← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకృతాత్మా akṛtātmā

Original — తెలుగు
  1. అజితేంద్రియః (జయింపబడని ఇంద్రియములు గలవాడు)

  2. అవశీకృతాంతఃకరణః; అవశీకృత చిత్తః. (తన స్వాధీనములో లేని మనస్సు కలవాడు)

  3. “అసంస్కృ తాత్మా, తపసా, ఇంద్రియ జయేన, దుశ్చరితా దనుపరతాః; అశాంతదర్పాః” (శ్రీశంకరః)

(తపస్సుచేత, ఇంద్రియ జయముచేత శోధింపబడని ఆత్మ గలవాడు. దుష్కర్మలు చేయుట మానలేనివాడు; దర్పము గలవాడు.)

  1. అశుధ్ధ బుధ్ధిః (పరిశుధ్ధముకాని బుధ్ధి - అంతఃకరణము గలవాడు)

  2. “ఉత్క్రామంతం స్థితంవాపి భుంజానం వా గుణాన్వితం |

విమూఢాః నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః |

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ న్య వస్థితం |

యతంతోప్య కృతాత్మానో నైవం పశ్యంత్య చేతనః ||” (శ్రీమద్భగవద్గీత - 15 - 10, 11)

(శరీరమును వదలి వెళ్ళిపోవుచున్నపుడైనను, శరీరములో ఉన్నపుడైనను, భోగముల ననుభవించు చున్నపుడైనను త్రిగుణములతో కూడి ఉన్న జీవుని - జీవాత్మను - మూఢులు - బహిర్దృష్టి కలవారు కనుక - ఎఱుగలేకున్నారు. జ్ఞానమే దృష్టిగా గలవారు - అంతర్దృష్టి గలవారు - చూడగలుగు చున్నారు. తమలోనే ఉన్న ఈ జీవుని యోగులు ప్రయత్నించి చూడగలుగుచున్నారు. కాని మనశ్శుధ్ధి లేనివారు ఎంత యత్నము చేసినను, ఎన్ని శాస్త్రములు నభ్యసించినను చూడలేరు.)

  1. ఆత్మజ్ఞానము లేనివాడు, ధన్యాత్ముడు కానివాడు, స్థిరమైన మనస్సు లేనివాడు, బ్రహ్మానుసంధానము లేనివాడు, మనస్సును గెలువనివాడు.
Transliteration
  1. ajitēṃdriyaḥ (jayiṃpabaḍani iṃdriyamulu galavāḍu)

  2. avaśīkṛtāṃtaḥkaraṇaḥ; avaśīkṛta cittaḥ. (tana svādhīnamulō lēni manassu kalavāḍu)

  3. “asaṃskṛ tātmā, tapasā, iṃdriya jayēna, duścaritā danuparatāḥ; aśāṃtadarpāḥ” (śrīśaṃkaraḥ)

(tapassucēta, iṃdriya jayamucēta śōdhiṃpabaḍani ātma galavāḍu. duṣkarmalu cēyuṭa mānalēnivāḍu; darpamu galavāḍu.)

  1. aśudhdha budhdhiḥ (pariśudhdhamukāni budhdhi - aṃtaḥkaraṇamu galavāḍu)

  2. “utkrāmaṃtaṃ sthitaṃvāpi bhuṃjānaṃ vā guṇānvitaṃ |

vimūḍhāḥ nānu paśyaṃti paśyaṃti jñāna cakṣuṣaḥ |

yataṃtō yōginaścainaṃ paśyaṃtyātma nya vasthitaṃ |

yataṃtōpya kṛtātmānō naivaṃ paśyaṃtya cētanaḥ ||” (śrīmadbhagavadgīta - 15 - 10, 11)

(śarīramunu vadali veḷḷipōvucunnapuḍainanu, śarīramulō unnapuḍainanu, bhōgamula nanubhaviṃcu cunnapuḍainanu triguṇamulatō kūḍi unna jīvuni - jīvātmanu - mūḍhulu - bahirdṛṣṭi kalavāru kanuka - eṟugalēkunnāru. jñānamē dṛṣṭigā galavāru - aṃtardṛṣṭi galavāru - cūḍagalugu cunnāru. tamalōnē unna ī jīvuni yōgulu prayatniṃci cūḍagalugucunnāru. kāni manaśśudhdhi lēnivāru eṃta yatnamu cēsinanu, enni śāstramulu nabhyasiṃcinanu cūḍalēru.)

  1. ātmajñānamu lēnivāḍu, dhanyātmuḍu kānivāḍu, sthiramaina manassu lēnivāḍu, brahmānusaṃdhānamu lēnivāḍu, manassunu geluvanivāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.