← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంబుజ గర్భుడు aṃbuja garbhuḍu

Original — తెలుగు
  1. చతుర్ముఖ బ్రహ్మ.

  2. తాను పుట్టుకు పద్మము – పద్మాకారముగా నున్నశ్రీ మహావిష్ణుని నాభి - గర్భ స్థానముగా గలవాడు.

  3. విష్ణువు కడుపులోనున్న లోకములు పుట్టుటకు పద్మరూపముగానుండు బొడ్డులోనుండి పుట్టినవాడు.

  4. “క. తన జఠరములోపల దా

చిన లోకనికాయముల సృజించుటకును సా

ధనమగు సూక్ష్మార్ధము మన

సునగని కాలానుగత రజోగుణమంతన్”

“సీ. పుట్టించె; దద్గుణంబున బరమేశ్వరు నాభిదేశము నందు నళిన నాళ

ముదయించె, మఱియు నప్ప యోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందు

దన తేజమున బ్రవృధ్ధంబైన జలముచే జలజాస్తుగతి బ్రకాశంబు నొంద

జేసి, లోకాశ్రయస్థితి సర్వ గుణ విభాసితగతి నొప్పు రాజీవమందు

తే. నిజకళా కలితాం శంబు నిలిపి దాని

వలన నామ్నాయమయుడును వరగుణుండు

నాత్మయోనియునైన తోయజ భవుండు

సరివి జతురా ననుండు నా జననమయ్యె” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము- 3 - 8 - 274, 275)

5. “యన్నాభిపంకజ భవః కమలాసనస్యాత్” - (శ్రీ రామకర్ణామృతం- 3 - 112)

Transliteration
  1. caturmukha brahma.

  2. tānu puṭṭuku padmamu – padmākāramugā nunnaśrī mahāviṣṇuni nābhi - garbha sthānamugā galavāḍu.

  3. viṣṇuvu kaḍupulōnunna lōkamulu puṭṭuṭaku padmarūpamugānuṃḍu boḍḍulōnuṃḍi puṭṭinavāḍu.

  4. “ka. tana jaṭharamulōpala dā

cina lōkanikāyamula sṛjiṃcuṭakunu sā

dhanamagu sūkṣmārdhamu mana

sunagani kālānugata rajōguṇamaṃtan”

“sī. puṭṭiṃce; dadguṇaṃbuna baramēśvaru nābhidēśamu naṃdu naḷina nāḷa

mudayiṃce, maṟiyu nappa yōruha mukuḷaṃbu garmabōdhitamaina kālamaṃdu

dana tējamuna bravṛdhdhaṃbaina jalamucē jalajāstugati brakāśaṃbu noṃda

jēsi, lōkāśrayasthiti sarva guṇa vibhāsitagati noppu rājīvamaṃdu

tē. nijakaḷā kalitāṃ śaṃbu nilipi dāni

valana nāmnāyamayuḍunu varaguṇuṃḍu

nātmayōniyunaina tōyaja bhavuṃḍu

sarivi jaturā nanuṃḍu nā jananamayye” (śrī madāṃdhra mahābhāgavatamu- 3 - 8 - 274, 275)

5. “yannābhipaṃkaja bhavaḥ kamalāsanasyāt” - (śrī rāmakarṇāmṛtaṃ- 3 - 112)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.