(గుడ్డు నుండి పుట్టినవి పక్షులు, పాములు మొ. వి.)
(ఉదా:- మన సూర్యునికి ఇంకో పేరు మార్తాండుడు - అనగా “మృతే అండే జాతః” - అండము - బ్రహ్మాండము - పేలిపోగా పుట్టినది.) అనగా గుడ్డు (బ్రహ్మాండము - cosmic egg) ప్రేలి తుత్తునియలు అయినందువలన పుట్టినది (big bang). ఈ ప్రకారముగా పుట్టినవే ప్రకాశమానములయి ఆకాశములో మనకి అగుపడు తేజోరూపములైన నక్షత్రములు. మన సూర్యుడు కూడా ఇటువంటి ఒక నక్షత్రమే. అందుచేత ఇవి అన్నియు అండజములె. (చూ:- ‘బ్రహ్మాండము’)
ఈ విషయమై శ్రీ శంకరాచార్యులు వారి అభిప్రాయము ఈ క్రింది విధముగా ఉన్నది. “అండశ్య అంతస్త్వినే లోకాః సప్తద్వీపాశ్చమేదినే”
(శ్రీ శంకరః)
అండము లోపల ఈ లోకములు, సప్తద్వీపములు, భూమి ఉన్నవి. బ్రహ్మాండములో అన్ని లోకములు మొ.వి. బ్రహ్మాండ భేదనముచే పైకి వేరు వేరు లోకములుగా వెలువడినవి.
(పంచీకృతము కానటువంటి పంచమహా భూతాత్మకమైన హిరణ్యగర్భ తత్వము అండము, బ్రహ్మాండము (cosmic egg) ఇవి అవ్యక్తము నుండి పుట్టినవి - హిరణ్యగర్భుడను పేరు గల అవ్యక్తము నుండి ఈ అండములో నిరాడాత్మకమైన (అనగా వివిధములుగా కనబడుచూ ప్రకాశించుచున్న) ఈ భూమి మొ ||ఈ లోకములు ఉండును. ఆ అండము పగిలి, లోనున్నవి పైకెగసి, చెల్లాచెదురై లోకములలోని సమస్త వస్తువులుగా అయినవి.) (చూ || ‘బ్రహ్మాండము’; ‘హిరణ్యగర్భుడు’, ‘లోకములు’)
(guḍḍu nuṃḍi puṭṭinavi pakṣulu, pāmulu mo. vi.)
(udā:- mana sūryuniki iṃkō pēru mārtāṃḍuḍu - anagā “mṛtē aṃḍē jātaḥ” - aṃḍamu - brahmāṃḍamu - pēlipōgā puṭṭinadi.) anagā guḍḍu (brahmāṃḍamu - cosmic egg) prēli tuttuniyalu ayinaṃduvalana puṭṭinadi (big bang). ī prakāramugā puṭṭinavē prakāśamānamulayi ākāśamulō manaki agupaḍu tējōrūpamulaina nakṣatramulu. mana sūryuḍu kūḍā iṭuvaṃṭi oka nakṣatramē. aṃducēta ivi anniyu aṃḍajamule. (cū:- ‘brahmāṃḍamu’)
ī viṣayamai śrī śaṃkarācāryulu vāri abhiprāyamu ī kriṃdi vidhamugā unnadi. “aṃḍaśya aṃtastvinē lōkāḥ saptadvīpāścamēdinē”
(śrī śaṃkaraḥ)
aṃḍamu lōpala ī lōkamulu, saptadvīpamulu, bhūmi unnavi. brahmāṃḍamulō anni lōkamulu mo.vi. brahmāṃḍa bhēdanamucē paiki vēru vēru lōkamulugā veluvaḍinavi.
(paṃcīkṛtamu kānaṭuvaṃṭi paṃcamahā bhūtātmakamaina hiraṇyagarbha tatvamu aṃḍamu, brahmāṃḍamu (cosmic egg) ivi avyaktamu nuṃḍi puṭṭinavi - hiraṇyagarbhuḍanu pēru gala avyaktamu nuṃḍi ī aṃḍamulō nirāḍātmakamaina (anagā vividhamulugā kanabaḍucū prakāśiṃcucunna) ī bhūmi mo ||ī lōkamulu uṃḍunu. ā aṃḍamu pagili, lōnunnavi paikegasi, cellācedurai lōkamulalōni samasta vastuvulugā ayinavi.) (cū || ‘brahmāṃḍamu’; ‘hiraṇyagarbhuḍu’, ‘lōkamulu’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.