← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షిణిపురుషః akṣiṇipuruṣaḥ

Original — తెలుగు
  1. అక్షిస్థః పురుషః(కంటియందున్న పురుషుడు).

  2. “య ఏషో అక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవా చైతదమృతమేతద భయమేతద్భ్రహ్మేతి”. (చాందోగ్యోపనిషత్)

(కంటిలో ఏ పురుషుడు కనబడుచున్నాడో అతనే ఆత్మ, అదియే అమృతము, అదియే అభయము, అదియే బ్రహ్మ).

  1. “యఏషోంతరక్షిణి”, “య ఏ షో అంతరాదిత్యే” ఇతి చ శ్రూయమాణః పరమేశ్వర ఏవ, న సంసారీ కుతః ? తత్తద్థర్మోప దేశాత్, తస్య పరమేశ్యరస్య యే సర్వ పాప్మరాహిత్యాది ధర్మాః తేషామస్మిన్ వాక్యే ఉపదేశాత్ - తస్మాత్ అక్ష్యాది యో రంతః పరమేశ్వర ఏవ ఇత్యర్థః. (భాష్యార్థ రత్నమాల)

(“కంటిలోపలనున్నవాడు”, : సూర్యునిలోపలనున్నవాడు అని చెప్పబడినవాడు పరమేశ్వరుడే, సంసారి కాడు ఎందుచేత ? ఏ విధమైన పాపములు లేనివాడు అని పరమేశ్వరుని ధర్మములు - లక్షణములు. ఈ అక్షి పురుషుని గుఱించికూడ చెప్పుటచేత కంటిలోపల సూర్యునిలోపలనుండు పురుషుడు పరమేశ్వరుడే).

  1. “అంతరః అక్షిమధ్యగతః పరమాత్మైవో పదిశ్యతే కుతః ? ఉపపత్తేః. ఆత్మత్వామృతత్వా భయత్వా దీనా మిహోక్తానాం పరమాత్మన్యేవోప పత్తేః”.

(కంటి మధ్యమందుండున్నవాడు పరమాత్మయే - ఎందుచేతననగా ఇక్కద చెప్పిన ఆత్మత్వ, అమృతత్వ, అభయత్వములు మొదలగునవి పరమాత్మకు చెందినవే.అందుచేత కంటిలోనున్న పురుషుని గుఱించి కూడ ఈ లక్షణములనే చెప్పుతచేత కంటిలోని పురుషుడు పరమాత్మయే).

  1. “యశ్చక్షుషి తిష్టన్” ఇతి ఉపాసనార్థం.

(ఎవడు కంటియందున్నను కన్ను అతనిని తెలుసుకొనలేదో- - - అని చెప్పబడియున్నది).

  1. “నిర్గుణమపి సద్బ్రహ్మ నామరూప గణైర్గుణేఇ స్సగుణ ముపాసనార్థం తత్ర తత్రోపదిశ్యతే ఇత్యేదస్యుక్తమేవ సర్వగతస్యాపి బ్రహ్మణః ఉపలభ్యర్థం స్థాన విశేషో న విరుద్యతౌ, - సాలగ్రామ ఇవ విష్ణోరిత్యేద ప్యుక్తమేవ”. (శ్రీ శంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(పరబ్రహ్మ నిర్గుణుడైనను నామరూపగుణములు గలవాడుగా ఉపాసన కొఱకు ఉద్దేశించబడుచున్నాడు. ఇది యుక్తమే. అన్నింటిలోను ఉన్న బ్రహ్మ ఉపలబ్దికొఱకు ఒక్కొక్కస్థాన విశేషమందున్నాడు అనుటవలనవిరోధములేదు - విష్ణువు సాలగ్రామములో ఉన్నట్లే).

  1. “తద్యత్తత్సత్యమసౌ ఆదిత్యో యఏష ఏతస్మిన్మండలే. పురుషో యశ్చాయం దక్షిణే అక్షిన్ పురుషః”. (బృహదారణ్యకోపనిషత్)

(ఆ పరమాత్మయే సూర్యమండలమందుండి సూర్యునివలె ఆ మండలమును ప్రకాశింప చేయుచున్నాడు. ఆ పురుషుడే, ఆ పరమాత్మయే మానవుల కుడినేత్రమందున్నవాడు. ఇట్లు చెప్పుటచేతసృష్టిలోనున్న వస్తువులన్నియు పరమాత్మ స్థానములే, ఉపాధులే).

Transliteration
  1. akṣisthaḥ puruṣaḥ(kaṃṭiyaṃdunna puruṣuḍu).

  2. “ya ēṣō akṣiṇi puruṣō dṛśyatē ēṣa ātmēti hōvā caitadamṛtamētada bhayamētadbhrahmēti”. (cāṃdōgyōpaniṣat)

(kaṃṭilō ē puruṣuḍu kanabaḍucunnāḍō atanē ātma, adiyē amṛtamu, adiyē abhayamu, adiyē brahma).

  1. “yaēṣōṃtarakṣiṇi”, “ya ē ṣō aṃtarādityē” iti ca śrūyamāṇaḥ paramēśvara ēva, na saṃsārī kutaḥ ? tattadtharmōpa dēśāt, tasya paramēśyarasya yē sarva pāpmarāhityādi dharmāḥ tēṣāmasmin vākyē upadēśāt - tasmāt akṣyādi yō raṃtaḥ paramēśvara ēva ityarthaḥ. (bhāṣyārtha ratnamāla)

(“kaṃṭilōpalanunnavāḍu”, : sūryunilōpalanunnavāḍu ani ceppabaḍinavāḍu paramēśvaruḍē, saṃsāri kāḍu eṃducēta ? ē vidhamaina pāpamulu lēnivāḍu ani paramēśvaruni dharmamulu - lakṣaṇamulu. ī akṣi puruṣuni guṟiṃcikūḍa ceppuṭacēta kaṃṭilōpala sūryunilōpalanuṃḍu puruṣuḍu paramēśvaruḍē).

  1. “aṃtaraḥ akṣimadhyagataḥ paramātmaivō padiśyatē kutaḥ ? upapattēḥ. ātmatvāmṛtatvā bhayatvā dīnā mihōktānāṃ paramātmanyēvōpa pattēḥ”.

(kaṃṭi madhyamaṃduṃḍunnavāḍu paramātmayē - eṃducētananagā ikkada ceppina ātmatva, amṛtatva, abhayatvamulu modalagunavi paramātmaku ceṃdinavē.aṃducēta kaṃṭilōnunna puruṣuni guṟiṃci kūḍa ī lakṣaṇamulanē cepputacēta kaṃṭilōni puruṣuḍu paramātmayē).

  1. “yaścakṣuṣi tiṣṭan” iti upāsanārthaṃ.

(evaḍu kaṃṭiyaṃdunnanu kannu atanini telusukonalēdō- - - ani ceppabaḍiyunnadi).

  1. “nirguṇamapi sadbrahma nāmarūpa gaṇairguṇēi ssaguṇa mupāsanārthaṃ tatra tatrōpadiśyatē ityēdasyuktamēva sarvagatasyāpi brahmaṇaḥ upalabhyarthaṃ sthāna viśēṣō na virudyatau, - sālagrāma iva viṣṇōrityēda pyuktamēva”. (śrī śaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(parabrahma nirguṇuḍainanu nāmarūpaguṇamulu galavāḍugā upāsana koṟaku uddēśiṃcabaḍucunnāḍu. idi yuktamē. anniṃṭilōnu unna brahma upalabdikoṟaku okkokkasthāna viśēṣamaṃdunnāḍu anuṭavalanavirōdhamulēdu - viṣṇuvu sālagrāmamulō unnaṭlē).

  1. “tadyattatsatyamasau ādityō yaēṣa ētasminmaṃḍalē. puruṣō yaścāyaṃ dakṣiṇē akṣin puruṣaḥ”. (bṛhadāraṇyakōpaniṣat)

(ā paramātmayē sūryamaṃḍalamaṃduṃḍi sūryunivale ā maṃḍalamunu prakāśiṃpa cēyucunnāḍu. ā puruṣuḍē, ā paramātmayē mānavula kuḍinētramaṃdunnavāḍu. iṭlu ceppuṭacētasṛṣṭilōnunna vastuvulanniyu paramātma sthānamulē, upādhulē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.