← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమృతః amṛtaḥ

Original — తెలుగు
  1. అమృతుడు; చావు లేనివాడు; ముక్తుడు; చావనివాడు.

  2. “న విద్యతే మృతం మరణం అస్య ఇతి అమృతం”. (శ్రీశంకరః)

(మరణము లేనివాడు; నిత్యుడు.)

  1. “అజరో అమరః”ఇతి శ్రుతేః. (బృహదారణ్యకోపనిషత్)

(జరామరణములు లేనివాడు అని భగవంతుని గుఱించి శ్రుతి చెప్పుచున్నది.)

  1. మరణ రహితః - దేహాత్ ప్రాణానాం ఉత్క్రాంతిః మరణం తచ్చ తత్వవిదాం నాస్తి - “న తస్య ప్రాణాఉత్క్రమంత్య త్రైహ సమన లీయంతే” ఇతి శ్రుతిః - - అమరణ ధర్మాః.

(మరణము లేనివాడు. దేహము నుండి ప్రాణములు పైకి పోవుట మరణము. అట్టి మరణము భగవత్తత్వమును తెలిసినవారికి, బ్రహ్మ జ్ఞానము కలవారికి, కలుగదు. - “అట్టివారి ప్రాణములు దేహము నుండి పైకి పోవు - ఇక్కడే లీనమైపోవుచున్నవి” అని శ్రుతి చెప్పుచున్నది. - చావులేని స్వభావముకలవాడు.)

  1. అసంసారీ, పునరావృత్తి రహితః.

(జననమరణ రూపమగు సంసారము లేనివాడు - మరల జన్మించని వాడు.)

  1. మరణరహితః - ఉపలక్షణమేతత్, ఉత్పత్యాది రహితః ఇత్యపి ద్రష్టవ్యం.

(చావులేనిది - ఈ మాట ఉపలక్షణము - అనగా, ఉత్పత్తి మొదలగునవి లేనివాడు అని తెలుసుకొన వలెను – చావు లేదనుట వలన షడ్వికారములలోను మిగిలినవి కూడ అనగా, పుట్టుట, వృద్ధిపొందుట, ముసలి యగుట మొదలగునవి లేనివాడు అని అర్థము.)

  1. మరణ హేతుభిః అవిద్యా తత్కార్య సంస్కారైర్వర్జితాః.

(మరణమునకు కారణములైన అవిద్యయొక్క కార్యములు లేనివాడు.)

  1. “బ్రహ్మ గుణ పూర్ణత్వాచ్చ, నిత్యత్వాచ్చదమృతం తథా”.

(బ్రహ్మ గుణములలో పూర్తిగా నిండియున్నవాడగుటచేతను, నిత్యుడు అగుటచేతను అమృతుడు.)

  1. అమృతత్వేన అహమస్మి ఇతి అమృతః - అమరణ ధర్మః.

(అమృతత్వము వలననే నేను జీవించియున్నాను, అందుచేత అమృతుడను అని అనుకొనుట - మరణించు ధర్మము, నైజము, స్వభావము, లేనివాడు.)

  1. మరణహేత్వ విద్యాదేః తత్వజ్ఞానాగ్నినా దగ్థత్వాత్ పునర్దేహాంతరం న భజం తీత్యర్థః -

(మరణము కలుగుటకు కారణమైన అవిద్య మొదలగునవి. తత్వజ్ఞానము అను అగ్నివలన - బ్రహ్మజ్ఞానము అను అగ్నివలన – దగ్థమై పోవుట వలన తిరిగి జననమును పొందరు. వారికి పునర్జన్మ ఉండదు.)

“యథాసర్వేప్రముచ్యంతే కామాయే అస్యహృదిస్థితాః |

అధమర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మసమశ్నుతే ||”

(హృదయమందున్న కామములన్నియు ఎప్పుడు విడిపోవునో అప్పుడు మానవుడు - మరణశీలుడైనవాడు - మృత్యువు లేనివాడగును - అమృతస్వరూపుడగును.)

  1. “అమృతాభిదా నమసి -” అమృతం నామయత్ సంతో మంత్రజిహ్యేషు జుహ్వతి.

(పైమంత్రముతో సత్పురుషులు త్రాగునది అంతయూ అమృతమే యగును, అమృతతుల్యమే యగును.)

Transliteration
  1. amṛtuḍu; cāvu lēnivāḍu; muktuḍu; cāvanivāḍu.

  2. “na vidyatē mṛtaṃ maraṇaṃ asya iti amṛtaṃ”. (śrīśaṃkaraḥ)

(maraṇamu lēnivāḍu; nityuḍu.)

  1. “ajarō amaraḥ”iti śrutēḥ. (bṛhadāraṇyakōpaniṣat)

(jarāmaraṇamulu lēnivāḍu ani bhagavaṃtuni guṟiṃci śruti ceppucunnadi.)

  1. maraṇa rahitaḥ - dēhāt prāṇānāṃ utkrāṃtiḥ maraṇaṃ tacca tatvavidāṃ nāsti - “na tasya prāṇāutkramaṃtya traiha samana līyaṃtē” iti śrutiḥ - - amaraṇa dharmāḥ.

(maraṇamu lēnivāḍu. dēhamu nuṃḍi prāṇamulu paiki pōvuṭa maraṇamu. aṭṭi maraṇamu bhagavattatvamunu telisinavāriki, brahma jñānamu kalavāriki, kalugadu. - “aṭṭivāri prāṇamulu dēhamu nuṃḍi paiki pōvu - ikkaḍē līnamaipōvucunnavi” ani śruti ceppucunnadi. - cāvulēni svabhāvamukalavāḍu.)

  1. asaṃsārī, punarāvṛtti rahitaḥ.

(jananamaraṇa rūpamagu saṃsāramu lēnivāḍu - marala janmiṃcani vāḍu.)

  1. maraṇarahitaḥ - upalakṣaṇamētat, utpatyādi rahitaḥ ityapi draṣṭavyaṃ.

(cāvulēnidi - ī māṭa upalakṣaṇamu - anagā, utpatti modalagunavi lēnivāḍu ani telusukona valenu – cāvu lēdanuṭa valana ṣaḍvikāramulalōnu migilinavi kūḍa anagā, puṭṭuṭa, vṛddhipoṃduṭa, musali yaguṭa modalagunavi lēnivāḍu ani arthamu.)

  1. maraṇa hētubhiḥ avidyā tatkārya saṃskārairvarjitāḥ.

(maraṇamunaku kāraṇamulaina avidyayokka kāryamulu lēnivāḍu.)

  1. “brahma guṇa pūrṇatvācca, nityatvāccadamṛtaṃ tathā”.

(brahma guṇamulalō pūrtigā niṃḍiyunnavāḍaguṭacētanu, nityuḍu aguṭacētanu amṛtuḍu.)

  1. amṛtatvēna ahamasmi iti amṛtaḥ - amaraṇa dharmaḥ.

(amṛtatvamu valananē nēnu jīviṃciyunnānu, aṃducēta amṛtuḍanu ani anukonuṭa - maraṇiṃcu dharmamu, naijamu, svabhāvamu, lēnivāḍu.)

  1. maraṇahētva vidyādēḥ tatvajñānāgninā dagthatvāt punardēhāṃtaraṃ na bhajaṃ tītyarthaḥ -

(maraṇamu kaluguṭaku kāraṇamaina avidya modalagunavi. tatvajñānamu anu agnivalana - brahmajñānamu anu agnivalana – dagthamai pōvuṭa valana tirigi jananamunu poṃdaru. vāriki punarjanma uṃḍadu.)

“yathāsarvēpramucyaṃtē kāmāyē asyahṛdisthitāḥ |

adhamartyō amṛtō bhavatyatra brahmasamaśnutē ||”

(hṛdayamaṃdunna kāmamulanniyu eppuḍu viḍipōvunō appuḍu mānavuḍu - maraṇaśīluḍainavāḍu - mṛtyuvu lēnivāḍagunu - amṛtasvarūpuḍagunu.)

  1. “amṛtābhidā namasi -” amṛtaṃ nāmayat saṃtō maṃtrajihyēṣu juhvati.

(paimaṃtramutō satpuruṣulu trāgunadi aṃtayū amṛtamē yagunu, amṛtatulyamē yagunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.