(క్షీణింపనిది, నశింపనిది, అగుటవలన అక్షరుడు - క్షరము అనగా నశించునది, అక్షరమనగా నశింపనిది - అపక్షయము, క్షీణించుట, నశించుట, మార్పులు గలిగియుండుట, పుట్టుట లేనిది).
(నశించుస్వభావములేనిది, నశించు స్వభావము లేనివాడు కనుక అక్షరుడు; నాశము లేనివాడు).
సర్వదాల్షరణహీనః(ఎన్నడూ క్షీణించుట లేనివాడు).
నిర్వికారః. (వికారములు, మార్పులు లేనివాడు).
అవికారాది శబ్ద వాచ్యం. (అవికారి - వికారములు లేనివాడు అను మొదలగుమాటలచే చెప్పబడువాడు).
యన్నక్షరతే, తదేవాక్షరం.
(క్షీణించనిదేదో అదే అక్షరమగు పరబ్రహ్మ. పరబ్రహ్మ తప్ప ప్రపంచమంతయు, ప్రపంచములో ఉన్నవస్తువులన్నియు, క్షీణించునవే, క్షీణించనివాడు పరబ్రహ్మ ఒకడే).
(సమస్తభూతములకు కారణమగుటచేత - అనగా, సమస్త భూత,ములకు పుట్టినచోటు అగుటచేత, నశించు స్వాభావముగల అన్నింటికి కారణమగుటవలన, తాని నశించని స్వభావముగలవాడగుట చేత పరబ్రహ్మ అక్షరుడు అనుమాట పరబ్రహ్మయందే నిర్ధిష్టమైనది, పరమేశ్వరును నిర్దేశించి చెప్పబడినది).
“అక్షరం పురుషం వేద”. (అక్షరుడైన పరమపురుషుని తెలుసుకొంటిని).
“త్వమక్షరం పరమం” (శ్రీమద్భగవద్గీత - 11 - 18)
(అక్షరమనగా సాక్షాత్ పరబ్రహ్మ). (నీవే అక్షరుడవు, పరతత్వము).
(తనయొక్క వికారములే, మార్పులే అయిన ఈ ప్రపంచకములో ఉన్న వస్తువులన్నింటిలోను వ్యాపించియున్నవాడు - పరమాత్మయే ఈ ప్రపంచములోని అన్ని వస్తువులుగా మారెను - అవన్నియు ఆ పరమాత్మనుండి, ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. అందుచేత అన్నివస్తువులు అతనే. అన్ని వస్తువులు తానే అయి యుండి, అన్నింటిలోను తాను పూర్తిగా వ్యాపించియున్నాడు కనుక సర్వవ్యాపి, లేక అక్షరుడు).
(చలనము లేనిది, నాశము లేనిది యగుటచేత అక్షరమనగా బ్రహ్మ అనియే ముఖ్యార్థము).
(నిత్యముగా, ఎల్లపుడూ ఉండువాడగుటచేతను ప్రపంచములోనున్న సమస్తవస్తువులలోను వ్యాపించి యుండువాడగుటచేతను అక్షరుడు అనగా పరబ్రహ్మ అనియే అర్థము).
(క్షీణించి నశించునదైన ఈ నాలుగు విధములైన ప్రపంచము లయమై పోయినను తన స్వరూపమునుండి - జగత్తును సృష్టించుట మొదలగు శక్తులు కలిగియుండు సామర్థ్యమునుండి - ఏవిధముగానైనను క్షీణించనివాడు తనకు ఉన్న శక్తులను ఎల్లపుడు ఒకేవిధముగానే కలిగియుండువాడు).
(ఎల్లపుడు ఉండువాడు - భూత భవిష్యత్ వర్తమానములను మూడుకాలములందు ఉండువాడు).
(భూమి మొదలు ఆకాశము వఱకుగల ప్రకృతి వికారములైన వస్తువులన్నింటినీ - మార్పులు చెందుచూమారిపోవు స్వభావముగల వాటన్నింటినీ, తను మారకయుండి, ధరించువాడు కనుక అక్షరుడు - బ్రహ్మ).
(ఆకాశమువరకుగల సమస్తమును ధరించువాడు కనుక అక్షరుడు).
(ప్రాకృత పురుషునివలె - ప్రకృతి దాని వికారములు కలిసి చేసిన శరీరముగల పురుషునివలె - తనస్వరూపమునుండిగాని, స్వభావమునుండిగాని మార్పు చెందనివాడు. ప్రకృతి వికారముల పొందుపురుషునివలె స్వభావశక్తులలో వికారములు - మార్పులు - లేనివాడు.)
(స్వస్వరూపముతోనుండునపుడు - ఏ విధమైన ఉపాధిలోను కూడియుండనందున అక్షరుడు, ఉపాధిఅనునది క్షీణించి నశించునదే. ఏ విధమైన ఉపాధి లేనందున అక్షరుడు).
నిర్విశేషం బ్రహ్మ. (విశేషములు లేని నిర్గుణ నిరాకార పరబ్రహ్మ).
“అస్థూలత్వాది గుణకం” (శ్రీరామానుజః)
(“అస్థూల మనగా” - స్థూలముకానిది, అణువుకానిది - అను మొదలగు గుణములుకలది - అక్షరుడు).
(కల్పించబడనిది, సృష్టింపబడనిది. సృష్టింపబడినవన్నియు జన్మ కలవి, జన్మ కలవాటికి నాశము కలదు - పరమాత్మ సృష్టింపబడనిది, పుట్టినదికాదు. అందుచేత అక్షరము).
(క్షేత్రమనగా శరీరము. శరీరమును - దాని తత్వమౌను - తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు, జీవాత్మ. అన్ని శరీరములను - క్షేత్రములను - తెలిసిన జీవాత్మ సమష్టి రూపము).
“చతుర్విధ వినాశరహితే విష్ణాదేవ అక్షరశబ్ద ప్రవృత్తి నిమిత్తస్య పౌష్కల్యాత్ విష్ణురేవ అక్షర శబ్ద ముఖ్యార్థః”.
(నాశము నాలుగు విధములు - ఎల్లకాలము ఉండకపోవుట, దేహము నాశనమగుట, దుఃఖముకలుగుట, పూర్తిగా నిండియుండకుండుట. ఈ నాలుగు విధముల నాశము విష్ణువునందు లేవు).
(ఈ నాలుగు విధముల వినాశములు లేనటువంటి విష్ణువునందే అక్షరుడు అను శబ్దము - మాట - పూర్తిగా వర్తించును - కనుక విష్ణువే అక్షరశబ్దమునునకు ముఖ్యార్థము).
“త్వమక్షరం సదసత్తత్పరం యత్” (గీత - 11 - 37)
(జీవాత్మ పుట్టినది కాదు, చనిపోవునదికాదు అని కఠోపనిషత్ (2 - 28) లో చెప్పబడినది, అందుచేత జీవాత్మ నశింపనివాడు గావున అక్షరుడు. ఈ విషయమే శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు - “న జాయతే మ్రియతేవా కదా చిత్” (2 - 28).
(ఆత్మ - జీవాత్మ - సత్యమైనదగుటవలన - అనగా, మూడుకాలములందు, ఎల్లపుడు, ఉండునదికనుక ఇది జన్మకలదికాదు, అందుచేత అజుడు - జన్మలేనిది - ఆ ప్రకారమే జీవాత్మ ఇదివరకు ఉండి, మఱియొకప్పుడు ఉండనిదికాదు. ఒకప్పుడు ఉండి ఇంకొక అప్పుడు లేనివస్తువు ఏదైనను నశించునదే. జీవాత్మ భవిష్యత్కాలమందు కూడా - రాబోవుకాలమందు కూడా - ఉండునది - సత్ పదార్థమగుటవలన నశించునది కాదు - అందుచేత - అందుచేత ఆత్మ అజుడు - జన్మలేనివాడు. జన్మలేనివానికి మృత్యువు - నాశము ఉండదు. అందుచేత ఆత్మ అవినాశి - నశించునదికాదు. నశించునదికాదు కనుక అక్షరుడు -“నజాయతే మ్రియతే వా” అనునది ప్రతిజ్ఞా వాక్యము - సిద్ధాంతము చేయబడిన వాక్యము).
అక్షర శబ్ద నిర్దిష్టః కూటస్థః, అచిత్సంసర్గ వియక్తః స్వేనరూపేణ అవస్థితః ముక్తాత్మా. నః తు అచిత్సం సర్గా భావాత్ అచిత్పరిణామ విశేష బ్రహ్మాది దేహో సాధారణో న భవతి ఇతి కూతస్థః ఉచ్యతే. (అక్షరుడు అను శబ్దముచేత నిర్దేశింపబడినవాడు కూటస్థుడు - అచిత్ - (అనగా, అనాత్మ) వస్తువులతో కలిసియుండనివాడు, తన స్వస్వరూపముతోనే ఉండువాడు, ముక్త స్వరూపుడు - ఏ విధమైన బంధముచేత బంధింపబడనివాడు కూటస్థుడు- ఎల్లపుడు ఒకే విధముగా, ఏ విధమైన వికారములు లేకయుండువాడు. కనుక కూటస్థుడు. అచిత్పదార్థముతో కలిసి యుండకపోవుటచేత, అచిద్వస్తువులకు కలిగెడి పరిణామములు - మార్పులు - విశేషములుగల చతుర్ముఖ బ్రహ్మ మొదలగువాటి దేహములవలెనుండునదికాదు - ఈ కారణమువల్ల కూటస్థుడు - కూటమువలె స్థిరముగా మార్పులు లేక ఉండువాడు - అని చెప్పబడుచున్నాడు).
“భగవతః మాయా శక్తిః క్షరాఖ్యస్య పురుషస్య ఉత్పత్తి బీజం, అనేక సంసారి జంతు కామ కర్మాది సంస్కారాశ్రయః, సంసార బీజానం త్యాత్ నక్షరతి ఇతి అక్షరః. స ఏవ కూటస్థః” (శ్రీశంకరః)
(అక్షరమనగా భగవంతునియొక్క మాయా సక్తి. లోకములో క్షరుడు, అక్షరుడు అని రెండువిధముల పురుషులు చెప్పబడిరి. ఆ ఇద్దరిలో క్షరపురుషుడు అని చెప్పబడినవానికి పుట్టుచోటు, పుట్టుకారణమైనవాడు అక్షరపురుషుడు. అదియే అక్షరము. ప్రాణులు చేసిన అనేక కర్మల సంస్కారమునకు ఆశ్రయమైనది. దీనినుండియే సూక్ష్మరూపములోనుండి వాటి వాటి కర్మానుసారముగ ప్రాణులు ఫలము ననుభవించుటకు స్థూలరూపమును గైకొనును. ఈ సంసారమనునది మరలమరల పుట్టుచు నశించుచుండినను ప్రవాహరూపమున ఎప్పుడైనను అంతము నొందనిది కనుక అనంతము, అందుచేత అక్షరము).
(సత్వరజస్తమములను గుణములు మూడింటియొక్క సామ్యావస్థ - అనగా మూడుగుణములు ఒకటి హెచ్చు, ఒకటి తక్కువగాను ఉండక మూడూ సమానపాళ్ళలోనుండుస్థితి, స్ఫుటముగా లేని ప్రకృతియొక్క స్థితి. అక్షరము. ప్రకృతియొక్క ఈ అవస్థ చేతన సమష్టికి గర్భము, కారణమైనది. ఆ అవస్థలోనున్నదంతయు చేతనమాత్రమేకాదు, అవ్యక్తముగానున్న ప్రకృతి తత్వము - ఈ అవస్థలో వివిధతత్వములన్నియు చిద చిద్రూపములన్నియు సూక్ష్మరూపములో ఉండి వ్యక్తముగాక యుండును. ఈ స్థితియే అక్షరమను పేరుతో ఉపచరింపబడుచున్నది. చిత్తును, అచిత్తును వేరు వేరుగా విశదీకరించి చెప్పుటకు శక్యముకాని అవస్థ. దీనినే ప్రథానమందురు).
(శ్రీమద్భగవద్గీత అధ్యా - 8 - 18 లో చెప్పబడిన అవ్యక్తమను సంజ్ఞకల చతుర్ముఖ బ్రహ్మ యొక్క పగటికాలమందు ఈ సమస్త ప్రపంచములోని వస్తువులన్నియు సూక్ష్మస్థితిలోనుండి వ్యక్తముగాక యుండునవి వ్యక్తమగును - అందులోనుండి వేరయి జన్మించినట్లుండును - ఆ చతుర్ముఖ బ్రహ్మ అను పేరుగల అవ్యక్తమునందే లీనమై వ్యక్తముగాక యుండును. ఆ చతుర్ముఖ బ్రహ్మయొక్క పగటికాలమనగా సమష్టిగా ఉండిసూక్ష్మరూపములో ఈ సమస్త వస్తువులు వ్యక్తమగుటకు - సృష్టింపబడుటకు - ఉన్ముఖమైన కాలము. అతని రాత్రికాలమనగా అవి అవ్యక్తస్థితిలోనే ఉండుకాలము. ప్రకృతియొక్క ఇట్టి స్థితిని అవ్యక్తమనిరి. ఈ అవ్యక్తము కన్న పరమము, ఉత్కృష్టమైన అవ్యక్తమనునది, సనాతనమైనది ఇంకొకటి కలదు - ఆ అవ్యక్తమనునది సమస్త భూత్రములు నశించినను నశించనిది. దానినే అక్షరమని పరమగతియని యందురు. దానిని చెందినవారు తిరిగిరారు - అట్టి అవ్యక్తమే నా పరమ ధామము - “తద్విష్ణోః పరమం పదం” - అదియే నేను (భగవంతుడను నేను).
వ్యతిరిక్తో (అ) ధవా శ్రేష్టో హేతుభూతో విధే రపి |
(చరాచరరూపములతో కూడియున్న ఈ స్థూలజగత్తు అంతటికీ కారణమైన చతుర్ముఖ బ్రహ్మ పుట్టుటకు కారణమైనటువంటిన్నీ, ఇంద్రియముల శక్తిని మించినదిన్నీ, రూపము, స్పర్శము మొదలగు విషయములు లేనటువంటిన్నీ, అక్షరుడైనటువంటిన్నీ, నిత్యము ఉండునదిన్నీ, భూతములన్నియు నశించినను తాను నశించనిది అయిన అవ్యక్తము అను పేరుగలది మరి యొకటికలదు. ఇదియే అవ్యక్తమని, అక్షరమని చెప్పబడుచున్నది. ఇదియే పరమపురుషార్థము, నాలుగవ పురుషార్థమైన మోక్షము. దీనిని పరమగతియని చెప్పుదురు - పరమ పురుషుని కన్న పరమము, పరమగతి ఇంకొకటి లేదు అని శ్రుతులు, స్మృతులు చెప్పుచున్నవి. అట్టి భావమును పొందినవారు మరల మరల జన్మించరు - ముక్తి పొందుదురు - అట్టి దాని స్వరూపము ఉత్కృష్టమైన వైష్ణవపదము - అన్నింటికంటె, ఉత్తమమైనవాటికంటె ఉత్తమమైనది. అందుచేత వేదాంతములో - ఉపనిషత్తులలో - చెప్పబడిన ఆ పరమగతి నేనే - “తద్విష్ణో పరమం పదం”.
(ఏ విధమైన బంధములేక యుండువాడు, మోక్షమే స్వరూపమైనవాడు).
(అక్షరుడు అను శబ్దముచేత నిర్దేశింపబడినవాడు కూటస్థుడు, అనాత్మ వస్తువులతో కలిసియుండనివాడు, తన స్వస్వరూపముతోనే యుండువాడు, ముక్తస్వరూపుడు, ఏ విధమైన బంధములచేతను బంధింపబడని వాడు కూటస్థుడు. ఎల్లపుడు ఒకే మోస్తరుగా నుండువాడు. ఏ విధమైన వికారములు లేక యుండువాడు కనుక కూటస్థుడు. అచిత్పదార్థముతో కలిసియుండకపోవుటచేత అచిద్వస్తువులకు కలిగెడి పరిణామములు - మార్పులు, విశేషములు - గల చతుర్ముఖ బ్రహ్మ మొదలగు వారి దేహములవలెనుండడు. ఈ కారణముచేత కూటస్థుడు స్థిరముగా, మార్పులు లేక యుండువాడు).
“ప్రత్యగాత్మ స్వరూపం” (శ్రీరామానుజః)
“తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. స బ్రహ్మ, స్సశివ స్సహరిస్సేంద్ర సో (అ) క్షరః పరమస్స్వరాట్.” (మంత్రపుష్పము)
(శరీరములో హృదయములో వైశ్యానరుడు అను అగ్నిజ్వాల మధ్యను పరమాత్మ ఉన్నాడు - అతనే బ్రహ్మ, అతనే శివుడు, అతనే విష్ణువు, అతనే ఇంద్రుడు, అతనే అక్షరుడు, పరతత్వము, స్వరాట్).
(ఈ లోకములో పురుషులు అనువారు ఇద్దరున్నారు - క్షరుడు, అక్షరుడు. క్షరుడు అనగా నశించువాడు, అక్షరుడు అనగా నశింపనివాడు. సమస్తమైన భూతములు క్షరములు - నశించు స్వభావము కలవి. భవము అనగా జన్మ, భూతములు అనగా పుట్టినవి, జన్మ కలవి. జన్మ కలది నశింపక తప్పదు. - పుట్టినది గిట్టకమానదు. అందుచేత, భూతములన్నియు, - భగవంతునిలోనుండి పుట్టినవన్నియు - క్షరములే. జీవాత్మ అక్షరుడు - నశింపనివాడు. జీవాత్మ పొందియున్న ఉపాధి - శరీరము - నశించినను తాను నశించనివాడు - కూటస్థమువలె ఏ విధమైన చలనముకాని, వికారముకాని లేకయుండువాడు. అందుచేత కూటస్థుడైన జీవాత్మ అక్షరుడు)
(శ్రీమద్భగవద్గీత - 15 - 16 శ్లోకములో చెప్పబడిన పురుషులిద్దరికంటె ఉత్తమమైన పురుషుడు మఱొకడు వేరుగానున్నాడు. అతనే ఉత్తమ పురుషుడని, లేక, పురుషోత్తముడని పరమాత్మయని చెప్పబడుచున్నాడు. ఈ ఉత్తమపురుషుడైన పరమాత్మయే మూడు లోకములను ఆవేశించి, భరించి పాలించుచున్నాడు).
(శ్రీమద్భగవద్గీత - 15 - 16 లో చెప్పబడిన అక్షరుడను పురుషుడు భగవంతుని యొక్క మాయాశక్తి యనియు కూడా చెప్పబడుచున్నాడు. ఇది భగవంతుని అవినాభావ సంబంధముచే నాశ్రయించి అతనివలె నాశములేకుండ నుండునది కనుక అక్షరమని చెప్పబడుచున్నది. అందుచేత ఇచ్చటకూటస్థమైన మూల ప్రకృతి).
(భగవంతుని మాయాశక్తి క్షరపురుషుడని శ్రీమద్భగవద్గీత - 15 - 16 లో చెప్పబడినదాని ఉత్పత్తికి బీజమైనది, కారణమైనది. ఈ మాయ లేక ప్రకృతి నుండియే జగత్తు అంతయు పుట్టినది. ఇదియే సంసారమునకు బీజము. సంసారమనగా సృష్టిసమయమున పుట్టుచు, ప్రళయమందు నశించుచు మరల మరల ఈ ప్రకారముగా జరుగుచుండునది. ఈ సంసారము నశించు స్వభావముకలది అయినను మరల మరల పుట్టుచుండుటచేత ప్రవాహ రూపముగా అనంతము - అక్షరము –
“ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి ||”. (శ్రీమద్భగవద్గీత - 13 - 19)
ప్రకృతి, పురుషుడు అనాదులే, అనాదులే, జన్మలేనివే - జన్మలేనిదానికి క్షీణించి నశించుట ఉండదు - అందుచేత ప్రకృతి అక్షరము).
(వేదార్థము తెలిసిన జ్ఞానులు అక్షరుడని - సర్వకాలములందుండువాడని ఏ భగవంతునిగుఱించి చెప్పు చుందురో అతనే పరమపదము. విషయములందాసక్తిలేని యతీశ్వరులు ఏ పదమును ప్రవేశించెదరో, ప్రవేశించి ముక్తి చెందెదరో, ఏ పదమును గుఱించి బ్రహ్మచర్యవ్రతము సలిపెదరో అట్టిపదమేనేను. పరమాత్మయనినను, పరబ్రహ్మ యనినను, పరమపదమనినను ఒకటే. పరమాత్మయే పరమపదము. పరమపదమే పరమాత్మ. అది నశించనిది - అందుచేత అక్షరము - అదియే ‘ఓం’ కారము).
(ఓం కారము ఒకే అక్షరము - అ + ఉ + మ కలిసి “ఓం” అయినప్పటికీ అది ఒకే అక్షరమని భావింపవలెను - “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” - ఓం కారమే పరబ్రహ్మ అని దానిని ఉపాసించవలెను అని చెప్పబడినది. ఈఓం కారము పరబ్రహ్మవలె అక్షరము - త్రికాలములందు ఉండునది. అందుచేత ఇక్కడ యదక్షరం వేదవిదో వదంతి అని చెప్పినపుడు వేదములో ‘ఓం’ అను అక్షరము - వర్ణము - పరబ్రహ్మమే అని చెప్పబడినది. అందుచేత ఈ అక్షరము - వర్ణము - ‘ఓం’ - కూడ బ్రహ్మవలె అక్షరమే).
(అక్షరుడైన పరబ్రహ్మనుండియే ఈ ప్రపంచము పుట్టినది. ఎట్లు పురుషుని సరీరమునుండి కేశములు, గోళ్ళుపుట్టుచున్నవో అట్లే).
(బాగా ప్రజ్వలింపబడిన అగ్నినుండి అగ్నితునకలు ఏ ప్రకారము పుట్టుచూ అందులోనే కలిసిపోవుచున్నవో ఆ ప్రకారమే శివుడు అనుపేరుగల అక్షరునియందు భావములన్నియు - భావము = పుట్టుకగల ప్రపంచములోనున్న వస్తువులన్నియు - పుట్టి, అతనిలోనే లయమగు చున్నవి).
(బృహదారణ్యకోపనిషత్ - 3 - 8 - 7 - 18)
(ఈ సర్వమును ఎవనియందు ఓతము ప్రోతము అయి - యున్నది - బట్టలోని పొడుగు, పేకదారములవలె - నిలువుదారము, అడ్డుదారమువలె - వ్యాపించియున్నది. “అని గార్గి యాజ్ఞవల్క్యుని అడిగెను - దానికి యాజ్ఞవల్క్యుడు ఈ ప్రకారముగా సమాధానము చెప్పెను” :- అవన్నియు ఆకాశమందు ఓతప్రోతమై యున్నవి. ఆకాశము దేనియందు ఓతప్రోతమై యున్నది అను ప్రశ్నకు సమాధానము - “ఆకాశము అక్షరమందు ఓతప్రోతమై యున్నది !” అని “ఆ అక్షరము అస్థూలము, అనణువు అను మొదలగు లక్షణములు గలదని బ్రహ్మ వేత్తలు చెప్పుదురు” అని. దీనినిబట్టి అక్షరమనగా పరబ్రహ్మమే - అని తెలియుచున్నది).
“ఆవిర్భావోపి వేదస్య హ్యక్షరాత్పరమాత్మనః”. (గీతాభావప్రకాశము - 4 - 97)
(ఇచ్చట బ్రహ్మ అనగా వేదము - వేదము అక్షరుడైన, నశించని స్వభావముగల, పరబ్రహ్మమునుండి పుట్టినది - అందుచేత ఇక్కడ అక్షరుడనగా పరబ్రహ్మ).
సూర్యా చంద్రమసౌ విధ్రృతౌ తిష్టతః ||“. (బృహదారణ్యకోపనిషత్ - 3 - 8 - 9)
(అక్షరుడైన పరబ్రహ్మ శాసనమువలననే సూర్యచంద్రులు ప్రకాశించుచున్నారు).
(ఉత్కృష్టమైన అక్షర సంజ్ఞకల ప్రకృతికంటె ఉత్కృష్టమైనవాడు అని భగవంతుని గుఱించి చెప్పుటవలనాక్షరము అనగా భగవంతుని శక్తి అయిన ప్రకృతి యని అర్థమగుచున్నది).
(బ్రహ్మ, రుద్రుడు మొదలగు దేవతలు క్షీణించు దేహముగలవారు కనుక క్షరములు - క్షీణించునవి - క్షీణించి నశించునవి. క్షీణించని దేహముగలదగుటచేత శ్రీలక్ష్మి అక్షరా అని చెప్పబడిచున్నది - శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణుని శక్తియే కనుక అతనినుండి వేరుకానిదగుటచేత శ్రీమహావిష్ణునివలె శ్రీమహాలక్ష్మికూడ అక్షరా అని చెప్పబడుచున్నది).
(kṣīṇiṃpanidi, naśiṃpanidi, aguṭavalana akṣaruḍu - kṣaramu anagā naśiṃcunadi, akṣaramanagā naśiṃpanidi - apakṣayamu, kṣīṇiṃcuṭa, naśiṃcuṭa, mārpulu galigiyuṃḍuṭa, puṭṭuṭa lēnidi).
(naśiṃcusvabhāvamulēnidi, naśiṃcu svabhāvamu lēnivāḍu kanuka akṣaruḍu; nāśamu lēnivāḍu).
sarvadālṣaraṇahīnaḥ(ennaḍū kṣīṇiṃcuṭa lēnivāḍu).
nirvikāraḥ. (vikāramulu, mārpulu lēnivāḍu).
avikārādi śabda vācyaṃ. (avikāri - vikāramulu lēnivāḍu anu modalagumāṭalacē ceppabaḍuvāḍu).
yannakṣaratē, tadēvākṣaraṃ.
(kṣīṇiṃcanidēdō adē akṣaramagu parabrahma. parabrahma tappa prapaṃcamaṃtayu, prapaṃcamulō unnavastuvulanniyu, kṣīṇiṃcunavē, kṣīṇiṃcanivāḍu parabrahma okaḍē).
(samastabhūtamulaku kāraṇamaguṭacēta - anagā, samasta bhūta,mulaku puṭṭinacōṭu aguṭacēta, naśiṃcu svābhāvamugala anniṃṭiki kāraṇamaguṭavalana, tāni naśiṃcani svabhāvamugalavāḍaguṭa cēta parabrahma akṣaruḍu anumāṭa parabrahmayaṃdē nirdhiṣṭamainadi, paramēśvarunu nirdēśiṃci ceppabaḍinadi).
“akṣaraṃ puruṣaṃ vēda”. (akṣaruḍaina paramapuruṣuni telusukoṃṭini).
“tvamakṣaraṃ paramaṃ” (śrīmadbhagavadgīta - 11 - 18)
(akṣaramanagā sākṣāt parabrahma). (nīvē akṣaruḍavu, paratatvamu).
(tanayokka vikāramulē, mārpulē ayina ī prapaṃcakamulō unna vastuvulanniṃṭilōnu vyāpiṃciyunnavāḍu - paramātmayē ī prapaṃcamulōni anni vastuvulugā mārenu - avanniyu ā paramātmanuṃḍi, okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. aṃducēta annivastuvulu atanē. anni vastuvulu tānē ayi yuṃḍi, anniṃṭilōnu tānu pūrtigā vyāpiṃciyunnāḍu kanuka sarvavyāpi, lēka akṣaruḍu).
(calanamu lēnidi, nāśamu lēnidi yaguṭacēta akṣaramanagā brahma aniyē mukhyārthamu).
(nityamugā, ellapuḍū uṃḍuvāḍaguṭacētanu prapaṃcamulōnunna samastavastuvulalōnu vyāpiṃci yuṃḍuvāḍaguṭacētanu akṣaruḍu anagā parabrahma aniyē arthamu).
(kṣīṇiṃci naśiṃcunadaina ī nālugu vidhamulaina prapaṃcamu layamai pōyinanu tana svarūpamunuṃḍi - jagattunu sṛṣṭiṃcuṭa modalagu śaktulu kaligiyuṃḍu sāmarthyamunuṃḍi - ēvidhamugānainanu kṣīṇiṃcanivāḍu tanaku unna śaktulanu ellapuḍu okēvidhamugānē kaligiyuṃḍuvāḍu).
(ellapuḍu uṃḍuvāḍu - bhūta bhaviṣyat vartamānamulanu mūḍukālamulaṃdu uṃḍuvāḍu).
(bhūmi modalu ākāśamu vaṟakugala prakṛti vikāramulaina vastuvulanniṃṭinī - mārpulu ceṃducūmāripōvu svabhāvamugala vāṭanniṃṭinī, tanu mārakayuṃḍi, dhariṃcuvāḍu kanuka akṣaruḍu - brahma).
(ākāśamuvarakugala samastamunu dhariṃcuvāḍu kanuka akṣaruḍu).
(prākṛta puruṣunivale - prakṛti dāni vikāramulu kalisi cēsina śarīramugala puruṣunivale - tanasvarūpamunuṃḍigāni, svabhāvamunuṃḍigāni mārpu ceṃdanivāḍu. prakṛti vikāramula poṃdupuruṣunivale svabhāvaśaktulalō vikāramulu - mārpulu - lēnivāḍu.)
(svasvarūpamutōnuṃḍunapuḍu - ē vidhamaina upādhilōnu kūḍiyuṃḍanaṃduna akṣaruḍu, upādhianunadi kṣīṇiṃci naśiṃcunadē. ē vidhamaina upādhi lēnaṃduna akṣaruḍu).
nirviśēṣaṃ brahma. (viśēṣamulu lēni nirguṇa nirākāra parabrahma).
“asthūlatvādi guṇakaṃ” (śrīrāmānujaḥ)
(“asthūla managā” - sthūlamukānidi, aṇuvukānidi - anu modalagu guṇamulukaladi - akṣaruḍu).
(kalpiṃcabaḍanidi, sṛṣṭiṃpabaḍanidi. sṛṣṭiṃpabaḍinavanniyu janma kalavi, janma kalavāṭiki nāśamu kaladu - paramātma sṛṣṭiṃpabaḍanidi, puṭṭinadikādu. aṃducēta akṣaramu).
(kṣētramanagā śarīramu. śarīramunu - dāni tatvamaunu - telisinavāḍu kṣētrajñuḍu, jīvātma. anni śarīramulanu - kṣētramulanu - telisina jīvātma samaṣṭi rūpamu).
“caturvidha vināśarahitē viṣṇādēva akṣaraśabda pravṛtti nimittasya pauṣkalyāt viṣṇurēva akṣara śabda mukhyārthaḥ”.
(nāśamu nālugu vidhamulu - ellakālamu uṃḍakapōvuṭa, dēhamu nāśanamaguṭa, duḥkhamukaluguṭa, pūrtigā niṃḍiyuṃḍakuṃḍuṭa. ī nālugu vidhamula nāśamu viṣṇuvunaṃdu lēvu).
(ī nālugu vidhamula vināśamulu lēnaṭuvaṃṭi viṣṇuvunaṃdē akṣaruḍu anu śabdamu - māṭa - pūrtigā vartiṃcunu - kanuka viṣṇuvē akṣaraśabdamununaku mukhyārthamu).
“tvamakṣaraṃ sadasattatparaṃ yat” (gīta - 11 - 37)
(jīvātma puṭṭinadi kādu, canipōvunadikādu ani kaṭhōpaniṣat (2 - 28) lō ceppabaḍinadi, aṃducēta jīvātma naśiṃpanivāḍu gāvuna akṣaruḍu. ī viṣayamē śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu - “na jāyatē mriyatēvā kadā cit” (2 - 28).
(ātma - jīvātma - satyamainadaguṭavalana - anagā, mūḍukālamulaṃdu, ellapuḍu, uṃḍunadikanuka idi janmakaladikādu, aṃducēta ajuḍu - janmalēnidi - ā prakāramē jīvātma idivaraku uṃḍi, maṟiyokappuḍu uṃḍanidikādu. okappuḍu uṃḍi iṃkoka appuḍu lēnivastuvu ēdainanu naśiṃcunadē. jīvātma bhaviṣyatkālamaṃdu kūḍā - rābōvukālamaṃdu kūḍā - uṃḍunadi - sat padārthamaguṭavalana naśiṃcunadi kādu - aṃducēta - aṃducēta ātma ajuḍu - janmalēnivāḍu. janmalēnivāniki mṛtyuvu - nāśamu uṃḍadu. aṃducēta ātma avināśi - naśiṃcunadikādu. naśiṃcunadikādu kanuka akṣaruḍu -“najāyatē mriyatē vā” anunadi pratijñā vākyamu - siddhāṃtamu cēyabaḍina vākyamu).
akṣara śabda nirdiṣṭaḥ kūṭasthaḥ, acitsaṃsarga viyaktaḥ svēnarūpēṇa avasthitaḥ muktātmā. naḥ tu acitsaṃ sargā bhāvāt acitpariṇāma viśēṣa brahmādi dēhō sādhāraṇō na bhavati iti kūtasthaḥ ucyatē. (akṣaruḍu anu śabdamucēta nirdēśiṃpabaḍinavāḍu kūṭasthuḍu - acit - (anagā, anātma) vastuvulatō kalisiyuṃḍanivāḍu, tana svasvarūpamutōnē uṃḍuvāḍu, mukta svarūpuḍu - ē vidhamaina baṃdhamucēta baṃdhiṃpabaḍanivāḍu kūṭasthuḍu- ellapuḍu okē vidhamugā, ē vidhamaina vikāramulu lēkayuṃḍuvāḍu. kanuka kūṭasthuḍu. acitpadārthamutō kalisi yuṃḍakapōvuṭacēta, acidvastuvulaku kaligeḍi pariṇāmamulu - mārpulu - viśēṣamulugala caturmukha brahma modalaguvāṭi dēhamulavalenuṃḍunadikādu - ī kāraṇamuvalla kūṭasthuḍu - kūṭamuvale sthiramugā mārpulu lēka uṃḍuvāḍu - ani ceppabaḍucunnāḍu).
“bhagavataḥ māyā śaktiḥ kṣarākhyasya puruṣasya utpatti bījaṃ, anēka saṃsāri jaṃtu kāma karmādi saṃskārāśrayaḥ, saṃsāra bījānaṃ tyāt nakṣarati iti akṣaraḥ. sa ēva kūṭasthaḥ” (śrīśaṃkaraḥ)
(akṣaramanagā bhagavaṃtuniyokka māyā sakti. lōkamulō kṣaruḍu, akṣaruḍu ani reṃḍuvidhamula puruṣulu ceppabaḍiri. ā iddarilō kṣarapuruṣuḍu ani ceppabaḍinavāniki puṭṭucōṭu, puṭṭukāraṇamainavāḍu akṣarapuruṣuḍu. adiyē akṣaramu. prāṇulu cēsina anēka karmala saṃskāramunaku āśrayamainadi. dīninuṃḍiyē sūkṣmarūpamulōnuṃḍi vāṭi vāṭi karmānusāramuga prāṇulu phalamu nanubhaviṃcuṭaku sthūlarūpamunu gaikonunu. ī saṃsāramanunadi maralamarala puṭṭucu naśiṃcucuṃḍinanu pravāharūpamuna eppuḍainanu aṃtamu noṃdanidi kanuka anaṃtamu, aṃducēta akṣaramu).
(satvarajastamamulanu guṇamulu mūḍiṃṭiyokka sāmyāvastha - anagā mūḍuguṇamulu okaṭi heccu, okaṭi takkuvagānu uṃḍaka mūḍū samānapāḷḷalōnuṃḍusthiti, sphuṭamugā lēni prakṛtiyokka sthiti. akṣaramu. prakṛtiyokka ī avastha cētana samaṣṭiki garbhamu, kāraṇamainadi. ā avasthalōnunnadaṃtayu cētanamātramēkādu, avyaktamugānunna prakṛti tatvamu - ī avasthalō vividhatatvamulanniyu cida cidrūpamulanniyu sūkṣmarūpamulō uṃḍi vyaktamugāka yuṃḍunu. ī sthitiyē akṣaramanu pērutō upacariṃpabaḍucunnadi. cittunu, acittunu vēru vērugā viśadīkariṃci ceppuṭaku śakyamukāni avastha. dīninē prathānamaṃduru).
(śrīmadbhagavadgīta adhyā - 8 - 18 lō ceppabaḍina avyaktamanu saṃjñakala caturmukha brahma yokka pagaṭikālamaṃdu ī samasta prapaṃcamulōni vastuvulanniyu sūkṣmasthitilōnuṃḍi vyaktamugāka yuṃḍunavi vyaktamagunu - aṃdulōnuṃḍi vērayi janmiṃcinaṭluṃḍunu - ā caturmukha brahma anu pērugala avyaktamunaṃdē līnamai vyaktamugāka yuṃḍunu. ā caturmukha brahmayokka pagaṭikālamanagā samaṣṭigā uṃḍisūkṣmarūpamulō ī samasta vastuvulu vyaktamaguṭaku - sṛṣṭiṃpabaḍuṭaku - unmukhamaina kālamu. atani rātrikālamanagā avi avyaktasthitilōnē uṃḍukālamu. prakṛtiyokka iṭṭi sthitini avyaktamaniri. ī avyaktamu kanna paramamu, utkṛṣṭamaina avyaktamanunadi, sanātanamainadi iṃkokaṭi kaladu - ā avyaktamanunadi samasta bhūtramulu naśiṃcinanu naśiṃcanidi. dāninē akṣaramani paramagatiyani yaṃduru. dānini ceṃdinavāru tirigirāru - aṭṭi avyaktamē nā parama dhāmamu - “tadviṣṇōḥ paramaṃ padaṃ” - adiyē nēnu (bhagavaṃtuḍanu nēnu).
vyatiriktō (a) dhavā śrēṣṭō hētubhūtō vidhē rapi |
(carācararūpamulatō kūḍiyunna ī sthūlajagattu aṃtaṭikī kāraṇamaina caturmukha brahma puṭṭuṭaku kāraṇamainaṭuvaṃṭinnī, iṃdriyamula śaktini miṃcinadinnī, rūpamu, sparśamu modalagu viṣayamulu lēnaṭuvaṃṭinnī, akṣaruḍainaṭuvaṃṭinnī, nityamu uṃḍunadinnī, bhūtamulanniyu naśiṃcinanu tānu naśiṃcanidi ayina avyaktamu anu pērugaladi mari yokaṭikaladu. idiyē avyaktamani, akṣaramani ceppabaḍucunnadi. idiyē paramapuruṣārthamu, nālugava puruṣārthamaina mōkṣamu. dīnini paramagatiyani ceppuduru - parama puruṣuni kanna paramamu, paramagati iṃkokaṭi lēdu ani śrutulu, smṛtulu ceppucunnavi. aṭṭi bhāvamunu poṃdinavāru marala marala janmiṃcaru - mukti poṃduduru - aṭṭi dāni svarūpamu utkṛṣṭamaina vaiṣṇavapadamu - anniṃṭikaṃṭe, uttamamainavāṭikaṃṭe uttamamainadi. aṃducēta vēdāṃtamulō - upaniṣattulalō - ceppabaḍina ā paramagati nēnē - “tadviṣṇō paramaṃ padaṃ”.
(ē vidhamaina baṃdhamulēka yuṃḍuvāḍu, mōkṣamē svarūpamainavāḍu).
(akṣaruḍu anu śabdamucēta nirdēśiṃpabaḍinavāḍu kūṭasthuḍu, anātma vastuvulatō kalisiyuṃḍanivāḍu, tana svasvarūpamutōnē yuṃḍuvāḍu, muktasvarūpuḍu, ē vidhamaina baṃdhamulacētanu baṃdhiṃpabaḍani vāḍu kūṭasthuḍu. ellapuḍu okē mōstarugā nuṃḍuvāḍu. ē vidhamaina vikāramulu lēka yuṃḍuvāḍu kanuka kūṭasthuḍu. acitpadārthamutō kalisiyuṃḍakapōvuṭacēta acidvastuvulaku kaligeḍi pariṇāmamulu - mārpulu, viśēṣamulu - gala caturmukha brahma modalagu vāri dēhamulavalenuṃḍaḍu. ī kāraṇamucēta kūṭasthuḍu sthiramugā, mārpulu lēka yuṃḍuvāḍu).
“pratyagātma svarūpaṃ” (śrīrāmānujaḥ)
“tasyā śśikhāyā madhyē paramātmā vyavasthitaḥ. sa brahma, ssaśiva ssaharissēṃdra sō (a) kṣaraḥ paramassvarāṭ.” (maṃtrapuṣpamu)
(śarīramulō hṛdayamulō vaiśyānaruḍu anu agnijvāla madhyanu paramātma unnāḍu - atanē brahma, atanē śivuḍu, atanē viṣṇuvu, atanē iṃdruḍu, atanē akṣaruḍu, paratatvamu, svarāṭ).
(ī lōkamulō puruṣulu anuvāru iddarunnāru - kṣaruḍu, akṣaruḍu. kṣaruḍu anagā naśiṃcuvāḍu, akṣaruḍu anagā naśiṃpanivāḍu. samastamaina bhūtamulu kṣaramulu - naśiṃcu svabhāvamu kalavi. bhavamu anagā janma, bhūtamulu anagā puṭṭinavi, janma kalavi. janma kaladi naśiṃpaka tappadu. - puṭṭinadi giṭṭakamānadu. aṃducēta, bhūtamulanniyu, - bhagavaṃtunilōnuṃḍi puṭṭinavanniyu - kṣaramulē. jīvātma akṣaruḍu - naśiṃpanivāḍu. jīvātma poṃdiyunna upādhi - śarīramu - naśiṃcinanu tānu naśiṃcanivāḍu - kūṭasthamuvale ē vidhamaina calanamukāni, vikāramukāni lēkayuṃḍuvāḍu. aṃducēta kūṭasthuḍaina jīvātma akṣaruḍu)
(śrīmadbhagavadgīta - 15 - 16 ślōkamulō ceppabaḍina puruṣuliddarikaṃṭe uttamamaina puruṣuḍu maṟokaḍu vērugānunnāḍu. atanē uttama puruṣuḍani, lēka, puruṣōttamuḍani paramātmayani ceppabaḍucunnāḍu. ī uttamapuruṣuḍaina paramātmayē mūḍu lōkamulanu āvēśiṃci, bhariṃci pāliṃcucunnāḍu).
(śrīmadbhagavadgīta - 15 - 16 lō ceppabaḍina akṣaruḍanu puruṣuḍu bhagavaṃtuni yokka māyāśakti yaniyu kūḍā ceppabaḍucunnāḍu. idi bhagavaṃtuni avinābhāva saṃbaṃdhamucē nāśrayiṃci atanivale nāśamulēkuṃḍa nuṃḍunadi kanuka akṣaramani ceppabaḍucunnadi. aṃducēta iccaṭakūṭasthamaina mūla prakṛti).
(bhagavaṃtuni māyāśakti kṣarapuruṣuḍani śrīmadbhagavadgīta - 15 - 16 lō ceppabaḍinadāni utpattiki bījamainadi, kāraṇamainadi. ī māya lēka prakṛti nuṃḍiyē jagattu aṃtayu puṭṭinadi. idiyē saṃsāramunaku bījamu. saṃsāramanagā sṛṣṭisamayamuna puṭṭucu, praḷayamaṃdu naśiṃcucu marala marala ī prakāramugā jarugucuṃḍunadi. ī saṃsāramu naśiṃcu svabhāvamukaladi ayinanu marala marala puṭṭucuṃḍuṭacēta pravāha rūpamugā anaṃtamu - akṣaramu –
“prakṛtiṃ puruṣaṃ caiva viddhyanādī ubhāvapi ||”. (śrīmadbhagavadgīta - 13 - 19)
prakṛti, puruṣuḍu anādulē, anādulē, janmalēnivē - janmalēnidāniki kṣīṇiṃci naśiṃcuṭa uṃḍadu - aṃducēta prakṛti akṣaramu).
(vēdārthamu telisina jñānulu akṣaruḍani - sarvakālamulaṃduṃḍuvāḍani ē bhagavaṃtuniguṟiṃci ceppu cuṃdurō atanē paramapadamu. viṣayamulaṃdāsaktilēni yatīśvarulu ē padamunu pravēśiṃcedarō, pravēśiṃci mukti ceṃdedarō, ē padamunu guṟiṃci brahmacaryavratamu salipedarō aṭṭipadamēnēnu. paramātmayaninanu, parabrahma yaninanu, paramapadamaninanu okaṭē. paramātmayē paramapadamu. paramapadamē paramātma. adi naśiṃcanidi - aṃducēta akṣaramu - adiyē ‘ōṃ’ kāramu).
(ōṃ kāramu okē akṣaramu - a + u + ma kalisi “ōṃ” ayinappaṭikī adi okē akṣaramani bhāviṃpavalenu - “ōṃ ityēkākṣaraṃ brahma” - ōṃ kāramē parabrahma ani dānini upāsiṃcavalenu ani ceppabaḍinadi. īōṃ kāramu parabrahmavale akṣaramu - trikālamulaṃdu uṃḍunadi. aṃducēta ikkaḍa yadakṣaraṃ vēdavidō vadaṃti ani ceppinapuḍu vēdamulō ‘ōṃ’ anu akṣaramu - varṇamu - parabrahmamē ani ceppabaḍinadi. aṃducēta ī akṣaramu - varṇamu - ‘ōṃ’ - kūḍa brahmavale akṣaramē).
(akṣaruḍaina parabrahmanuṃḍiyē ī prapaṃcamu puṭṭinadi. eṭlu puruṣuni sarīramunuṃḍi kēśamulu, gōḷḷupuṭṭucunnavō aṭlē).
(bāgā prajvaliṃpabaḍina agninuṃḍi agnitunakalu ē prakāramu puṭṭucū aṃdulōnē kalisipōvucunnavō ā prakāramē śivuḍu anupērugala akṣaruniyaṃdu bhāvamulanniyu - bhāvamu = puṭṭukagala prapaṃcamulōnunna vastuvulanniyu - puṭṭi, atanilōnē layamagu cunnavi).
(bṛhadāraṇyakōpaniṣat - 3 - 8 - 7 - 18)
(ī sarvamunu evaniyaṃdu ōtamu prōtamu ayi - yunnadi - baṭṭalōni poḍugu, pēkadāramulavale - niluvudāramu, aḍḍudāramuvale - vyāpiṃciyunnadi. “ani gārgi yājñavalkyuni aḍigenu - dāniki yājñavalkyuḍu ī prakāramugā samādhānamu ceppenu” :- avanniyu ākāśamaṃdu ōtaprōtamai yunnavi. ākāśamu dēniyaṃdu ōtaprōtamai yunnadi anu praśnaku samādhānamu - “ākāśamu akṣaramaṃdu ōtaprōtamai yunnadi !” ani “ā akṣaramu asthūlamu, anaṇuvu anu modalagu lakṣaṇamulu galadani brahma vēttalu ceppuduru” ani. dīninibaṭṭi akṣaramanagā parabrahmamē - ani teliyucunnadi).
“āvirbhāvōpi vēdasya hyakṣarātparamātmanaḥ”. (gītābhāvaprakāśamu - 4 - 97)
(iccaṭa brahma anagā vēdamu - vēdamu akṣaruḍaina, naśiṃcani svabhāvamugala, parabrahmamunuṃḍi puṭṭinadi - aṃducēta ikkaḍa akṣaruḍanagā parabrahma).
sūryā caṃdramasau vidhrṛtau tiṣṭataḥ ||“. (bṛhadāraṇyakōpaniṣat - 3 - 8 - 9)
(akṣaruḍaina parabrahma śāsanamuvalananē sūryacaṃdrulu prakāśiṃcucunnāru).
(utkṛṣṭamaina akṣara saṃjñakala prakṛtikaṃṭe utkṛṣṭamainavāḍu ani bhagavaṃtuni guṟiṃci ceppuṭavalanākṣaramu anagā bhagavaṃtuni śakti ayina prakṛti yani arthamagucunnadi).
(brahma, rudruḍu modalagu dēvatalu kṣīṇiṃcu dēhamugalavāru kanuka kṣaramulu - kṣīṇiṃcunavi - kṣīṇiṃci naśiṃcunavi. kṣīṇiṃcani dēhamugaladaguṭacēta śrīlakṣmi akṣarā ani ceppabaḍicunnadi - śrīmahālakṣmi śrīmahāviṣṇuni śaktiyē kanuka ataninuṃḍi vērukānidaguṭacēta śrīmahāviṣṇunivale śrīmahālakṣmikūḍa akṣarā ani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.