← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంశ aṃśa

Original — తెలుగు
  1. కళ; భాగము; వంతు.

  2. ఏకద్రవ్యైక దేశత్వం హి అంశత్వం. (ఒకేవస్తువు ఒకే దేశ మందుండుట అంశత్వము.)

  3. అంశత్వం నామ ఏకవస్త్వేక దేశత్వం.

(అంశత్వమనగా ఒకే వస్తువు ఒకే దేశమందుండుట - ఒకే చోట నుండుట.)

  1. “మ మైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః” (శ్రీమద్భగవద్గీత - 15 - 18)

(నా యొక్క అంశయే జీవలోకములో జీవుడై యున్నాడు. అగ్ని నుండి బయలు వెడలు విస్ఫులింగముల వలె - అగ్ని తునకలవలె - పరమాత్మ అంశయే జీవలోకములో, ప్రతి జీవిలోను జీవరూపముగా నున్నది. పరమాత్మ అంశి - అంశములు కలది - జీవుడు పరమాత్మయొక్క అంశ. ఇందువలననే జీవ, పరమాత్మలకు - జీవేశ్వరులకు - అంశాంశి సంబంధము.)

  1. “తే సర్వే సర్వ భూతస్య విష్ణోరంశ సముద్భవాః” (విష్ణు పురాణము)

(వారందఱూ, సర్వభూతములు తానే అయిన – సర్వము తానే అయిన - విష్ణువు యొక్క అంశ వలన పుట్టినవారు.)

  1. “విష్టభ్యాహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్ ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 42)

(“వ్యా ప్యైక దేశమాత్రేణ జగత్సర్వమహం స్థితః”) (గీతాభావ ప్రకాశము -10 - 171)

ఈ జగత్తు అంతయు ఒకే చోట ఒకే వస్తువుగా ఉన్నదానినిగా నేను నా అంశతో ప్రవేశించి వ్యాపించి యున్నాను. ఇదంతా నా అంశయే ఇతరమేమీ లేదు. (పరమాత్మ యొక్క ఒకే ఒక అంశ చేతనే ఈ విశ్వమంతయు ఉత్పత్తి అయినది. మొదట - సృష్టికిపూర్వము - భగవంతుడు ఒకడే ఉండెను. అతనిలోనుండి, ఒకదానిలోనుండి ఒకటిగా, మహత్తత్త్వము మొదలు గడ్డిపోచ వఱకు గల వస్తువులన్నియు పుట్టినవి. అనగా, యీ ప్రపంచములోని వస్తువులన్నియు పుట్టుకు ఒకే ఒకటి కారణము. అదియే భగవంతుడు. ఒక బీజములోనుండి ఒక మొలక పుట్టి, అది పెద్ద చెట్టుగా పెరిగి, దాని వలన మొదటి బీజము వంటి బీజములు పుట్టి, వాటిలో ఒక్కొక్క బీజము మఱల ఒక్కొక్కచెట్టు అగుచు ఈ ప్రకారముగా ఆ మొదటి బీజమే అనంతముగా వృద్ధి పొందుచున్నట్లు ఈ సృష్టి మొదటిలో భగవంతునిలో నుండి ఒక దానిలో నుండి ఒకటిగా పుట్టిన సమస్త వస్తువులుగా అనంతముగా పుట్టి యీ ప్రపంచము అయినది. అందుచేత ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క ఒకే ఒక అంశ వలన - బీజము వలన - విస్తరించి యున్నది - మొదటి బీజములోని సత్తాస్ఫూర్తియే తర్వాత పుట్టిన బీజములన్నింటిలోను ఉండి సృష్టిని వ్యాపింప చేయును.

“బీజం మాం సర్వభూతానాం విధ్ధి పార్ధ సనాతనం |” - (శ్రీమద్భగవద్గీత - 7 -10)

(“నేను సృష్టికి ఆది బీజమునే కాకుందా, తర్వాత పుట్టిన ప్రతి వస్తువునకు అవి పుట్టుటకు బీజము నేనే. అన్ని కార్యములకు కారణము నేనే, అందుచేత అన్నిబీజములు నేనే. ఆ బీజములన్నింటి లోను నా అంశయే యున్నది”. అందుచేత భగవంతుని యొక్క ఒకే ఒక అంశచేతనే యీ జగత్తు అంతా పుట్టి, పెరిగి, వ్యాపించి, నిలబడియున్నది; అనగా ఒక్క భగవంతుడే, అతనియొక్క ఒకే ఒకటి అయిన అంశ ఈ జగత్తు అంతటిని అవేశించియున్నది - ప్రపంచరూపముగా గాని, దానిలోని ఒక్కొక్క వస్తురూపముగా గాని, వాటిలోనున్న సత్తాస్ఫూర్తి గాని - చైతన్య రసముగాని - ఒకటే. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా యిప్పుడు ఈ సృష్టి అంతటిలోను ఉన్న అన్ని వస్తువులు, వాటికారణ వస్తువులు, సృష్టి ప్రారంభములో ఒకే ఒక వస్తువునుండి పుట్టినవి అని అభిప్రాయ పడుచున్నారు.)

  1. శ్రీమద్భగవద్గీతలో చెప్పబడిన పై విషయమే శ్రుతిలో ఈ ప్రకారముగా చెప్పబడినది : - “పాదో అస్య విశ్వ భూతాని” (పురుష సూక్తము)

(ఈ సమస్త భూతములు ఈశ్వరుని యొక్క పాదము, అంశ, భాగము)

  1. జీవుడు ఈశ్వరాంశమే అయినను - తత్సమానశక్తి గల వాడే అయినను - జీవునిగా నున్నపుడు అవిద్యావశమున ఆ శక్తి అంతర్హితమైనది. “అహం బ్రహ్మాస్మి” అను మహావాక్యము నర్ధము చేసుకొని, అవలంబించి తధ్థ్యానము వలన జీవుడు ప్రకృతిని మించి, తన శక్తిని గ్రహించి, పొందగలడు. అప్పుడు జీవుడు పరమాత్మతో ఏకమగును.- అనగా పరమాత్మనుండి వేరయిన అంశ మరల పరమాత్మలో (అంశిలో) చేరి లీనమై (అంశిలో) చేరి లీనమైపోవును. (పరబ్రహ్మ ప్రకృతితోను దాని సత్వ రజ స్తమో గుణములతోను కలియుటచేత ఒక విధమైన ఆవరణచే కప్పబడి, తన దివ్య శక్తిని మఱచి, ప్రకృతికి వశుడై జీవరూపములో తిరుగుచు, సంసారములో పడి దానికి సంబంధించిన బాధల ననుభవించుచూ, శాస్త్రము చదువుట వలన సంసారమును విడిచి “అహం బ్రహ్మాస్మి” (నేనే పరబ్రహ్మను అయితిని) అను జ్ఞానము సంపాదించి, యీ ప్రకృతి సంబంధము వదలి, తన తొలిరూపమైన కేవలత్వము - కైవల్యము - అనగా, ప్రకృతికి సంబంధించిన వస్తువు దేనితోను కలియక ఉండు స్థితి - ఏకత్వమును పోంది తన అంశి అయిన పరబ్రహ్మముతో కలిసి దానిలో లీనమైపోవును, తన అంశి యొక్క అంశయే తానుగనుక.)

  2. అంశైః శక్తి భిః భజతే అధితిష్టతి సర్వాన్ స్తంబాది సర్వపర్యంతాన్ ఇత్యంశ భాగః - పరిపూర్ణరూపం.

(స్తంబము మొదలు అన్నింటిలోను తన శక్తులతో అధిష్టించి యుండువాడు - పరిపూర్ణరూపము గలవాడు.)

  1. అంశేన పురుష రూపేణ మాయయా భోగో భజనం ఈక్షణం యస్యసః

(అంశ అను తన పురుషరూపముతో మాయతోగూడి భోగించువాడు. ప్రకృతి - మాయ - పురుష సం యోగము వలననే సృష్టి జరుగుచున్నది.)

  1. “అంశేన మాయాయాః గుణావతారరూపాః భోగాః భేదాః యస్య సః.” (తన అంశచేత మాయ యొక్క త్రిగుణములకు - సత్వ రజస్తమములకు - సంబంధించిన అవతార రూపములను అనుభవించువాడు)

  2. అంశాః ఏవ మత్స్యకూర్మాది రూపాః భజనీయాః నతుసాక్షాత్ స్వరూపం యస్యసః - (మత్స్యావతరము, కూర్మావతారము మొదలగు అవతార రూపములు తన అంశ వలననే ధరించినవి. ఆ రూపములు భజనీయములు కాని పరమాత్మయొక్క సాక్షాత్ స్వరూపముకాదు, స్వస్వరూపముకాదు.)

Transliteration
  1. kaḷa; bhāgamu; vaṃtu.

  2. ēkadravyaika dēśatvaṃ hi aṃśatvaṃ. (okēvastuvu okē dēśa maṃduṃḍuṭa aṃśatvamu.)

  3. aṃśatvaṃ nāma ēkavastvēka dēśatvaṃ.

(aṃśatvamanagā okē vastuvu okē dēśamaṃduṃḍuṭa - okē cōṭa nuṃḍuṭa.)

  1. “ma maivāṃśō jīvalōkē jīvabhūtaḥ sanātanaḥ” (śrīmadbhagavadgīta - 15 - 18)

(nā yokka aṃśayē jīvalōkamulō jīvuḍai yunnāḍu. agni nuṃḍi bayalu veḍalu visphuliṃgamula vale - agni tunakalavale - paramātma aṃśayē jīvalōkamulō, prati jīvilōnu jīvarūpamugā nunnadi. paramātma aṃśi - aṃśamulu kaladi - jīvuḍu paramātmayokka aṃśa. iṃduvalananē jīva, paramātmalaku - jīvēśvarulaku - aṃśāṃśi saṃbaṃdhamu.)

  1. “tē sarvē sarva bhūtasya viṣṇōraṃśa samudbhavāḥ” (viṣṇu purāṇamu)

(vāraṃdaṟū, sarvabhūtamulu tānē ayina – sarvamu tānē ayina - viṣṇuvu yokka aṃśa valana puṭṭinavāru.)

  1. “viṣṭabhyāhamidaṃ kṛtsna mēkāṃśēna sthitō jagat ||” (śrīmadbhagavadgīta - 10 - 42)

(“vyā pyaika dēśamātrēṇa jagatsarvamahaṃ sthitaḥ”) (gītābhāva prakāśamu -10 - 171)

ī jagattu aṃtayu okē cōṭa okē vastuvugā unnadāninigā nēnu nā aṃśatō pravēśiṃci vyāpiṃci yunnānu. idaṃtā nā aṃśayē itaramēmī lēdu. (paramātma yokka okē oka aṃśa cētanē ī viśvamaṃtayu utpatti ayinadi. modaṭa - sṛṣṭikipūrvamu - bhagavaṃtuḍu okaḍē uṃḍenu. atanilōnuṃḍi, okadānilōnuṃḍi okaṭigā, mahattattvamu modalu gaḍḍipōca vaṟaku gala vastuvulanniyu puṭṭinavi. anagā, yī prapaṃcamulōni vastuvulanniyu puṭṭuku okē okaṭi kāraṇamu. adiyē bhagavaṃtuḍu. oka bījamulōnuṃḍi oka molaka puṭṭi, adi pedda ceṭṭugā perigi, dāni valana modaṭi bījamu vaṃṭi bījamulu puṭṭi, vāṭilō okkokka bījamu maṟala okkokkaceṭṭu agucu ī prakāramugā ā modaṭi bījamē anaṃtamugā vṛddhi poṃducunnaṭlu ī sṛṣṭi modaṭilō bhagavaṃtunilō nuṃḍi oka dānilō nuṃḍi okaṭigā puṭṭina samasta vastuvulugā anaṃtamugā puṭṭi yī prapaṃcamu ayinadi. aṃducēta ī prapaṃcamaṃtā paramātma yokka okē oka aṃśa valana - bījamu valana - vistariṃci yunnadi - modaṭi bījamulōni sattāsphūrtiyē tarvāta puṭṭina bījamulanniṃṭilōnu uṃḍi sṛṣṭini vyāpiṃpa cēyunu.

“bījaṃ māṃ sarvabhūtānāṃ vidhdhi pārdha sanātanaṃ |” - (śrīmadbhagavadgīta - 7 -10)

(“nēnu sṛṣṭiki ādi bījamunē kākuṃdā, tarvāta puṭṭina prati vastuvunaku avi puṭṭuṭaku bījamu nēnē. anni kāryamulaku kāraṇamu nēnē, aṃducēta annibījamulu nēnē. ā bījamulanniṃṭi lōnu nā aṃśayē yunnadi”. aṃducēta bhagavaṃtuni yokka okē oka aṃśacētanē yī jagattu aṃtā puṭṭi, perigi, vyāpiṃci, nilabaḍiyunnadi; anagā okka bhagavaṃtuḍē, ataniyokka okē okaṭi ayina aṃśa ī jagattu aṃtaṭini avēśiṃciyunnadi - prapaṃcarūpamugā gāni, dānilōni okkokka vasturūpamugā gāni, vāṭilōnunna sattāsphūrti gāni - caitanya rasamugāni - okaṭē. ādhunika śāstrajñulu kūḍā yippuḍu ī sṛṣṭi aṃtaṭilōnu unna anni vastuvulu, vāṭikāraṇa vastuvulu, sṛṣṭi prāraṃbhamulō okē oka vastuvunuṃḍi puṭṭinavi ani abhiprāya paḍucunnāru.)

  1. śrīmadbhagavadgītalō ceppabaḍina pai viṣayamē śrutilō ī prakāramugā ceppabaḍinadi : - “pādō asya viśva bhūtāni” (puruṣa sūktamu)

(ī samasta bhūtamulu īśvaruni yokka pādamu, aṃśa, bhāgamu)

  1. jīvuḍu īśvarāṃśamē ayinanu - tatsamānaśakti gala vāḍē ayinanu - jīvunigā nunnapuḍu avidyāvaśamuna ā śakti aṃtarhitamainadi. “ahaṃ brahmāsmi” anu mahāvākyamu nardhamu cēsukoni, avalaṃbiṃci tadhthyānamu valana jīvuḍu prakṛtini miṃci, tana śaktini grahiṃci, poṃdagalaḍu. appuḍu jīvuḍu paramātmatō ēkamagunu.- anagā paramātmanuṃḍi vērayina aṃśa marala paramātmalō (aṃśilō) cēri līnamai (aṃśilō) cēri līnamaipōvunu. (parabrahma prakṛtitōnu dāni satva raja stamō guṇamulatōnu kaliyuṭacēta oka vidhamaina āvaraṇacē kappabaḍi, tana divya śaktini maṟaci, prakṛtiki vaśuḍai jīvarūpamulō tirugucu, saṃsāramulō paḍi dāniki saṃbaṃdhiṃcina bādhala nanubhaviṃcucū, śāstramu caduvuṭa valana saṃsāramunu viḍici “ahaṃ brahmāsmi” (nēnē parabrahmanu ayitini) anu jñānamu saṃpādiṃci, yī prakṛti saṃbaṃdhamu vadali, tana tolirūpamaina kēvalatvamu - kaivalyamu - anagā, prakṛtiki saṃbaṃdhiṃcina vastuvu dēnitōnu kaliyaka uṃḍu sthiti - ēkatvamunu pōṃdi tana aṃśi ayina parabrahmamutō kalisi dānilō līnamaipōvunu, tana aṃśi yokka aṃśayē tānuganuka.)

  2. aṃśaiḥ śakti bhiḥ bhajatē adhitiṣṭati sarvān staṃbādi sarvaparyaṃtān ityaṃśa bhāgaḥ - paripūrṇarūpaṃ.

(staṃbamu modalu anniṃṭilōnu tana śaktulatō adhiṣṭiṃci yuṃḍuvāḍu - paripūrṇarūpamu galavāḍu.)

  1. aṃśēna puruṣa rūpēṇa māyayā bhōgō bhajanaṃ īkṣaṇaṃ yasyasaḥ

(aṃśa anu tana puruṣarūpamutō māyatōgūḍi bhōgiṃcuvāḍu. prakṛti - māya - puruṣa saṃ yōgamu valananē sṛṣṭi jarugucunnadi.)

  1. “aṃśēna māyāyāḥ guṇāvatārarūpāḥ bhōgāḥ bhēdāḥ yasya saḥ.” (tana aṃśacēta māya yokka triguṇamulaku - satva rajastamamulaku - saṃbaṃdhiṃcina avatāra rūpamulanu anubhaviṃcuvāḍu)

  2. aṃśāḥ ēva matsyakūrmādi rūpāḥ bhajanīyāḥ natusākṣāt svarūpaṃ yasyasaḥ - (matsyāvataramu, kūrmāvatāramu modalagu avatāra rūpamulu tana aṃśa valananē dhariṃcinavi. ā rūpamulu bhajanīyamulu kāni paramātmayokka sākṣāt svarūpamukādu, svasvarūpamukādu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.