మోక్షం - ముక్తిః,
కైవల్యం - (మోక్షము, ముక్తి, కైవల్యము -వీటిని వేరు వేరుగా చూడుము.)
మరణ శూన్యం, మరణరాహిత్యం;
మఋత్యు వర్జితం.
(చావులేనిది;
మృత్యువు లేనిది - మోక్షము.)
అమరణ ధర్మం, మరణాది ధర్మ
రహితం.
(మరణ ధర్మము లేనిది; మరణము
మొదలగు ధర్మములు - గుణములు లేనిది.)
అవినాశి స్వభావం; అవినాశిత్వాత్
అమృతం.
(నశింపని
స్వభావం కలది - “సచ్చిదానందం బ్రహ్మ” - సత్ అనగా మూడు కాలములందు ఉండువాడు బ్రహ్మ. అందుచేత
నశింపనివాడు.)
మరణాది భయ
వైరల్యాత్ అమృతం. (చావు మొదలగు భయము లేనిది.)
జననమరణ
రాహిత్యం, మోక్షం. (చావు పుట్టుకలు లేనిది - మోక్షము.)
జన్మ జరామరణాది ప్రాకృత
ధర్మరహితం, అమృతం ఆత్మానం,
(చావు పుట్టుకలు,
ముసలితనము మొదలగునవి, ప్రకృతికి సంబంధించిన ధర్మములు లేనిది - ఆత్మ.)
కాల పరిచ్ఛిన్నం; మృత్యాది సంసార
నాశకం.
(కాలముచేత
పరిచ్ఛిన్నము కానిది - ఇది ఇన్నాళ్ళే ఉండును అను కాలపరిమితిలేనిది; శాశ్వతముగా నుండునది. జననమరణాది
రూపమైన సంసారమును నశింప చేయునది.)
నమృతం అమృతం, మరణ నివర్తకః
-
(చావులేనిది;
చావును తప్పించునది; చావులేకుండచేయునది.)
నిశ్రేయ సహేతుః, ఉపాసకానాం
అజరామరత్వ హేతుః -
(నిశ్రేయసకారణము;
ఉపాసకులకు జరామరణములు - జననము మరణము - లేకుండుటకు కారణమైనది.)
స్వర్గం, న విద్యతే మరణం
యత్ర ఇత్యుత్సత్తేః.
(మరణము ఎక్కడ
లేకుండునో అది అమృతము; స్వర్గము -) (స్వర్గముకూడ నశించవలసినదే.)
మరణ రహిత
ఆత్మస్థితిః. (ఆత్మయొక్క చావులేని స్థితి.)
అక్షరం పరమం పదం.
(నశించనిది;
పరమమైన ఉత్కృష్టమైన పదము, స్థానము - పుణ్యాత్ములు, భక్తులు, యోగీశ్వరులు మొదలగువారు పొందతగిన
స్థానము, మోక్షము -.)
వికలేబర
కైవల్యం - (శరీరము లేని కైవల్యము - కేవలము ఆత్మతత్త్వమై యుండుట.) (చూడుము -
‘కైవల్యము’.)
“సర్వదోష
రహితత్వేన ప్రతీతం పరమాత్మానాం, దేవతాత్మ భావం - తద్ధి అమృత ముచ్యతే యద్దేవతాత్మగమనం”
(శ్రీశంకరః)
(ఏ విధమైన దోషములు లేకపోవుటచేత
పరమాత్మ అమృతమని చెప్పబడుచున్నది.)
“యత్తు చంచలతా హీనం తన్మనో
(అ)మృతముచ్యతే |
తధైవచ తపః శాస్త్ర సిద్ధాంతే
మోక్ష ఉచ్యతే ||“. (మహోపనిషత్ - 4 - 101)
(మనస్సు
చంచలము గాకయుండుటే అమృతమని చెప్పబడినది. ఆ ప్రకారముగానే శాస్త్ర సిద్ధాంతప్రకారము అటువంటి
మనస్సుగల తపస్సు మోక్షమని చెప్పబడుచున్నది.)
సచ్చిదానంద రూపం బ్రహ్మ.
(సద్రూపుడు, చిద్రూపుడు,
ఆనందరూపుడు - మోక్షరూపుడు అయిన - పరబ్రహ్మ.)
“త్వం తదాపః ఆపో జ్యోతిరసో
(అ)మృతం బ్రహ్మ -
(నీవే ఆ జలము, ఆ జలమే
జ్యోతిస్సు, రసము, అమృతము - పరబ్రహ్మము -.)
“అమృతంచైవ మృత్యుశ్చ సదసచ్చాహ
మర్జున”. (శ్రీమద్భగవద్గీత- 9 - 19)
(అమృతము, మృత్యువు, సత్. అసత్ నేనే -
భగవంతుడే.)
“దేవానామమృతం, సర్వప్రాణినాం జీవనం
చ వా” (గీతాభావప్రకాశము - 9 - 130)
(దేవతులు
మరణము లేకుండుటకు పుచ్చుకొను అమృతము నేను. ఆ ప్రకారముగానే సకల జీవరాశులు జీవించియుండుటకు
అమృతమను జీవనము నేనే శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను చెప్పుచు ఇట్లు చెప్పెను. దేవతులు,
మానవులు, ఇతరప్రాణులు జీవించియుండుటకు కారణమైన వస్తువు తానే అని గ్రహించవలెను - భగవంతుడు
అన్ని జీవులలోను ఉండుటవలననే వారు జీవించియున్నారు అని కూడ గ్రహించవలెను.)
“తపసా కిల్బిషం హంతి
విద్యయా అమృతమశ్నుతే |” (ఇతి మనుః)
(తపస్సుచేత
పాపములు తొలగును, విద్యచేత - బ్రహ్మవిద్యచేత - బ్రహ్మజ్ఞానము చేత అమృతత్వమును పొందును - అనగా
మరణములేని స్థితిని, తిరిగి జన్మలేకుండుటను, మోక్షమును - పొందును.)
“వివశేన ప్రయత్నేన జ్ఞానేనా జ్ఞాతతోపివా
|
నామ స్మరణతో పాపో
విద్వానమృతమశ్నుతే ||“.
(ప్రయత్నముచేసిగాని,
అప్రయత్నముగా గాని, తెలిసినగాని, తెలియకగాని భగవంతుని నామస్మరణ చేసిన విద్వాంసుడు అమృతమును - అనగా,
మోక్షమును - పొందును.)
“విద్యాంచావిద్యాంచ యస్తు తద్వేదోభయః
తతః |
అవిద్యయా
మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే ||“.
(విద్యను
అవిద్యను తెలుసుకొనవలెను - అట్లు రెండింటిని తెలుసుకొనిన అవిద్యచేత మృత్యువుచే అంతమయ్యే
దుఃఖములన్నింటిని దాటి, విద్యచేత అమృతస్వరూపమైన మోక్షమును పొందును - అవిద్య అనగా లౌకికవిద్య, విద్య
యనగా బ్రహ్మవిద్య, బ్రహ్మజ్ఞానము.)
“మృతం స్యాద్యాచితం
చైక్ష్యమమృతస్యాద యాచితం”. (మనుః)
(ఒకరిని
యాచించక కలుగు భిక్షము - అన్నము మొదలగునవి - అమృతముతో సమానము - అమృతమే - ఒకరిని యాచించగా
కలిగినది మృత్యువుతో సమానము.)
విషమప్యమృతం క్వచిత్
భవేదమృతం వా విషమీశ్వరేచ్ఛయా |“.
(భగవంతుని
యనుగ్రహముకొలది ఒక్కొకచోట విషము అమృతముగను, అమృతము విషముగను పరిణమించును - ఫలమిచ్చును -
మాహాభక్తుడైన ప్రహ్లాదునికి త్రాగమని తండ్రి ఇప్పించిన విషమున్నూ, విషజంతువులైన పాములచేత
కరిపించుటవలనకలిగిన విషమున్నూ భగవత్కృప ప్రహ్లాదునియందు ఉండుటచేత అవి అతనని చంపక జీవమును
పోషించు అమృతముగా మారెను.)
దేవైః సేవ్యం పీయూషం;
సుధ. (దేవతులు సేవించునది, త్రాగునది, పీయూషము; సుధ - అమృతము.)
రసః, సన్మాత్రిత్వా దమృతం.
(రసము;
అది సన్మాత్రమే కనుక అమృతము - సత్ అనగా త్రికాలములందుండునది, భగవంతుడు - రసము భగవంతుడే
- అందుచేత రసము అమృతము - నశింపనిది -)
“రసో
(అ)హమప్సు కౌంతేయ”. (శ్రీమద్భగవద్గీత- 7 - 8)
(నోటిలోనున్న
రసము నేనే - భగవంతుడే) రసము - “అపాంసారః” నీటిలోని సారము రసము - అన్ని పదార్థములలోని రసము
జలముతోకలిసి. జలరూపముగా ప్రాణులచే సేవింపబడుచున్నది - ఆ రసము భగవంతుడే అగుటవలన దానిద్వారా
ప్రాణులకు భగవంతుడు - స్థితికాలములో - పోషించుచున్నాడు.)
అమృతవద్భోగ్యం కల్యాణ గుణ
జాతం.
(అమృతమువలె భోగించవలసినది,
సేవించవలసినది – కల్యాణగుణము గలవన్నియు ఇట్టివే.)
రుచికరమైనది - నేయి, సుధి, పాలు,
నీరు -
పంచామృతములలోనొకటి -
నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె.
Transliteration
mōkṣaṃ
- muktiḥ, kaivalyaṃ - (mōkṣamu, mukti, kaivalyamu -vīṭini vēru vērugā
cūḍumu.)
maraṇa śūnyaṃ,
maraṇarāhityaṃ; maṛtyu varjitaṃ.
(cāvulēnidi; mṛtyuvu lēnidi
- mōkṣamu.)
amaraṇa
dharmaṃ, maraṇādi dharma rahitaṃ.
(maraṇa
dharmamu lēnidi; maraṇamu modalagu dharmamulu - guṇamulu lēnidi.)
avināśi
svabhāvaṃ; avināśitvāt amṛtaṃ.
(naśiṃpani
svabhāvaṃ kaladi - “saccidānaṃdaṃ brahma” - sat anagā mūḍu kālamulaṃdu
uṃḍuvāḍu brahma. aṃducēta naśiṃpanivāḍu.)
maraṇādi
bhaya vairalyāt amṛtaṃ. (cāvu modalagu bhayamu lēnidi.)
jananamaraṇa
rāhityaṃ, mōkṣaṃ. (cāvu puṭṭukalu lēnidi - mōkṣamu.)
janma
jarāmaraṇādi prākṛta dharmarahitaṃ, amṛtaṃ ātmānaṃ,
(cāvu
puṭṭukalu, musalitanamu modalagunavi, prakṛtiki saṃbaṃdhiṃcina
dharmamulu lēnidi - ātma.)
kāla
paricchinnaṃ; mṛtyādi saṃsāra nāśakaṃ.
(kālamucēta
paricchinnamu kānidi - idi innāḷḷē uṃḍunu anu kālaparimitilēnidi;
śāśvatamugā nuṃḍunadi. jananamaraṇādi rūpamaina saṃsāramunu naśiṃpa
cēyunadi.)
namṛtaṃ amṛtaṃ,
maraṇa nivartakaḥ -
(cāvulēnidi;
cāvunu tappiṃcunadi; cāvulēkuṃḍacēyunadi.)
niśrēya sahētuḥ,
upāsakānāṃ ajarāmaratva hētuḥ -
(niśrēyasakāraṇamu;
upāsakulaku jarāmaraṇamulu - jananamu maraṇamu - lēkuṃḍuṭaku
kāraṇamainadi.)
svargaṃ, na
vidyatē maraṇaṃ yatra ityutsattēḥ.
(maraṇamu
ekkaḍa lēkuṃḍunō adi amṛtamu; svargamu -) (svargamukūḍa
naśiṃcavalasinadē.)
maraṇa
rahita ātmasthitiḥ. (ātmayokka cāvulēni sthiti.)
akṣaraṃ paramaṃ padaṃ.
(naśiṃcanidi;
paramamaina utkṛṣṭamaina padamu, sthānamu - puṇyātmulu, bhaktulu,
yōgīśvarulu modalaguvāru poṃdatagina sthānamu, mōkṣamu -.)
vikalēbara
kaivalyaṃ - (śarīramu lēni kaivalyamu - kēvalamu ātmatattvamai yuṃḍuṭa.)
(cūḍumu - ‘kaivalyamu’.)
“sarvadōṣa
rahitatvēna pratītaṃ paramātmānāṃ, dēvatātma bhāvaṃ - taddhi amṛta
mucyatē yaddēvatātmagamanaṃ” (śrīśaṃkaraḥ)
(ē
vidhamaina dōṣamulu lēkapōvuṭacēta paramātma amṛtamani
ceppabaḍucunnadi.)
“yattu caṃcalatā hīnaṃ
tanmanō (a)mṛtamucyatē |
tadhaivaca
tapaḥ śāstra siddhāṃtē mōkṣa ucyatē ||“. (mahōpaniṣat - 4 - 101)
(manassu
caṃcalamu gākayuṃḍuṭē amṛtamani ceppabaḍinadi. ā prakāramugānē śāstra
siddhāṃtaprakāramu aṭuvaṃṭi manassugala tapassu mōkṣamani
ceppabaḍucunnadi.)
saccidānaṃda rūpaṃ
brahma.
(sadrūpuḍu,
cidrūpuḍu, ānaṃdarūpuḍu - mōkṣarūpuḍu ayina - parabrahma.)
“tvaṃ tadāpaḥ āpō
jyōtirasō (a)mṛtaṃ brahma -
(nīvē
ā jalamu, ā jalamē jyōtissu, rasamu, amṛtamu - parabrahmamu -.)
“amṛtaṃcaiva
mṛtyuśca sadasaccāha marjuna”. (śrīmadbhagavadgīta- 9 - 19)
(amṛtamu, mṛtyuvu,
sat. asat nēnē - bhagavaṃtuḍē.)
“dēvānāmamṛtaṃ,
sarvaprāṇināṃ jīvanaṃ ca vā” (gītābhāvaprakāśamu - 9 - 130)
(dēvatulu
maraṇamu lēkuṃḍuṭaku puccukonu amṛtamu nēnu. ā prakāramugānē sakala
jīvarāśulu jīviṃciyuṃḍuṭaku amṛtamanu jīvanamu nēnē śrīkṛṣṇabhagavānuḍu
tana vibhūtulanu ceppucu iṭlu ceppenu. dēvatulu, mānavulu, itaraprāṇulu
jīviṃciyuṃḍuṭaku kāraṇamaina vastuvu tānē ani grahiṃcavalenu -
bhagavaṃtuḍu anni jīvulalōnu uṃḍuṭavalananē vāru jīviṃciyunnāru ani kūḍa
grahiṃcavalenu.)
“tapasā
kilbiṣaṃ haṃti vidyayā amṛtamaśnutē |” (iti manuḥ)
(tapassucēta
pāpamulu tolagunu, vidyacēta - brahmavidyacēta - brahmajñānamu cēta
amṛtatvamunu poṃdunu - anagā maraṇamulēni sthitini, tirigi
janmalēkuṃḍuṭanu, mōkṣamunu - poṃdunu.)
“vivaśēna prayatnēna
jñānēnā jñātatōpivā |
nāma smaraṇatō pāpō
vidvānamṛtamaśnutē ||“.
(prayatnamucēsigāni,
aprayatnamugā gāni, telisinagāni, teliyakagāni bhagavaṃtuni nāmasmaraṇa
cēsina vidvāṃsuḍu amṛtamunu - anagā, mōkṣamunu - poṃdunu.)
“vidyāṃcāvidyāṃca yastu
tadvēdōbhayaḥ tataḥ |
avidyayā mṛtyuṃ
tīrtvā vidyayāmṛtamaśnutē ||“.
(vidyanu
avidyanu telusukonavalenu - aṭlu reṃḍiṃṭini telusukonina avidyacēta
mṛtyuvucē aṃtamayyē duḥkhamulanniṃṭini dāṭi, vidyacēta amṛtasvarūpamaina
mōkṣamunu poṃdunu - avidya anagā laukikavidya, vidya yanagā brahmavidya,
brahmajñānamu.)
“mṛtaṃ
syādyācitaṃ caikṣyamamṛtasyāda yācitaṃ”. (manuḥ)
(okarini
yāciṃcaka kalugu bhikṣamu - annamu modalagunavi - amṛtamutō samānamu -
amṛtamē - okarini yāciṃcagā kaliginadi mṛtyuvutō samānamu.)
viṣamapyamṛtaṃ
kvacit bhavēdamṛtaṃ vā viṣamīśvarēcchayā |“.
(bhagavaṃtuni
yanugrahamukoladi okkokacōṭa viṣamu amṛtamuganu, amṛtamu viṣamuganu
pariṇamiṃcunu - phalamiccunu - māhābhaktuḍaina prahlāduniki trāgamani
taṃḍri ippiṃcina viṣamunnū, viṣajaṃtuvulaina pāmulacēta
karipiṃcuṭavalanakaligina viṣamunnū bhagavatkṛpa prahlāduniyaṃdu
uṃḍuṭacēta avi atanani caṃpaka jīvamunu pōṣiṃcu amṛtamugā mārenu.)
dēvaiḥ
sēvyaṃ pīyūṣaṃ; sudha. (dēvatulu sēviṃcunadi, trāgunadi, pīyūṣamu; sudha
- amṛtamu.)
rasaḥ, sanmātritvā
damṛtaṃ.
(rasamu;
adi sanmātramē kanuka amṛtamu - sat anagā trikālamulaṃduṃḍunadi,
bhagavaṃtuḍu - rasamu bhagavaṃtuḍē - aṃducēta rasamu amṛtamu -
naśiṃpanidi -)
“rasō
(a)hamapsu kauṃtēya”. (śrīmadbhagavadgīta- 7 - 8)
(nōṭilōnunna
rasamu nēnē - bhagavaṃtuḍē) rasamu - “apāṃsāraḥ” nīṭilōni sāramu rasamu
- anni padārthamulalōni rasamu jalamutōkalisi. jalarūpamugā prāṇulacē
sēviṃpabaḍucunnadi - ā rasamu bhagavaṃtuḍē aguṭavalana dānidvārā
prāṇulaku bhagavaṃtuḍu - sthitikālamulō - pōṣiṃcucunnāḍu.)
amṛtavadbhōgyaṃ kalyāṇa guṇa
jātaṃ.
(amṛtamuvale
bhōgiṃcavalasinadi, sēviṃcavalasinadi – kalyāṇaguṇamu galavanniyu
iṭṭivē.)
rucikaramainadi - nēyi,
sudhi, pālu, nīru -
paṃcāmṛtamulalōnokaṭi
- nīru, pālu, perugu, neyyi, tēne.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.