← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంభశ్శయనుడు aṃbhaśśayanuḍu

Original — తెలుగు
  1. విష్ణువు; నీటిలో శయనించువాడు. విష్ణువు పాలసముద్రమున శేష శయ్యపై శయనించువాడు అని పురాణ ప్రసిద్ది. “ఈ మఱ్ఱియాకొకో యేకార్ణవమునాడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె” – (శ్రీనాధుడు) (చూడుము : - నారాయణుడు)

  2. వ. ” --- అమ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపేక్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె. స్వతః పరిశుద్ధుండు గావున స్వ సృష్టం బగు నేకార్ణ వాకారం బైన జలరాశి యందు శయనంబు సేయుటం జేసి.

“శ్లో|| ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః |

రా య ద స్యాయనం పూర్వం తేన నారాయణః స్మృతః ||”

అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 -10 - 268)

Transliteration
  1. viṣṇuvu; nīṭilō śayaniṃcuvāḍu. viṣṇuvu pālasamudramuna śēṣa śayyapai śayaniṃcuvāḍu ani purāṇa prasiddi. “ī maṟṟiyākokō yēkārṇavamunāḍu śēṣāhiśāyiki sejja yayye” – (śrīnādhuḍu) (cūḍumu : - nārāyaṇuḍu)

  2. va. ” --- ammahātmuṃḍu līlārthaṃbai jagatsarjanaṃbu sēyu talaṃpuna brahmāṃḍaṃbu nirbhēdiṃci tanaku sukhasthānaṃbu napēkṣiṃci modala śuddhaṃbulagu jalaṃbula sṛjiyiṃce. svataḥ pariśuddhuṃḍu gāvuna sva sṛṣṭaṃ bagu nēkārṇa vākāraṃ baina jalarāśi yaṃdu śayanaṃbu sēyuṭaṃ jēsi.

“ślō|| āpō nārā iti prōktā āpō vai narasūnavaḥ |

rā ya da syāyanaṃ pūrvaṃ tēna nārāyaṇaḥ smṛtaḥ ||”

anu pramāṇamu coppuna nārāyaṇa śabdavācyuṃḍu” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 -10 - 268)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.