← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలాత్మా akhilātmā

Original — తెలుగు
  1. అఖిలస్య జగతః ఆత్మా. (సమస్త జగత్తునకు ఆత్మ అయినవాడు.)

  2. అఖిలానాం జీవానాం ఆత్మభూతః. (సమస్త జీవులకు ఆత్మ అయినవాడు.)

  3. హంతృ హంతవ్యా ద్యంతరాత్మా. (చంపెడు వారి యొక్క, చంపబడు వాళ్ళ యొక్క అంతరాత్మ అయినవాడు.)

  4. సర్వాంతర్యామి. (అన్నింటి యందును అంతరాత్మగా నున్నవాడు.)

  5. సర్వాత్మా (అందఱికి ఆత్మ అయినవాడు.)

  6. విశ్వాత్మా - (విశ్వమనగా ప్రపంచము. ప్రపంచమంతటికి ఆత్మ అయిన వాడు – విశ్వములో నున్న అన్నింటికీ ఆత్మ అయిన వాడు.)

  7. అఖిల శరీరకః. (సమస్త వస్తువులు తన శరీరమే అయినవాడు.)

  8. “అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయ స్థితః” (శ్రీమద్భగవద్గీత - 10 - 20)

“హృద్దేశే సర్వ భూతానాం అంతర్యామితయా స్థితః |

ప్రత్యగాత్మనా చైవ -- ||” (గీతాభావప్రకాశము - 10 - 97, 98)

(సమస్త భూతముల హృదయ మందు అంతర్యామిగా భగవంతుడున్నాడు.)

  1. “సీ. అఖిలభూతములందు నాత్మ రూపంబున నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్ధు

బుద్ధ్యాది లక్షణంబుల గానబడును --- ” (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 2 - 2 - 36)

(సమస్త భూతములందు ఆత్మ రూపములో భగవంతుడుండును. బుద్ధి మొదలగు లక్షణంబుల చేత ఉన్నట్టు తెలియ వచ్చును. అందుచేత అతను అఖిలాత్మ. సమస్త భూతముల లోను ఆత్మగా ఉన్నట్లు తెలియడమెట్లనగా బుద్ధి మొదలగు లక్షణముల చేత, అనగా, మనోవృత్తుల వలన, ఇంద్రియముల పనుల వల్ల తెలియ నగును. లోపల ఆత్మగా భగవంతుడు ఉండని యెడల మనస్సు, ఇంద్రియములు వాటి వాటి పనులు చేయనేరవు.)

Transliteration
  1. akhilasya jagataḥ ātmā. (samasta jagattunaku ātma ayinavāḍu.)

  2. akhilānāṃ jīvānāṃ ātmabhūtaḥ. (samasta jīvulaku ātma ayinavāḍu.)

  3. haṃtṛ haṃtavyā dyaṃtarātmā. (caṃpeḍu vāri yokka, caṃpabaḍu vāḷḷa yokka aṃtarātma ayinavāḍu.)

  4. sarvāṃtaryāmi. (anniṃṭi yaṃdunu aṃtarātmagā nunnavāḍu.)

  5. sarvātmā (aṃdaṟiki ātma ayinavāḍu.)

  6. viśvātmā - (viśvamanagā prapaṃcamu. prapaṃcamaṃtaṭiki ātma ayina vāḍu – viśvamulō nunna anniṃṭikī ātma ayina vāḍu.)

  7. akhila śarīrakaḥ. (samasta vastuvulu tana śarīramē ayinavāḍu.)

  8. “ahamātmā guḍākēśa! sarvabhūtāśaya sthitaḥ” (śrīmadbhagavadgīta - 10 - 20)

“hṛddēśē sarva bhūtānāṃ aṃtaryāmitayā sthitaḥ |

pratyagātmanā caiva -- ||” (gītābhāvaprakāśamu - 10 - 97, 98)

(samasta bhūtamula hṛdaya maṃdu aṃtaryāmigā bhagavaṃtuḍunnāḍu.)

  1. “sī. akhilabhūtamulaṃdu nātma rūpaṃbuna nīśuṃḍu hari yuṃḍu nella proddhu

buddhyādi lakṣaṇaṃbula gānabaḍunu --- ” (śrīmadāṃdhra mahā bhāgavatamu - 2 - 2 - 36)

(samasta bhūtamulaṃdu ātma rūpamulō bhagavaṃtuḍuṃḍunu. buddhi modalagu lakṣaṇaṃbula cēta unnaṭṭu teliya vaccunu. aṃducēta atanu akhilātma. samasta bhūtamula lōnu ātmagā unnaṭlu teliyaḍameṭlanagā buddhi modalagu lakṣaṇamula cēta, anagā, manōvṛttula valana, iṃdriyamula panula valla teliya nagunu. lōpala ātmagā bhagavaṃtuḍu uṃḍani yeḍala manassu, iṃdriyamulu vāṭi vāṭi panulu cēyanēravu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.