← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంగసంశ్రయా aṃgasaṃśrayā

Original — తెలుగు

నిత్యానపాయనీ

(ఎల్లపుడు వదలకుండా ఉండునది - శ్రీ మహావిష్ణువునకు శ్రీలక్ష్మి నిత్యానపాయని) -విష్ణు వక్షస్తలమున ఎల్లపుడు ఉండునది - శ్రీమహాలక్ష్మి - (మాయ, విష్ణువును వదలకుండా ఎల్లపుడు అంటిపెట్టుకొని యుండునది - ఆ మాయయే లక్ష్మీదేవి - “యామాసా మాయా”) (ఎవరు లక్ష్మీ దేవియో ఆమె యే మాయ.) అపాయము లేక ఉండునది అనపాయి, నిత్యానపాయి అనగా ఎన్నడూ అపాయమనునది లేక (లేకపోవుట లేక) విష్ణువునే ఆశ్రయించి ఉండునది - సృష్టిలోని ప్రతి వస్తువు ప్రకృతి రూపమే, ప్రకృతి పరిణామమే - ప్రకృతిలోను, ప్రకృతి పరిణామములన్నిటిలోను భగవంతుడు ఉన్నాడు.

“క. ఇందు గలడందు లేడను

సందేహము వలదు, చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన

నందందే గలడు దానవాగ్రణి వింటే” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 7- 8- 275)

“క. ---

హరిమయము గాని ద్రవ్యము,

పరమాణువు లేదు. వంశపావని వింటే.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము – 6-16-47)

“Every particle of matter contains energy” (There is not even the smallest particle of matter which does not contain energy -) Energy అనగా భగవంతుడే (శక్తి రూపములో). సృష్టిలో భగవదంశ లేనటువంటిది పరమాణువు కూడా లేదు. ప్రకృతి ఏ రూపము చెందినా, ఎంత చిన్న వస్తువుగా మారినా (పరమాణువుగా మారినా) భగవదంశ కలిగియుండుట మానలేదు - అందుచేత ప్రకృతి భగవంతునికి నిత్యానపాయని -

Transliteration

nityānapāyanī

(ellapuḍu vadalakuṃḍā uṃḍunadi - śrī mahāviṣṇuvunaku śrīlakṣmi nityānapāyani) -viṣṇu vakṣastalamuna ellapuḍu uṃḍunadi - śrīmahālakṣmi - (māya, viṣṇuvunu vadalakuṃḍā ellapuḍu aṃṭipeṭṭukoni yuṃḍunadi - ā māyayē lakṣmīdēvi - “yāmāsā māyā”) (evaru lakṣmī dēviyō āme yē māya.) apāyamu lēka uṃḍunadi anapāyi, nityānapāyi anagā ennaḍū apāyamanunadi lēka (lēkapōvuṭa lēka) viṣṇuvunē āśrayiṃci uṃḍunadi - sṛṣṭilōni prati vastuvu prakṛti rūpamē, prakṛti pariṇāmamē - prakṛtilōnu, prakṛti pariṇāmamulanniṭilōnu bhagavaṃtuḍu unnāḍu.

“ka. iṃdu galaḍaṃdu lēḍanu

saṃdēhamu valadu, cakri sarvōpagatuṃ

ḍeṃdeṃdu vedaki jūcina

naṃdaṃdē galaḍu dānavāgraṇi viṃṭē” (śrīmadāṃdhra mahābhāgavatamu - 7- 8- 275)

“ka. ---

harimayamu gāni dravyamu,

paramāṇuvu lēdu. vaṃśapāvani viṃṭē.” (śrīmadāṃdhra mahābhāgavatamu – 6-16-47)

“Every particle of matter contains energy” (There is not even the smallest particle of matter which does not contain energy -) Energy anagā bhagavaṃtuḍē (śakti rūpamulō). sṛṣṭilō bhagavadaṃśa lēnaṭuvaṃṭidi paramāṇuvu kūḍā lēdu. prakṛti ē rūpamu ceṃdinā, eṃta cinna vastuvugā mārinā (paramāṇuvugā mārinā) bhagavadaṃśa kaligiyuṃḍuṭa mānalēdu - aṃducēta prakṛti bhagavaṃtuniki nityānapāyani -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.