అంధ పరంపర అనగా ఒక గుడ్డి వాని వెనుక ఇంకొక గుడ్డివాడు, వాడి వెనుక మఱియొక గుడ్డివాడు - ఈ ప్రకారము ఒక గుడ్డివాని వెనుక ఇంకొక గుడ్డివాడు వెళ్ళుట.
ఒక గుడ్డివానిని పట్టుకొని మఱియొక గుడ్డివాడు మొదటి వాడు వెళ్ళిన మార్గముననే వెళ్ళిన యెడల మొదటివానికి కనబడక వాడు ఏ నూతిలోనో ఏ గోతిలోనో పడినయెడల, వాడిని పట్టుకొని వాడి వెనుకవెళ్ళు గుడ్డివారు కూడ వాడితో పాటు ఆ నూతిలోనో గోతులోనో పడుదురు. ఆ ప్రకారముగానే బ్రహ్మజ్ఞానములేని అజ్ఞాని చెప్పినదే ప్రమాణము కలది అని నమ్మి వాడు చెప్పిన మార్గములోనే వెళ్ళినవారికి వాడి అజ్ఞానమే అలవడును. మొదటివాడు గుడ్డివాడు కానిచో వాడు సరియైన మార్గములో పోయి తన వెనకాతల వచ్చు వారినందఱిని, గుడ్డి వారైనను, అజ్ఞానులైనను తాను పోయిన సరియైన మార్గముననే తీసుకొని వెళ్ళి తాను చేరిన గమ్యస్థానమును - బ్రహ్మపదమును - తన అడుగు జాడలలో వచ్చినవారిని పొందింపచేయును. అందుచేత బ్రహ్మజ్ఞాని అయిన ఆచార్యుని వద్ద ఉపనిషద్వాక్యముల అర్ధము వినిన యెడల మోక్షము సిద్ధించును. బ్రహ్మజ్ఞానము లేనివాడు చెప్పిన బోధవినిన వారు అంధపరంపరన్యాయమున తప్పు దారి అయిన సంసారములోనే పడుచూ ఎప్పటికినీ గమ్యస్తానమైన పరమపదమును పొందలేరు.
ఈ విషయము శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింది విధముగా చెప్పబడినది : -
“ఉ. కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్
గాననిభంగి గర్మములు గైకొని కొందఱు కర్మబధ్ధు లై
కానరు విష్ణు గొంద ఱట గందు రకించిన వైష్ణవాఘ్రి సం
స్థాన రజోభిషిక్తు లగు సంహృతకర్మలు దానవేశ్వరా !” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 7 - 5 - 182)
(బ్రహ్మజ్ఞానము లేక కేవలము కర్మలు చేయుట యందే ఆసక్తి కలిగి వాటి వలన కలిగే ఫలముచే బధ్ధులయినవారు గుడ్డి వారివలే గమ్యస్తానమైన పరమ పదమును పొందలేరు. భగవద్భక్తి కలిగి కర్మ నిర్మూలనము చేసు కొనినవారు సరి యైన మార్గమునపోయి బ్రహ్మసాక్షాత్కారము పొందెదరు.)
aṃdha paraṃpara anagā oka guḍḍi vāni venuka iṃkoka guḍḍivāḍu, vāḍi venuka maṟiyoka guḍḍivāḍu - ī prakāramu oka guḍḍivāni venuka iṃkoka guḍḍivāḍu veḷḷuṭa.
oka guḍḍivānini paṭṭukoni maṟiyoka guḍḍivāḍu modaṭi vāḍu veḷḷina mārgamunanē veḷḷina yeḍala modaṭivāniki kanabaḍaka vāḍu ē nūtilōnō ē gōtilōnō paḍinayeḍala, vāḍini paṭṭukoni vāḍi venukaveḷḷu guḍḍivāru kūḍa vāḍitō pāṭu ā nūtilōnō gōtulōnō paḍuduru. ā prakāramugānē brahmajñānamulēni ajñāni ceppinadē pramāṇamu kaladi ani nammi vāḍu ceppina mārgamulōnē veḷḷinavāriki vāḍi ajñānamē alavaḍunu. modaṭivāḍu guḍḍivāḍu kānicō vāḍu sariyaina mārgamulō pōyi tana venakātala vaccu vārinaṃdaṟini, guḍḍi vārainanu, ajñānulainanu tānu pōyina sariyaina mārgamunanē tīsukoni veḷḷi tānu cērina gamyasthānamunu - brahmapadamunu - tana aḍugu jāḍalalō vaccinavārini poṃdiṃpacēyunu. aṃducēta brahmajñāni ayina ācāryuni vadda upaniṣadvākyamula ardhamu vinina yeḍala mōkṣamu siddhiṃcunu. brahmajñānamu lēnivāḍu ceppina bōdhavinina vāru aṃdhaparaṃparanyāyamuna tappu dāri ayina saṃsāramulōnē paḍucū eppaṭikinī gamyastānamaina paramapadamunu poṃdalēru.
ī viṣayamu śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃdi vidhamugā ceppabaḍinadi : -
“u. kānanivāni nūtagoni kānanivāḍu viśiṣṭa vastuvul
gānanibhaṃgi garmamulu gaikoni koṃdaṟu karmabadhdhu lai
kānaru viṣṇu goṃda ṟaṭa gaṃdu rakiṃcina vaiṣṇavāghri saṃ
sthāna rajōbhiṣiktu lagu saṃhṛtakarmalu dānavēśvarā !” (śrīmadāṃdhra mahābhāgavatamu- 7 - 5 - 182)
(brahmajñānamu lēka kēvalamu karmalu cēyuṭa yaṃdē āsakti kaligi vāṭi valana kaligē phalamucē badhdhulayinavāru guḍḍi vārivalē gamyastānamaina parama padamunu poṃdalēru. bhagavadbhakti kaligi karma nirmūlanamu cēsu koninavāru sari yaina mārgamunapōyi brahmasākṣātkāramu poṃdedaru.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.