← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకర్త akarta

Original — తెలుగు
  1. ఏకార్యమును చేయనివాడు..

  2. అకర్మవశ్యతయా పుణ్యపాపయోః అకర్తా.

(కర్మకు వశుడు కానందున పుణ్యపాపములు చేయనివాడు)

  1. గమనాగమనాది సాంసారిక ప్రవృత్తి రహితః

(గమనా గమనములు - చావు పుట్టుకలు మొదలగుగా గల సంసారమునకు సంబంధించిన ప్రవృత్తి లేనివాడు.)

  1. కర్తృత్వాది సంసార ధర్మ రహితః పరమేశ్వరః ఇత్యర్థః

(కర్తృత్వము మొదలగు సంసారమునకు సంబంధించిన ధర్మములు లేని వాడు.)

  1. అయమాత్మా విశ్వరూపః విశ్వకల్పనాధారతయా, విశ్వసత్తాస్ఫూర్తి ప్రదత్వాత్, తద్వికారసృష్టత్వాత్ అకర్తా.

(విశ్వరూపుడైన - విశ్వమే రూపముగా గలవాడైన - ఈఆత్మ విశ్వమును సృష్టించి ధరించుట చేతను, విశ్వమునకు తన సత్తస్ఫూర్తి నిచ్చుట వలనను, వికారములను సృష్టించుట వలనను అకర్త.)

  1. అనాదిత్వాన్నిర్గుణ త్వాత్పరమాత్మాయమద్యయః |

శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే |

యథా సర్వగతం సౌక్ష్మా దా కాశం నోపలిప్యతే |

సర్వత్రావస్థితో దేహే తధాత్మా నోపలిప్యతే || (శ్రీమద్భగవద్గీత- 13 - 31 - 32)

(అన్నింటిలోను ఉన్నప్పటికి వాటికంటే సూక్ష్మమైనదగుట వలన ఆకాశము దేనినీ అంటదు. ఆ ప్రకారమే అనాది యగుట వలనను, జన్మ లేనివాడగుట చేతను, త్రిగుణములు లేనందు వలనను అవ్యయుండైన పరమాత్మ శరీరములో ఉన్నప్పటికీ ఏ కర్మను చేయుటలేదు - శరీరము కర్మలు చేయుచున్నను ఆ కర్మలు ఈ పరమాత్మను అంటవు. అందుచేత పరమాత్మ అకర్త.)

  1. “ఏవం జన్మాని కర్మాణి హ్యకర్తుర జనస్యచ |

వర్ణయంతి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతే” (శ్రీమద్భగవద్గీత -1 - 3 - 35)

(జన్మము లేనటువంటిన్నీ, కర్త గానటువంటిన్నీ పరమాత్మకు కవులు అవతారములలో జన్మము నెత్తినట్లు, కర్మలు చేసినట్లు వర్ణించుచుందురు.)

  1. “చ. జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్త వ

ర్తను డగు చక్రికిం గవులు దారవదంబుల జన్మ కర్మముల్

వినుతులు సేయుచుండుదురు; వేదరహస్యములందు నెందు జూ

చిన మఱి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 3 – 31)

  1. “క. హరి నరుల కెల్ల బూజ్యుడు

హరి లీలామనుజుడును గుణాతీతుడు నై

పరగిన భవ కర్మంబుల

బొరయుండట హరికి గర్మములు లీల లగున్“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 1 - 73)

  1. “క. మాయా గుణానుగతుడై

పాయక నానావిధ ప్రపంచం బితడే

చేయుననితోచు నేమియు

జేయడ సంగుండకర్త నిర్ధము వత్సా” (శ్రీ సీతారామాంజనేయ సంవాదము- 1 - 83)

  1. “మ. ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా

హరి కర్తృత్వము నొల్ల డాత్మగత మాయా రోపితంజేసి తా

నిరవద్యుండు, నిరంజనుండు పరుడున్ నిష్కించనుం డాడ్యుడున్

నిరపేక్షుండును నిష్కశంకు డగుచున్ నిత్యత్వమున్ బొందెడిన్” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 10 - 280)

(ప్రపంచమునకు సృష్టి, స్తితి లయములు చేయు చున్నప్పటికిన్నీ, ఈ కర్మలు తనలో నున్న మాయ చేయుచున్నందు వల్ల పరమాత్మకి కర్తృత్వము లేదు. ఆ కర్మల ఫలము భగవంతుని అంటదు.)

  1. “మ. జననం బందుట లేని యీశ్వరుడు దా జన్మించు టెల్లన్ విరో

ధి నిరాసార్థము వీతకర్ము డగు న ద్దేవుండు గర్మ ప్రవ

ర్తను డౌ టెల్ల జరాచర ప్రకట భూతశ్రేణులన్ గర్మ వ

ర్తనులం జేయ దలంచి కాక కలవే దైత్యారికిం గర్మముల్“. (శ్రీమదాంధ్ర మహా భాగవతము- 3 - 2 - 72)

(అజుడు అనాది యగుటచేత జన్మమే లేని పరమాత్మ అవతారము లెత్తి కర్మలు చేయుట విరోధులను శాసించుటకు తాను కర్మలు చేసిన యెడల తనను చూచి లోకులు కర్మ చేయుదురు అను ఉద్దేశముతో కర్మలు చేసెను. అంతే కాని జన్మమే లేని వానికి కర్మలు చేయుటే లేదు. అందుచేత భగవంతుడు అకర్త.)

  1. “కర్తృత్వమపి భోక్తృత్వం నాధత్వయి నవిద్యతే |

బుధ్ధౌత్వం ప్రతిబింబేన కర్తా భోక్తాచ గీయనే ||” (శివపురాణం)

(కర్తృత్వము గాని భోక్తృత్వము గాని నీ యందు కనబడదు - లేదు. బుధ్ధి యందు నీ ప్రతిబింబముండుటచేత నీవు కర్తయని భోక్తయని చెప్పబడుచున్నావు.)

  1. “సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతిమామికాం|

కల్పక్షయే పునస్తాని, కల్పాదౌ విసృజామ్యహం ||

ప్రకృతిం సామ విష్టభ్య విసృజామి పునః పునః |

భూత గ్రామ మిమం కృత్స్నమవశం ప్రకృతిర్యశాత్ ||

న చ మాంతాం కర్మాణి నిబధ్నంతి ధనంజయ |

ఉదాసీన వదాసీనమసక్తం తేషుకర్మసు |

మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే న చరాచరం |

హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ||” (శ్రీమద్భగవద్గీత - 9 - 7 to 10)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -

“భూతవర్గమిమం కృత్స్నం తారతమ్యాన్వితం సృజన్ |

న తత్కర్తృత్వ సంబంధం భజామీత్యాహ మాపతిః ||

సృష్టి స్తితిలయాఖ్యాని క్రియమాణాని మాయయా |

మాయావినేతకర్మాణి తాని స్వప్నదృశేనచ |

నిగ్రహానుగ్రహానుగ్రహాభ్యాంవా న నిబధ్నంతి మాం హరిం |

మిధ్యా త్వాన్నైవకుర్వంతి పుణ్య పాపాది భాగినం |

ఉపేక్షకో యధాకశ్చిద్ధ్వయోర్వివదమానయోః |

జయాజయాద్య సంసర్గీ తత్రాస్తే నిర్వికారధీః |

నిర్వికారతయా తద్వదాసీనం నిరహం కృతిం |

తేషుకర్మసు తస్మాన్మాం ననిబధ్నంతి తానివై |

అన్యస్యాపి ఫలాసంగాభావో నిరభిమానితా |

సర్వకర్మ స్వబంధస్య కారణం హరిణేరితం ||” (గీతాభావ ప్రకాశము - 9 - 64 to 69)

(భూతములన్నింటిని తారతమ్యములు గలవిగా - ఒకదానికి ఇంకొకదానికి హెచ్చు తగ్గులు గలవాటినిగా, అనగా ఒకరిని బీదవాడిని గాను, ఇంకొకరిని గొప్పవాడిని గాను, ఒకడిని సుఖము అనుభవించువాడిని గాను, ఇంకొకడిని దుఃఖమనుభవించువాడు గాను, ఒకడిని స్ఫురద్రూపుడు గాను, ఇంకొకడిని కురూపి గాను, ఒకడిని సన్మార్గుడు గాను, ఇంకొకడిని దుర్మార్గుడు గాను, ఈ విధముగా తేడాలతో, అందఱిని ఒకలాగున కాక - సృష్టించి యీ కర్మకు సంబంధించిన కర్తృత్వము తనకు లేదు, దానికి తాను కర్త గానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను. సృష్టి స్తితి లయములను కర్మలు ఒక ఇంద్రజాలికుడు వలె, కలలో జరిగినవాటి వలె మాయచే నిర్మింపబడుచున్నవి. ఈ కర్మలో నిగ్రహించినా, అనుగ్రహించినా అవి నన్ను బంధించవు. ఇదంతామిధ్య గనుక వాటివలన కలుగు పుణ్యపాపములు నావి కావు. ఇద్దరు వివాదము సలుపు చున్నపుడు వారి జయాపజయములతో సంబంధము లేకుండా, వికారబుధ్ధి లేకుండా తటస్తముగా ఉండి, ఉపేక్ష చేస్తూ ఉండువాడు వలె నేను, స్వతః నిర్వికారుడగుట చేతను, అహంకారము లేనివాడనగుట చేతను - అనగా, ఈ పని నేను చేయుచున్నాను అనుభావము లేకపోవుట చేత - ఆ కర్మలు (సృష్టి స్తితి లయములు, వాటికి సంబంధించిన పుణ్య పాపములు, మంచి చెడ్దలు) నన్ను బంధించవు. ఈ రీతిగా బంధము లేకుందుట నాకే కాదు, ఎవరైన చేయు కర్మ యొక్క ఫలమందాసక్తి లేక చేయుదురో - నేను చేయుచున్నాను అను అహంకారము లేక చేయుదురో – అట్టివారిని కూడా అకర్మలు బంధించవు.)

“భూతగ్రామం సృజామీతి తధోదాసీనవత్ స్తితిః |

ఇత్యన్యాన్య విరుద్ధం స్యాత్ ఇత్యా శంక్యాహ మాధవః |

మయా దృఙ్మాత్రరూపేణధ్యక్షేణా విక్రియాత్మనా |

నియంత్రా ప్రకృతిర్మాయా భాసకేనావ భాసతా |

సత్వాదిభిరనిర్వాచ్యోత్పాద యత్యఖిలం జగత్ |

మాయా వినా శ్రితా మాయా యథాస్తం గజాదికం |

సృజత్యహం తథాధ్యస్తం సృజామీదం చరాచరం |

న త్వహం సర్వకార్యాత్మా మాయా భాసనమాతరా |

వ్యాపారాంతరమప్యత్ర విదధేవి క్రియాతిగః |

అనేనాధ్యక్ష భానేన నిమిత్తేన చరాచరం |

జననాది వినాశాంతం వికారమను యాత్యదః |

అతోహం భాసకత్వాఖ్య వ్యాపారేణ సృజామి తత్ |

తావతా సూర్యవన్నాస్తి కర్తృత్వం మమ సర్వధా |

ఉదాసీన వదాసీనమిత్యుక్తేర్న విరుధ్ధతా |

“అస్య ద్వైతేంద్ర జాలస్య యదుపాదానకారణం |

అజ్ఞానం తదుపాశ్రిత్య బ్రహ్మ కారణముచ్యతే |”

అపూర్వానపరం బ్రహ్మ తస్య కార్యం న కారణం |

అధిష్టానమాత్రేణకారణం బ్రహ్మగీయతే |

ఇత్యుక్తేరపి హేతుత్వం మాయయా నతు వస్తుతః |

ప్రవృత్తిఃసర్వ జగతః చిదదీనా నదైవహి |

అతస్తదు భయం నైవవిరుద్ధం స్యాత్పరస్పరం ||“. (గీతాభావ ప్రకాశము- 9 - 70 to 80)

(“భూతములన్నింటినీ నేను సృజించు చున్నాను.” అని ఒకచోట, “ప్రకృతి - మాయ - భూతములను సృజించు చున్నది, నేను ఉదాసీనుని వలె ఊరక చూచుచుందును” అని మఱియొక చోట చెప్పబడినది. ఈ రెండువాక్యములు ఒకదానికొకటి విరుధ్ధముగా నున్నవి శంక - అనుమానం - ఉండునేమో అని ఆ శంక తీర్చుటకు భగవంతుడు - శ్రీకృష్ణుడు - ఈ క్రింది విధముగా స్పష్టము చేయు చున్నాడు : - దృజ్మాత్ర రూపుడు - సాక్షి, ఊరక చూచువాడు - అధ్యక్షుడు, అవిక్రియుడు, నియంత అయిన నాయొక్కకాంతిచేత -సత్తాస్ఫూర్తిచేత - భాసమానమైనదై, అనిర్వచనీయ మగుట చేత మాయ యనబడు ప్రకృతి యీ సమస్త జగత్తును పుట్టించును. మాయావి చేత ఆశ్రయించ బడినట్టి మాయ అధ్యస్తమైన ఏనుగు మొదలగు వానిని సృజించినట్లు నాచేత నధ్యస్తమైన ఈ సకల చరాచర జగత్తును సృష్టించు చున్నాను. నేను మాయాంతర్గతుడను మాత్రమే కాని సమస్త కార్యములను చేయువాడను కాను. మాయావికారము నతిక్రమించి ఏ పనినైనను చేయను. మాయలో అధ్యక్షుడుగా నేను ఉండిన కారణముచేత ఈ చరాచర జగత్తంతయు, జన్మము మొదలు నశించు వరకు గల మార్పులను (వికారములను) పొందుచు నుందును. అందునుండి నేనుమాయలో భాసమానుడనై యుండి సత్తాస్ఫూర్తి కలిగించుటచేత ఈ జగత్తును సృష్టించుచున్నాను - అట్లు అయినను నాకు సూర్యునివలె ఏ ప్రకారముగా నైనను కర్తృత్వము లేదు. అందుచేత నేను సృష్టిస్తున్నాను అన్న మాటకు, మాయ సృష్టి చేయుచు నుండగా నేను ఉదాసీనుడు వలె తటస్థముగా చూచుచు ఊరకుండువాడను అను మాటకు, పరస్పరము విరుధ్ధము లేదు. ఈ ద్వైతేంద్ర జాలమునకు అజ్ఞానము పాదాన కారణము. ఈ యజ్ఞానము నాశ్రయించు కొనుటచేత నేను కారణమని చెప్పబడు చున్నాను. బ్రహ్మకు పూర్వమేమీ లేదు, తర్వాతకూడ ఏమియు లేదు - ముందు, వెనుక ఏమియు లేదు. అనగా బ్రహ్మ కారణము కాదు, కార్యము కాదు. మాయను - ప్రకృతిని అధిష్టించి యుండుట చేత మాయ చేయుపనికి బ్రహ్మయే కారణమని చెప్పబడుచున్నాడు. ఈ ప్రకారము బ్రహ్మ కారణమని చెప్పబడుట కూడా మాయవలననే, వాస్తవముగా కాదు. ఈ సమస్త జగత్తు యొక్క ప్రవృత్తి చిన్మాత్రము యొక్క అధీనములో నున్నది. చిద్రూపుడు తన సత్తాను ప్రతి వస్తువునకు నిచ్చి ప్రతిదానిచేత దానికి నిర్ణీతమైన పనిని చేయించును.

  1. “చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః |

తస్యకర్తారమపిమాం విధ్ధ్య కర్తా రమప్య వ్యయం |

నమే కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ||” (శ్రీమద్భగవత్గీత - 4 -13, 14)

ఈ శ్లోకమునకు వ్యాఖ్యానము : -

“వ్యవహారదృశా తస్య చాతుర్వర్ణ్యస్య సర్వ శః |

కర్తారం సంతమపిమాం పరమార్ధ దృశా (అ)వ్యయం |

విధ్ధ్యకర్తారమక్షీణ స్వభావమ నహం కృతం |

నిర్వికారతయా సంతం మాం జ్ఞా త్వా ముచ్యతే భయాత్ ||

- - - కర్మాణి విశ్వ సృష్ట్యా దీన్యహంకారమీశ్వరం |

దేహాద్యారంభకత్వేన నమాం బధ్నంతి చిద్ఘనం |

నవా మమాప్త కామస్య తృష్ణాకర్మఫలేయతః |

కర్తృత్వాభినివేశేన తధైవ ఫలతృష్ణయా |

పంత్యజ్ఞాంస్తు కర్మాణి తద భావాన్న మాం హరం ||” (గీతాభావ ప్రకాశము - 4 - 90 - 94)

(సత్వరజస్తమములను మూడు గుణములు అనేక విధములుగా హెచ్చు తగ్గులతో కలిసియుండుటను బట్టి ఈ గుణముల వలన కలిగిన శరీరములున్నూ, అనేక విధములుగా నుండును. అన్ని శరీరముల లోను త్రిగుణముల యొక్క కూటమి ఒక్క రీతిగా నుండదు. అందుచేత అందఱు ఒకే శీలము - గుణము - గలవారుగా నుండరు. ఇంతే గాక, వారు వారు చేయు కర్మలననుసరించి ఫలము ననుభవించుటకు - వేఱు వేఱు శీలములు - గుణములు - గల శరీరములు పొందుదురు. అందుచేత నీ త్రిగుణములను కర్మములను అనుసరించి సృష్టి ప్రారభములో నేను నాలుగు వర్ణములను నిర్మించితిని. త్రిగుణములలో సత్వగుణము ప్రధానముగా కలిగియుండి, శమము, దమము మొదలగునవి కలవారు విప్రులు, రజోగుణము ముఖ్యముగా నుండి సత్వగుణము తక్కువగా నున్న వారు క్షత్రియులు. వారు చేయవలసిన కర్మ శౌర్యము - యుధ్ధము - మొదలగునవి. రజోగుణము ముఖ్యముగా నుండి హెచ్చుగా నుండి - తమోగుణము తక్కువగా నున్న వారు వైశ్యులు. వ్యవసాయము మొదలగు కర్మ చేయువారు, తమోగుణము ప్రధానముగా నుండి శుశ్రూష మొదలగు పనిచేయువారు శూద్రులు. ఈ ప్రకారముగా వేఱువేఱుగా వర్ణములను మనుష్యులలో కల్పించుట వలన భగవంతునికి దీని కర్తృత్వము కలుగదా అను సంశయము నివారించుటకై శ్రీకృష్ణపరమాత్మ ఆ సంశయము తీరునట్లుగా శ్రీమద్భగవద్గీతా శ్లోకములలో ఈ క్రింది విధముగా చెప్పెను : -పైన చెప్పిన నాలుగు వర్ణములను వ్యవహారికముగా భగవంతుడు చేసినది యని అనిపించినను, దీనికి కర్త భగవంతుడే యని తోచినను, పారమార్ధిక దృష్టిలో భగవంతుడు దీనికి కర్త కాడు. ఎందుచేత ననగా భగవంతుడు అవ్యయుడు - క్షీణించని స్వభావము గలవాడు -, అహంకారము లేనివాడు, నిర్వికారుడు - ఎన్నడూ మార్పు పొందకుండ, ఒకేతీరున నుండువాడు. అహంకారి నశించువాడు, మార్పులు చెందువాడు, ఏ కర్మ చేసినను దాని ఫలము ననుభవించును. భగవంతుడిట్టి వాడు కాడు, కనుక అకర్తయే, ఆ పని చేయని వాడే. అందుచేత సృష్టి చేసినప్పటికీ, మనుష్యులను నాలుగు వర్ణములు వారిగా సృష్టించినను, భగవంతుడు అహంకారము లేని వాడగుటచేత, అన్ని విధములైన సంపదలు మొదలగునవి తన యధీనము లోనివే అయి యున్నందున అన్ని కోరికలు తీరి యే కోరికలు లేనివాడు, చేసిన కర్మల ఫలమందాసక్తి లేనివాడు. నేను ఈ కర్మ చేసితిని యను అహంకారము గలవాడిని, కర్మఫలమందాసక్తి గలవాడిని కర్మలు బంధించును. అటువంటివాడు కర్త. నేను (భగవంతుడు) అటువంటివాడిని కాను కనుక, నేను చేసినట్టు కనబడు సృష్టి మొదలగు కర్మలు నన్ను బంధించవు. అందుచేత నేను అకర్తను - “అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్ధ్యతే||” (శ్రీమద్భగవద్గీత- 5 - 12) (కోరికతో కర్మలు చేసి ఫలము నాశించు వాడు బధ్ధుడగును)

  1. “ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |

యః పశ్యతి తదాత్మాన మకర్తారం సపశ్యతి ||” (శ్రీమద్భగవద్గీత- 13 - 29)

(ప్రకృతి చేతనే కర్మలన్నియు చేయబడుచున్నవి అని తెలుసుకొనిన యడల పరమాత్మ అకర్తయే అని తెలుసుకొనును.)

  1. “త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః |

కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్కరోతి సః |

నిరా శీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహః |

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం |

యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వా తీతో విమత్సరః |

సమః సిధ్ధావ సిధ్ధౌచ కృత్వాపి నబధ్ధ్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 4 - 20 to 23)

“కర్తృత్వాహం కృతిం త్యక్త్వాఫలే తృష్ణాంచ కర్మణి |

పరానందాత్మ లాభేన నిరాకాంక్షో (అ)ఖిలే ఫలే |

దేహాద్యహంకృతేః శూన్యో దృష్టా దృష్టా శ్రయంతిగః |

ఏవం భూతః ప్రవృత్తోపి లోకదృష్ట్యా యధావిధి |

లౌకికే వైదికేవా (అ)సౌ కర్మణ్యారబ్ధ యోజితః |

స్వదృష్ట్యానిష్క్రియః సాత్మదర్శన ధ్వస్త విక్రియః |

స్వేమహిమ్ని స్థితో ధీరో నైవ కించిత్కరోత్యసౌ |

వీత తృష్ణోవశేనీతం చిత్తం దేహేంద్రియైస్సహ |

యేన సో(అ)త్యంత వైరాగ్యా త్యక్త భోగోపకారకః |

ఏతాధ్ధ్వశోపి ప్రారబ్ధ వశాద్భిక్షాట నాదికం |

శరీరస్తితి మాత్రార్ధే కాయికం వాచికం తధా |

మానసం కర్మ కర్తృత్వా ధ్యస శూన్యః సమాచరన్ |

అకర్తాత్మ దృశా నాసౌ ధర్మా ధర్మఫలం యతః |

సంసార కించనాప్నోతి బాధిత త్వాఛ్చుభా సుభం |

యతేరనిష్ట హేతుత్సాత్పుణ్య మవ్యస్య కిల్బిషం |

లాభోహ్య ప్రార్థితో (అ)యత్నాత్తే నాలం ప్రత్యయం గతః |

శాస్తానుమత భిక్షాది లాభాత్ సంతుష్ట ఏవషా |

స్వప్రయత్నంవినా (అ)లాభే శీతోష్ణాది భిరర్థితః |

ద్వంద్వైరక్షుబ్ధ చిత్తో యో నిర్విరః సర్వజంతుషు |

శరీరస్థితి హేతోశ్చ లాభే (అ)లాభే (అ)వికారధీః |

స్వానుభూత్యా సచాకర్తైవారోపిత క్రియః |

భిక్షాటనాదికం కృత్వా బంధం నాప్నోతి కించన |

ఫలాసంగ విహీనస్య నిర్గతాధ్యాసకస్య చ |

నిర్వికల్పాత్మతత్వైక్య బోధే యస్యస్థితం మనః |

ఈ దృశస్యాపి ప్రారబ్ధవశా ల్లోక ప్రవృత్తయే |

కుర్వతః కర్మ యజ్ఞాది విష్ణు ప్రీత్యర్ధమేవవా |

సహాగ్రేణ ఫలే నైతత్కర్మజ్ఞస్య వినశ్యతి |

ఫలం చా జన యిత్వైద మూలోచ్చేవాద్ధృశోక్తయా ||“. (గీతాభావ ప్రకాశము - 4 - 135 -153)

(తను చేయు కర్మలందు ‘నేను కర్తను’ అను అహంకారమును వదలి ఆ కర్మల వలన కలుగు ఫలము నందాసక్తి లేక యుండి, పరమానందలాభము పొందియుండుట చేత అన్ని విధములైన కర్మ ఫలములందును ఆసక్తి లేకయుండి, ‘దేహమే నేను’ అను మొదలగు నహంకారము లేక, దృష్టా దృష్ట విషయములకు అతీతుడైనవాడు, లౌకికకర్మగాని, వైదికకర్మగాని యధావిధిగా లోకుల దృష్టిలో చేయుచున్నప్పటికీ తన దృష్టిలో - పరమార్ధ దృష్టిలో ఏ పనియును చేయనివాడే. ఆత్మ జ్ఞానము కలిగియుండుటచేత అన్ని విధముల విక్రియములు లేనివాడై, ఆత్మజ్ఞానమునందే నిలకడ కలిగియున్నందున యట్టి ధీరుడు ఏ కర్మయును, ఏ కొంచెమైనను చేయనివాడే, అకర్తయే. దేని యందును ఆశ లేనివాడై, దేహమును, ఇంద్రియములను, మనస్సును తన స్వాధీనములో నుంచుకొనిన వాడు అత్యంత వైరాగ్యము వలన భోగములను వదలివేసి ప్రారబ్దవశమున శరీరమును పోషించు కొనుటకు మాత్రము అవసరమైన, మనోవాక్కాయములకు సంబంధించిన కర్మ తానే కర్తను అనుధ్యాస లేక చేయువాడు, ‘నేను ఈ పనికి కర్తనుకాను’ అను అభిప్రాయము గలిగి యుండుటచేత ఆ కర్మఫలము అగు సంసారము తనని అంటదు. స్వప్రయత్నము లేకుండగనే, తాను కోరకనే భిక్షాటనము వలన సంప్రాప్తమైనదే చాలునని సంతుష్టి పొందువాడును, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములచేత వ్యాకులత చెందని మనస్సు గలవాడై, సమస్త ప్రాణుల యడల వైరము లేనివాడును, జీవించియుండుట కొఱకైన లభాలాభముల వలన వికారమును పొందనివాడు, భిక్షాటనము మొదలగు కర్మలను చేసినను అకర్తయే. అందుచేత ఆ కర్మలు అతనిని బంధించవు. కర్మఫలమందు ఆసక్తిలేనివాడు, అధ్యాస లేనివాడు నిర్వికల్పాత్మ తత్వమునందు నిలకడగల మనస్సు గలవాడు ప్రారబ్ధవశమున ప్రవృత్తి రూపమైన దానిని చేయుచున్నను, లేక భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని ప్రీతి కొఱకు యజ్ఞము మొదలగు కర్మలు చేసినను, అట్టికర్మలు ఫలమునివ్వక సమూలముగ నశించిపోవును. అందుచేత ఆ కర్మలు అట్టివానిని బంధించవు. అట్టివాడు అకర్త.)

  1. “బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతియః |

లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ||” (శ్రీమద్భగవద్గీత- 5 -10)

పైశ్లోకమునకు వ్యాఖ్యానము : -

“ఫలాసంగం పరిత్యజ్య సమర్ప్య పరమేశ్వరే |

కర్మాణి వైదికాన్యజ్ఞో లౌకికాన్ కరోతి యః |

పాపపుణ్యాత్మికే నాసౌ కర్మణా నైవ లిప్యతే |

యధో పరిప్రక్షిప్తేన పద్మపత్రం న చాంభసా |

లిప్యతే, తద్వదీశేపి కర్మార్పిత మలేపకం |

ప్రత్యుతేశ ప్రసాదేన ధీసుధ్ధిశ్చాస్య జాయతే ||” (గీతాభావప్రకాశము - 5 - 82 to 85)

(కర్మయొక్కఫలము నాందాసక్తి వదిలి తానుచేసిన యజ్ఞము మొదలగు వైదికకర్మలను, లౌకికకర్మలను పరమేశ్వరునకు - భగవంతునికి- అర్పించిన యడల ఆ కర్మలు తనను అంటవు. తామరాకు పైన నీరు పడినను ఆ నీరు ఆ ఆకును అంటదు - అందుచేత అట్టివాడు అట్టి కర్మల ఫలము ననుభవించడు. అందుచేత అతను అకర్త. అట్లు ఆ కర్మలను భగవంతునికి అర్పించినందు వలన భగవంతుని దయ వలన అతనికి చిత్త శుధ్ధి కలుగును.)

  1. “యోగయుక్తో విశుధ్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |

సర్వ భూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే |

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ |

పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ |

ప్రలపన్ విశ్వజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి |

ఇంద్రియాణీంద్రియార్ధేషు వర్తంత ఇతి ధారయన్ ||” (శ్రీమద్భగవద్గీత- 5 - 6 to 8)

పైశ్లోకమునకు వ్యాఖ్యానము : -

“యస్యాత్మా సర్వ భూతానామాత్మ భూతస్స ఈ దృశః |

అఖండాద్వైత నిష్టస్సన్ త్యక్త భేదనుతిః పుమాన్ |

సర్వ భూత ఆత్మ భూతశ్చాత్మా యస్యేతి విగ్రహే |

జడా జడాత్మకం విశ్వం ప్రశ్యన్నాత్మమయం మునిః |

ఉభయత్రాప్యఖండార్థ బోధ సిధిరితీరితా |

ఈదృశఃతత్వదృక్కుర్వన్నపి లోక దృశా క్రియాః |

తాభిర్న లిప్యతే యస్మాత్ స్వ దృష్ట్యా తదభావతః |

ధీశుధ్ధ్యా యుక్తఏ వాదౌ భూత్వా తత్వ వి దేవనః |

క్రియమాణాను చేష్టాను నకరోమీతిమన్యతే |

జ్ఞానకర్మేంద్రి యైః కర్మదశభిః తద్యధా యధం |

కుర్వన్న కుర్వతా బుధ్ధ్యా పశ్యత్యాత్మాన మక్రియం |

శ్వసన్ ప్రాణైః స్వపన్నంతః కరణేన మునిస్తథా |

ఉన్మిషన్నిమిషన్నేవం నాగకూర్మాది పంచకైః |

ఏతాని స్పస్వవిషయే వర్తంతే నత్వహం త్వితి |

ధారయన్సర్వ వ్యాపారే ష్యాత్మాన మక్రియం విదన్ |

కుర్వన్న లిప్యతే చాతోయుక్త మేవేరితం వచః ||” --- (గీతాభావప్రకాశము - 5 - 73 to 81)

(ఏ కర్మ చేసినను దాని ఫలము నాశించక, దానిని భగవదర్పణము చేయుట యోగము. రజోగుణము, తమోగుణము - వీటి దోషములు అంటకుండునట్టి కేవల సత్వగుణము కలిగియుండుట వలన శుధ్ధమైన మనస్సు కలిగి, పైనచెప్పబడిన యోగము నవలంబించి, శరీరమును ఇంద్రియములను జయించి తనవశములో నుంచుకొనినవాడు - అనగా వాగ్దండము, మనోదండము, కాయ దండము అను త్రివిధ దండములు ధరించినవాడు త్రిదండి. సర్వభూతముల ఆత్మా తన ఆత్మేయని, లేక, జడములు అజడములతో నిండియున్న ఈ ప్రపంచమంతయు ఆత్మ మయమని తలచువాడు. ఇట్లు పరమాత్మ తత్వమును తెలుసుకొనినవాడు లోక దృష్టిలో కర్మలు చేయుచున్నను, అతని దృష్టిలో - పరమాత్మ దృష్టిలో - కర్మలు చేయని వాడే యగుటవలన ఆ కర్మఫలము అతనిని అంటదు. చిత్తశుధ్ధి కలిగిన మీదట భగవత్తత్వము తెలిసినవాడు తానుచేయుచున్న పనులయందు ‘నేను ఈ పనులను చేయుట లేదు’ అని తలచును – “జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అయిన పదింటిచేత వాటి వాటి పనులను చేయుచున్నాను” అని అనుకొనును. తనను అక్రియుని వలె ఏ పనియు చేయనట్లే చూచును. ప్రాణవాయువుతో ఊపిరి తీయుచున్నను, అంతఃకరణముతో నిద్ర పోవుచున్నను, ఉప ప్రాణముల చేత కన్నులు తెఱచి ఉన్నను, మూసి ఉన్నను, కండ్లతో చూచుచున్నను, చెవులతో వినుచున్నను, శరీరముతో తాకుచున్నను, ముక్కుతో వాసన చూచుచున్నను, నోటితో తినుచున్నను, కాళ్ళతో నడచుచున్నను, నిద్రించుచున్నను, నోటితో మాట్లాడుచున్నను, అపానముచే విడిచిపెట్టు చున్నను, చేతులతో తీసుకొనుచున్నను - అనగా ఇంద్రియములు వాటివాటి పనులను చేయుచున్నవే, వాటివాటి విషయములందు వర్తించుచున్నవే కాని, ఆత్మను అయిన నేను ఏమియు చేయుటలేదు. నేను అక్రియుడను అనుకొనును - అట్టివాడు అకర్త.)

  1. “సర్వ కర్మాణి మనసా నన్యస్యాస్తే సుఖం వశీ |

నవద్వారపురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ||” (శ్రీమద్భగవద్గీత- 5 - 12)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -

” - - - దేహ భిన్నాత్మ తత్వదృక్ |

నవద్వారవిశిష్టే (అ) స్మిన్ దేహే తిష్టత్యసౌ పురే |

పరగేహ ప్రవాసీవ నిర్మమో నిరహంకృతిః |

దేహమాత్రాత్మ దర్శీతు దేహాధి కరణం నరః |

స్వస్యాధికరణం మత్వా గృహే భూమే తధాసనే |

అహమాసే (అ)భిమానీతి నత్వాసే దేహ ఇత్యపి |

సంఘాత వ్యతిరిక్తాత్మ దర్శిన స్తూప పద్యతే |

దేహ ఆస ఇతి జ్ఞానం విద్యయా భ్రాంతి బాధనాత్ |”

(దేహముకన్న ఆత్మ వేరైనది అని ఆత్మ తత్వమును తెలిసుకొనినవాడు నవద్వారములు కల పురము వలె నున్న ఈ శరీరమందు, ఇతరుల గృహమందున్న పైవాడు వలె - ప్రవాశి వలె - మమకారము, అహంకారము లేనివాడుగ నుండును. ఇట్టివాడు ఏ కర్మ చేసినను అకర్తయే. దేహమే ఆత్మయని తలచువాడు “నేను నా ఇంటిలో భూమిమీద ఆసనము కల్పించుకొని దానిమీదనే ఉన్నాను” అను అభిమానము - అహంకార మమకారములు గలవాడై యుండును.)

Transliteration
  1. ēkāryamunu cēyanivāḍu..

  2. akarmavaśyatayā puṇyapāpayōḥ akartā.

(karmaku vaśuḍu kānaṃduna puṇyapāpamulu cēyanivāḍu)

  1. gamanāgamanādi sāṃsārika pravṛtti rahitaḥ

(gamanā gamanamulu - cāvu puṭṭukalu modalagugā gala saṃsāramunaku saṃbaṃdhiṃcina pravṛtti lēnivāḍu.)

  1. kartṛtvādi saṃsāra dharma rahitaḥ paramēśvaraḥ ityarthaḥ

(kartṛtvamu modalagu saṃsāramunaku saṃbaṃdhiṃcina dharmamulu lēni vāḍu.)

  1. ayamātmā viśvarūpaḥ viśvakalpanādhāratayā, viśvasattāsphūrti pradatvāt, tadvikārasṛṣṭatvāt akartā.

(viśvarūpuḍaina - viśvamē rūpamugā galavāḍaina - īātma viśvamunu sṛṣṭiṃci dhariṃcuṭa cētanu, viśvamunaku tana sattasphūrti niccuṭa valananu, vikāramulanu sṛṣṭiṃcuṭa valananu akarta.)

  1. anāditvānnirguṇa tvātparamātmāyamadyayaḥ |

śarīrasthōpi kauṃtēya nakarōti nalipyatē |

yathā sarvagataṃ saukṣmā dā kāśaṃ nōpalipyatē |

sarvatrāvasthitō dēhē tadhātmā nōpalipyatē || (śrīmadbhagavadgīta- 13 - 31 - 32)

(anniṃṭilōnu unnappaṭiki vāṭikaṃṭē sūkṣmamainadaguṭa valana ākāśamu dēninī aṃṭadu. ā prakāramē anādi yaguṭa valananu, janma lēnivāḍaguṭa cētanu, triguṇamulu lēnaṃdu valananu avyayuṃḍaina paramātma śarīramulō unnappaṭikī ē karmanu cēyuṭalēdu - śarīramu karmalu cēyucunnanu ā karmalu ī paramātmanu aṃṭavu. aṃducēta paramātma akarta.)

  1. “ēvaṃ janmāni karmāṇi hyakartura janasyaca |

varṇayaṃti sma kavayō vēdaguhyāni hṛtpatē” (śrīmadbhagavadgīta -1 - 3 - 35)

(janmamu lēnaṭuvaṃṭinnī, karta gānaṭuvaṃṭinnī paramātmaku kavulu avatāramulalō janmamu nettinaṭlu, karmalu cēsinaṭlu varṇiṃcucuṃduru.)

  1. “ca. jananamulēka karmamula jāḍalabōka samasta citta va

rtanu ḍagu cakrikiṃ gavulu dāravadaṃbula janma karmamul

vinutulu sēyucuṃḍuduru; vēdarahasyamulaṃdu neṃdu jū

cina maṟi lēvu jīvuniki ceppina kaivaḍi janma karmamul”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 1- 3 – 31)

  1. “ka. hari narula kella būjyuḍu

hari līlāmanujuḍunu guṇātītuḍu nai

paragina bhava karmaṃbula

borayuṃḍaṭa hariki garmamulu līla lagun”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 1 - 73)

  1. “ka. māyā guṇānugatuḍai

pāyaka nānāvidha prapaṃcaṃ bitaḍē

cēyunanitōcu nēmiyu

jēyaḍa saṃguṃḍakarta nirdhamu vatsā” (śrī sītārāmāṃjanēya saṃvādamu- 1 - 83)

  1. “ma. dharaṇīśōttama! bhūtasṛṣṭi niṭu saṃsthāpiṃci rakṣiṃcu nā

hari kartṛtvamu nolla ḍātmagata māyā rōpitaṃjēsi tā

niravadyuṃḍu, niraṃjanuṃḍu paruḍun niṣkiṃcanuṃ ḍāḍyuḍun

nirapēkṣuṃḍunu niṣkaśaṃku ḍagucun nityatvamun boṃdeḍin” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 10 - 280)

(prapaṃcamunaku sṛṣṭi, stiti layamulu cēyu cunnappaṭikinnī, ī karmalu tanalō nunna māya cēyucunnaṃdu valla paramātmaki kartṛtvamu lēdu. ā karmala phalamu bhagavaṃtuni aṃṭadu.)

  1. “ma. jananaṃ baṃduṭa lēni yīśvaruḍu dā janmiṃcu ṭellan virō

dhi nirāsārthamu vītakarmu ḍagu na ddēvuṃḍu garma prava

rtanu ḍau ṭella jarācara prakaṭa bhūtaśrēṇulan garma va

rtanulaṃ jēya dalaṃci kāka kalavē daityārikiṃ garmamul”. (śrīmadāṃdhra mahā bhāgavatamu- 3 - 2 - 72)

(ajuḍu anādi yaguṭacēta janmamē lēni paramātma avatāramu letti karmalu cēyuṭa virōdhulanu śāsiṃcuṭaku tānu karmalu cēsina yeḍala tananu cūci lōkulu karma cēyuduru anu uddēśamutō karmalu cēsenu. aṃtē kāni janmamē lēni vāniki karmalu cēyuṭē lēdu. aṃducēta bhagavaṃtuḍu akarta.)

  1. “kartṛtvamapi bhōktṛtvaṃ nādhatvayi navidyatē |

budhdhautvaṃ pratibiṃbēna kartā bhōktāca gīyanē ||” (śivapurāṇaṃ)

(kartṛtvamu gāni bhōktṛtvamu gāni nī yaṃdu kanabaḍadu - lēdu. budhdhi yaṃdu nī pratibiṃbamuṃḍuṭacēta nīvu kartayani bhōktayani ceppabaḍucunnāvu.)

  1. “sarvabhūtāni kauṃtēya prakṛtiṃ yāṃtimāmikāṃ|

kalpakṣayē punastāni, kalpādau visṛjāmyahaṃ ||

prakṛtiṃ sāma viṣṭabhya visṛjāmi punaḥ punaḥ |

bhūta grāma mimaṃ kṛtsnamavaśaṃ prakṛtiryaśāt ||

na ca māṃtāṃ karmāṇi nibadhnaṃti dhanaṃjaya |

udāsīna vadāsīnamasaktaṃ tēṣukarmasu |

mayādhyakṣēṇa prakṛtiḥ sūyatē na carācaraṃ |

hētunānēna kauṃtēya jagadviparivartatē ||” (śrīmadbhagavadgīta - 9 - 7 to 10)

pai ślōkamunaku vyākhyānamu : -

“bhūtavargamimaṃ kṛtsnaṃ tāratamyānvitaṃ sṛjan |

na tatkartṛtva saṃbaṃdhaṃ bhajāmītyāha māpatiḥ ||

sṛṣṭi stitilayākhyāni kriyamāṇāni māyayā |

māyāvinētakarmāṇi tāni svapnadṛśēnaca |

nigrahānugrahānugrahābhyāṃvā na nibadhnaṃti māṃ hariṃ |

midhyā tvānnaivakurvaṃti puṇya pāpādi bhāginaṃ |

upēkṣakō yadhākaściddhvayōrvivadamānayōḥ |

jayājayādya saṃsargī tatrāstē nirvikāradhīḥ |

nirvikāratayā tadvadāsīnaṃ nirahaṃ kṛtiṃ |

tēṣukarmasu tasmānmāṃ nanibadhnaṃti tānivai |

anyasyāpi phalāsaṃgābhāvō nirabhimānitā |

sarvakarma svabaṃdhasya kāraṇaṃ hariṇēritaṃ ||” (gītābhāva prakāśamu - 9 - 64 to 69)

(bhūtamulanniṃṭini tāratamyamulu galavigā - okadāniki iṃkokadāniki heccu taggulu galavāṭinigā, anagā okarini bīdavāḍini gānu, iṃkokarini goppavāḍini gānu, okaḍini sukhamu anubhaviṃcuvāḍini gānu, iṃkokaḍini duḥkhamanubhaviṃcuvāḍu gānu, okaḍini sphuradrūpuḍu gānu, iṃkokaḍini kurūpi gānu, okaḍini sanmārguḍu gānu, iṃkokaḍini durmārguḍu gānu, ī vidhamugā tēḍālatō, aṃdaṟini okalāguna kāka - sṛṣṭiṃci yī karmaku saṃbaṃdhiṃcina kartṛtvamu tanaku lēdu, dāniki tānu karta gānani śrīkṛṣṇa bhagavānuḍu ceppenu. sṛṣṭi stiti layamulanu karmalu oka iṃdrajālikuḍu vale, kalalō jariginavāṭi vale māyacē nirmiṃpabaḍucunnavi. ī karmalō nigrahiṃcinā, anugrahiṃcinā avi nannu baṃdhiṃcavu. idaṃtāmidhya ganuka vāṭivalana kalugu puṇyapāpamulu nāvi kāvu. iddaru vivādamu salupu cunnapuḍu vāri jayāpajayamulatō saṃbaṃdhamu lēkuṃḍā, vikārabudhdhi lēkuṃḍā taṭastamugā uṃḍi, upēkṣa cēstū uṃḍuvāḍu vale nēnu, svataḥ nirvikāruḍaguṭa cētanu, ahaṃkāramu lēnivāḍanaguṭa cētanu - anagā, ī pani nēnu cēyucunnānu anubhāvamu lēkapōvuṭa cēta - ā karmalu (sṛṣṭi stiti layamulu, vāṭiki saṃbaṃdhiṃcina puṇya pāpamulu, maṃci ceḍdalu) nannu baṃdhiṃcavu. ī rītigā baṃdhamu lēkuṃduṭa nākē kādu, evaraina cēyu karma yokka phalamaṃdāsakti lēka cēyudurō - nēnu cēyucunnānu anu ahaṃkāramu lēka cēyudurō – aṭṭivārini kūḍā akarmalu baṃdhiṃcavu.)

“bhūtagrāmaṃ sṛjāmīti tadhōdāsīnavat stitiḥ |

ityanyānya viruddhaṃ syāt ityā śaṃkyāha mādhavaḥ |

mayā dṛṅmātrarūpēṇadhyakṣēṇā vikriyātmanā |

niyaṃtrā prakṛtirmāyā bhāsakēnāva bhāsatā |

satvādibhiranirvācyōtpāda yatyakhilaṃ jagat |

māyā vinā śritā māyā yathāstaṃ gajādikaṃ |

sṛjatyahaṃ tathādhyastaṃ sṛjāmīdaṃ carācaraṃ |

na tvahaṃ sarvakāryātmā māyā bhāsanamātarā |

vyāpārāṃtaramapyatra vidadhēvi kriyātigaḥ |

anēnādhyakṣa bhānēna nimittēna carācaraṃ |

jananādi vināśāṃtaṃ vikāramanu yātyadaḥ |

atōhaṃ bhāsakatvākhya vyāpārēṇa sṛjāmi tat |

tāvatā sūryavannāsti kartṛtvaṃ mama sarvadhā |

udāsīna vadāsīnamityuktērna virudhdhatā |

“asya dvaitēṃdra jālasya yadupādānakāraṇaṃ |

ajñānaṃ tadupāśritya brahma kāraṇamucyatē |”

apūrvānaparaṃ brahma tasya kāryaṃ na kāraṇaṃ |

adhiṣṭānamātrēṇakāraṇaṃ brahmagīyatē |

ityuktērapi hētutvaṃ māyayā natu vastutaḥ |

pravṛttiḥsarva jagataḥ cidadīnā nadaivahi |

atastadu bhayaṃ naivaviruddhaṃ syātparasparaṃ ||“. (gītābhāva prakāśamu- 9 - 70 to 80)

(“bhūtamulanniṃṭinī nēnu sṛjiṃcu cunnānu.” ani okacōṭa, “prakṛti - māya - bhūtamulanu sṛjiṃcu cunnadi, nēnu udāsīnuni vale ūraka cūcucuṃdunu” ani maṟiyoka cōṭa ceppabaḍinadi. ī reṃḍuvākyamulu okadānikokaṭi virudhdhamugā nunnavi śaṃka - anumānaṃ - uṃḍunēmō ani ā śaṃka tīrcuṭaku bhagavaṃtuḍu - śrīkṛṣṇuḍu - ī kriṃdi vidhamugā spaṣṭamu cēyu cunnāḍu : - dṛjmātra rūpuḍu - sākṣi, ūraka cūcuvāḍu - adhyakṣuḍu, avikriyuḍu, niyaṃta ayina nāyokkakāṃticēta -sattāsphūrticēta - bhāsamānamainadai, anirvacanīya maguṭa cēta māya yanabaḍu prakṛti yī samasta jagattunu puṭṭiṃcunu. māyāvi cēta āśrayiṃca baḍinaṭṭi māya adhyastamaina ēnugu modalagu vānini sṛjiṃcinaṭlu nācēta nadhyastamaina ī sakala carācara jagattunu sṛṣṭiṃcu cunnānu. nēnu māyāṃtargatuḍanu mātramē kāni samasta kāryamulanu cēyuvāḍanu kānu. māyāvikāramu natikramiṃci ē paninainanu cēyanu. māyalō adhyakṣuḍugā nēnu uṃḍina kāraṇamucēta ī carācara jagattaṃtayu, janmamu modalu naśiṃcu varaku gala mārpulanu (vikāramulanu) poṃducu nuṃdunu. aṃdunuṃḍi nēnumāyalō bhāsamānuḍanai yuṃḍi sattāsphūrti kaligiṃcuṭacēta ī jagattunu sṛṣṭiṃcucunnānu - aṭlu ayinanu nāku sūryunivale ē prakāramugā nainanu kartṛtvamu lēdu. aṃducēta nēnu sṛṣṭistunnānu anna māṭaku, māya sṛṣṭi cēyucu nuṃḍagā nēnu udāsīnuḍu vale taṭasthamugā cūcucu ūrakuṃḍuvāḍanu anu māṭaku, parasparamu virudhdhamu lēdu. ī dvaitēṃdra jālamunaku ajñānamu pādāna kāraṇamu. ī yajñānamu nāśrayiṃcu konuṭacēta nēnu kāraṇamani ceppabaḍu cunnānu. brahmaku pūrvamēmī lēdu, tarvātakūḍa ēmiyu lēdu - muṃdu, venuka ēmiyu lēdu. anagā brahma kāraṇamu kādu, kāryamu kādu. māyanu - prakṛtini adhiṣṭiṃci yuṃḍuṭa cēta māya cēyupaniki brahmayē kāraṇamani ceppabaḍucunnāḍu. ī prakāramu brahma kāraṇamani ceppabaḍuṭa kūḍā māyavalananē, vāstavamugā kādu. ī samasta jagattu yokka pravṛtti cinmātramu yokka adhīnamulō nunnadi. cidrūpuḍu tana sattānu prati vastuvunaku nicci pratidānicēta dāniki nirṇītamaina panini cēyiṃcunu.

  1. “cāturvarṇyaṃ mayāsṛṣṭaṃ guṇakarmavibhāgaśaḥ |

tasyakartāramapimāṃ vidhdhya kartā ramapya vyayaṃ |

namē karmāṇi liṃpaṃti namē karmaphalē spṛhā ||” (śrīmadbhagavatgīta - 4 -13, 14)

ī ślōkamunaku vyākhyānamu : -

“vyavahāradṛśā tasya cāturvarṇyasya sarva śaḥ |

kartāraṃ saṃtamapimāṃ paramārdha dṛśā (a)vyayaṃ |

vidhdhyakartāramakṣīṇa svabhāvama nahaṃ kṛtaṃ |

nirvikāratayā saṃtaṃ māṃ jñā tvā mucyatē bhayāt ||

- - - karmāṇi viśva sṛṣṭyā dīnyahaṃkāramīśvaraṃ |

dēhādyāraṃbhakatvēna namāṃ badhnaṃti cidghanaṃ |

navā mamāpta kāmasya tṛṣṇākarmaphalēyataḥ |

kartṛtvābhinivēśēna tadhaiva phalatṛṣṇayā |

paṃtyajñāṃstu karmāṇi tada bhāvānna māṃ haraṃ ||” (gītābhāva prakāśamu - 4 - 90 - 94)

(satvarajastamamulanu mūḍu guṇamulu anēka vidhamulugā heccu taggulatō kalisiyuṃḍuṭanu baṭṭi ī guṇamula valana kaligina śarīramulunnū, anēka vidhamulugā nuṃḍunu. anni śarīramula lōnu triguṇamula yokka kūṭami okka rītigā nuṃḍadu. aṃducēta aṃdaṟu okē śīlamu - guṇamu - galavārugā nuṃḍaru. iṃtē gāka, vāru vāru cēyu karmalananusariṃci phalamu nanubhaviṃcuṭaku - vēṟu vēṟu śīlamulu - guṇamulu - gala śarīramulu poṃduduru. aṃducēta nī triguṇamulanu karmamulanu anusariṃci sṛṣṭi prārabhamulō nēnu nālugu varṇamulanu nirmiṃcitini. triguṇamulalō satvaguṇamu pradhānamugā kaligiyuṃḍi, śamamu, damamu modalagunavi kalavāru viprulu, rajōguṇamu mukhyamugā nuṃḍi satvaguṇamu takkuvagā nunna vāru kṣatriyulu. vāru cēyavalasina karma śauryamu - yudhdhamu - modalagunavi. rajōguṇamu mukhyamugā nuṃḍi heccugā nuṃḍi - tamōguṇamu takkuvagā nunna vāru vaiśyulu. vyavasāyamu modalagu karma cēyuvāru, tamōguṇamu pradhānamugā nuṃḍi śuśrūṣa modalagu panicēyuvāru śūdrulu. ī prakāramugā vēṟuvēṟugā varṇamulanu manuṣyulalō kalpiṃcuṭa valana bhagavaṃtuniki dīni kartṛtvamu kalugadā anu saṃśayamu nivāriṃcuṭakai śrīkṛṣṇaparamātma ā saṃśayamu tīrunaṭlugā śrīmadbhagavadgītā ślōkamulalō ī kriṃdi vidhamugā ceppenu : -paina ceppina nālugu varṇamulanu vyavahārikamugā bhagavaṃtuḍu cēsinadi yani anipiṃcinanu, dīniki karta bhagavaṃtuḍē yani tōcinanu, pāramārdhika dṛṣṭilō bhagavaṃtuḍu dīniki karta kāḍu. eṃducēta nanagā bhagavaṃtuḍu avyayuḍu - kṣīṇiṃcani svabhāvamu galavāḍu -, ahaṃkāramu lēnivāḍu, nirvikāruḍu - ennaḍū mārpu poṃdakuṃḍa, okētīruna nuṃḍuvāḍu. ahaṃkāri naśiṃcuvāḍu, mārpulu ceṃduvāḍu, ē karma cēsinanu dāni phalamu nanubhaviṃcunu. bhagavaṃtuḍiṭṭi vāḍu kāḍu, kanuka akartayē, ā pani cēyani vāḍē. aṃducēta sṛṣṭi cēsinappaṭikī, manuṣyulanu nālugu varṇamulu vārigā sṛṣṭiṃcinanu, bhagavaṃtuḍu ahaṃkāramu lēni vāḍaguṭacēta, anni vidhamulaina saṃpadalu modalagunavi tana yadhīnamu lōnivē ayi yunnaṃduna anni kōrikalu tīri yē kōrikalu lēnivāḍu, cēsina karmala phalamaṃdāsakti lēnivāḍu. nēnu ī karma cēsitini yanu ahaṃkāramu galavāḍini, karmaphalamaṃdāsakti galavāḍini karmalu baṃdhiṃcunu. aṭuvaṃṭivāḍu karta. nēnu (bhagavaṃtuḍu) aṭuvaṃṭivāḍini kānu kanuka, nēnu cēsinaṭṭu kanabaḍu sṛṣṭi modalagu karmalu nannu baṃdhiṃcavu. aṃducēta nēnu akartanu - “ayuktaḥ kāmakārēṇa phalē saktō nibadhdhyatē||” (śrīmadbhagavadgīta- 5 - 12) (kōrikatō karmalu cēsi phalamu nāśiṃcu vāḍu badhdhuḍagunu)

  1. “prakṛtyaiva ca karmāṇi kriyamāṇāni sarvaśaḥ |

yaḥ paśyati tadātmāna makartāraṃ sapaśyati ||” (śrīmadbhagavadgīta- 13 - 29)

(prakṛti cētanē karmalanniyu cēyabaḍucunnavi ani telusukonina yaḍala paramātma akartayē ani telusukonunu.)

  1. “tyaktvā karma phalāsaṃgaṃ nitya tṛptō nirāśrayaḥ |

karmaṇyabhi pravṛttōpi naiva kiṃcitkarōti saḥ |

nirā śīryata cittātma tyakta sarvaparigrahaḥ |

śārīraṃ kēvalaṃ karma kurvannāpnōti kilbiṣaṃ |

yadṛcchā lābha saṃtuṣṭō dvaṃdvā tītō vimatsaraḥ |

samaḥ sidhdhāva sidhdhauca kṛtvāpi nabadhdhyatē ||” (śrīmadbhagavadgīta - 4 - 20 to 23)

“kartṛtvāhaṃ kṛtiṃ tyaktvāphalē tṛṣṇāṃca karmaṇi |

parānaṃdātma lābhēna nirākāṃkṣō (a)khilē phalē |

dēhādyahaṃkṛtēḥ śūnyō dṛṣṭā dṛṣṭā śrayaṃtigaḥ |

ēvaṃ bhūtaḥ pravṛttōpi lōkadṛṣṭyā yadhāvidhi |

laukikē vaidikēvā (a)sau karmaṇyārabdha yōjitaḥ |

svadṛṣṭyāniṣkriyaḥ sātmadarśana dhvasta vikriyaḥ |

svēmahimni sthitō dhīrō naiva kiṃcitkarōtyasau |

vīta tṛṣṇōvaśēnītaṃ cittaṃ dēhēṃdriyaissaha |

yēna sō(a)tyaṃta vairāgyā tyakta bhōgōpakārakaḥ |

ētādhdhvaśōpi prārabdha vaśādbhikṣāṭa nādikaṃ |

śarīrastiti mātrārdhē kāyikaṃ vācikaṃ tadhā |

mānasaṃ karma kartṛtvā dhyasa śūnyaḥ samācaran |

akartātma dṛśā nāsau dharmā dharmaphalaṃ yataḥ |

saṃsāra kiṃcanāpnōti bādhita tvāchcubhā subhaṃ |

yatēraniṣṭa hētutsātpuṇya mavyasya kilbiṣaṃ |

lābhōhya prārthitō (a)yatnāttē nālaṃ pratyayaṃ gataḥ |

śāstānumata bhikṣādi lābhāt saṃtuṣṭa ēvaṣā |

svaprayatnaṃvinā (a)lābhē śītōṣṇādi bhirarthitaḥ |

dvaṃdvairakṣubdha cittō yō nirviraḥ sarvajaṃtuṣu |

śarīrasthiti hētōśca lābhē (a)lābhē (a)vikāradhīḥ |

svānubhūtyā sacākartaivārōpita kriyaḥ |

bhikṣāṭanādikaṃ kṛtvā baṃdhaṃ nāpnōti kiṃcana |

phalāsaṃga vihīnasya nirgatādhyāsakasya ca |

nirvikalpātmatatvaikya bōdhē yasyasthitaṃ manaḥ |

ī dṛśasyāpi prārabdhavaśā llōka pravṛttayē |

kurvataḥ karma yajñādi viṣṇu prītyardhamēvavā |

sahāgrēṇa phalē naitatkarmajñasya vinaśyati |

phalaṃ cā jana yitvaida mūlōccēvāddhṛśōktayā ||“. (gītābhāva prakāśamu - 4 - 135 -153)

(tanu cēyu karmalaṃdu ‘nēnu kartanu’ anu ahaṃkāramunu vadali ā karmala valana kalugu phalamu naṃdāsakti lēka yuṃḍi, paramānaṃdalābhamu poṃdiyuṃḍuṭa cēta anni vidhamulaina karma phalamulaṃdunu āsakti lēkayuṃḍi, ‘dēhamē nēnu’ anu modalagu nahaṃkāramu lēka, dṛṣṭā dṛṣṭa viṣayamulaku atītuḍainavāḍu, laukikakarmagāni, vaidikakarmagāni yadhāvidhigā lōkula dṛṣṭilō cēyucunnappaṭikī tana dṛṣṭilō - paramārdha dṛṣṭilō ē paniyunu cēyanivāḍē. ātma jñānamu kaligiyuṃḍuṭacēta anni vidhamula vikriyamulu lēnivāḍai, ātmajñānamunaṃdē nilakaḍa kaligiyunnaṃduna yaṭṭi dhīruḍu ē karmayunu, ē koṃcemainanu cēyanivāḍē, akartayē. dēni yaṃdunu āśa lēnivāḍai, dēhamunu, iṃdriyamulanu, manassunu tana svādhīnamulō nuṃcukonina vāḍu atyaṃta vairāgyamu valana bhōgamulanu vadalivēsi prārabdavaśamuna śarīramunu pōṣiṃcu konuṭaku mātramu avasaramaina, manōvākkāyamulaku saṃbaṃdhiṃcina karma tānē kartanu anudhyāsa lēka cēyuvāḍu, ‘nēnu ī paniki kartanukānu’ anu abhiprāyamu galigi yuṃḍuṭacēta ā karmaphalamu agu saṃsāramu tanani aṃṭadu. svaprayatnamu lēkuṃḍaganē, tānu kōrakanē bhikṣāṭanamu valana saṃprāptamainadē cālunani saṃtuṣṭi poṃduvāḍunu, śītōṣṇamulu modalagu dvaṃdvamulacēta vyākulata ceṃdani manassu galavāḍai, samasta prāṇula yaḍala vairamu lēnivāḍunu, jīviṃciyuṃḍuṭa koṟakaina labhālābhamula valana vikāramunu poṃdanivāḍu, bhikṣāṭanamu modalagu karmalanu cēsinanu akartayē. aṃducēta ā karmalu atanini baṃdhiṃcavu. karmaphalamaṃdu āsaktilēnivāḍu, adhyāsa lēnivāḍu nirvikalpātma tatvamunaṃdu nilakaḍagala manassu galavāḍu prārabdhavaśamuna pravṛtti rūpamaina dānini cēyucunnanu, lēka bhagavaṃtuḍaina śrī mahāviṣṇuvuni prīti koṟaku yajñamu modalagu karmalu cēsinanu, aṭṭikarmalu phalamunivvaka samūlamuga naśiṃcipōvunu. aṃducēta ā karmalu aṭṭivānini baṃdhiṃcavu. aṭṭivāḍu akarta.)

  1. “brahmaṇyādhāya karmāṇi saṃgaṃ tyaktvā karōtiyaḥ |

lipyatē na sa pāpēna padmapatramivāṃbhasā ||” (śrīmadbhagavadgīta- 5 -10)

paiślōkamunaku vyākhyānamu : -

“phalāsaṃgaṃ parityajya samarpya paramēśvarē |

karmāṇi vaidikānyajñō laukikān karōti yaḥ |

pāpapuṇyātmikē nāsau karmaṇā naiva lipyatē |

yadhō pariprakṣiptēna padmapatraṃ na cāṃbhasā |

lipyatē, tadvadīśēpi karmārpita malēpakaṃ |

pratyutēśa prasādēna dhīsudhdhiścāsya jāyatē ||” (gītābhāvaprakāśamu - 5 - 82 to 85)

(karmayokkaphalamu nāṃdāsakti vadili tānucēsina yajñamu modalagu vaidikakarmalanu, laukikakarmalanu paramēśvarunaku - bhagavaṃtuniki- arpiṃcina yaḍala ā karmalu tananu aṃṭavu. tāmarāku paina nīru paḍinanu ā nīru ā ākunu aṃṭadu - aṃducēta aṭṭivāḍu aṭṭi karmala phalamu nanubhaviṃcaḍu. aṃducēta atanu akarta. aṭlu ā karmalanu bhagavaṃtuniki arpiṃcinaṃdu valana bhagavaṃtuni daya valana ataniki citta śudhdhi kalugunu.)

  1. “yōgayuktō viśudhdhātmā vijitātmā jitēṃdriyaḥ |

sarva bhūtātma bhūtātmā kurvannapi na lipyatē |

naiva kiṃcit karōmīti yuktō manyēta tatvavit |

paśyan śṛṇvan spṛśan jighran aśnan gaccan svapan śvasan |

pralapan viśvajan gṛhṇan unmiṣan nimiṣannapi |

iṃdriyāṇīṃdriyārdhēṣu vartaṃta iti dhārayan ||” (śrīmadbhagavadgīta- 5 - 6 to 8)

paiślōkamunaku vyākhyānamu : -

“yasyātmā sarva bhūtānāmātma bhūtassa ī dṛśaḥ |

akhaṃḍādvaita niṣṭassan tyakta bhēdanutiḥ pumān |

sarva bhūta ātma bhūtaścātmā yasyēti vigrahē |

jaḍā jaḍātmakaṃ viśvaṃ praśyannātmamayaṃ muniḥ |

ubhayatrāpyakhaṃḍārtha bōdha sidhiritīritā |

īdṛśaḥtatvadṛkkurvannapi lōka dṛśā kriyāḥ |

tābhirna lipyatē yasmāt sva dṛṣṭyā tadabhāvataḥ |

dhīśudhdhyā yuktaē vādau bhūtvā tatva vi dēvanaḥ |

kriyamāṇānu cēṣṭānu nakarōmītimanyatē |

jñānakarmēṃdri yaiḥ karmadaśabhiḥ tadyadhā yadhaṃ |

kurvanna kurvatā budhdhyā paśyatyātmāna makriyaṃ |

śvasan prāṇaiḥ svapannaṃtaḥ karaṇēna munistathā |

unmiṣannimiṣannēvaṃ nāgakūrmādi paṃcakaiḥ |

ētāni spasvaviṣayē vartaṃtē natvahaṃ tviti |

dhārayansarva vyāpārē ṣyātmāna makriyaṃ vidan |

kurvanna lipyatē cātōyukta mēvēritaṃ vacaḥ ||” --- (gītābhāvaprakāśamu - 5 - 73 to 81)

(ē karma cēsinanu dāni phalamu nāśiṃcaka, dānini bhagavadarpaṇamu cēyuṭa yōgamu. rajōguṇamu, tamōguṇamu - vīṭi dōṣamulu aṃṭakuṃḍunaṭṭi kēvala satvaguṇamu kaligiyuṃḍuṭa valana śudhdhamaina manassu kaligi, painaceppabaḍina yōgamu navalaṃbiṃci, śarīramunu iṃdriyamulanu jayiṃci tanavaśamulō nuṃcukoninavāḍu - anagā vāgdaṃḍamu, manōdaṃḍamu, kāya daṃḍamu anu trividha daṃḍamulu dhariṃcinavāḍu tridaṃḍi. sarvabhūtamula ātmā tana ātmēyani, lēka, jaḍamulu ajaḍamulatō niṃḍiyunna ī prapaṃcamaṃtayu ātma mayamani talacuvāḍu. iṭlu paramātma tatvamunu telusukoninavāḍu lōka dṛṣṭilō karmalu cēyucunnanu, atani dṛṣṭilō - paramātma dṛṣṭilō - karmalu cēyani vāḍē yaguṭavalana ā karmaphalamu atanini aṃṭadu. cittaśudhdhi kaligina mīdaṭa bhagavattatvamu telisinavāḍu tānucēyucunna panulayaṃdu ‘nēnu ī panulanu cēyuṭa lēdu’ ani talacunu – “jñānēṃdriyamulu, karmēṃdriyamulu ayina padiṃṭicēta vāṭi vāṭi panulanu cēyucunnānu” ani anukonunu. tananu akriyuni vale ē paniyu cēyanaṭlē cūcunu. prāṇavāyuvutō ūpiri tīyucunnanu, aṃtaḥkaraṇamutō nidra pōvucunnanu, upa prāṇamula cēta kannulu teṟaci unnanu, mūsi unnanu, kaṃḍlatō cūcucunnanu, cevulatō vinucunnanu, śarīramutō tākucunnanu, mukkutō vāsana cūcucunnanu, nōṭitō tinucunnanu, kāḷḷatō naḍacucunnanu, nidriṃcucunnanu, nōṭitō māṭlāḍucunnanu, apānamucē viḍicipeṭṭu cunnanu, cētulatō tīsukonucunnanu - anagā iṃdriyamulu vāṭivāṭi panulanu cēyucunnavē, vāṭivāṭi viṣayamulaṃdu vartiṃcucunnavē kāni, ātmanu ayina nēnu ēmiyu cēyuṭalēdu. nēnu akriyuḍanu anukonunu - aṭṭivāḍu akarta.)

  1. “sarva karmāṇi manasā nanyasyāstē sukhaṃ vaśī |

navadvārapurē dēhī naiva kurvanna kārayan ||” (śrīmadbhagavadgīta- 5 - 12)

pai ślōkamunaku vyākhyānamu : -

” - - - dēha bhinnātma tatvadṛk |

navadvāraviśiṣṭē (a) smin dēhē tiṣṭatyasau purē |

paragēha pravāsīva nirmamō nirahaṃkṛtiḥ |

dēhamātrātma darśītu dēhādhi karaṇaṃ naraḥ |

svasyādhikaraṇaṃ matvā gṛhē bhūmē tadhāsanē |

ahamāsē (a)bhimānīti natvāsē dēha ityapi |

saṃghāta vyatiriktātma darśina stūpa padyatē |

dēha āsa iti jñānaṃ vidyayā bhrāṃti bādhanāt |”

(dēhamukanna ātma vērainadi ani ātma tatvamunu telisukoninavāḍu navadvāramulu kala puramu vale nunna ī śarīramaṃdu, itarula gṛhamaṃdunna paivāḍu vale - pravāśi vale - mamakāramu, ahaṃkāramu lēnivāḍuga nuṃḍunu. iṭṭivāḍu ē karma cēsinanu akartayē. dēhamē ātmayani talacuvāḍu “nēnu nā iṃṭilō bhūmimīda āsanamu kalpiṃcukoni dānimīdanē unnānu” anu abhimānamu - ahaṃkāra mamakāramulu galavāḍai yuṃḍunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.