“అంగుష్ఠమాత్రః పురుషఃమధ్య ఆత్మని తిష్ఠతి”- “అంగుష్ఠమాత్రి పురుషే (ఆ) అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ఠః”. (బ్రొటన వ్రేలంత పరిమితి గల పురుషుడు - పరమాత్మ - శరీరమధ్యమందు - అందరి జనుల యొక్క హృదయమందు - అంతరాత్మగా ఉన్నాడు.)
పరమాత్మనః ఉపాసనార్ధం ఉపాసక హృదయే వర్తమానత్వ ఉపాసక హృదయస్య అంగుష్ఠ ప్రమాణత్వాత్ తదపేక్షయా ఇదం అంగుష్ఠ ప్రమితత్వం హృదయాంతర్వర్తిత్వాత్ తదపేక్ష యేవ. (పరమాత్మయొక్క ఉపాసన నిమిత్తము ఉపాసకుని హృదయమందు ఉండుటవలనను - ఉపాసకుని హృదయము బొటన వ్రేలంత ప్రమాణము గలదగుటచేతను) పరమాత్మకు బొటన వ్రేలంత (అంగుష్ఠమంత ప్రమాణత్వము) చెప్పబడియున్నది. జీవుడు హృదయమందుండుట వలన జీవుడు అంగుష్ఠప్రమాణము గలవాడని చెప్పబడినది.
అంగుష్ఠ పరిమాణ హృదయం ఆశ్రితః అతయేవ అంగుష్ఠ పరిమాణః
(బొటన వ్రేలంత పరిమాణము గల హృదయమును ఆశ్రయించి ఉన్నవాడు - అందుచేతనే అంగుష్ఠమంతవాడు)
(అంగుష్ఠ పరిమితిని హృదయమందుండుట అవ్యాక్రుత ఆకాశమువలె నుండుటవలన కాని స్వతః అంగుష్ఠమాత్ర రూపుడై ఉండుట చేత కాదు. ఆ పరమాత్మ అన్నిటికీ విభుడై ఉండుటవలన అంగుష్ఠ పరిమాణత్వము చెప్పబడినది)
(హృదయము తన బొటన వ్రేలి పరిమితి గలదగుట చేత అందులోనుండు చైతన్యముకూడా అంతమాత్రమే - అంగుష్ఠమాత్రమే. యదార్ధముగా హృదయమునందే గాక అంతటనూ పూర్తిగా నిండియుండువాడు. అందుచే పూర్ణుడు అనబడుచున్నాడు.)
(బ్రొటనవేలంత పరిమాణము గలది హృదయకమలము. దానిలో ఉండువాడు - అంతఃకరణము ఉపాధిగాగలవాడు కనుక అంగుష్ఠమాత్రుడు అని చెప్పబడుచున్నాడు. అన్నింటియందు, అంతటా వ్యాపించి యుండువాడు - ఇంతవాడు అని చెప్పుటకు వీలులేనివాడు అయిన పరమాత్మకి స్వభావము చేతనే, యధార్థము గానే అంగుష్ఠమాత్రత్వము అని చెప్పుట కుదరదు.
“aṃguṣṭhamātraḥ puruṣaḥmadhya ātmani tiṣṭhati”- “aṃguṣṭhamātri puruṣē (ā) aṃtarātma sadā janānāṃ hṛdayē sanniviṣṭhaḥ”. (broṭana vrēlaṃta parimiti gala puruṣuḍu - paramātma - śarīramadhyamaṃdu - aṃdari janula yokka hṛdayamaṃdu - aṃtarātmagā unnāḍu.)
paramātmanaḥ upāsanārdhaṃ upāsaka hṛdayē vartamānatva upāsaka hṛdayasya aṃguṣṭha pramāṇatvāt tadapēkṣayā idaṃ aṃguṣṭha pramitatvaṃ hṛdayāṃtarvartitvāt tadapēkṣa yēva. (paramātmayokka upāsana nimittamu upāsakuni hṛdayamaṃdu uṃḍuṭavalananu - upāsakuni hṛdayamu boṭana vrēlaṃta pramāṇamu galadaguṭacētanu) paramātmaku boṭana vrēlaṃta (aṃguṣṭhamaṃta pramāṇatvamu) ceppabaḍiyunnadi. jīvuḍu hṛdayamaṃduṃḍuṭa valana jīvuḍu aṃguṣṭhapramāṇamu galavāḍani ceppabaḍinadi.
aṃguṣṭha parimāṇa hṛdayaṃ āśritaḥ atayēva aṃguṣṭha parimāṇaḥ
(boṭana vrēlaṃta parimāṇamu gala hṛdayamunu āśrayiṃci unnavāḍu - aṃducētanē aṃguṣṭhamaṃtavāḍu)
(aṃguṣṭha parimitini hṛdayamaṃduṃḍuṭa avyākruta ākāśamuvale nuṃḍuṭavalana kāni svataḥ aṃguṣṭhamātra rūpuḍai uṃḍuṭa cēta kādu. ā paramātma anniṭikī vibhuḍai uṃḍuṭavalana aṃguṣṭha parimāṇatvamu ceppabaḍinadi)
(hṛdayamu tana boṭana vrēli parimiti galadaguṭa cēta aṃdulōnuṃḍu caitanyamukūḍā aṃtamātramē - aṃguṣṭhamātramē. yadārdhamugā hṛdayamunaṃdē gāka aṃtaṭanū pūrtigā niṃḍiyuṃḍuvāḍu. aṃducē pūrṇuḍu anabaḍucunnāḍu.)
(broṭanavēlaṃta parimāṇamu galadi hṛdayakamalamu. dānilō uṃḍuvāḍu - aṃtaḥkaraṇamu upādhigāgalavāḍu kanuka aṃguṣṭhamātruḍu ani ceppabaḍucunnāḍu. anniṃṭiyaṃdu, aṃtaṭā vyāpiṃci yuṃḍuvāḍu - iṃtavāḍu ani ceppuṭaku vīlulēnivāḍu ayina paramātmaki svabhāvamu cētanē, yadhārthamu gānē aṃguṣṭhamātratvamu ani ceppuṭa kudaradu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.