(మరణించని ధర్మము, స్వభావము కలిగియుండుట; అమృతధర్మము కలిగియుండుట - ఎల్లపుడు మార్పులేక ఒకే స్వభావము కలిగియుండుట; నాశము లేకయుండుట, మోక్షము.)
విదేహ కైవల్యం. (దేహములేకయుండి కేవలుడైన పరమాత్మయందు కేవల స్థితి -.)
బ్రహ్మమాత్రాపస్థిత లక్షణ కైవల్యం.
(ప్రకృతి, ప్రకృతివికారములు - వీటితోకలియక పరమాత్మ తానొక్కడేకేవలముగా ఉన్నస్థితి కైవల్యము.)
(శరీరములేకుండా, స్వస్వరూపముతో, మఱియొకదానితో కలియక ఉండుస్థితి.)
అమృతత్వమును పొందుటకు మార్గములు : -
(“మీదికి తీసుకొని పోబడుట వలన అమృతత్వమును పొందును” అని చెప్పబడియుండుట వలన అమృతత్వము పరబ్రహ్మ యందే (మీదనే) కలుగును. కార్యము నశించి దాని కారణమందు లీనమగుట అమృతత్వము కాదు.)
(ఇంద్రియములకు విషయములతో గల సంబంధము క్షణభంగురము - వచ్చుచూ, పోవుచుండును. వీటివలన సుఖదుఃఖములు కలుగుచుండును; కలకాలము ఉండునవి కావు కనుక వాటిని సహించుము. సుఖదుఃఖములందు ఎవడు వికారమును పొందక ఒకేరీతిగ నుండునో వాడు అమృతత్వమను శాశ్వతపదమగు మోక్షమునకు అర్హుడగును.)
(దేహము కలుగుటకు కారణమైన సత్వరజస్తమో గుణములు మూడింటిని అతిక్రమించినవాడు, సంసారలక్షణములగు జననమరణములు, ముసలితనము, వాటివలన కలుగు దుఃఖములనుండి విడువబడినవాడై అమృతరూపమైన - చావులేని - మోక్షమును పొందును.)
(కామ్యకర్మలు మొదలగునవి చేయుట వలన కాని, సంసారములోపడి సంతానమును కనుటచే గాని, ధనసంపాదన వలన కాని అమృతత్వము - మృతిలేని శాశ్వతమైన మోక్షపదము - లభించదు. ఒక్క త్యాగము చేతనే అమృతత్వమును పొందుదురు.)
(భగవంతుని యందు తప్ప మఱి దేని యందును లేనటువంటి అనన్యప్రేమ గల భగవద్భక్తునియొక్క హృదయమందెప్పటికప్పుడు క్రొత్త క్రొత్తదగు - ఎప్పుడూ క్రొత్తదిగానే యుండు – భగవంతుని యడల ప్రేమ భక్తికి సంబంధించిన వాసన యొకటే మిగిలి యుండును. ఇతర విధమైన వాసన ఏదియు నుండదు. అతికష్టము మీదకాని లభించని - దుర్లభమైన - వాసన చేతనే, - ఇట్టి వాసన ఒకటే కలిగియుండుట చేతనే, మునుల మనసులను హరించువాడగు భగవంతునియొక్క లీల చేత ఈ ఒక్కటే సాధనముగా చేసుకొని, భక్తుడు, కర్మబంధముచే కూడుకున్న జననమరణములు చక్రమువలె కలిగించు సంసారమునుండి విముక్తుడగుచున్నాడు. అట్టి భగవద్భక్తుడు ఎల్లపుడూ భగవంతునియొక్క పార్శ్వమందే - దగ్గఱనే - నివసించును. భగవంతుడుకూడా అట్టి ప్రేమ భక్తిగల భగవద్భ క్తుని పార్శ్వమందు నిలుచును. ఈ ప్రకారముగా ప్రేమీభక్తిగల ఆ భగవద్భక్తునితో ప్రేమాస్పదుడైన భగవంతుని చలింపని సంయోగమే యదార్థముగా అమృతత్వము. తనకు ప్రియుడగు భక్తుని భక్తిపొంది భగవంతుడు పూర్ణకాముడగును - ఈ పూర్ణకామత్వమే అతని యొక్క అమృతత్వము.)
(పరబ్రహ్మ ధ్యానమందు నిష్టుడై యున్నవాడు - ఒంకారోపాసకుడు - బ్రహ్మ నిష్టుడు – అమృతత్వమును పొందును.)
(maraṇiṃcani dharmamu, svabhāvamu kaligiyuṃḍuṭa; amṛtadharmamu kaligiyuṃḍuṭa - ellapuḍu mārpulēka okē svabhāvamu kaligiyuṃḍuṭa; nāśamu lēkayuṃḍuṭa, mōkṣamu.)
vidēha kaivalyaṃ. (dēhamulēkayuṃḍi kēvaluḍaina paramātmayaṃdu kēvala sthiti -.)
brahmamātrāpasthita lakṣaṇa kaivalyaṃ.
(prakṛti, prakṛtivikāramulu - vīṭitōkaliyaka paramātma tānokkaḍēkēvalamugā unnasthiti kaivalyamu.)
(śarīramulēkuṃḍā, svasvarūpamutō, maṟiyokadānitō kaliyaka uṃḍusthiti.)
amṛtatvamunu poṃduṭaku mārgamulu : -
(“mīdiki tīsukoni pōbaḍuṭa valana amṛtatvamunu poṃdunu” ani ceppabaḍiyuṃḍuṭa valana amṛtatvamu parabrahma yaṃdē (mīdanē) kalugunu. kāryamu naśiṃci dāni kāraṇamaṃdu līnamaguṭa amṛtatvamu kādu.)
(iṃdriyamulaku viṣayamulatō gala saṃbaṃdhamu kṣaṇabhaṃguramu - vaccucū, pōvucuṃḍunu. vīṭivalana sukhaduḥkhamulu kalugucuṃḍunu; kalakālamu uṃḍunavi kāvu kanuka vāṭini sahiṃcumu. sukhaduḥkhamulaṃdu evaḍu vikāramunu poṃdaka okērītiga nuṃḍunō vāḍu amṛtatvamanu śāśvatapadamagu mōkṣamunaku arhuḍagunu.)
(dēhamu kaluguṭaku kāraṇamaina satvarajastamō guṇamulu mūḍiṃṭini atikramiṃcinavāḍu, saṃsāralakṣaṇamulagu jananamaraṇamulu, musalitanamu, vāṭivalana kalugu duḥkhamulanuṃḍi viḍuvabaḍinavāḍai amṛtarūpamaina - cāvulēni - mōkṣamunu poṃdunu.)
(kāmyakarmalu modalagunavi cēyuṭa valana kāni, saṃsāramulōpaḍi saṃtānamunu kanuṭacē gāni, dhanasaṃpādana valana kāni amṛtatvamu - mṛtilēni śāśvatamaina mōkṣapadamu - labhiṃcadu. okka tyāgamu cētanē amṛtatvamunu poṃduduru.)
(bhagavaṃtuni yaṃdu tappa maṟi dēni yaṃdunu lēnaṭuvaṃṭi ananyaprēma gala bhagavadbhaktuniyokka hṛdayamaṃdeppaṭikappuḍu krotta krottadagu - eppuḍū krottadigānē yuṃḍu – bhagavaṃtuni yaḍala prēma bhaktiki saṃbaṃdhiṃcina vāsana yokaṭē migili yuṃḍunu. itara vidhamaina vāsana ēdiyu nuṃḍadu. atikaṣṭamu mīdakāni labhiṃcani - durlabhamaina - vāsana cētanē, - iṭṭi vāsana okaṭē kaligiyuṃḍuṭa cētanē, munula manasulanu hariṃcuvāḍagu bhagavaṃtuniyokka līla cēta ī okkaṭē sādhanamugā cēsukoni, bhaktuḍu, karmabaṃdhamucē kūḍukunna jananamaraṇamulu cakramuvale kaligiṃcu saṃsāramunuṃḍi vimuktuḍagucunnāḍu. aṭṭi bhagavadbhaktuḍu ellapuḍū bhagavaṃtuniyokka pārśvamaṃdē - daggaṟanē - nivasiṃcunu. bhagavaṃtuḍukūḍā aṭṭi prēma bhaktigala bhagavadbha ktuni pārśvamaṃdu nilucunu. ī prakāramugā prēmībhaktigala ā bhagavadbhaktunitō prēmāspaduḍaina bhagavaṃtuni caliṃpani saṃyōgamē yadārthamugā amṛtatvamu. tanaku priyuḍagu bhaktuni bhaktipoṃdi bhagavaṃtuḍu pūrṇakāmuḍagunu - ī pūrṇakāmatvamē atani yokka amṛtatvamu.)
(parabrahma dhyānamaṃdu niṣṭuḍai yunnavāḍu - oṃkārōpāsakuḍu - brahma niṣṭuḍu – amṛtatvamunu poṃdunu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.