లింగాత్ శరీరాత్ అన్యం భిన్నం అలింగం, ఆత్మా - (లింగమనగా శరీరము; శరీరముకంటె వేరైనది ఆత్మ.)
నలింగ్యతే ఇత్యలింగం, అదృష్టం. (దృష్టికి కానరానివాడు.)
కర్మ నిర్మిత శరీర రహితం. (కర్మవలన కలిగిన శరీరము లేనివాడు.)
లింగ్యతే, గమ్యతే యేన తల్లింగం, బుద్ధాది; తదవిద్యమానం అస్య ఇతి సో (అ) యమలింగ ఏవచ, - సర్వ సంసార వర్జితః.
(దేనివలన ప్రవర్తించునో అది లింగము - బుద్ధి మొదలగునవి. అవిలేనందున అలింగము - ఏ విధమైన సంసారధర్మములు (అనగా, పుట్టుట, పెరుగుట, చనిపోవుట, కర్మలను చేయుట, వాటి ఫలములను అనుభవించుట, సుఖదుఃఖములను అనుభవించుట మొదలగునవి లేనివాడు.)
అచిహ్నత్వాత్ అలింగం. (పురుషలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అను మూడు లింగ ముల చిహ్నములు లేనివాడు.)
“శివస్యలింగం కథయంతి కేచిత్ బహుప్రకారం వ్యవహార దృష్ట్యా |
సతత్వ దృష్ట్యా పరమేశ్వరస్యస్వయంప్రభస్యాస్య నచాస్తిలింగం |
వేదాంతవాక్యోత్థపరాత్మ విద్యా శివస్య లింగం కథయంతి కేచిత్ |
విచార జన్యా మసి సత్యవిద్యాం బ్రువంతి చాన్యే పరమస్య లింగం |
స్మతిజన్య మితిహా జమిమాం పరవిద్యామపిలింగమీశుతుః |
అతి శుద్ధామపితాం పురాణజాం ప్రవదంతి శ్రుతివిత్తమోత్తమాః |
శివస్య లింగం కథయంతి మాయాం శివస్య దృశ్యాం శివవస్తు నిష్ఠాం |
వదంతి కేచిజ్జన చిత్తమస్యే త్వహంకృతిం చాపి మనశ్చ బుద్ధిం |
ప్రాణంచ లింగం కథయంతి కేచిత్ శరీరమన్యే ప్రవదంతి లింగం |
యద స్తి యన్నాస్తి మహేశ్వరస్య సమస్తమేతత్ ప్రవదంతి లింగం |
విశుద్ధ విద్యాః పరయోగినో (అ) స్యస్వయం ప్రభస్యైవ నలింగ మూచుః ||“.
“తస్మాత్ పరమార్థ దృష్ట్యా స్వయం ప్రకాశస్య బ్రహ్మణో గమకాంతర నిరపేక్షత్వాత్, స్వయమేవ సర్వగమకత్వాత్ చ అలింగత్వముపపన్నం”
(వ్యవహార దృష్టిలో శివినికి లింగము - ఆకారము, శరీరము, తత్వము అనేక ప్రకారములుగా కొందఱు చెప్పుదురు - స్వయంప్రకాశుడైన పరమేశ్వరునకు తత్వదృష్టిలో లింగములేదు. వేదాంతవాక్యములవలన కలిగెడి పరతత్వ విద్యయే శివుని లింగమని కొందరు అనుచున్నారు - వేదాంతవాక్యములను విచారించి నిర్థారణచేయబడిన, విశేషజ్ఞానము - సత్యజ్ఞానము - త్రికాలములందు ఉండు తత్వము అని కొందఱు చెప్పుచున్నారు; స్మృతులవలనకలిగిన విద్య - జ్ఞానము అని కొందరు, శ్రుతులను, వాటిసారాంశమును, గూఢార్థములను బాగుగ తెలిసినవారు చెప్పుచున్నారు - మాయయేశివుని లింగమని కొందఱు అభిప్రాయపడుచున్నారు - కొందఱు శివునియందు నిష్ఠకలిగియుండుట అని మఱికొందరు చిత్తమని, అహంకారమని, మనస్సని, బుద్ధి అని, ప్రాణమని చెప్పుదురు - ఇంక కొందఱు శరీరము లింగమని చెప్పుచున్నారు - ఉన్నది, లేనిది అంతా పరమేశ్వరుని లింగమే - కాని విశుద్ధ విద్యావేత్తలు అయిన పరమయోగీంద్రులు స్వయముగా ప్రకాశించు పరమేశ్వరునకు లింగములేదనే చెప్పుదురు.)
(అందుచేత స్వయంప్రకాశుడైన పరమాత్మకు - పరబ్రహ్మకు - ఇతరులు తనలో ప్రవేశించియుండుటకవకాశము లేనివాడగుటచేతను, తానే అన్నింటిలోను ప్రవేశించియుండువాడగుటచేతను, - లింగములేదనుట ఉపపన్నమే, వాస్తవమే - అలింగము, లేక ఏవిధమైనలింగమునకు చెందనివాడనుట తగును.)
(వ్యవహారదృష్టిలో కొందరు శివునికి లింగభేదము చెప్పుచున్నారు - శరీరము కలవాడని చెప్పుచున్నారు. “ఎవనికి ప్రపంచము శరీరమో” అని శ్రుతి చెప్పుచున్నది. కాని తన ఆధేయము అయిన ప్రపంచమునకు తాను ఆధారమని చెప్పబడియుండుటచేత - ప్రపంచము తనశరీరము కాని తనకు ఏదియు శరీరముకాదు - అందుచేత అలింగము.)
(తన శరీరమువలె ప్రకాశించుచున్న, తనకంటె వేరైనప్రపంచములో దేనిలో ఆత్మలక్షణములైన సత్యత్వము, వ్యావహారికత్వము, ప్రాతిభాసికత్వము కలిగియున్నదో అది లింగము - అదికానిది అలింగము.)
అలింగశ్శివ ఇత్యుక్తో లింగం శైవమతఃపరం |
ప్రథానం ప్రకృతిశ్చేతి యథా హుర్లింగముత్తమం |
గంధవర్ణ రసైర్హీనం శబ్దస్పర్శాది వర్జితం |
అగుణంధ్రువమక్షయ్యమ లింగం శివలక్షణం |
గంధవర్ణ రసైర్యుక్తం శబ్ద స్పర్శాది లక్షణం |
జగద్యోనిమహాభూతంస్థూలసూక్ష్మం ద్విజోత్తమాః |
విగ్రహం జగతాం లింగం అలింగా ద భవత్ స్వయం||“. (లింగపురాణే)
(అవ్యక్తము - కనబడనిది - అగు ప్రకృతి లింగమనిన్నీ - ఈ లింగమునకు - ప్రకృతికి కారణమైనది అలింగమనిన్నీ చెప్పబడుచున్నది. ప్రధానము, ప్రకృతి అని ఏది చెప్పబడుచున్నదో అది, లింగము - అలింగమనునది శివుడు - గంధము, వర్ణము, రసము లేనిది, శబ్దము, స్పర్శము మొదలగునవిలేనిది,సత్వరజస్తమములను త్రిగుణములు లేనిది, స్థిరముగానుండునది, క్షీణించనిది, - ఇవి అలింగలక్షణములు. గంధ, వర్ణ, రసములతో కూడియున్నది, శబ్దము, స్పర్శము మొదలగునవి కలది, జగత్తునకు యోని - జన్మస్థానము - మహాభూతము, స్థూలము, సూక్ష్మము ఆకారముగలది జగత్తులింగము - అది అలింగమువలన పుట్టినది.)
liṃgāt śarīrāt anyaṃ bhinnaṃ aliṃgaṃ, ātmā - (liṃgamanagā śarīramu; śarīramukaṃṭe vērainadi ātma.)
naliṃgyatē ityaliṃgaṃ, adṛṣṭaṃ. (dṛṣṭiki kānarānivāḍu.)
karma nirmita śarīra rahitaṃ. (karmavalana kaligina śarīramu lēnivāḍu.)
liṃgyatē, gamyatē yēna talliṃgaṃ, buddhādi; tadavidyamānaṃ asya iti sō (a) yamaliṃga ēvaca, - sarva saṃsāra varjitaḥ.
(dēnivalana pravartiṃcunō adi liṃgamu - buddhi modalagunavi. avilēnaṃduna aliṃgamu - ē vidhamaina saṃsāradharmamulu (anagā, puṭṭuṭa, peruguṭa, canipōvuṭa, karmalanu cēyuṭa, vāṭi phalamulanu anubhaviṃcuṭa, sukhaduḥkhamulanu anubhaviṃcuṭa modalagunavi lēnivāḍu.)
acihnatvāt aliṃgaṃ. (puruṣaliṃgamu, strīliṃgamu, napuṃsakaliṃgamu anu mūḍu liṃga mula cihnamulu lēnivāḍu.)
“śivasyaliṃgaṃ kathayaṃti kēcit bahuprakāraṃ vyavahāra dṛṣṭyā |
satatva dṛṣṭyā paramēśvarasyasvayaṃprabhasyāsya nacāstiliṃgaṃ |
vēdāṃtavākyōtthaparātma vidyā śivasya liṃgaṃ kathayaṃti kēcit |
vicāra janyā masi satyavidyāṃ bruvaṃti cānyē paramasya liṃgaṃ |
smatijanya mitihā jamimāṃ paravidyāmapiliṃgamīśutuḥ |
ati śuddhāmapitāṃ purāṇajāṃ pravadaṃti śrutivittamōttamāḥ |
śivasya liṃgaṃ kathayaṃti māyāṃ śivasya dṛśyāṃ śivavastu niṣṭhāṃ |
vadaṃti kēcijjana cittamasyē tvahaṃkṛtiṃ cāpi manaśca buddhiṃ |
prāṇaṃca liṃgaṃ kathayaṃti kēcit śarīramanyē pravadaṃti liṃgaṃ |
yada sti yannāsti mahēśvarasya samastamētat pravadaṃti liṃgaṃ |
viśuddha vidyāḥ parayōginō (a) syasvayaṃ prabhasyaiva naliṃga mūcuḥ ||“.
“tasmāt paramārtha dṛṣṭyā svayaṃ prakāśasya brahmaṇō gamakāṃtara nirapēkṣatvāt, svayamēva sarvagamakatvāt ca aliṃgatvamupapannaṃ”
(vyavahāra dṛṣṭilō śiviniki liṃgamu - ākāramu, śarīramu, tatvamu anēka prakāramulugā koṃdaṟu ceppuduru - svayaṃprakāśuḍaina paramēśvarunaku tatvadṛṣṭilō liṃgamulēdu. vēdāṃtavākyamulavalana kaligeḍi paratatva vidyayē śivuni liṃgamani koṃdaru anucunnāru - vēdāṃtavākyamulanu vicāriṃci nirthāraṇacēyabaḍina, viśēṣajñānamu - satyajñānamu - trikālamulaṃdu uṃḍu tatvamu ani koṃdaṟu ceppucunnāru; smṛtulavalanakaligina vidya - jñānamu ani koṃdaru, śrutulanu, vāṭisārāṃśamunu, gūḍhārthamulanu bāguga telisinavāru ceppucunnāru - māyayēśivuni liṃgamani koṃdaṟu abhiprāyapaḍucunnāru - koṃdaṟu śivuniyaṃdu niṣṭhakaligiyuṃḍuṭa ani maṟikoṃdaru cittamani, ahaṃkāramani, manassani, buddhi ani, prāṇamani ceppuduru - iṃka koṃdaṟu śarīramu liṃgamani ceppucunnāru - unnadi, lēnidi aṃtā paramēśvaruni liṃgamē - kāni viśuddha vidyāvēttalu ayina paramayōgīṃdrulu svayamugā prakāśiṃcu paramēśvarunaku liṃgamulēdanē ceppuduru.)
(aṃducēta svayaṃprakāśuḍaina paramātmaku - parabrahmaku - itarulu tanalō pravēśiṃciyuṃḍuṭakavakāśamu lēnivāḍaguṭacētanu, tānē anniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍaguṭacētanu, - liṃgamulēdanuṭa upapannamē, vāstavamē - aliṃgamu, lēka ēvidhamainaliṃgamunaku ceṃdanivāḍanuṭa tagunu.)
(vyavahāradṛṣṭilō koṃdaru śivuniki liṃgabhēdamu ceppucunnāru - śarīramu kalavāḍani ceppucunnāru. “evaniki prapaṃcamu śarīramō” ani śruti ceppucunnadi. kāni tana ādhēyamu ayina prapaṃcamunaku tānu ādhāramani ceppabaḍiyuṃḍuṭacēta - prapaṃcamu tanaśarīramu kāni tanaku ēdiyu śarīramukādu - aṃducēta aliṃgamu.)
(tana śarīramuvale prakāśiṃcucunna, tanakaṃṭe vērainaprapaṃcamulō dēnilō ātmalakṣaṇamulaina satyatvamu, vyāvahārikatvamu, prātibhāsikatvamu kaligiyunnadō adi liṃgamu - adikānidi aliṃgamu.)
aliṃgaśśiva ityuktō liṃgaṃ śaivamataḥparaṃ |
prathānaṃ prakṛtiścēti yathā hurliṃgamuttamaṃ |
gaṃdhavarṇa rasairhīnaṃ śabdasparśādi varjitaṃ |
aguṇaṃdhruvamakṣayyama liṃgaṃ śivalakṣaṇaṃ |
gaṃdhavarṇa rasairyuktaṃ śabda sparśādi lakṣaṇaṃ |
jagadyōnimahābhūtaṃsthūlasūkṣmaṃ dvijōttamāḥ |
vigrahaṃ jagatāṃ liṃgaṃ aliṃgā da bhavat svayaṃ||“. (liṃgapurāṇē)
(avyaktamu - kanabaḍanidi - agu prakṛti liṃgamaninnī - ī liṃgamunaku - prakṛtiki kāraṇamainadi aliṃgamaninnī ceppabaḍucunnadi. pradhānamu, prakṛti ani ēdi ceppabaḍucunnadō adi, liṃgamu - aliṃgamanunadi śivuḍu - gaṃdhamu, varṇamu, rasamu lēnidi, śabdamu, sparśamu modalagunavilēnidi,satvarajastamamulanu triguṇamulu lēnidi, sthiramugānuṃḍunadi, kṣīṇiṃcanidi, - ivi aliṃgalakṣaṇamulu. gaṃdha, varṇa, rasamulatō kūḍiyunnadi, śabdamu, sparśamu modalagunavi kaladi, jagattunaku yōni - janmasthānamu - mahābhūtamu, sthūlamu, sūkṣmamu ākāramugaladi jagattuliṃgamu - adi aliṃgamuvalana puṭṭinadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.