పూర్ణము అగుటవలన - పూర్తిగా ప్రపంచములో నిండి యుండుట వలన అఖండము -
అపరిచ్ఛిన్నం (ఛేదించుటకు వీలు కానిది; పరిమితి ఇడరానిది).
సర్వ వ్యాపకమైనది; విభాగములు లేనిది; ముక్కలు కానిది, సంపూర్ణమైనది.
(శస్త్రములు మొదలయిన వాటిలో కూడ వ్యాపించి యున్నది)
(ఆత్మ చేదింప శక్యముకానిది, ఖండింప శక్యము కానిది)
(ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, ఖండింపలేవు - అందుచేత అఖండము)
నశక్నువంతి- - - ||” (గీతాభావప్రకాశము - 2 - 291, 292)
(శస్త్రములు - ఆయుధములు ఆత్మని రెండుగా చేయుటకు శక్తి లేనివి; ఆత్మ నిత్యమైనది, అచ్ఛేద్యము, అక్షరము, అవ్యయము - అందుచేత ఆత్మ అఖండము -)
ప్రేరకో (అ)oతర్యామితయా కధిమే నమిమాన్యపి |
శస్త్రా దీని ప్రకుర్యుస్తం స్వ వ్యాపరైకగోచరం ||” (గీతాభావప్రకాశము- 2 - 300, 301)
(ఈ ఆత్మ శస్త్రములు మొదలగువాటిలో అంతర్యామిగా ఉంది, వాటికి సత్తాస్ఫూర్తినిచ్ఛి వాటిని వాటి పనులలో - ఖండించుట మొదలగు పనులలో - ప్రేరేపించునది. వాటిలో ఆత్మ లేని యెడల అవి దేనినైనను ఖండింప శక్తి లేనివే యగును.) (చూడుము -‘అక్లేద్యః-3’)
“వ. ఇట్లు సర్వాత్మకం బై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహా విష్ణుని యందు జిత్తంబు జేర్చి, తన్మయుం డై పరమానందంబునం బొందియున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుండు దన కింకరుల చేతం జేయింపు చున్న మారణకర్మంబులు పాపకర్మునియందు బ్రయుక్తంబు లైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి.”
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7 - 5 -195)
pūrṇamu aguṭavalana - pūrtigā prapaṃcamulō niṃḍi yuṃḍuṭa valana akhaṃḍamu -
aparicchinnaṃ (chēdiṃcuṭaku vīlu kānidi; parimiti iḍarānidi).
sarva vyāpakamainadi; vibhāgamulu lēnidi; mukkalu kānidi, saṃpūrṇamainadi.
(śastramulu modalayina vāṭilō kūḍa vyāpiṃci yunnadi)
(ātma cēdiṃpa śakyamukānidi, khaṃḍiṃpa śakyamu kānidi)
(ātmanu śastramulu chēdiṃpalēvu, khaṃḍiṃpalēvu - aṃducēta akhaṃḍamu)
naśaknuvaṃti- - - ||” (gītābhāvaprakāśamu - 2 - 291, 292)
(śastramulu - āyudhamulu ātmani reṃḍugā cēyuṭaku śakti lēnivi; ātma nityamainadi, acchēdyamu, akṣaramu, avyayamu - aṃducēta ātma akhaṃḍamu -)
prērakō (a)otaryāmitayā kadhimē namimānyapi |
śastrā dīni prakuryustaṃ sva vyāparaikagōcaraṃ ||” (gītābhāvaprakāśamu- 2 - 300, 301)
(ī ātma śastramulu modalaguvāṭilō aṃtaryāmigā uṃdi, vāṭiki sattāsphūrtinicchi vāṭini vāṭi panulalō - khaṃḍiṃcuṭa modalagu panulalō - prērēpiṃcunadi. vāṭilō ātma lēni yeḍala avi dēninainanu khaṃḍiṃpa śakti lēnivē yagunu.) (cūḍumu -‘aklēdyaḥ-3’)
“va. iṭlu sarvātmakaṃ bai yiṭṭi daṭṭi dani nirdēśiṃparāni parabrahmaṃbu dānayai ya mmahā viṣṇuni yaṃdu jittaṃbu jērci, tanmayuṃ ḍai paramānaṃdaṃbunaṃ boṃdiyunna prahlāduniyaṃdu rākṣasēṃdruṃḍu dana kiṃkarula cētaṃ jēyiṃpu cunna māraṇakarmaṃbulu pāpakarmuniyaṃdu brayuktaṃbu laina satkāraṃbuluṃ bōle viphalaṃbu laguṭaṃ jūci.”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 7 - 5 -195)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.