← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకారః akāraḥ

Original — తెలుగు
  1. ‘అ’ అ ను అక్షరము - వర్ణములలో మొదటిది.

  2. “’అ’ఇతి బ్రహ్మ” ఇతి; “అకారో వై సర్వవాక్” ఇతిశ్రుతిసిద్ధః సర్వ వర్ణానాం ప్రకృతిః అకారః“. (శ్రీరామానుజః)

(‘అ’ అనగా బ్రహ్మ అనిన్నీ, “అకారమే సమస్తవాచకము” అనిన్నీ శ్రుతి చెప్పుచున్నది. అన్నివర్ణములకు - అక్షరములకు ప్రకృతి - మొదట చేయబడినది, మూలము అకారమే. దాని తాలూకు వికారములే మార్పులే - మిగిలిన అక్షరములన్నియు. సృష్టిక్రమములో భగవంతుడు మొదట సృష్టించినది ప్రకృతి - “ప్రధమం కృతం ఇతి ప్రకృతిః” - ప్రకృతియే భగవంతుని చైతన్య శక్తితోకలిసి సృష్టిలోని సమస్త వస్తువులుగా మారినది - కుమ్మరివాని శక్తితో జడమైన మట్టి కుండ, మూకుడు మొదలగు వస్తువులుగా మారినట్లు.)

  1. “అక్షరాణామకారోస్మి” (శ్రీమద్భగవద్గీత -10 - 33)

(అక్షరములలో ‘అ’ కారము నేనే ‘అని’ శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియుండెను. అక్షరము లన్నింటిలోను మొట్ట మొదటి అక్షరమైన ‘అ’ కారము భగ వంతుడే అనిన్నీ, అక్షరములన్నింటిలోను, - ప్రతి అక్షరములోను ఉన్న ‘అ’ కారము - అకారాంశ - భగవంతుడే అనిన్నీ అర్ధము.)

(సృష్టిలోని అన్ని వస్తువులలోను భగవదంశ ఉన్నటులే ‘అ’ అను అక్షరము పరబ్రహ్మ కనుక మిగిలిన అక్షరములన్నింటి లోనూ ‘అ’ కారము యొక్క అంశ ఉన్నది. వస్తువులు ఎన్ని రూపములుగా మారినను అవి పరబ్రహ్మ స్వరూపములే అయినట్లు, ‘అ’ కారము మిగిలిన అక్షరములుగా మారినది. అవన్నియు అకారము యొక్క మార్పులే. ఇట్లు అక్షరము లన్నింటిలోను భగవచ్ఛక్తి యుండుట వలననే ఈ అక్షరములతో కూడిన మంత్రములు శక్తివంతము లైనవి). “ఆక్షాంతవర్ణం” (అకారము మొదలు క్ష కారము వరకు గల అన్నిఅక్షరరూపము తానే అయినవాడు) అనిన్నీ, “ఆక్షాంత వర్ణాశ్రయం” (అకారము మొదలు క్ష కారము అంతముగా గల అన్ని అక్షరములను ఆశ్రయించి యున్నవాడు) అనిన్నీ ‘శ్రీరామ కర్ణామృతం’ లో చెప్పబడినవి.

  1. ప్రత్యగాత్మ

  2. క్రియా రహితః - కరోతీతి కారః.

(పనిచేయువాడు క్రియ చేయువాడు కారుడు – చిత్రకారుడు వలే-క్రియ లేనివాడు-పనిచేయనివాడు క్రియారహితుడు.)(చూడుము - ‘అ’)

Transliteration
  1. ‘a’ a nu akṣaramu - varṇamulalō modaṭidi.

  2. “’a’iti brahma” iti; “akārō vai sarvavāk” itiśrutisiddhaḥ sarva varṇānāṃ prakṛtiḥ akāraḥ”. (śrīrāmānujaḥ)

(‘a’ anagā brahma aninnī, “akāramē samastavācakamu” aninnī śruti ceppucunnadi. annivarṇamulaku - akṣaramulaku prakṛti - modaṭa cēyabaḍinadi, mūlamu akāramē. dāni tālūku vikāramulē mārpulē - migilina akṣaramulanniyu. sṛṣṭikramamulō bhagavaṃtuḍu modaṭa sṛṣṭiṃcinadi prakṛti - “pradhamaṃ kṛtaṃ iti prakṛtiḥ” - prakṛtiyē bhagavaṃtuni caitanya śaktitōkalisi sṛṣṭilōni samasta vastuvulugā mārinadi - kummarivāni śaktitō jaḍamaina maṭṭi kuṃḍa, mūkuḍu modalagu vastuvulugā mārinaṭlu.)

  1. “akṣarāṇāmakārōsmi” (śrīmadbhagavadgīta -10 - 33)

(akṣaramulalō ‘a’ kāramu nēnē ‘ani’ śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyuṃḍenu. akṣaramu lanniṃṭilōnu moṭṭa modaṭi akṣaramaina ‘a’ kāramu bhaga vaṃtuḍē aninnī, akṣaramulanniṃṭilōnu, - prati akṣaramulōnu unna ‘a’ kāramu - akārāṃśa - bhagavaṃtuḍē aninnī ardhamu.)

(sṛṣṭilōni anni vastuvulalōnu bhagavadaṃśa unnaṭulē ‘a’ anu akṣaramu parabrahma kanuka migilina akṣaramulanniṃṭi lōnū ‘a’ kāramu yokka aṃśa unnadi. vastuvulu enni rūpamulugā mārinanu avi parabrahma svarūpamulē ayinaṭlu, ‘a’ kāramu migilina akṣaramulugā mārinadi. avanniyu akāramu yokka mārpulē. iṭlu akṣaramu lanniṃṭilōnu bhagavacchakti yuṃḍuṭa valananē ī akṣaramulatō kūḍina maṃtramulu śaktivaṃtamu lainavi). “ākṣāṃtavarṇaṃ” (akāramu modalu kṣa kāramu varaku gala anniakṣararūpamu tānē ayinavāḍu) aninnī, “ākṣāṃta varṇāśrayaṃ” (akāramu modalu kṣa kāramu aṃtamugā gala anni akṣaramulanu āśrayiṃci yunnavāḍu) aninnī ‘śrīrāma karṇāmṛtaṃ’ lō ceppabaḍinavi.

  1. pratyagātma

  2. kriyā rahitaḥ - karōtīti kāraḥ.

(panicēyuvāḍu kriya cēyuvāḍu kāruḍu – citrakāruḍu valē-kriya lēnivāḍu-panicēyanivāḍu kriyārahituḍu.)(cūḍumu - ‘a’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.