← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్రతుం akratuṃ

Original — తెలుగు
  1. సర్వ కర్మ బంధ శూన్యం; అపహత పాప్మానం.

(అన్ని విధములైన కర్మలవలన కలుగు బంధము లేని వాడు; పాపములు లేనివాడు)

  1. కామ్య కర్మాది రహితం. (కామ్య కర్మలు మొదలగునవి లేనివాడు)

  2. విషయ భోగ సంకల్ప రహితం.

(విషయములను అనుభవించవలెనను సంకల్పము లేనివాడు. భగవంతుడు పరమానంద రూపుడగుట వలన ఏ విధమైన సంకల్పము లేనివాడు.)

  1. సంకల్ప రహితం, స్త్ర్యన్న పానాదిభోగ్యజాతం సమీచీనం ఇతి సంకల్పనం జీవస్యైవ, నతు ఈశస్య, సంకల్ప హేతుభూతాంతః కరణోపాథేర భావాత్.

(స్త్రీ, అన్నము, పానము, భక్ష్యము, భోజ్యము, పానీయము మొదలగు భోగ్యవస్తువుల గుఱించి ఇవి నాకుకావలెను, వీటిని నేను అనుభవించవలెను అను కోరిక సంకల్పము జీవునకే గాని ఈశ్వరునకు కలుగదు. సంకల్పము కలుగుటకు కారణమైన అంతఃకరణము - సంకల్పించు మనోవృత్తి - అను ఉపాధి లేకపోవుట వలన.)

  1. దృష్టా దృష్ట విషయోపరతధీః, అక్రతుః, అకామోమునిః.

(దృష్టా దృష్ట విషయములందు ఉపరతమైన మనస్సు కలవాడు,- అనగా - వాటి చింతయే లేనివాడు. అందుచేత కోరికలు లేని ముని.)

  1. నిర్వికల్పః, స్వమాత్రమితి.

(నిర్వికల్పుడు; ఆత్మ తత్వ మాత్రమే అయినవాడు; ప్రకృతితో గాని, ఇతర తత్వములతో గాని కలియని స్థితిలో నున్న వాడు.)

  1. వివిధ భోగ సంకల్ప రహితః ఇత్యర్ధః, పరమానంద రూపత్వాత్.

(పరమానంద రూపుడగుట వలన ఏ విధమైన భోగములందు సంకల్పము లేనివాడు.)

Transliteration
  1. sarva karma baṃdha śūnyaṃ; apahata pāpmānaṃ.

(anni vidhamulaina karmalavalana kalugu baṃdhamu lēni vāḍu; pāpamulu lēnivāḍu)

  1. kāmya karmādi rahitaṃ. (kāmya karmalu modalagunavi lēnivāḍu)

  2. viṣaya bhōga saṃkalpa rahitaṃ.

(viṣayamulanu anubhaviṃcavalenanu saṃkalpamu lēnivāḍu. bhagavaṃtuḍu paramānaṃda rūpuḍaguṭa valana ē vidhamaina saṃkalpamu lēnivāḍu.)

  1. saṃkalpa rahitaṃ, stryanna pānādibhōgyajātaṃ samīcīnaṃ iti saṃkalpanaṃ jīvasyaiva, natu īśasya, saṃkalpa hētubhūtāṃtaḥ karaṇōpāthēra bhāvāt.

(strī, annamu, pānamu, bhakṣyamu, bhōjyamu, pānīyamu modalagu bhōgyavastuvula guṟiṃci ivi nākukāvalenu, vīṭini nēnu anubhaviṃcavalenu anu kōrika saṃkalpamu jīvunakē gāni īśvarunaku kalugadu. saṃkalpamu kaluguṭaku kāraṇamaina aṃtaḥkaraṇamu - saṃkalpiṃcu manōvṛtti - anu upādhi lēkapōvuṭa valana.)

  1. dṛṣṭā dṛṣṭa viṣayōparatadhīḥ, akratuḥ, akāmōmuniḥ.

(dṛṣṭā dṛṣṭa viṣayamulaṃdu uparatamaina manassu kalavāḍu,- anagā - vāṭi ciṃtayē lēnivāḍu. aṃducēta kōrikalu lēni muni.)

  1. nirvikalpaḥ, svamātramiti.

(nirvikalpuḍu; ātma tatva mātramē ayinavāḍu; prakṛtitō gāni, itara tatvamulatō gāni kaliyani sthitilō nunna vāḍu.)

  1. vividha bhōga saṃkalpa rahitaḥ ityardhaḥ, paramānaṃda rūpatvāt.

(paramānaṃda rūpuḍaguṭa valana ē vidhamaina bhōgamulaṃdu saṃkalpamu lēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.