← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షరపురుషోపాసన akṣarapuruṣōpāsana

Original — తెలుగు

సూర్యుడు ప్రకాశస్వరూపుడు, స్వయంప్రకాశుడు కాకపోయినను, భగవంతుడు తనలోనుండుటవలన ప్రకాశించుచున్నాడు - (Atomic Bombardment) - “యదాదిత్యగతం తేజో జగద్భాసయతే (అ) ఖిలం| యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం ||.”.

(శ్రీమద్భగవద్గీత - 15 - 12)

(జగత్తు అంతటినీ ప్రకాశింపచేసే సూర్యునిలో ఉన్న తేజస్సు నాదే - భగవంతునిదే. సూర్యునిలోపల భగవంతుడుండుట బట్టియే సూర్యుడు ప్రకాశించుచున్నాడు). జ్యోతిస్వరూపుడైన భగవంతుని ప్రతీకము సూర్యుడు - ప్రత్యక్షదైవము - అందుచేత అతనిని భగవంతుడనే భావముతో ఉపాసించవలెను.

“తేజః తేజస్వినామహం” (శ్రీమద్భగవద్గీత - 10 - 36)

(తేజస్సుగలవారిలో - ప్రకాశించు స్వరూపముగలవారిలో ఉన్నతేజస్సు నేనే).

“ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 21)

సూర్యుడు భగవంతుడే యని తానే చెప్పియున్నాడు - ఇది పరబ్రహ్మ యొక్క సగుణరూపము - సాకార బ్రహ్మ.ఇది అధి దైవతమని చెప్పబడినది. మానవులలో ఉన్న కుడికన్నులోనున్న జ్యోతిస్వరూపము అధ్యాత్మమని చెప్పబడినది. ఈ అధ్యాత్మపురుషుడు సూర్యునిలోనున్న అధి దైవతపురుషుడూ ఒకటే - అదే పరబ్రహ్మ అక్షరపురుషుడు అని ఉపాసించవలెను. (చూడుము - అక్ష పురుషుడు).

Transliteration

sūryuḍu prakāśasvarūpuḍu, svayaṃprakāśuḍu kākapōyinanu, bhagavaṃtuḍu tanalōnuṃḍuṭavalana prakāśiṃcucunnāḍu - (Atomic Bombardment) - “yadādityagataṃ tējō jagadbhāsayatē (a) khilaṃ| yaccaṃdramasi yaccāgnau tattējō viddhi māmakaṃ ||.”.

(śrīmadbhagavadgīta - 15 - 12)

(jagattu aṃtaṭinī prakāśiṃpacēsē sūryunilō unna tējassu nādē - bhagavaṃtunidē. sūryunilōpala bhagavaṃtuḍuṃḍuṭa baṭṭiyē sūryuḍu prakāśiṃcucunnāḍu). jyōtisvarūpuḍaina bhagavaṃtuni pratīkamu sūryuḍu - pratyakṣadaivamu - aṃducēta atanini bhagavaṃtuḍanē bhāvamutō upāsiṃcavalenu.

“tējaḥ tējasvināmahaṃ” (śrīmadbhagavadgīta - 10 - 36)

(tējassugalavārilō - prakāśiṃcu svarūpamugalavārilō unnatējassu nēnē).

“ādityānāmahaṃ viṣṇurjyōtiṣāṃ raviraṃśumān ||” (śrīmadbhagavadgīta - 10 - 21)

sūryuḍu bhagavaṃtuḍē yani tānē ceppiyunnāḍu - idi parabrahma yokka saguṇarūpamu - sākāra brahma.idi adhi daivatamani ceppabaḍinadi. mānavulalō unna kuḍikannulōnunna jyōtisvarūpamu adhyātmamani ceppabaḍinadi. ī adhyātmapuruṣuḍu sūryunilōnunna adhi daivatapuruṣuḍū okaṭē - adē parabrahma akṣarapuruṣuḍu ani upāsiṃcavalenu. (cūḍumu - akṣa puruṣuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.