← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమరః amaraḥ

Original — తెలుగు

మి యతే ఇతి మరః నమ్రి యతే ఇత్యమరః. (మరణము లేనివారు - దేవతులు.)

ఉత్పత్యాది వికార రహితాః.

(జననము మొదలగు వికారములు లేనివాడు - జననము ఉండిననే మరణము కలుగును - భగవంతుడు జననము లేనివాడు కనుక మరణము కూడా లేనివాడు-జననమరణములు షడ్భావవికారములు లోనివి - జననము ఉండిననే మిగిలిన వికారములు కలుగును -.)

మరణ రహితః (మరణములేనివాడు.)

పారమార్థిక నిత్యః - (పరమార్థదృష్టిలో శాశ్వతముగానుండువాడు - భగవంతుడు.)

వ. “సత్వాది గుణ పరిణామంబుల నమరు లైరి. ఊర్జిత సత్వగుణంబున న ద్దేవతులు ద్రిదివంబునుం బొందిరి”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 6 - 215)

మృత్యుని లేనివారు అమరులు - అనగా ఎన్నటికీ భగవంతునివలె మృత్యువు లేని వారని దీని అర్థము కాదు.మనుష్యులు మొదలగువారికంటె విశేషకాలముండువారు - కల్పాంతమున ఇంద్రాదులకు కూడా లయము చెప్పబడినది. -

“ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినో (అ)ర్జున”.

(బ్రహ్మలోకము మొదలు అన్నిలోకములు తిరిగీ తిరిగీ పుట్టవలసినవే, పుట్టి, అంతమొంది, మరల పుట్టి, మరల అంతమొందవలసినవే.) (శ్రీమద్భగవద్గీత- 8 - 16)

“అజరో (అ)మరో (అ)మృతః” ఇతి శ్రుతిః -.

(భగవంతుడు జరామరణములు లేనివాడు - అమృతుడు - అని శ్రుతి చెప్పుచున్నది.)

Transliteration

mi yatē iti maraḥ namri yatē ityamaraḥ. (maraṇamu lēnivāru - dēvatulu.)

utpatyādi vikāra rahitāḥ.

(jananamu modalagu vikāramulu lēnivāḍu - jananamu uṃḍinanē maraṇamu kalugunu - bhagavaṃtuḍu jananamu lēnivāḍu kanuka maraṇamu kūḍā lēnivāḍu-jananamaraṇamulu ṣaḍbhāvavikāramulu lōnivi - jananamu uṃḍinanē migilina vikāramulu kalugunu -.)

maraṇa rahitaḥ (maraṇamulēnivāḍu.)

pāramārthika nityaḥ - (paramārthadṛṣṭilō śāśvatamugānuṃḍuvāḍu - bhagavaṃtuḍu.)

va. “satvādi guṇa pariṇāmaṃbula namaru lairi. ūrjita satvaguṇaṃbuna na ddēvatulu dridivaṃbunuṃ boṃdiri”

(śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 6 - 215)

mṛtyuni lēnivāru amarulu - anagā ennaṭikī bhagavaṃtunivale mṛtyuvu lēni vārani dīni arthamu kādu.manuṣyulu modalaguvārikaṃṭe viśēṣakālamuṃḍuvāru - kalpāṃtamuna iṃdrādulaku kūḍā layamu ceppabaḍinadi. -

“ā brahma bhuvanāllōkāḥ punarāvartinō (a)rjuna”.

(brahmalōkamu modalu annilōkamulu tirigī tirigī puṭṭavalasinavē, puṭṭi, aṃtamoṃdi, marala puṭṭi, marala aṃtamoṃdavalasinavē.) (śrīmadbhagavadgīta- 8 - 16)

“ajarō (a)marō (a)mṛtaḥ” iti śrutiḥ -.

(bhagavaṃtuḍu jarāmaraṇamulu lēnivāḍu - amṛtuḍu - ani śruti ceppucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.