← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమానిత్వము amānitvamu

Original — తెలుగు

మానినః భావం మానిత్వం, ఆత్మనః శ్లాఘనం, తదభావః అమానిత్వం. (శ్రీశంకరః)

(మాని అనగా అభిమానము కలవాడు, మానియొక్క భావము మానిత్వము - అనగా, తన్ను తాను పొగడుకొనుట, అది లేకపోవుట అమానిత్వము.)

“అన్నాంగనాది భోగేషు భావోమాన ఇతి స్మృతః”.

(అన్నము - తిను పదార్థము - స్త్రీ సంభోగము మొదలగువాటివలన కలుగు భోగమందు తలపు కలిగియుండుట మానము; అట్టి తలంపులు లేకయుండుట.)

“ఉత్కృష్ట జనేషు అవదీరణా రహితత్వం” (శ్రీరామానుజః)

(ఉత్కృష్ట జనులయడల అనగా పండితులు, సాధువులు మొదలగువారియడల తిరస్కారబుద్ధి కలిగియుండుట, అటువంటివారిని నిందించుట మొదలగునవి లేకుండుట.)

“విద్యాభి జన ధనాది సంపత్తి మూల ఉత్కృష్ట జనావమాన హేతుః గర్వో మానః, తద్వాన్ మానీ, తదన్యో అమానీ, తస్య భావః తత్వం అమానిత్వం; మానిత్వస్యా భావో వా అమానిత్వం”. (శ్రీవేంకటాచార్యః)

(విద్యకలిగియుండుటవలన, గొప్ప కుటుంబములో పుట్టుటవలన, ధనవంతులయి ఉండుటవలన, ఉత్కృష్టమైనవారి నవమానించుటకు కారణమైన గర్వము మానముఅనబడును - అట్టి మానముగల వాడు మానీ, అదిలేనివాడు అమాని, అమానియొక్క భావము, లేక, తత్వము అమానిత్వము.)

“అనాత్మవస్తుషు ఆత్మాభిమానో నాస్త్యస్య స్వచ్ఛ సంవేదనాకృతరితి అమానీ”. (శ్రీ శంకరః)

(సమ్యక్ జ్ఞానము కలిగియుండుటవలన ఆత్మగానివస్తువులందు ఆత్మయని అభిమానము లేనివాడు అమాని. అతనియొక్క భావము అమానిత్వము -.)

ఆత్మస్తుతి, పరనిందలేకుండుట; గౌరవమును కోరకయుండుట.

Transliteration

māninaḥ bhāvaṃ mānitvaṃ, ātmanaḥ ślāghanaṃ, tadabhāvaḥ amānitvaṃ. (śrīśaṃkaraḥ)

(māni anagā abhimānamu kalavāḍu, māniyokka bhāvamu mānitvamu - anagā, tannu tānu pogaḍukonuṭa, adi lēkapōvuṭa amānitvamu.)

“annāṃganādi bhōgēṣu bhāvōmāna iti smṛtaḥ”.

(annamu - tinu padārthamu - strī saṃbhōgamu modalaguvāṭivalana kalugu bhōgamaṃdu talapu kaligiyuṃḍuṭa mānamu; aṭṭi talaṃpulu lēkayuṃḍuṭa.)

“utkṛṣṭa janēṣu avadīraṇā rahitatvaṃ” (śrīrāmānujaḥ)

(utkṛṣṭa janulayaḍala anagā paṃḍitulu, sādhuvulu modalaguvāriyaḍala tiraskārabuddhi kaligiyuṃḍuṭa, aṭuvaṃṭivārini niṃdiṃcuṭa modalagunavi lēkuṃḍuṭa.)

“vidyābhi jana dhanādi saṃpatti mūla utkṛṣṭa janāvamāna hētuḥ garvō mānaḥ, tadvān mānī, tadanyō amānī, tasya bhāvaḥ tatvaṃ amānitvaṃ; mānitvasyā bhāvō vā amānitvaṃ”. (śrīvēṃkaṭācāryaḥ)

(vidyakaligiyuṃḍuṭavalana, goppa kuṭuṃbamulō puṭṭuṭavalana, dhanavaṃtulayi uṃḍuṭavalana, utkṛṣṭamainavāri navamāniṃcuṭaku kāraṇamaina garvamu mānamuanabaḍunu - aṭṭi mānamugala vāḍu mānī, adilēnivāḍu amāni, amāniyokka bhāvamu, lēka, tatvamu amānitvamu.)

“anātmavastuṣu ātmābhimānō nāstyasya svaccha saṃvēdanākṛtariti amānī”. (śrī śaṃkaraḥ)

(samyak jñānamu kaligiyuṃḍuṭavalana ātmagānivastuvulaṃdu ātmayani abhimānamu lēnivāḍu amāni. ataniyokka bhāvamu amānitvamu -.)

ātmastuti, paraniṃdalēkuṃḍuṭa; gauravamunu kōrakayuṃḍuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.