అదర్శనాత్మకం తమః (మిక్కిలి దట్టమైన చీకటి, కనబడకుండ చేయునట్టి చీకటి.)
అంధం అతిగాఢం తమః ; అజ్ఞానమిత్యర్ధః, సంసారాఖ్యం
(గాడాంధకారము, అజ్ఞానమని అర్థము, సంసారమను పేరు గలది.)
అజ్ఞానరూపం అంధకారం (అజ్ఞానమను చీకటి).
అంధయతీత్యంధం తమః, గాఢం తమః. (గాఢాంధకారము, చిమ్మ చీకటి.)
వ. “పరమేష్ఠి యీ సృష్ట్యాది నహ మ్మను దేహాభిమానబుద్ధి గల మోహంబును, అంగనా సంగమ స్రక్చందనాది గ్రామ్య భోగేచ్ఛలు గల మహామోహంబును, దత్ప్రతిఘాత జాతంబైన క్రోధంబు నందు గలుగు తామిస్రంబును, దన్నాశంబునందు అహ మేవ మృతోస్మి యను నంధ తామిస్రంబును చిత్త విభ్రమంబు నను నవిద్యా పంచక మిశ్రంబుగా సర్వ భూతావళిం బుట్టించి ---”
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 -12 - 367) (చూడుము - ‘అంధతామిశ్రము’)
adarśanātmakaṃ tamaḥ (mikkili daṭṭamaina cīkaṭi, kanabaḍakuṃḍa cēyunaṭṭi cīkaṭi.)
aṃdhaṃ atigāḍhaṃ tamaḥ ; ajñānamityardhaḥ, saṃsārākhyaṃ
(gāḍāṃdhakāramu, ajñānamani arthamu, saṃsāramanu pēru galadi.)
ajñānarūpaṃ aṃdhakāraṃ (ajñānamanu cīkaṭi).
aṃdhayatītyaṃdhaṃ tamaḥ, gāḍhaṃ tamaḥ. (gāḍhāṃdhakāramu, cimma cīkaṭi.)
va. “paramēṣṭhi yī sṛṣṭyādi naha mmanu dēhābhimānabuddhi gala mōhaṃbunu, aṃganā saṃgama srakcaṃdanādi grāmya bhōgēcchalu gala mahāmōhaṃbunu, datpratighāta jātaṃbaina krōdhaṃbu naṃdu galugu tāmisraṃbunu, dannāśaṃbunaṃdu aha mēva mṛtōsmi yanu naṃdha tāmisraṃbunu citta vibhramaṃbu nanu navidyā paṃcaka miśraṃbugā sarva bhūtāvaḷiṃ buṭṭiṃci ---”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 3 -12 - 367) (cūḍumu - ‘aṃdhatāmiśramu’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.