← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షమాల akṣamāla

Original — తెలుగు
  1. అక్షాణాం మాలా సూత్రం అకారాది క్షకారంతః అక్షః, తత్కృతా, తత్ప్రతినిధి భూతావామాలా.

(అక్షః అనగా అకారము మొదలు క్షకారాంతముగల అక్షరములు, వాటితో చేసిన మాల, లేక వాటికి ప్రతినిధిగా - బదులుగా - చేసినమాల).

  1. అకారాది క్షకారాంత వర్ణ ప్రతినిధిర్మాలా, రుద్రాక్ష స్ఫటికాది నిర్మితా.

(అకారము మొదలు క్షకారమువరకు గల అక్షరములకు - వర్ణములకు - ప్రతిగా, బదులుగా రుద్రాక్షలతోగాని, స్ఫటికముతోగాని నిర్మింపబడిన మాల).

  1. జపమాల.

  2. ‘అ’ కారము మొదలు క్షకారమువరకు గల అన్ని అక్షరములలోనుభగవదంశయున్నది -అ ‘ఇతి బ్రహ్మ’ - (అ అనగా బ్రహ్మ), “అక్షరాణాం అకారోస్మి” (శ్రీమద్భగవద్గీత - 10 - 33)

(అకారము మొదలు క్షకారము వఱకు గల అక్షరములలో అకారము నేను - ప్రతి అక్షరము అకారముయొక్క వికారమే (చూడుము - ‘అ’). ‘అ’ అనగా బ్రహ్మమే కనుక అన్ని అక్షరములలోను భగదవంశ యున్నది - “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” - ‘ఖం బ్రహ్మ’. అందుచేత అక్షమాల అనగా భగవదంశ ఉన్న అక్షరములమాల.

  1. “అక్షాం తవర్ణాశ్రయం” (శ్రీరామకర్ణామృతం - 2 - 1)

(అకారము మొదలు క్షకారము అంతముగాగల వర్ణములన్నింటిని - అక్షరములన్నింటిని ఆశ్రయముగా గలవాడు - ఆశ్రయించి యుండువాడు –

“ఆక్షాంత వర్ణం” - (శ్రీరామకర్ణామృతం - 2 - 3)

(అకారము మొదలు క్షకారమువఱకుగల వర్ణములు - అక్షరములు - తానే అయినవాడు అక్షరరూపుడు).

Transliteration
  1. akṣāṇāṃ mālā sūtraṃ akārādi kṣakāraṃtaḥ akṣaḥ, tatkṛtā, tatpratinidhi bhūtāvāmālā.

(akṣaḥ anagā akāramu modalu kṣakārāṃtamugala akṣaramulu, vāṭitō cēsina māla, lēka vāṭiki pratinidhigā - badulugā - cēsinamāla).

  1. akārādi kṣakārāṃta varṇa pratinidhirmālā, rudrākṣa sphaṭikādi nirmitā.

(akāramu modalu kṣakāramuvaraku gala akṣaramulaku - varṇamulaku - pratigā, badulugā rudrākṣalatōgāni, sphaṭikamutōgāni nirmiṃpabaḍina māla).

  1. japamāla.

  2. ‘a’ kāramu modalu kṣakāramuvaraku gala anni akṣaramulalōnubhagavadaṃśayunnadi -a ‘iti brahma’ - (a anagā brahma), “akṣarāṇāṃ akārōsmi” (śrīmadbhagavadgīta - 10 - 33)

(akāramu modalu kṣakāramu vaṟaku gala akṣaramulalō akāramu nēnu - prati akṣaramu akāramuyokka vikāramē (cūḍumu - ‘a’). ‘a’ anagā brahmamē kanuka anni akṣaramulalōnu bhagadavaṃśa yunnadi - “ōṃ ityēkākṣaraṃ brahma” - ‘khaṃ brahma’. aṃducēta akṣamāla anagā bhagavadaṃśa unna akṣaramulamāla.

  1. “akṣāṃ tavarṇāśrayaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 1)

(akāramu modalu kṣakāramu aṃtamugāgala varṇamulanniṃṭini - akṣaramulanniṃṭini āśrayamugā galavāḍu - āśrayiṃci yuṃḍuvāḍu –

“ākṣāṃta varṇaṃ” - (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 3)

(akāramu modalu kṣakāramuvaṟakugala varṇamulu - akṣaramulu - tānē ayinavāḍu akṣararūpuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.