ఆంగేషు మంత్ర భేదస్య న్యాసః
(అవయవములందు మంత్రవిశేషములు ఉంచుట - జపారంభమున ఆయా అవయవములకు విహితములగు మంత్రములను ఉచ్ఛరించుచు ఆయా అవయవములను తాకుట -.) ఉదాహరణ –
(1) గాయత్రీ మంత్రమునకు –
“తత్సవితుః హృదయం యనమః వరేణ్యం శిరసేస్వాహా, భర్గో దేవస్య శిఖాయైవౌషట్, ధీమహీ కవచాయహుం, ధియో యోనః నేత్రాభ్యాం వౌషట్, ప్రచోదయాత్ అస్త్రాయఫట్, భూర్భువస్స్యరోమితి దిగ్బంధః” - అని, చెప్పినపుడు ఆయా అంగములను చేతితో ముట్టుకొనుట. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధీయో యోనః ప్రచోదయాత్ - అను గాయత్రీ మంత్రమునకు పైన చెప్పినది అంగన్యాసము.
(2) “ఓం విష్ణువేనమః” అను మంత్రమునకు –
“వ. --- హృదయంబున నోంకారంబు, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబునందు, ణకారంబు శిఖయందు, వేకారంబు నేత్రంబుల యందు, నకారంబు సర్వసంధులయందు మరియు, నస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యశించెనేని మంత్రమూర్తియగు, మఱియును నస్త్రాయఫట్ అను మంత్రంబున దిగ్భంధనంబు చేసి ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము -6 - 8 - 299)
āṃgēṣu maṃtra bhēdasya nyāsaḥ
(avayavamulaṃdu maṃtraviśēṣamulu uṃcuṭa - japāraṃbhamuna āyā avayavamulaku vihitamulagu maṃtramulanu ucchariṃcucu āyā avayavamulanu tākuṭa -.) udāharaṇa –
(1) gāyatrī maṃtramunaku –
“tatsavituḥ hṛdayaṃ yanamaḥ varēṇyaṃ śirasēsvāhā, bhargō dēvasya śikhāyaivauṣaṭ, dhīmahī kavacāyahuṃ, dhiyō yōnaḥ nētrābhyāṃ vauṣaṭ, pracōdayāt astrāyaphaṭ, bhūrbhuvassyarōmiti digbaṃdhaḥ” - ani, ceppinapuḍu āyā aṃgamulanu cētitō muṭṭukonuṭa. tatsaviturvarēṇyaṃ bhargō dēvasya dhīmahī dhīyō yōnaḥ pracōdayāt - anu gāyatrī maṃtramunaku paina ceppinadi aṃganyāsamu.
(2) “ōṃ viṣṇuvēnamaḥ” anu maṃtramunaku –
“va. --- hṛdayaṃbuna nōṃkāraṃbu, vikāraṃbu mūrdhaṃbuna, ṣakāraṃbu bhrūmadhyaṃbunaṃdu, ṇakāraṃbu śikhayaṃdu, vēkāraṃbu nētraṃbula yaṃdu, nakāraṃbu sarvasaṃdhulayaṃdu mariyu, nastramu nuddēśiṃci makāraṃbu nupanyaśiṃcenēni maṃtramūrtiyagu, maṟiyunu nastrāyaphaṭ anu maṃtraṃbuna digbhaṃdhanaṃbu cēsi ---” (śrīmadāṃdhra mahābhāgavatamu -6 - 8 - 299)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.