వర్ణములు; అకారము మొదలు క్షకారము వరకుగల అక్షరములు.
అక్షరశ్బ్దో వర్ణేషు రూఢః ఇతి వర్ణ ఏవ అక్షరః.
(అకారము మొదలు క్షకారము వరకుగల వర్ణములను అక్షరము(లు) అని చెప్పుట రూఢిగానున్నది. వర్ణమే అక్షరము).
(వర్ణము అక్షరము - వర్ణ నిర్మాణము అక్షరము - అక్షరము క్షరముకాదు - క్షీణించునదికాదు - భగవంతునివలె ఎల్లకాలమందు ఉండునది. ఒక్కొక్క వర్ణము అక్షరమే).
“ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ”. (ఓం అను ఒకే అక్షరము పరబ్రహ్మ అని ఉపాసించవలెను).
‘అ’ ఇతి బ్రహ్మ; ” ‘ఖం’ బ్రహ్మ -” (‘అ’ అనగా బ్రహ్మ అని ఉపాసించవలెను).
అక్షరములన్నియు, అకారము మొదలు క్షకారమువరకుగలవన్నియు అకారముయొక్క వికారములే - “అకారో వై సర్వ వాక్” అని శ్రుతి చెప్పుచున్నది. అకారమే సమస్త వాక్కు -అన్నిమాటలు - భగవంతునిలోనుండి పుట్టిన వస్తువులన్నియు భగవంతుని రూపములే అయినట్లు అక్షరములన్నియు అకారముయొక్క వికారములే - ‘అ’ ఇతి బ్రహ్మ - (అకారము బ్రహ్మ అని ఉపాసించుటకు చెప్పబడినది కనుక అకారము యొక్క వికారములైన మిగిలిన అక్షరములన్నింటియందు భగవదంశకలదు - భగవంతుని శక్తి కలదు –
“అక్షరాణా మకారోస్మి” - (శ్రీమద్భగవద్గీత - 10 - 33)
అకారము మొదలు క్షకారము వరకుగల అక్షరములలో మొదటి అక్షరము అయిన ‘అ’ కారము నేనే అని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు - ఇంతేకాదు, అక్షరములన్నీ అకారముయొక్క వికారములేకనుక వాటి అన్నింటిలోను అకారాంశ యున్నది - ఆ అకారాంశ నేనే అని అర్థము. అందుచేత అవి అన్నియు భగవంతునివలె అక్షరములే (నిత్యములే) - అక్షరరూపమైన భగవంతుడు అక్షరుడే).
(‘యదక్షరం వేదవిదో వదంతి” (వేదమును తెలిసినవాడు ’ఓం’ అను అక్షరము పరబ్రహ్మ అని చెప్పుదురు - ‘ఓం’ అనునది పరబ్రహ్మమే అని ‘ఓం’ అని ఉపాసించెదరు).
(అక్షరజ్ఞానము లేనివాడైనను - నిరక్షరకుక్షి అయినను - ఎవనిలో బ్రహ్మ ప్రకాశించునో వాడు సాక్షరుడే, విద్యావంతుడే. ఎంత చదువుకున్నవాడైనను, ఎంత జ్ఞానము కలవాడైనను ఎవని చిత్తములో పరబ్రహ్మ ధ్యానములేదో వాడు నిరక్షరుడే - చదువనివాడే, అజ్ఞానియే).
(అక్షరస్వరూపము రెండువిధములు - స్థూలము,సూక్ష్మము - స్థూలరూపమేమనగా - ఇతరుల చెవులకు వినబడునది, వైఖరీవాగ్రూపమైనది. అకారము మొదలు క్షకారము అంతమువరకుగల వర్ణములు, వాటితో వ్యవహరింపబడు వాక్యములు, పదములు, మంత్రములు మొదలగునవి. సూక్ష్మరూపమే మనగా - మధ్యమా వాగ్రూపమును వదలి వైఖరావాగ్రూపమును పొందుటకు నభిముఖమైనది. నాదాత్మికము, ప్రణవరూపమైనది. ప్రణవము కంఠము దగ్గర చేరినప్పుడు పైకి శబ్దరూపముతో వచ్చునది స్థూలము - నాదాత్మికమనునది సమస్తమైన శబ్దములకు ఉపాదాన కారణమైనది. (అన్ని శబ్దములు దీనిలోనుండి పుట్టినవే). ఇది శిరస్సులో పుట్టినదై లోపలనే ఉండునది, సూక్ష్మమైనది. ఇది అక్షరరూపమును పొందుటకు అభిముఖమై నాదాత్మికమగుచున్నది. ఇది శిరస్సునందు ప్రాణవాయువుతో కలిసి అన్ని వర్ణములకు - అక్షరములకు - ఉపాదానకారణమై వాటిని కలుగచేయును - నాభినుండి పైకి వచ్చు ప్రాణవాయువు హృదయమందు విస్తరించి, కంఠమునకు వచ్చి శిరస్సుచేరి, అక్కడనుండి అనేక విధములైన శబ్దములనుకంఠముద్వారా కలిగించును. (చూడుము - ‘సృష్టి’ ; ‘మాయ’, ‘అవ్యక్తము’).
అచ్చులు, హల్లులు,.స్వరములు, స్పర్శములు అంతస్థులు ఊష్మములు, అను లక్షణములుగల వర్ణములు -స్వరములు అనగా అచ్చులు - అకారాదులు. స్పర్శములు అనగా కకారము మొదలు మకారాంతమువరకు గల హల్లులు. అంతస్థములు అనగా యరలవలు. ఊష్మములు అనగా శషసహలు.
“ఆదియందు చతుర్ముఖుని హృదయంబున నొక నాదంబుద్భవించె, నది వృత్తినిరోధంబువలన మూర్తీభవించి వ్యక్తంబుగా గనుపట్టె, నట్టి నాదోపాసనవలన యోగిజనంబుల నిష్పాపులై ముక్తి నొందుదురందు నోంకారంబు జనియించెనదియె సర్వమంత్రోపనిషన్మూల భూతయగు వేదమాతయని చెప్పబడు నా యోణ్కారంబు త్రిగుణాత్మకంబై యకారోకార మకారంబులనెడు త్రివర్ణరూపంబై ప్రకాశించుచుండె నంత భగవంతుండగు నజుం డా ప్రణవంబువలన స్వరస్పర్శాంతస్థోష్మాది లక్షణ లక్షితంబగు నక్షర సమామ్నాయంబు కల్పించి తత్సహాయంబునం దన వదన చతుష్టయంబువలన వేద చతుష్టయంబు కలుగం జేసె”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 30 -)
(అకారము మొదలు క్షకారము వరకుగల వర్ణములు అవయవములుగా గలది).
(అకారము మొదలు క్షకారము వరకు ఉన్న వర్ణములను ఆశ్రయించి యుండువాడు).
(అకారము మొదలు క్షకారమువరకుగల వర్ణములు తానే అయినవాడు -).
varṇamulu; akāramu modalu kṣakāramu varakugala akṣaramulu.
akṣaraśbdō varṇēṣu rūḍhaḥ iti varṇa ēva akṣaraḥ.
(akāramu modalu kṣakāramu varakugala varṇamulanu akṣaramu(lu) ani ceppuṭa rūḍhigānunnadi. varṇamē akṣaramu).
(varṇamu akṣaramu - varṇa nirmāṇamu akṣaramu - akṣaramu kṣaramukādu - kṣīṇiṃcunadikādu - bhagavaṃtunivale ellakālamaṃdu uṃḍunadi. okkokka varṇamu akṣaramē).
“ōṃ ityēkākṣaraṃ brahma”. (ōṃ anu okē akṣaramu parabrahma ani upāsiṃcavalenu).
‘a’ iti brahma; ” ‘khaṃ’ brahma -” (‘a’ anagā brahma ani upāsiṃcavalenu).
akṣaramulanniyu, akāramu modalu kṣakāramuvarakugalavanniyu akāramuyokka vikāramulē - “akārō vai sarva vāk” ani śruti ceppucunnadi. akāramē samasta vākku -annimāṭalu - bhagavaṃtunilōnuṃḍi puṭṭina vastuvulanniyu bhagavaṃtuni rūpamulē ayinaṭlu akṣaramulanniyu akāramuyokka vikāramulē - ‘a’ iti brahma - (akāramu brahma ani upāsiṃcuṭaku ceppabaḍinadi kanuka akāramu yokka vikāramulaina migilina akṣaramulanniṃṭiyaṃdu bhagavadaṃśakaladu - bhagavaṃtuni śakti kaladu –
“akṣarāṇā makārōsmi” - (śrīmadbhagavadgīta - 10 - 33)
akāramu modalu kṣakāramu varakugala akṣaramulalō modaṭi akṣaramu ayina ‘a’ kāramu nēnē ani śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu - iṃtēkādu, akṣaramulannī akāramuyokka vikāramulēkanuka vāṭi anniṃṭilōnu akārāṃśa yunnadi - ā akārāṃśa nēnē ani arthamu. aṃducēta avi anniyu bhagavaṃtunivale akṣaramulē (nityamulē) - akṣararūpamaina bhagavaṃtuḍu akṣaruḍē).
(‘yadakṣaraṃ vēdavidō vadaṃti” (vēdamunu telisinavāḍu ’ōṃ’ anu akṣaramu parabrahma ani ceppuduru - ‘ōṃ’ anunadi parabrahmamē ani ‘ōṃ’ ani upāsiṃcedaru).
(akṣarajñānamu lēnivāḍainanu - nirakṣarakukṣi ayinanu - evanilō brahma prakāśiṃcunō vāḍu sākṣaruḍē, vidyāvaṃtuḍē. eṃta caduvukunnavāḍainanu, eṃta jñānamu kalavāḍainanu evani cittamulō parabrahma dhyānamulēdō vāḍu nirakṣaruḍē - caduvanivāḍē, ajñāniyē).
(akṣarasvarūpamu reṃḍuvidhamulu - sthūlamu,sūkṣmamu - sthūlarūpamēmanagā - itarula cevulaku vinabaḍunadi, vaikharīvāgrūpamainadi. akāramu modalu kṣakāramu aṃtamuvarakugala varṇamulu, vāṭitō vyavahariṃpabaḍu vākyamulu, padamulu, maṃtramulu modalagunavi. sūkṣmarūpamē managā - madhyamā vāgrūpamunu vadali vaikharāvāgrūpamunu poṃduṭaku nabhimukhamainadi. nādātmikamu, praṇavarūpamainadi. praṇavamu kaṃṭhamu daggara cērinappuḍu paiki śabdarūpamutō vaccunadi sthūlamu - nādātmikamanunadi samastamaina śabdamulaku upādāna kāraṇamainadi. (anni śabdamulu dīnilōnuṃḍi puṭṭinavē). idi śirassulō puṭṭinadai lōpalanē uṃḍunadi, sūkṣmamainadi. idi akṣararūpamunu poṃduṭaku abhimukhamai nādātmikamagucunnadi. idi śirassunaṃdu prāṇavāyuvutō kalisi anni varṇamulaku - akṣaramulaku - upādānakāraṇamai vāṭini kalugacēyunu - nābhinuṃḍi paiki vaccu prāṇavāyuvu hṛdayamaṃdu vistariṃci, kaṃṭhamunaku vacci śirassucēri, akkaḍanuṃḍi anēka vidhamulaina śabdamulanukaṃṭhamudvārā kaligiṃcunu. (cūḍumu - ‘sṛṣṭi’ ; ‘māya’, ‘avyaktamu’).
acculu, hallulu,.svaramulu, sparśamulu aṃtasthulu ūṣmamulu, anu lakṣaṇamulugala varṇamulu -svaramulu anagā acculu - akārādulu. sparśamulu anagā kakāramu modalu makārāṃtamuvaraku gala hallulu. aṃtasthamulu anagā yaralavalu. ūṣmamulu anagā śaṣasahalu.
“ādiyaṃdu caturmukhuni hṛdayaṃbuna noka nādaṃbudbhaviṃce, nadi vṛttinirōdhaṃbuvalana mūrtībhaviṃci vyaktaṃbugā ganupaṭṭe, naṭṭi nādōpāsanavalana yōgijanaṃbula niṣpāpulai mukti noṃduduraṃdu nōṃkāraṃbu janiyiṃcenadiye sarvamaṃtrōpaniṣanmūla bhūtayagu vēdamātayani ceppabaḍu nā yōṇkāraṃbu triguṇātmakaṃbai yakārōkāra makāraṃbulaneḍu trivarṇarūpaṃbai prakāśiṃcucuṃḍe naṃta bhagavaṃtuṃḍagu najuṃ ḍā praṇavaṃbuvalana svarasparśāṃtasthōṣmādi lakṣaṇa lakṣitaṃbagu nakṣara samāmnāyaṃbu kalpiṃci tatsahāyaṃbunaṃ dana vadana catuṣṭayaṃbuvalana vēda catuṣṭayaṃbu kalugaṃ jēse”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 30 -)
(akāramu modalu kṣakāramu varakugala varṇamulu avayavamulugā galadi).
(akāramu modalu kṣakāramu varaku unna varṇamulanu āśrayiṃci yuṃḍuvāḍu).
(akāramu modalu kṣakāramuvarakugala varṇamulu tānē ayinavāḍu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.