శుభ కర్మలయందు మంత్రమును ఉచ్చరించుచు మన్నుగల ప్రమిదలలో (పాలికలలో) నవధాన్యములను ఉంచుట. ఈ ధాన్యములు - బీజములు - పాలికలలోని మన్ను, నీళ్ళతో కలిసి కొద్ది రోజులకు అంకురించును - అనగా మొక్కలు వచ్చును. అంకురములు మొలచుటకై బీజములను జన్మస్తలమగు మట్టిలో (భూమిలో) నుంచుట. ఇది సృష్టి ప్రకారమును సూచించును. ప్రపంచములోని సమస్త వస్తువులకు ఆది బీజము - ఆది కారణము భగవంతుడే. అతని నుండే సమస్త వస్తువులు (భూతములు) అంకురము వలే ఒక దానిలోనుండి ఒకటిగా పుట్టినవి. శ్రీమద్భగవద్గీతలో అధ్యా. 7 - 10 శ్లోకములో శ్రీ కృష్ణ భగవానుడు ఈ విధముగా చెప్పియుండెను. “బీజం మాం సర్వ భూతానాం విధ్ధి పార్ద్ధ సనాతనం” - సమస్త భూతములకు బీజము, కారణమైనవాడు, నేనే, అని తెలుసుకొనుము - అధ్యా. 10 - 39 లో “యచ్చాపి సర్వ భూతానాం బీజం తదహమహర్జున” - అనగా వ్యష్టి అవస్థలోకూడా ఒక్కొక్క భూతమునకు బీజము (కారణము) తానే, అని అర్ధము. ఎందుచేతననగా ఆ బీజము (కారణము) తన రూపమే తన సత్తాస్పూర్తి చేతనే ప్రవర్తించునది కనుక.
“సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభావంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజః ప్రదః పితా” (శ్రీమద్భగవద్గీత అధ్యా - 14 - 4)
(చూడుము : - ‘బీజము’, ‘సృష్టి’, ‘బీజాంకుర న్యాయము’, ‘కారణ కార్యములు’)
śubha karmalayaṃdu maṃtramunu uccariṃcucu mannugala pramidalalō (pālikalalō) navadhānyamulanu uṃcuṭa. ī dhānyamulu - bījamulu - pālikalalōni mannu, nīḷḷatō kalisi koddi rōjulaku aṃkuriṃcunu - anagā mokkalu vaccunu. aṃkuramulu molacuṭakai bījamulanu janmastalamagu maṭṭilō (bhūmilō) nuṃcuṭa. idi sṛṣṭi prakāramunu sūciṃcunu. prapaṃcamulōni samasta vastuvulaku ādi bījamu - ādi kāraṇamu bhagavaṃtuḍē. atani nuṃḍē samasta vastuvulu (bhūtamulu) aṃkuramu valē oka dānilōnuṃḍi okaṭigā puṭṭinavi. śrīmadbhagavadgītalō adhyā. 7 - 10 ślōkamulō śrī kṛṣṇa bhagavānuḍu ī vidhamugā ceppiyuṃḍenu. “bījaṃ māṃ sarva bhūtānāṃ vidhdhi pārddha sanātanaṃ” - samasta bhūtamulaku bījamu, kāraṇamainavāḍu, nēnē, ani telusukonumu - adhyā. 10 - 39 lō “yaccāpi sarva bhūtānāṃ bījaṃ tadahamaharjuna” - anagā vyaṣṭi avasthalōkūḍā okkokka bhūtamunaku bījamu (kāraṇamu) tānē, ani ardhamu. eṃducētananagā ā bījamu (kāraṇamu) tana rūpamē tana sattāspūrti cētanē pravartiṃcunadi kanuka.
“sarvayōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhāvaṃti yāḥ tāsāṃ brahma mahadyōni rahaṃ bījaḥ pradaḥ pitā” (śrīmadbhagavadgīta adhyā - 14 - 4)
(cūḍumu : - ‘bījamu’, ‘sṛṣṭi’, ‘bījāṃkura nyāyamu’, ‘kāraṇa kāryamulu’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.