గాఢాంధకారము, కటిక చీకటి, చిమ్మచీకటి.
దేహే నష్టే అహమేవ నష్టః ఇతి రూపమజ్ఞానం.
(దేహము నశింపగా నేను నశింతును అనెడి అజ్ఞానము -)
భయవిశేష విషయకో అభినివేశః. (ఒక విధమైన భయమును కలిగించు అభినివేశము -)
ఒక నరకము.
‘అంధతమసమ యాః నరక విశేషాః’
(కారు చీకటితో నిండియున్న ఒక విధమైన నరకములు -)
“క. పరకాంతనెవ్వడేనిం
బురుషుండుండగ మొఱగి పొందిన యమ కిం
కరులతని బట్టి వడి ద
త్తఱమున బడవైతు రంధతామిశ్రమునన్” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 12 - 137)
(ఆత్మహత్య చేయువారలకు - అనగా తమ అత్మను దుర్మార్గావలంబనముచే మోక్షమార్గమునకు దూరము చేయువారలకు - అసూర్యములు - అనగా, సూర్యుడు లేని లోకములు, సూర్య రశ్మి లేని లోకములు - అంధతా మిస్రములు విధింపబడినవి అని ఋషులు చెప్పుదురు. సూర్య కాంతి లేనటువంటి లోకములు గనుకనే చీకటి లోకములు)
(శబ్దాది భోగస్పృహ మహా మోహము, ఆ మోహ ప్రతిఘాతము వలన క్రోధము కలుగుట తామిశ్రము, వినాశాది శంకచే నిత్యము ఆ భోగరక్షణ యందు అభినివేశము కలిగి యుండుట అంధతామిశ్రము. అంధతామిశ్రము పంచక్లేశములలో నొకటి) - (చూడుము ‘పంచక్లేశములు’)
అవిద్యాదులు - అవిద్యాపంచకము - మంచివి కావని తెలిసినప్పటికీ అజ్ఞానివలె వాటిని విడువక పోవుట; అభినివేశము; పాశములలో నొకటి.
“అష్ట విధైశ్వర్యే దశషు విషయేషు, భోగత్వే నోపస్థితేషు, అర్ధ భుక్తేషు మృత్యునా హ్రియమాణస్య యః శోకా జాయతే, మహతా క్లేశేన యేతే ప్రాప్తాః న చైతే మయోపభుక్తాః ప్రత్యా సన్నాశ్చాయం మరణకాలః ఇతి సో అంధతా మిస్రః”. (శ్రీ శంకరః)
(పది విషయములకు సంబంధించిన అష్టైశ్వరములు అనుభవించుటకు దగ్గరగా ఉన్నప్పటికీ “ఇవి చాలా కష్టపడిన మీదట కలిగినవి, వీటిని - ఈ భోగములను - నేను అనుభవించ లేదు. మరణకాలము సమీపించినది. అయ్యో” అని. మరణకాలమునందు కలుగు శోకము అంధతామిస్రము.)
gāḍhāṃdhakāramu, kaṭika cīkaṭi, cimmacīkaṭi.
dēhē naṣṭē ahamēva naṣṭaḥ iti rūpamajñānaṃ.
(dēhamu naśiṃpagā nēnu naśiṃtunu aneḍi ajñānamu -)
bhayaviśēṣa viṣayakō abhinivēśaḥ. (oka vidhamaina bhayamunu kaligiṃcu abhinivēśamu -)
oka narakamu.
‘aṃdhatamasama yāḥ naraka viśēṣāḥ’
(kāru cīkaṭitō niṃḍiyunna oka vidhamaina narakamulu -)
“ka. parakāṃtanevvaḍēniṃ
buruṣuṃḍuṃḍaga moṟagi poṃdina yama kiṃ
karulatani baṭṭi vaḍi da
ttaṟamuna baḍavaitu raṃdhatāmiśramunan” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 12 - 137)
(ātmahatya cēyuvāralaku - anagā tama atmanu durmārgāvalaṃbanamucē mōkṣamārgamunaku dūramu cēyuvāralaku - asūryamulu - anagā, sūryuḍu lēni lōkamulu, sūrya raśmi lēni lōkamulu - aṃdhatā misramulu vidhiṃpabaḍinavi ani ṛṣulu ceppuduru. sūrya kāṃti lēnaṭuvaṃṭi lōkamulu ganukanē cīkaṭi lōkamulu)
(śabdādi bhōgaspṛha mahā mōhamu, ā mōha pratighātamu valana krōdhamu kaluguṭa tāmiśramu, vināśādi śaṃkacē nityamu ā bhōgarakṣaṇa yaṃdu abhinivēśamu kaligi yuṃḍuṭa aṃdhatāmiśramu. aṃdhatāmiśramu paṃcaklēśamulalō nokaṭi) - (cūḍumu ‘paṃcaklēśamulu’)
avidyādulu - avidyāpaṃcakamu - maṃcivi kāvani telisinappaṭikī ajñānivale vāṭini viḍuvaka pōvuṭa; abhinivēśamu; pāśamulalō nokaṭi.
“aṣṭa vidhaiśvaryē daśaṣu viṣayēṣu, bhōgatvē nōpasthitēṣu, ardha bhuktēṣu mṛtyunā hriyamāṇasya yaḥ śōkā jāyatē, mahatā klēśēna yētē prāptāḥ na caitē mayōpabhuktāḥ pratyā sannāścāyaṃ maraṇakālaḥ iti sō aṃdhatā misraḥ”. (śrī śaṃkaraḥ)
(padi viṣayamulaku saṃbaṃdhiṃcina aṣṭaiśvaramulu anubhaviṃcuṭaku daggaragā unnappaṭikī “ivi cālā kaṣṭapaḍina mīdaṭa kaliginavi, vīṭini - ī bhōgamulanu - nēnu anubhaviṃca lēdu. maraṇakālamu samīpiṃcinadi. ayyō” ani. maraṇakālamunaṃdu kalugu śōkamu aṃdhatāmisramu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.