జ్ఞానము లేనివాడు, తెలివి లేనివాడు. (చూడుము : - ‘జ్ఞానము’)
ప్రపంచజ్ఞానము లేనివాడు, మంచి చెడ్డల వివరము తెలియని వాడు, బ్రహ్మ జ్ఞానము లేనివాడు, శాస్త్ర జ్ఞానము లేనివాడు. (చూడుము :- ‘బ్రహ్మ జ్ఞానము’)
“ఆ. సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగ
జారు పీఠమెక్కి సార్వభౌము
డైన సతుల గృహములందు క్రీడా భోగ
వృత్తినుండు; నిన్ను వెదకలేడు”
“ఆ. మానసంబు గట్టి మహిత భోగంబులు
మాని ఇంద్రియముల మదము లడచి
తపము జేసి యింద్రతయ కోరు గాని నీ
యమృత పదము గోరడజ్ఞు డీశ” (శ్రీ మదాంధ్ర మహా భాగవతము- 10 - పూ.భా. 1663, 1664)
jñānamu lēnivāḍu, telivi lēnivāḍu. (cūḍumu : - ‘jñānamu’)
prapaṃcajñānamu lēnivāḍu, maṃci ceḍḍala vivaramu teliyani vāḍu, brahma jñānamu lēnivāḍu, śāstra jñānamu lēnivāḍu. (cūḍumu :- ‘brahma jñānamu’)
“ā. sakala diśalu gelici samulu varṇiṃpaṃga
jāru pīṭhamekki sārvabhaumu
ḍaina satula gṛhamulaṃdu krīḍā bhōga
vṛttinuṃḍu; ninnu vedakalēḍu”
“ā. mānasaṃbu gaṭṭi mahita bhōgaṃbulu
māni iṃdriyamula madamu laḍaci
tapamu jēsi yiṃdrataya kōru gāni nī
yamṛta padamu gōraḍajñu ḍīśa” (śrī madāṃdhra mahā bhāgavatamu- 10 - pū.bhā. 1663, 1664)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.