(ఇది భగవంతుడైన విష్ణుని కర్మ; ఆ చిద్రూపుడైన పరమాత్మయొక్క - ప్రతిబింబము నేను. నేను ఏ కర్మయు చేయుట లేదు - అనుకొని చేయుట అకర్మ కరణము - అనగా, భగవంతుని ఆధీనములో నుండి చేయుచున్నాను అని సూచింపబడినది.)
(కర్మ చేయుచున్నను అది కర్మ కాదు అని చూచుట, దానిని అకర్మగా చూచుట.)
(కర్మ చేయుచున్నను ఆత్మజ్ఞానం కలిగియుండుట - కర్మగాని దానియందు - అకర్మ యందు - ఆత్మజ్ఞానమును పొందుచున్నప్పుడు అది కర్మగా చూచుట. ఈ సందర్భములో అకర్మయనగా కర్మ కానిది ఆత్మజ్ఞానమూని చెప్పబడుచున్నది. కర్మ చేయుచున్నను ఆత్మ యాధాత్మ్యానుసంధానము వలన అది జ్ఞానాకారముగానే చూచుట. ఆ జ్ఞానము కర్మయోగములో అంతర్గతమగుట వలన అది అకర్మ అనియే భావింప బడును.)
(కర్త కాని ఆత్మయందు కర్తృత్వమును, భోక్తకాని ఆత్మయందు భోక్తృత్వమును ఆరోపింప చేయునది యగు కర్మ జన్మాదులగు బంధములకు కారణమని తెలిసి నిత్యకర్మలను, నైమిత్తికకర్మలను యాగ వ్రత తపోదానాదులను చేయుచున్నను ఆ కర్మల ఫలమందు సంగము లేనపుడు ఫలాభిసంధి లేనిది యగు నాకర్మ అకర్మయే యగును.) (చూడుము : - ‘అకర్మ’)
(idi bhagavaṃtuḍaina viṣṇuni karma; ā cidrūpuḍaina paramātmayokka - pratibiṃbamu nēnu. nēnu ē karmayu cēyuṭa lēdu - anukoni cēyuṭa akarma karaṇamu - anagā, bhagavaṃtuni ādhīnamulō nuṃḍi cēyucunnānu ani sūciṃpabaḍinadi.)
(karma cēyucunnanu adi karma kādu ani cūcuṭa, dānini akarmagā cūcuṭa.)
(karma cēyucunnanu ātmajñānaṃ kaligiyuṃḍuṭa - karmagāni dāniyaṃdu - akarma yaṃdu - ātmajñānamunu poṃducunnappuḍu adi karmagā cūcuṭa. ī saṃdarbhamulō akarmayanagā karma kānidi ātmajñānamūni ceppabaḍucunnadi. karma cēyucunnanu ātma yādhātmyānusaṃdhānamu valana adi jñānākāramugānē cūcuṭa. ā jñānamu karmayōgamulō aṃtargatamaguṭa valana adi akarma aniyē bhāviṃpa baḍunu.)
(karta kāni ātmayaṃdu kartṛtvamunu, bhōktakāni ātmayaṃdu bhōktṛtvamunu ārōpiṃpa cēyunadi yagu karma janmādulagu baṃdhamulaku kāraṇamani telisi nityakarmalanu, naimittikakarmalanu yāga vrata tapōdānādulanu cēyucunnanu ā karmala phalamaṃdu saṃgamu lēnapuḍu phalābhisaṃdhi lēnidi yagu nākarma akarmayē yagunu.) (cūḍumu : - ‘akarma’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.