(స్పర్శ లేకుండుట వలన నీళ్ళు తడిచేయుటకు శక్యము కానివాడు.)
(మిక్కిలి వేగవంత మైనప్పటికీ నీళ్ళు తడపడము వలన అవయవములను విశ్లిష్టముగా చేయలేని వాడు, వలన పడనివాడు.)
(ఆత్మని నీరు తడిపి విడిపోవునట్లు చేయలేదు)
“నచైవం క్లేదయం త్యాపో నశోషయ తి మారుతః” (శ్రీమద్భగవద్గీత - 2 - 23)
దీనికి వ్యాఖానము :-
“నచార్ద్రీ కరణేప్యాపః శక్ను వంత్యేనం” ---
“ఆత్మానం నీరసం కర్తుం శక్నోతి బలవత్తరః |
ప్రసిధ్ధా నాశకా ఏతే ప్రభవంతి న చాత్మని |
పృధివ్య బ్వహ్ని వా యూనాం నాశకత్వ ప్రసిధ్ధతః |
తేషా మప్యాంతరో హ్యాత్మా తం వినాతే మృషాత్మకాః |
--- సత్తాస్ఫూర్తి ప్రదాతాస్తి శస్త్రా దీనామయం యతః |
ప్రేరకో (అ)oతర్యామితయా కధమేవ మిమాన్యపి |
శస్త్రాదీని ప్రకుర్యుస్తం స్వవ్యాపారైక గోచరం ||” (గీతాభావప్రకాశము - 2 - 292, 294, 295, 300, 301)
(క్లేదము అనగా తడి చేయుట. నీరు దేనితో నైనా కలిసిన దానిని నానబెట్టి, రూపు లేకుండు నట్లుచేసి, దానిని తనలో లీనమైనట్లు కలిపివేసుకొనును - నీరు వస్తువులను తడిపి నాశనము చేయును అని లోకములో ప్రసిధ్ధిగా ఉన్నప్పటికీ ఆత్మను అట్లు చేయలేదు. ఎందుచేతననగా, నీరు, అగ్ని, వాయువు మొదలగు భూతములను ఆత్మే నశింపచేయును. వాటిలోపల కూడా అంతరాత్మగా ఆత్మ ఉండును. ఆత్మ వాటిలో లేకపోతే అవి వ్యర్థములే, వాటిపని చేయలేనివే. వీటికి పనిచేయుటకు కావలసిన సత్తాస్ఫూర్తిని కలిగించునదే ఆత్మ. వాటిలో అంతర్యామిగా నుండి వాటిని పనులలో ప్రేరేపించునదే ఆత్మ. అటువంటి ఆత్మని ఈ నీరు, గాలి, అగ్ని మొదలగునవి ఎట్లు నాశనము చేయగలవు ?)
(sparśa lēkuṃḍuṭa valana nīḷḷu taḍicēyuṭaku śakyamu kānivāḍu.)
(mikkili vēgavaṃta mainappaṭikī nīḷḷu taḍapaḍamu valana avayavamulanu viśliṣṭamugā cēyalēni vāḍu, valana paḍanivāḍu.)
(ātmani nīru taḍipi viḍipōvunaṭlu cēyalēdu)
“nacaivaṃ klēdayaṃ tyāpō naśōṣaya ti mārutaḥ” (śrīmadbhagavadgīta - 2 - 23)
dīniki vyākhānamu :-
“nacārdrī karaṇēpyāpaḥ śaknu vaṃtyēnaṃ” ---
“ātmānaṃ nīrasaṃ kartuṃ śaknōti balavattaraḥ |
prasidhdhā nāśakā ētē prabhavaṃti na cātmani |
pṛdhivya bvahni vā yūnāṃ nāśakatva prasidhdhataḥ |
tēṣā mapyāṃtarō hyātmā taṃ vinātē mṛṣātmakāḥ |
--- sattāsphūrti pradātāsti śastrā dīnāmayaṃ yataḥ |
prērakō (a)otaryāmitayā kadhamēva mimānyapi |
śastrādīni prakuryustaṃ svavyāpāraika gōcaraṃ ||” (gītābhāvaprakāśamu - 2 - 292, 294, 295, 300, 301)
(klēdamu anagā taḍi cēyuṭa. nīru dēnitō nainā kalisina dānini nānabeṭṭi, rūpu lēkuṃḍu naṭlucēsi, dānini tanalō līnamainaṭlu kalipivēsukonunu - nīru vastuvulanu taḍipi nāśanamu cēyunu ani lōkamulō prasidhdhigā unnappaṭikī ātmanu aṭlu cēyalēdu. eṃducētananagā, nīru, agni, vāyuvu modalagu bhūtamulanu ātmē naśiṃpacēyunu. vāṭilōpala kūḍā aṃtarātmagā ātma uṃḍunu. ātma vāṭilō lēkapōtē avi vyarthamulē, vāṭipani cēyalēnivē. vīṭiki panicēyuṭaku kāvalasina sattāsphūrtini kaligiṃcunadē ātma. vāṭilō aṃtaryāmigā nuṃḍi vāṭini panulalō prērēpiṃcunadē ātma. aṭuvaṃṭi ātmani ī nīru, gāli, agni modalagunavi eṭlu nāśanamu cēyagalavu ?)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.