← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షరం akṣaraṃ

Original — తెలుగు
  1. సత్యం, స్వరూపేణా వికారం.

(సత్యమైనది, మూడు కాలము లందు ఉండునవి; స్వరూపము చేత వికారము - మార్పు - లేనివాడు. ఎల్లపుడు ఒకే రీతిగా నుండువాడు.)

  1. నక్షర తీత్యక్షరః - (క్షీణింపనివాడు; నాశములేనివాడు; పరబ్రహ్మ).

  2. అకారాది వర్ణం; (‘అ’ ఇతి బ్రహ్మ - ‘అ’ అనగా పరబ్రహ్మ. వర్ణములన్నియు అకారము యొక్క మార్పులే - అకారము పరబ్రహ్మము కనుక వర్ణములన్నియు పరబ్రహ్మ రూపములే; పరబ్రహ్మ శక్తి కలవియే - అందుచేతనే అక్షరములతో కూడియున్న మంత్రములకు దివ్య శక్తి కలిగి యున్నది. దీవనలు, శాసములు ఫలించుటకు ఇదియే కారణము. (చూడుము : - ‘రాముడు’)

  3. “అక్షరం బ్రహ్మ పరమం” (నశించనిది, మూడు కాలములందు ఉండునదే పరతత్వము, లేక పరబ్రహ్మము.)

  4. “త్వమక్షరం పరమం నేది తవ్యం” (శ్రీమద్భగవద్గీత - 11 - 18)

(నీవు అక్షరుడవు, నాశము లేనివాడవు, క్షీణింపనివాడవు, మూడు కాలములందుండు వాడవు, నీవే పరతత్వము, పరబ్రహ్మము, సృష్టి అంతటిలో నుండు ఓకే ఒక తత్వము. నీవే జ్ఞేయ వస్తువు - తెలుసుకో తగినవాడవు. సృష్టి అంతటిలోను ఉన్నది నీవొక్కడివే కనుక తెలియ తగిన వస్తువు ఒక్క నీవే -)

  1. “యే త్వమక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |

సర్వత్ర గమ చింత్యంచ కూటస్తమచలం ధ్రువం |

- - - తేప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ||” (శ్రీమద్భగవద్గీత - 12 - 3, 4)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -

“యే (అ)క్షరం నిర్విశేషం మాం నిర్గుణం పర్యుపాసతే |

మామేవప్రాప్నువంతి - - |

అనిర్ధేశ్య మశక్యం యద్వ్యపదేష్టుం గిరా(అ)క్షరం |

- - -సర్వత్రగం యతోవ్యాపి సర్వకారణమద్వయం |

పరిచ్ఛిన్నస్య కార్యస్య జాత్యాదేర్యోగ దర్శనాత్ |

అవరిచ్ఛిన్న చిధ్థాతోర్నాస్తి తద్యోగ ఇత్య తః |

అచింత్యం తన్మనో వృత్తేరవ్యగోచరమక్షరం |

మాయా తత్కార్య రూపే యత్కూటే (అ)ధిష్ఠాన భావతః |

తిష్టత్యధ్యాసకేనైవ సంబంధేనాదికారి చ |

కూటస్థత్వేన సర్వేషాం దోషా ణామధిష్టానతయా (అ)చలం |

అత ఏవధ్రువం నిత్యం పరిణామ వివర్జితం |

శుధ్ధ మేతాదృశం బ్రహ్మ వేదాంత శ్రవాణాదిభిః |

ఉపాస్యార్థం యధా శాస్త్రం విషయీకృత్య సంతతం |

తుల్యప్రత్యయ సంతత్యాతైల ధారావ దాసనం |

యదస్యుపాసనం తేన నిధిధ్యాసన సంజ్ఞినా |

సాక్షాత్కుర్వంతి మాం ప్రత్యగభిన్నం చిద్ఘనం సుఖం ||” (గీతాభావప్రకాశము - 12 - 21 to 31)

(విశేషములు అనగా అవయవములు – అవయవములు లేని వాడు నిర్విశేషుడు – అవయవములుండునది నశించును - భగవంతుడు నిర్విశేషుడు కనుక అక్షరుడు - సత్వరజస్తమో గుణములు లేనివాడు. అందుచేత అక్షరుడు. అవ్యక్తుడు - కనబడనివాడు అందుచేత ఇటువంటివాడు అని నిర్దేశించుటకు శక్యముకానివాడు – అన్నింటిలోను ఉండువాడు కనుక - అన్నింటిలోను వ్యాపించి యుండువాడు కనుక వ్యాపి - విచక్షణ లేకుండా అన్నింటి యందు పూర్తిగా వ్యాపించి యుండువాడు, అచలము, ధ్రువము, నిత్యము శుద్ద్ధము. ఇటువంటి నిర్విశేష, నిరాకార, నిర్గుణ పరబ్రహ్మను వేదాంత శ్రవణము వలన ఉపాసన కొరకు శాస్త్రములో చెప్పిన ప్రకారము నిధిధ్యాసన మూలముగా నన్ను సాక్షాత్కరించు కొనుచున్నారు).

  1. “ద్వాదిమౌ పురుషౌ లోకే క్షరాక్షర ఏవచ |

క్షరః సర్వాణి భూతాని కూటస్థో(అ)క్షర ఉచ్యతే |

ఉత్తమఃపురుషస్త్వన్యః పరమాత్మేత్యుదా హృతః |

యే లోకత్రయ మా విశ్యభిభర్త్య వ్యయ ఈశ్వరః |

యస్మాత్ క్షరమతీతోహ మక్షరాదపి చోత్తోమం |

అతో(అ)స్మిన్ లోకే వేదే చ ప్రధితః పురుషోత్తమః ||” (శ్రీమద్భగవద్గీత-15 - 17, 18)

(ఈ లోకమందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు ఇద్దరు ఉన్నారు. నశించు స్వభావముగల సమస్త భూతములు క్షరము - కూటస్థుడు - అనగా కూటము వలె చెక్కుచెదరక ఎల్లపుడు ఒకే రూపముగా, శక్తిగలిగి యుండువాడు అక్షరుడు - ఇచ్చట అక్షరుడు అనగా జీవుడు - పరబ్రహ్మ అంశయే కనుక నాశము లేనివాడు అని అర్ధము - కొందఱు భగవంతునివలె అతని మాయా శక్తి అయిన ప్రకృతి కూడా త్రికాలములందు ఉండునది కనుక ప్రకృతి అక్షరుడు అని చెప్పుదురు. ఈ అక్షరుడు కన్న, ప్రకృతికన్న ఉత్తముడు, మూడు లోకములను ఆదేశించి భరించువాడు అయినవాడు పరమాత్మ - పరబ్రహ్మ అని చెప్పబడుచున్నాడు. క్షరమైన లోకము కంటె, అక్షరమైన ప్రకృతి కంటె ఉత్తముడగుట వలన పరమాత్మ పురుషోత్తముడు, లేక ఉత్తమ పురుషుడు అని చెప్పబడుచున్నాడు.)

  1. “పరస్తస్మాత్తు భావో (అ) న్యో (అ) వ్యక్తో (అ) వ్యక్తా త్సనాతనః |

యః స సర్వేషు భూతేషు నశ్యత్సు నపినశ్యతి |

అవ్యక్తో (అ)క్షర ఇత్యుక్తస్త మాహుః పరమాం గతిం |

యంప్రాప్యన నివర్తంతే తద్థామ పరమం మమ ||” (శ్రీమద్భగవద్గీత- 8 - 20, 21)

పై శ్లోకములకు వ్యాఖ్యానము : -

“తస్మాచ్చరాచర స్థూల జగధ్ధేతోర్విధేః పరః |

వ్యతిరిక్తో (అ) ధవా శ్రేష్టో హేతుభూతో విధేరపి |

నతస్యప్రతిమాస్తీతి శ్రుత్యాత్యంత విలక్షణః |

అవ్యక్త ఇంద్రియాతీతో రూపస్పర్శాదివర్జితః |

అధ్యస్తేషు చ సర్వేషు కార్యేష్వనుగతో (అ) క్షరః |

నిత్యో య ఈ దృశో భావో నశ్యత్స్వఖిలే షుచ |

భూతేషు జాయమానేషు ననశ్యతి నజాయతే |

స్రష్టుర్హిరణ్య గర్భస్య కార్యసాత్రాభిమానినః |

తదుత్పత్తి వినాశాభ్యాం యుక్తేస్తో నాశ జన్మని |

అధిష్ఠానస్య సత్యస్యా వ్యక్తస్యా కృత్రిమస్యచ |

పరమేశ్వరస్య విష్ణోర్నాస్తి జన్మాది విక్రియా ||“.

“యో భాస ఇహ చా వ్యక్త ఇత్యక్షర ఈరితాం |

తముత్పత్తి వినాశాభ్యాం శూన్య మానంద మవ్యయం |

పురుషార్ధస్య విశ్రాంతిం తం ప్రాహుః పరమాం గతిం |

శ్రుతయః స్మృతయ శ్చైవ పురుషాన్న పరంత్వితి |

యం భావం ప్రాప్య భూయో నో నివర్తంతే (అ) త్రజన్మనే |

తత్స్వరూపం పరం విష్ణోర్మమ సర్వోత్తమోత్తమం|

అతోహమేవ వేదాంత గమ్యోస్మి పరమా గతిః ||” (గీతాభావ ప్రకాశము 8 - 120 to 128)

“పురుషః స పరః పార్ధ భక్త్యా లభ్యస్త్వనన్యయా |

యస్యాంతస్థాని భూతాని యేన సర్వ మిదం తతం ||” (శ్రీమద్భగవద్గీత - 8 - 22)

“సర్వోత్కష్టః స పురుషః పరమాత్మాహమేవ చ |

ప్రేమ లక్షణయా భక్త్యా జ్ఞానలక్షణయైవవా |

లభ్యోస్మి నాన్యధా కర్మ కోటిభిః సంచి తైరపి |

- - - - యస్యాధిష్ఠానభూతస్యాంతర్వర్తీన్య ఖిలాన్యపి |

భూతాని కల్పితాన్యేవయేన విశ్వమిదం తతం |

అకాశేనేవ కుంభాది సోహ మేవ మహేశ్వరః“. (గీతాభావ ప్రకాశము - 8 - 129 - 132)

(స్థూల జగత్తుకు కారణమైన ప్రకృతి లేక చతుర్ముఖ బ్రహ్మయే అవ్యక్తము. ఈ అవ్యక్తము నుండి భూతములన్నియు పుట్టుచూ, అందులోనే లీనమై పోవుచున్నవి. (చూడుము - శ్రీమద్భగవద్గీత 8 – 18, 19). ఈ అవ్య క్తము కంటె ఉత్కృష్టమైనది, ఇతరమైనది అగు అవ్యక్తము - కనబడనిది, సనాతనమైనదిన్నీ - అని పేరు గలది, అందుచేత సనాతనమైనది పరబ్రహ్మము - ఇది మొదట చెప్పబడిన అవ్యక్తమునకు కారణమైనది, రూపము, స్పర్స మొదలగునవి లేనిది, అందుచేత ఇంద్రియములకు అతీతమైనది, మూడు కాలములందు ఉండునదియు, సమస్త భూతములు పుట్టుచూ, చచ్చుచున్నను, తాను పుట్టక చావక యుండునది, ఇది అధిష్ఠానము, సత్యము - నిత్యము - అవ్యక్తము, అకృత్రిమము అయినందున జన్మ మొదలగు మార్పులు లేనిది.)

(అవ్యక్తము అని చెప్పబడు ఇదియే అక్షరము - దీని జనన మరణములు లేవు, ఇది ఆనందము, అవ్యయము, పురుషార్థములలో ఆఖరుది పరమ పురుషార్థము, పరమగతి, “పురుషాన్నపరం కించిత్”- (ఈ పురుషుని కంటె - పరమపురుషుని కంటె పరమమైనది - ఉత్కృష్టమైనది- ఏదియు లేదు) అని శ్రుతులు స్మృతులు చెప్పుచున్నవి - అట్టి స్థితిని పొంది మరల ఈ లోకములో జన్మ ఎత్తుటకు తిరిగిరారు - అది పరతత్వము విష్ణువు నైన నాయొక్క స్వరూపము. అది ఉత్తమమైన వాటి అన్నింటికన్నను ఉత్తమమైనది. అందుచేత ఉపనిషత్తులలో పొందతగిన ఉత్కృష్టమైన గతి - ‘పరంధామము’ అని చెప్పబడినది నేనే.)

(ఉత్తమోత్తముడు అని పైన చెప్పబడిన ఆ పురుషుడు - పరమపురుషుడు, ఉత్తమపురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమగును - అతనిలోనే ఈ భూతములన్నియు ఉన్నవి. ఈ ప్రపంచమంతటి లోన అతనే వ్యాపించియున్నాడు -- ఘటాకాశమువలె - అనన్య భక్తి యనగా ప్రేమీ భక్తి - ప్రేమ లక్షణము గల భక్తి, లేక, జ్ఞానలక్షణములు గల భక్తి. కోట్ల కొలది కర్మలు చేసినను ఈ పురుషుడు పొందబడడు.)

(పైన చెప్పినప్రకారము ఆ లక్షణములు గలవాడు అక్షరుడు.)

  1. “యదక్షరం వేదవిదో వదంతి, విశంతి యద్యతయో వీతరాగాః |

యదిచ్చంతో బ్రహ్మ చర్యం చరంతి తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే ||” (శ్రీమద్భగవద్గీత - 8 -11)

(వేదమును తెలిసినవారు ఏది అక్షరము - నశింపనిది, నాశము లేనిది, మూడు కాలములందు ఉండునది - అని చెప్పుచున్నారో, దేనియందును అనురాగము - ఆసక్తి - లేనివారగు యోగులు దేనిని ప్రవేశించుచున్నారో, దేనిని కోరుచు బ్రహ్మచర్యవ్రతము సలుపుచున్నారో ఆ పదమును - స్థానమును, బ్రహ్మ పదమును, పరతత్వమును, నేను నీకు సంగ్రహముగా చెప్పుచున్నాను).

Transliteration
  1. satyaṃ, svarūpēṇā vikāraṃ.

(satyamainadi, mūḍu kālamu laṃdu uṃḍunavi; svarūpamu cēta vikāramu - mārpu - lēnivāḍu. ellapuḍu okē rītigā nuṃḍuvāḍu.)

  1. nakṣara tītyakṣaraḥ - (kṣīṇiṃpanivāḍu; nāśamulēnivāḍu; parabrahma).

  2. akārādi varṇaṃ; (‘a’ iti brahma - ‘a’ anagā parabrahma. varṇamulanniyu akāramu yokka mārpulē - akāramu parabrahmamu kanuka varṇamulanniyu parabrahma rūpamulē; parabrahma śakti kalaviyē - aṃducētanē akṣaramulatō kūḍiyunna maṃtramulaku divya śakti kaligi yunnadi. dīvanalu, śāsamulu phaliṃcuṭaku idiyē kāraṇamu. (cūḍumu : - ‘rāmuḍu’)

  3. “akṣaraṃ brahma paramaṃ” (naśiṃcanidi, mūḍu kālamulaṃdu uṃḍunadē paratatvamu, lēka parabrahmamu.)

  4. “tvamakṣaraṃ paramaṃ nēdi tavyaṃ” (śrīmadbhagavadgīta - 11 - 18)

(nīvu akṣaruḍavu, nāśamu lēnivāḍavu, kṣīṇiṃpanivāḍavu, mūḍu kālamulaṃduṃḍu vāḍavu, nīvē paratatvamu, parabrahmamu, sṛṣṭi aṃtaṭilō nuṃḍu ōkē oka tatvamu. nīvē jñēya vastuvu - telusukō taginavāḍavu. sṛṣṭi aṃtaṭilōnu unnadi nīvokkaḍivē kanuka teliya tagina vastuvu okka nīvē -)

  1. “yē tvamakṣaramanirdēśyamavyaktaṃ paryupāsatē |

sarvatra gama ciṃtyaṃca kūṭastamacalaṃ dhruvaṃ |

- - - tēprāpnuvaṃti māmēva sarvabhūtahitē ratāḥ ||” (śrīmadbhagavadgīta - 12 - 3, 4)

pai ślōkamunaku vyākhyānamu : -

“yē (a)kṣaraṃ nirviśēṣaṃ māṃ nirguṇaṃ paryupāsatē |

māmēvaprāpnuvaṃti - - |

anirdhēśya maśakyaṃ yadvyapadēṣṭuṃ girā(a)kṣaraṃ |

- - -sarvatragaṃ yatōvyāpi sarvakāraṇamadvayaṃ |

paricchinnasya kāryasya jātyādēryōga darśanāt |

avaricchinna cidhthātōrnāsti tadyōga itya taḥ |

aciṃtyaṃ tanmanō vṛttēravyagōcaramakṣaraṃ |

māyā tatkārya rūpē yatkūṭē (a)dhiṣṭhāna bhāvataḥ |

tiṣṭatyadhyāsakēnaiva saṃbaṃdhēnādikāri ca |

kūṭasthatvēna sarvēṣāṃ dōṣā ṇāmadhiṣṭānatayā (a)calaṃ |

ata ēvadhruvaṃ nityaṃ pariṇāma vivarjitaṃ |

śudhdha mētādṛśaṃ brahma vēdāṃta śravāṇādibhiḥ |

upāsyārthaṃ yadhā śāstraṃ viṣayīkṛtya saṃtataṃ |

tulyapratyaya saṃtatyātaila dhārāva dāsanaṃ |

yadasyupāsanaṃ tēna nidhidhyāsana saṃjñinā |

sākṣātkurvaṃti māṃ pratyagabhinnaṃ cidghanaṃ sukhaṃ ||” (gītābhāvaprakāśamu - 12 - 21 to 31)

(viśēṣamulu anagā avayavamulu – avayavamulu lēni vāḍu nirviśēṣuḍu – avayavamuluṃḍunadi naśiṃcunu - bhagavaṃtuḍu nirviśēṣuḍu kanuka akṣaruḍu - satvarajastamō guṇamulu lēnivāḍu. aṃducēta akṣaruḍu. avyaktuḍu - kanabaḍanivāḍu aṃducēta iṭuvaṃṭivāḍu ani nirdēśiṃcuṭaku śakyamukānivāḍu – anniṃṭilōnu uṃḍuvāḍu kanuka - anniṃṭilōnu vyāpiṃci yuṃḍuvāḍu kanuka vyāpi - vicakṣaṇa lēkuṃḍā anniṃṭi yaṃdu pūrtigā vyāpiṃci yuṃḍuvāḍu, acalamu, dhruvamu, nityamu śudddhamu. iṭuvaṃṭi nirviśēṣa, nirākāra, nirguṇa parabrahmanu vēdāṃta śravaṇamu valana upāsana koraku śāstramulō ceppina prakāramu nidhidhyāsana mūlamugā nannu sākṣātkariṃcu konucunnāru).

  1. “dvādimau puruṣau lōkē kṣarākṣara ēvaca |

kṣaraḥ sarvāṇi bhūtāni kūṭasthō(a)kṣara ucyatē |

uttamaḥpuruṣastvanyaḥ paramātmētyudā hṛtaḥ |

yē lōkatraya mā viśyabhibhartya vyaya īśvaraḥ |

yasmāt kṣaramatītōha makṣarādapi cōttōmaṃ |

atō(a)smin lōkē vēdē ca pradhitaḥ puruṣōttamaḥ ||” (śrīmadbhagavadgīta-15 - 17, 18)

(ī lōkamaṃdu kṣaruḍu, akṣaruḍu ani puruṣulu iddaru unnāru. naśiṃcu svabhāvamugala samasta bhūtamulu kṣaramu - kūṭasthuḍu - anagā kūṭamu vale cekkucedaraka ellapuḍu okē rūpamugā, śaktigaligi yuṃḍuvāḍu akṣaruḍu - iccaṭa akṣaruḍu anagā jīvuḍu - parabrahma aṃśayē kanuka nāśamu lēnivāḍu ani ardhamu - koṃdaṟu bhagavaṃtunivale atani māyā śakti ayina prakṛti kūḍā trikālamulaṃdu uṃḍunadi kanuka prakṛti akṣaruḍu ani ceppuduru. ī akṣaruḍu kanna, prakṛtikanna uttamuḍu, mūḍu lōkamulanu ādēśiṃci bhariṃcuvāḍu ayinavāḍu paramātma - parabrahma ani ceppabaḍucunnāḍu. kṣaramaina lōkamu kaṃṭe, akṣaramaina prakṛti kaṃṭe uttamuḍaguṭa valana paramātma puruṣōttamuḍu, lēka uttama puruṣuḍu ani ceppabaḍucunnāḍu.)

  1. “parastasmāttu bhāvō (a) nyō (a) vyaktō (a) vyaktā tsanātanaḥ |

yaḥ sa sarvēṣu bhūtēṣu naśyatsu napinaśyati |

avyaktō (a)kṣara ityuktasta māhuḥ paramāṃ gatiṃ |

yaṃprāpyana nivartaṃtē tadthāma paramaṃ mama ||” (śrīmadbhagavadgīta- 8 - 20, 21)

pai ślōkamulaku vyākhyānamu : -

“tasmāccarācara sthūla jagadhdhētōrvidhēḥ paraḥ |

vyatiriktō (a) dhavā śrēṣṭō hētubhūtō vidhērapi |

natasyapratimāstīti śrutyātyaṃta vilakṣaṇaḥ |

avyakta iṃdriyātītō rūpasparśādivarjitaḥ |

adhyastēṣu ca sarvēṣu kāryēṣvanugatō (a) kṣaraḥ |

nityō ya ī dṛśō bhāvō naśyatsvakhilē ṣuca |

bhūtēṣu jāyamānēṣu nanaśyati najāyatē |

sraṣṭurhiraṇya garbhasya kāryasātrābhimāninaḥ |

tadutpatti vināśābhyāṃ yuktēstō nāśa janmani |

adhiṣṭhānasya satyasyā vyaktasyā kṛtrimasyaca |

paramēśvarasya viṣṇōrnāsti janmādi vikriyā ||“.

“yō bhāsa iha cā vyakta ityakṣara īritāṃ |

tamutpatti vināśābhyāṃ śūnya mānaṃda mavyayaṃ |

puruṣārdhasya viśrāṃtiṃ taṃ prāhuḥ paramāṃ gatiṃ |

śrutayaḥ smṛtaya ścaiva puruṣānna paraṃtviti |

yaṃ bhāvaṃ prāpya bhūyō nō nivartaṃtē (a) trajanmanē |

tatsvarūpaṃ paraṃ viṣṇōrmama sarvōttamōttamaṃ|

atōhamēva vēdāṃta gamyōsmi paramā gatiḥ ||” (gītābhāva prakāśamu 8 - 120 to 128)

“puruṣaḥ sa paraḥ pārdha bhaktyā labhyastvananyayā |

yasyāṃtasthāni bhūtāni yēna sarva midaṃ tataṃ ||” (śrīmadbhagavadgīta - 8 - 22)

“sarvōtkaṣṭaḥ sa puruṣaḥ paramātmāhamēva ca |

prēma lakṣaṇayā bhaktyā jñānalakṣaṇayaivavā |

labhyōsmi nānyadhā karma kōṭibhiḥ saṃci tairapi |

- - - - yasyādhiṣṭhānabhūtasyāṃtarvartīnya khilānyapi |

bhūtāni kalpitānyēvayēna viśvamidaṃ tataṃ |

akāśēnēva kuṃbhādi sōha mēva mahēśvaraḥ”. (gītābhāva prakāśamu - 8 - 129 - 132)

(sthūla jagattuku kāraṇamaina prakṛti lēka caturmukha brahmayē avyaktamu. ī avyaktamu nuṃḍi bhūtamulanniyu puṭṭucū, aṃdulōnē līnamai pōvucunnavi. (cūḍumu - śrīmadbhagavadgīta 8 – 18, 19). ī avya ktamu kaṃṭe utkṛṣṭamainadi, itaramainadi agu avyaktamu - kanabaḍanidi, sanātanamainadinnī - ani pēru galadi, aṃducēta sanātanamainadi parabrahmamu - idi modaṭa ceppabaḍina avyaktamunaku kāraṇamainadi, rūpamu, sparsa modalagunavi lēnidi, aṃducēta iṃdriyamulaku atītamainadi, mūḍu kālamulaṃdu uṃḍunadiyu, samasta bhūtamulu puṭṭucū, caccucunnanu, tānu puṭṭaka cāvaka yuṃḍunadi, idi adhiṣṭhānamu, satyamu - nityamu - avyaktamu, akṛtrimamu ayinaṃduna janma modalagu mārpulu lēnidi.)

(avyaktamu ani ceppabaḍu idiyē akṣaramu - dīni janana maraṇamulu lēvu, idi ānaṃdamu, avyayamu, puruṣārthamulalō ākharudi parama puruṣārthamu, paramagati, “puruṣānnaparaṃ kiṃcit”- (ī puruṣuni kaṃṭe - paramapuruṣuni kaṃṭe paramamainadi - utkṛṣṭamainadi- ēdiyu lēdu) ani śrutulu smṛtulu ceppucunnavi - aṭṭi sthitini poṃdi marala ī lōkamulō janma ettuṭaku tirigirāru - adi paratatvamu viṣṇuvu naina nāyokka svarūpamu. adi uttamamaina vāṭi anniṃṭikannanu uttamamainadi. aṃducēta upaniṣattulalō poṃdatagina utkṛṣṭamaina gati - ‘paraṃdhāmamu’ ani ceppabaḍinadi nēnē.)

(uttamōttamuḍu ani paina ceppabaḍina ā puruṣuḍu - paramapuruṣuḍu, uttamapuruṣuḍu ananya bhakti cētanē labhyamagunu - atanilōnē ī bhūtamulanniyu unnavi. ī prapaṃcamaṃtaṭi lōna atanē vyāpiṃciyunnāḍu -- ghaṭākāśamuvale - ananya bhakti yanagā prēmī bhakti - prēma lakṣaṇamu gala bhakti, lēka, jñānalakṣaṇamulu gala bhakti. kōṭla koladi karmalu cēsinanu ī puruṣuḍu poṃdabaḍaḍu.)

(paina ceppinaprakāramu ā lakṣaṇamulu galavāḍu akṣaruḍu.)

  1. “yadakṣaraṃ vēdavidō vadaṃti, viśaṃti yadyatayō vītarāgāḥ |

yadiccaṃtō brahma caryaṃ caraṃti tattēpadaṃ saṃgrahēṇa pravakṣyē ||” (śrīmadbhagavadgīta - 8 -11)

(vēdamunu telisinavāru ēdi akṣaramu - naśiṃpanidi, nāśamu lēnidi, mūḍu kālamulaṃdu uṃḍunadi - ani ceppucunnārō, dēniyaṃdunu anurāgamu - āsakti - lēnivāragu yōgulu dēnini pravēśiṃcucunnārō, dēnini kōrucu brahmacaryavratamu salupucunnārō ā padamunu - sthānamunu, brahma padamunu, paratatvamunu, nēnu nīku saṃgrahamugā ceppucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.