- మొలక - వంశము నిలుచుటకు ఆధారము. బీజమునుండి అంకురము పుట్టును - అంకురము పెద్ద
చెట్టై అనేక బీజములను పుట్టించును. అందులోని ప్రతి ఒక్క బీజమును మరల అంకురమును
పుట్టించును. అంకురము - చెట్టు - పుట్టుటకు బీజము కారణము. అంకురము - చెట్టు - కార్యము
- ఈ ప్రకారముగానే సృష్టిలోని ప్రతి వస్తువు ఒక కార్యము - దానికి కారణము ఉండవలెను - కారణము లేనిదే
కార్యము ఉండదు. ఆ కారణ వస్తువు కూడా కార్యమే. ఎందుచేతనంటే దానికి ఒక కారణ వస్తువు ఉండి
తీరవలెను. “కారణేన వినా కార్యం నాస్తి”. ఈ ప్రకారముగా ప్రతి వస్తువు కారణము, కార్యము కూడా అన్ని
కారణవస్తువులకు కారణము, మూలకారణము లేక ఆదికారణము లేక కారణకారణము అయినది భగవంతుడే.
ఎందుచేతనంటే అతనిలోనుండి, ఒక దానిలో నుండి ఒకటిగా, ఈ సృష్టిలోని అన్ని వస్తువులు పుట్టినవి.
(చూడుము : - ‘బీజము’, ‘బీజాంకుర న్యాయము’, ‘కారణకార్యములు’)
Transliteration
- molaka - vaṃśamu nilucuṭaku ādhāramu. bījamunuṃḍi aṃkuramu puṭṭunu -
aṃkuramu pedda ceṭṭai anēka bījamulanu puṭṭiṃcunu. aṃdulōni prati okka
bījamunu marala aṃkuramunu puṭṭiṃcunu. aṃkuramu - ceṭṭu - puṭṭuṭaku
bījamu kāraṇamu. aṃkuramu - ceṭṭu - kāryamu - ī prakāramugānē sṛṣṭilōni
prati vastuvu oka kāryamu - dāniki kāraṇamu uṃḍavalenu - kāraṇamu lēnidē
kāryamu uṃḍadu. ā kāraṇa vastuvu kūḍā kāryamē. eṃducētanaṃṭē dāniki oka
kāraṇa vastuvu uṃḍi tīravalenu. “kāraṇēna vinā kāryaṃ nāsti”. ī
prakāramugā prati vastuvu kāraṇamu, kāryamu kūḍā anni kāraṇavastuvulaku
kāraṇamu, mūlakāraṇamu lēka ādikāraṇamu lēka kāraṇakāraṇamu ayinadi
bhagavaṃtuḍē. eṃducētanaṃṭē atanilōnuṃḍi, oka dānilō nuṃḍi okaṭigā, ī
sṛṣṭilōni anni vastuvulu puṭṭinavi. (cūḍumu : - ‘bījamu’, ‘bījāṃkura
nyāyamu’, ‘kāraṇakāryamulu’)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.