← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖండార్ధము akhaṃḍārdhamu

Original — తెలుగు
  1. ఆత్మ అనునది ఒకటే. అదియే లోకములో ఉన్న అన్ని వస్తువుల రూపముగా మారి యున్నది. ఈ వస్తువులన్నియు కలిసి ఒకే పదార్ధము. అదియే ఆత్మ - పరమాత్మ. అనేక రూపములుగా మారినను అవి అన్నీ కలిసి ఒకటే పదార్ధము. “తత్వమని”, “అహం బ్రహ్మస్మి” అను మహా వాక్యముల ప్రకారము జీవుడు, పరమాత్మ ఒకటే. ఇంతే కాక, జీవము లేనట్లు కనుపించు సమస్త పదార్ధములు భగవంతుడే. ఈ మహా వాక్యము అన్నితత్వములకు వర్తించును. అన్ని తత్వములు పరమాత్మ లోనుండి పుట్టినవే. కనుక అన్నియు పరమాత్మయే. బంగారముతో చేయబడిన ఆభరణము బంగారమే; మట్టితో చేయబడిన కుండ మొదలగునవి మట్టియే యగునట్లు.

  2. “సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వ మాశ్రితః |

సర్వధా వర్తమానోపి సయోగీమయి వర్తతే ||” (శ్రీమద్భగవద్గీత - 6 - 31)

“తత్వం పదార్థ ముక్త్యైవం అఖండారో నిరూప్యతే |

బ్రహ్మాదిస్తావరాం తేషు భూతేషూచ్ఛావ శేషు యః |

నిర్విశేషం చిదానందం మామద్వైతం నిరంజనం |

గుణరూపక్రియావస్తు విక్రియా ద్యేక హేతుకం |

భేదం త్యక్త్వాం ధ్యజం శుధ్ధం సచ్చిన్మాత్రతయా స్థితం |

తత్పదార్థైక లక్షస్య త్వమో లక్ష్యేణ సాక్షిణం |

ఇ హైకత్వం శ్రుతౌ సిద్ధమత్యంతా భేద మాస్థితః |

అహం బ్రహ్మేతి వేదాంతవాక్య జిజ్ఞాన చక్షుషా |

అపరోక్షీ కరోత్యాశు త్యక్త్వా విద్యాం చతత్కృతాం |

కృతకృత్య తయా సోయం జీవన్ముక్త ఉదార ధీః |

యావత్తస్య శరీరాది దర్శినం చాను వర్తతే |

ఆభాస మాత్రం బుధ్ధ్యస్వ యదా స్వాప్నస్య దర్శనం |

ప్రారబ్దకర్మ ప్రాబల్యాత్తావత్కర్మాణి వా త్యజన్ |

కుర్వన్వావిహితం కర్మనిషిధ్ధం వా సమాచరన్ |

యేనకేనాపి రూపేణ యోగీన్యాహరన్నపి |

బ్రహ్మస్మీతిధియా విద్వాన్మయ్యేవ పరమాత్మని |

ఐక్యేన వర్తతే నిత్యమద్వైతే వైష్ణవే పదే |

నిత్య ముక్త స్వభావ త్వా త్కర్మ భిర్నెవ లభ్యతే |

ధర్మాధర్మా ద్యతీతే హి పదే నిత్యం విరాజితే ||.” (గీతాభావప్రకాశము - 6 - 151 to 160)

(నిర్విశేషుడు, చిదానందుడు, నిరంజనుడు, గుణరూపక్రియా, వస్తు విక్రియములు మొదలగు వాటి కన్నింటికి ఒకే కారణమైన వాడు; తను గాక ఇతర పదార్ధమను నది లేనటువంటి వాడు, మీద చతుర్ముఖబ్రహ్మ మొదలు క్రిందను స్థావరముల వఱకు గల సమస్త భూతముల యందు ఇవి ఉచ్ఛమైనవి ఇవి నీచమైనవి అను విచక్షణ లేకుండా అన్నిటియందు సన్మాత్రము గాను, చిన్మాత్రము గాను, ఉన్న భగవంతుని ఉపనిషత్తులలో చెప్పబడిన “అహం బ్రహ్మాస్మి” అను మహా వాక్యము ప్రకారము ‘అహం’ పదలక్ష్యార్ధము, ‘త్వం’ పదలక్ష్యార్ధము తెలుసుకొని యున్నవాడు. ప్రారబ్ధకర్మ వశమున విహితమైనది కాని, నిషిధ్ధమైనది కాని, కర్మచేయుచు జీవన్ముక్తుడై ఎల్లపుడు నాయందే ఐక్యమయి నా యందే వర్తించును - అనగా, వైష్ణవ పదమైన పరమపదమందే, పరంధామమందే - వర్తించును, “పరంధామమూర్తిం”. (శ్రీ రామ కర్ణామృతం - 2 - 92)

అని ఉన్నది కనుక,

“క. పరమ బ్రహ్మ మనంగా

బరతత్వం బనంగ బరమపద మనగను నీ

శ్వరు డన గృష్ణు డన జగ

ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్ (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 11 - 51)

అని కూడా ఉన్నది కనుక, పరంధామమే పరబ్రహ్మ, పరబ్రహ్మమే పరంధామము, లేక పరమపదము. వైకుంఠమనినను, వైకుంఠుడనినను ఒకటే - వైకుంఠమే వైకుంఠుడు, వైకుంఠుడే వైకుంఠము)

  1. “యస్యాత్మా సర్వభూతానామాత్మభూతస్స ఈదృశః |

అఖండాద్వైత నిష్ఠస్సన్ త్యక్త భేదమతిః పుమాన్ |

సర్వభూత ఆత్మ భూతశ్చాత్మా యస్యేతి విగ్రహే |

జడా జడాత్మకం విశ్వం పశ్యన్నాత్మ మయం మునిః |

ఉభయత్రాప్య ఖండార్థ బోధ సిధ్ధిరితీరితా |

ఈ దృశః తత్వ దృక్కుర్వన్నపి లోకదృశా క్రియాః |

తాభిర్న లిప్యతే యస్మాత్స్వదృష్ట్యా తద భావతః || (గీతాభావప్రకాశము - 5 - 73 to 76)

(ఎవని ఆత్మ సర్వ భూతములకు ఆత్మభూతమైనది అని ఎవడు భావించునో, అతడు సర్వభూతాత్మ భూతాత్ముడు – సర్వ భూతములకు తనే భూతాత్మ అయినవాడు అనగా, - సర్వాత్ముడు అయిన భగవంతుడు తానే అను భావము కలవాడు; తనలో నున్న ఆత్మయే అన్నింటిలో నున్న ఆత్మ, ఈ రెండూ ఒకటే, వేఱుకాదు; జీవాత్మ పరమాత్మలకు భేదము లేదు, ఆ రెండూ ఒకటే అను భావము కలవాడు - అనగా, సమస్త జీవులతో నిండియున్న ఈ ప్రపంచ మంతయు ఆత్మమయము - ఇందులో మఱియొక వస్తువు లేదు –

“క. హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయము పనిలేదా

హరిమయము గాని ద్రవ్యము

పరమాణువు లేదు వంశపావన !వింటే” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 1 - 17)

ఈ ప్రకారముగా అట్టి ఆత్మ తానే అని భావించువాడు. ఈ ప్రకారముగా సమస్త భూతములకు ఆత్మకు ఐక్యమే అఖండార్ధము. ఇట్లు అఖండార్ధము తెలిసినవాడు - భగవత్తత్వమును యధార్ధముగా తెలిసినవాడు - లోకదృష్టిలో ఏపని చేసినను, తనదృష్టిలో - అనగా, పరమార్థ దృష్టిలో ఆ పనులు తనను అంటవు - అవి ఫలమును కలుగ చేయవు.)

  1. భగవంతుడు అపరిచ్ఛిన్నుడు; అందుచేత అఖండము, పూర్ణుడు, పూర్తిగా సృష్టి అంతటి లోను వ్యాపించి యుండువాడు. (చూడుము - ‘అఖండము’)
Transliteration
  1. ātma anunadi okaṭē. adiyē lōkamulō unna anni vastuvula rūpamugā māri yunnadi. ī vastuvulanniyu kalisi okē padārdhamu. adiyē ātma - paramātma. anēka rūpamulugā mārinanu avi annī kalisi okaṭē padārdhamu. “tatvamani”, “ahaṃ brahmasmi” anu mahā vākyamula prakāramu jīvuḍu, paramātma okaṭē. iṃtē kāka, jīvamu lēnaṭlu kanupiṃcu samasta padārdhamulu bhagavaṃtuḍē. ī mahā vākyamu annitatvamulaku vartiṃcunu. anni tatvamulu paramātma lōnuṃḍi puṭṭinavē. kanuka anniyu paramātmayē. baṃgāramutō cēyabaḍina ābharaṇamu baṃgāramē; maṭṭitō cēyabaḍina kuṃḍa modalagunavi maṭṭiyē yagunaṭlu.

  2. “sarvabhūtasthitaṃ yō māṃ bhajatyēkatva māśritaḥ |

sarvadhā vartamānōpi sayōgīmayi vartatē ||” (śrīmadbhagavadgīta - 6 - 31)

“tatvaṃ padārtha muktyaivaṃ akhaṃḍārō nirūpyatē |

brahmādistāvarāṃ tēṣu bhūtēṣūcchāva śēṣu yaḥ |

nirviśēṣaṃ cidānaṃdaṃ māmadvaitaṃ niraṃjanaṃ |

guṇarūpakriyāvastu vikriyā dyēka hētukaṃ |

bhēdaṃ tyaktvāṃ dhyajaṃ śudhdhaṃ saccinmātratayā sthitaṃ |

tatpadārthaika lakṣasya tvamō lakṣyēṇa sākṣiṇaṃ |

i haikatvaṃ śrutau siddhamatyaṃtā bhēda māsthitaḥ |

ahaṃ brahmēti vēdāṃtavākya jijñāna cakṣuṣā |

aparōkṣī karōtyāśu tyaktvā vidyāṃ catatkṛtāṃ |

kṛtakṛtya tayā sōyaṃ jīvanmukta udāra dhīḥ |

yāvattasya śarīrādi darśinaṃ cānu vartatē |

ābhāsa mātraṃ budhdhyasva yadā svāpnasya darśanaṃ |

prārabdakarma prābalyāttāvatkarmāṇi vā tyajan |

kurvanvāvihitaṃ karmaniṣidhdhaṃ vā samācaran |

yēnakēnāpi rūpēṇa yōgīnyāharannapi |

brahmasmītidhiyā vidvānmayyēva paramātmani |

aikyēna vartatē nityamadvaitē vaiṣṇavē padē |

nitya mukta svabhāva tvā tkarma bhirneva labhyatē |

dharmādharmā dyatītē hi padē nityaṃ virājitē ||.” (gītābhāvaprakāśamu - 6 - 151 to 160)

(nirviśēṣuḍu, cidānaṃduḍu, niraṃjanuḍu, guṇarūpakriyā, vastu vikriyamulu modalagu vāṭi kanniṃṭiki okē kāraṇamaina vāḍu; tanu gāka itara padārdhamanu nadi lēnaṭuvaṃṭi vāḍu, mīda caturmukhabrahma modalu kriṃdanu sthāvaramula vaṟaku gala samasta bhūtamula yaṃdu ivi ucchamainavi ivi nīcamainavi anu vicakṣaṇa lēkuṃḍā anniṭiyaṃdu sanmātramu gānu, cinmātramu gānu, unna bhagavaṃtuni upaniṣattulalō ceppabaḍina “ahaṃ brahmāsmi” anu mahā vākyamu prakāramu ‘ahaṃ’ padalakṣyārdhamu, ‘tvaṃ’ padalakṣyārdhamu telusukoni yunnavāḍu. prārabdhakarma vaśamuna vihitamainadi kāni, niṣidhdhamainadi kāni, karmacēyucu jīvanmuktuḍai ellapuḍu nāyaṃdē aikyamayi nā yaṃdē vartiṃcunu - anagā, vaiṣṇava padamaina paramapadamaṃdē, paraṃdhāmamaṃdē - vartiṃcunu, “paraṃdhāmamūrtiṃ”. (śrī rāma karṇāmṛtaṃ - 2 - 92)

ani unnadi kanuka,

“ka. parama brahma manaṃgā

baratatvaṃ banaṃga baramapada managanu nī

śvaru ḍana gṛṣṇu ḍana jaga

dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun (śrīmadāṃdhra mahābhāgavatamu - 11 - 51)

ani kūḍā unnadi kanuka, paraṃdhāmamē parabrahma, parabrahmamē paraṃdhāmamu, lēka paramapadamu. vaikuṃṭhamaninanu, vaikuṃṭhuḍaninanu okaṭē - vaikuṃṭhamē vaikuṃṭhuḍu, vaikuṃṭhuḍē vaikuṃṭhamu)

  1. “yasyātmā sarvabhūtānāmātmabhūtassa īdṛśaḥ |

akhaṃḍādvaita niṣṭhassan tyakta bhēdamatiḥ pumān |

sarvabhūta ātma bhūtaścātmā yasyēti vigrahē |

jaḍā jaḍātmakaṃ viśvaṃ paśyannātma mayaṃ muniḥ |

ubhayatrāpya khaṃḍārtha bōdha sidhdhiritīritā |

ī dṛśaḥ tatva dṛkkurvannapi lōkadṛśā kriyāḥ |

tābhirna lipyatē yasmātsvadṛṣṭyā tada bhāvataḥ || (gītābhāvaprakāśamu - 5 - 73 to 76)

(evani ātma sarva bhūtamulaku ātmabhūtamainadi ani evaḍu bhāviṃcunō, ataḍu sarvabhūtātma bhūtātmuḍu – sarva bhūtamulaku tanē bhūtātma ayinavāḍu anagā, - sarvātmuḍu ayina bhagavaṃtuḍu tānē anu bhāvamu kalavāḍu; tanalō nunna ātmayē anniṃṭilō nunna ātma, ī reṃḍū okaṭē, vēṟukādu; jīvātma paramātmalaku bhēdamu lēdu, ā reṃḍū okaṭē anu bhāvamu kalavāḍu - anagā, samasta jīvulatō niṃḍiyunna ī prapaṃca maṃtayu ātmamayamu - iṃdulō maṟiyoka vastuvu lēdu –

“ka. harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu saṃśayamu panilēdā

harimayamu gāni dravyamu

paramāṇuvu lēdu vaṃśapāvana !viṃṭē” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 1 - 17)

ī prakāramugā aṭṭi ātma tānē ani bhāviṃcuvāḍu. ī prakāramugā samasta bhūtamulaku ātmaku aikyamē akhaṃḍārdhamu. iṭlu akhaṃḍārdhamu telisinavāḍu - bhagavattatvamunu yadhārdhamugā telisinavāḍu - lōkadṛṣṭilō ēpani cēsinanu, tanadṛṣṭilō - anagā, paramārtha dṛṣṭilō ā panulu tananu aṃṭavu - avi phalamunu kaluga cēyavu.)

  1. bhagavaṃtuḍu aparicchinnuḍu; aṃducēta akhaṃḍamu, pūrṇuḍu, pūrtigā sṛṣṭi aṃtaṭi lōnu vyāpiṃci yuṃḍuvāḍu. (cūḍumu - ‘akhaṃḍamu’)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.