(అక్షరుడు - నాశరహితుడు, నిత్యుడు - అయిన సాక్షాత్పరమాత్మనుండి పురుషుని నిశ్వాసమువలె - (పైకివదలెడి ఊపిరివలె). - పట్టినటువంటిది, వేదము. పరబ్రహ్మలోనుండి పుట్టినదికనుక వేదముకూడ బ్రహ్మమనే వ్యవహరింపబడుచున్నది).
(నాశములేనటువంటిన్నీ, దోషములేనటువంటిన్నీ పరమాత్మనుండి పురుషుని నిశ్వాసమువలె బుద్ధిపూర్వకముగా కాక, అప్రయత్నముగా వేదము ఆవిర్భవించినది. అందుచేత వేదము అక్షర సముద్భవము - అక్షరుడైన బ్రహ్మనుండి పుట్టినది. ఈ రీతిగా ఒక సాధారణ పురుషునినుండి పుట్టినదికాదుకనుక - సాధారణమానవుని కృత్యము కాదుకనుక వేదము అపౌరుషేయము. అందుచేత వేదములో చెప్పబడిన వాక్యము - అంశము - ఏ విధమైన దోషము లేనిది యని, శంకలేక చెప్పతగును - ఇంద్రియముల శక్తికి మించిన విషయముల గుఱించి వేదమే ప్రమాణము; ప్రమాదము మొదలగు దోషములతో కూడినవికాదు).
(నీలకంఠవ్యాఖ్యా)
(వేదము సాక్షాత్పరమేశ్వరునుండియే పుట్టినది. అందుచేత భ్రమ, విప్రలంభము మొదలగు దోషములు పాషాండుల వాక్యములలో ఉండుటవల్ల, అప్రామాణ్యము అని వేదమును గణించుటకు అవకాశము లేదు - ఈ కారణమువల్ల అన్ని దేశములందు, అన్ని కాలములందును వేదము వర్తించును, అందుచేత వేదము నిత్యము.)
(akṣaruḍu - nāśarahituḍu, nityuḍu - ayina sākṣātparamātmanuṃḍi puruṣuni niśvāsamuvale - (paikivadaleḍi ūpirivale). - paṭṭinaṭuvaṃṭidi, vēdamu. parabrahmalōnuṃḍi puṭṭinadikanuka vēdamukūḍa brahmamanē vyavahariṃpabaḍucunnadi).
(nāśamulēnaṭuvaṃṭinnī, dōṣamulēnaṭuvaṃṭinnī paramātmanuṃḍi puruṣuni niśvāsamuvale buddhipūrvakamugā kāka, aprayatnamugā vēdamu āvirbhaviṃcinadi. aṃducēta vēdamu akṣara samudbhavamu - akṣaruḍaina brahmanuṃḍi puṭṭinadi. ī rītigā oka sādhāraṇa puruṣuninuṃḍi puṭṭinadikādukanuka - sādhāraṇamānavuni kṛtyamu kādukanuka vēdamu apauruṣēyamu. aṃducēta vēdamulō ceppabaḍina vākyamu - aṃśamu - ē vidhamaina dōṣamu lēnidi yani, śaṃkalēka ceppatagunu - iṃdriyamula śaktiki miṃcina viṣayamula guṟiṃci vēdamē pramāṇamu; pramādamu modalagu dōṣamulatō kūḍinavikādu).
(nīlakaṃṭhavyākhyā)
(vēdamu sākṣātparamēśvarunuṃḍiyē puṭṭinadi. aṃducēta bhrama, vipralaṃbhamu modalagu dōṣamulu pāṣāṃḍula vākyamulalō uṃḍuṭavalla, aprāmāṇyamu ani vēdamunu gaṇiṃcuṭaku avakāśamu lēdu - ī kāraṇamuvalla anni dēśamulaṃdu, anni kālamulaṃdunu vēdamu vartiṃcunu, aṃducēta vēdamu nityamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.