← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంశపంచకము aṃśapaṃcakamu

Original — తెలుగు
  1. “అస్తి, భాతి, ప్రియం, రూపం, నామ చేత్యంశ పంచకం |

ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతో ద్వయం ||”

ఇతి శ్రుతేః అస్తి భాతి ప్రియ మితి యద్యత్ వ్యవహృతం తత్సచ్చిదానాందం బ్రహ్మ, యద్యత్ ప్రియం తదేవ బ్రహ్మ సుఖం ఇతి బోధ్ధవ్యం.

(ఈ కనబడుచున్న జగత్తు రెండు భాగములు : - సత్, అసత్. సత్ అనగా బ్రహ్మ, - “ఓం తత్సత్” ఇతి - ‘ఓం’ అనినను, తత్ అనినను, సత్ అనినను పరబ్రహ్మమే చెప్పబడుచున్నది. ‘అసత్’ అనగా మాయాస్వరూపమగు ప్రపంచము. అస్తి, భాతి, ప్రియం అనునవి అంశపంచకము లోని మూడు అంశలు బ్రహ్మాంశలు, మిగిలిన రెండు - నామము, రూపము అనునవి - మాయారూపములో ఉన్న జగత్తు .)

(అస్తి = కలదు; భాతి = ప్రకాశించుచున్నది; ప్రియం = ఇష్టమైనది; రూపము = కంటితో చూచుటకు వీలగునట్లు ఒక ఆకారము కలది; నామము= ఈ ప్రకారము కనబడంగ దానికి వ్యవహారము నిమిత్తము వాడుకలో ఇచ్చిన పేరు;- ఈఆకారము గలవాడు మనిషి; ఇది పశువు; ఇది పక్షి - వీడు రాముడు - అను మొదలగునవి నామములు.)

Transliteration
  1. “asti, bhāti, priyaṃ, rūpaṃ, nāma cētyaṃśa paṃcakaṃ |

ādyaṃ trayaṃ brahmarūpaṃ jagadrūpaṃ tatō dvayaṃ ||”

iti śrutēḥ asti bhāti priya miti yadyat vyavahṛtaṃ tatsaccidānāṃdaṃ brahma, yadyat priyaṃ tadēva brahma sukhaṃ iti bōdhdhavyaṃ.

(ī kanabaḍucunna jagattu reṃḍu bhāgamulu : - sat, asat. sat anagā brahma, - “ōṃ tatsat” iti - ‘ōṃ’ aninanu, tat aninanu, sat aninanu parabrahmamē ceppabaḍucunnadi. ‘asat’ anagā māyāsvarūpamagu prapaṃcamu. asti, bhāti, priyaṃ anunavi aṃśapaṃcakamu lōni mūḍu aṃśalu brahmāṃśalu, migilina reṃḍu - nāmamu, rūpamu anunavi - māyārūpamulō unna jagattu .)

(asti = kaladu; bhāti = prakāśiṃcucunnadi; priyaṃ = iṣṭamainadi; rūpamu = kaṃṭitō cūcuṭaku vīlagunaṭlu oka ākāramu kaladi; nāmamu= ī prakāramu kanabaḍaṃga dāniki vyavahāramu nimittamu vāḍukalō iccina pēru;- īākāramu galavāḍu maniṣi; idi paśuvu; idi pakṣi - vīḍu rāmuḍu - anu modalagunavi nāmamulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.