అంతరింద్రియము; లోపలి ఇంద్రియము, మనస్సు.
అంతః దేహస్యాంతః స్థిత్వా కరణం జ్ఞానసాధనం ఇత్యంతః కరణముచ్యతే.
(దేహములోపల ఉండి జ్ఞానమునకు సాధనమగుట వలన దానికి అంతఃకరణమని పేరు వచ్చినది)
(పంచభూతముల సమష్ఠి యొక్క సత్వగుణ కార్యమగుట వలన దీనిని సత్వమని అంతఃకరణమని అందురు)
అంతః = లోపలి, కరణం = ఇంద్రియము - లోపలి ఇంద్రియము - మనస్సు
అంతఃకరణం జ్ఞానోత్పత్తిహేతుః, జ్ఞానోత్పత్తిః సత్వగుణాత్. తస్మాత్ అంతఃకరణం భూతానాం సత్వ గుణకార్యం.
(అంతఃకరణము జ్ఞానోత్పత్తికి కారణము. జ్ఞానోత్పత్తి సత్వగుణమువలన కలుగును. అందుచేత అంతఃకరణము పంచభూతములయొక్క సాముదాయిక సత్వ గుణము వలన కలిగినది.)
(పంచీకరణము చేయబడని మహా భూతముల యొక్క సత్వ గుణభాగములు మూడింటి యొక్క మొత్తము చేత అంతఃకరణమును (భగవంతుడు) సృష్టించెను)
“సకలపదార్థ పరిజ్ఞాన కారణంబైన యంతఃకరణము”
“నిగద్యతే అంతఃకరణం మనోధీరహంకృతిశ్చిత్తమితి స్వవృత్తిభిః”
(దాని వృత్తులనుబట్టి – చేయు పనులను బట్టి - మనస్సు, బుధ్ధి, అహంకారము, చిత్తము అని నాలుగు విధములుగ చెప్పబడుచున్నది), (చూడుము - ‘అంతఃకరణవృత్తులు’).
(అంతఃకరణ వృత్తులు: - మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వాటికి విషయములు: - సంకల్పము చేయుట, నిశ్చయించుట, స్మరించుట, అభిమానించుట, వాటిస్థానములు :- గళము, వదనము, నాభి, హృదయము, భ్రూమధ్యము.)
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 4 - 22 - 624)
aṃtariṃdriyamu; lōpali iṃdriyamu, manassu.
aṃtaḥ dēhasyāṃtaḥ sthitvā karaṇaṃ jñānasādhanaṃ ityaṃtaḥ karaṇamucyatē.
(dēhamulōpala uṃḍi jñānamunaku sādhanamaguṭa valana dāniki aṃtaḥkaraṇamani pēru vaccinadi)
(paṃcabhūtamula samaṣṭhi yokka satvaguṇa kāryamaguṭa valana dīnini satvamani aṃtaḥkaraṇamani aṃduru)
aṃtaḥ = lōpali, karaṇaṃ = iṃdriyamu - lōpali iṃdriyamu - manassu
aṃtaḥkaraṇaṃ jñānōtpattihētuḥ, jñānōtpattiḥ satvaguṇāt. tasmāt aṃtaḥkaraṇaṃ bhūtānāṃ satva guṇakāryaṃ.
(aṃtaḥkaraṇamu jñānōtpattiki kāraṇamu. jñānōtpatti satvaguṇamuvalana kalugunu. aṃducēta aṃtaḥkaraṇamu paṃcabhūtamulayokka sāmudāyika satva guṇamu valana kaliginadi.)
(paṃcīkaraṇamu cēyabaḍani mahā bhūtamula yokka satva guṇabhāgamulu mūḍiṃṭi yokka mottamu cēta aṃtaḥkaraṇamunu (bhagavaṃtuḍu) sṛṣṭiṃcenu)
“sakalapadārtha parijñāna kāraṇaṃbaina yaṃtaḥkaraṇamu”
“nigadyatē aṃtaḥkaraṇaṃ manōdhīrahaṃkṛtiścittamiti svavṛttibhiḥ”
(dāni vṛttulanubaṭṭi – cēyu panulanu baṭṭi - manassu, budhdhi, ahaṃkāramu, cittamu ani nālugu vidhamuluga ceppabaḍucunnadi), (cūḍumu - ‘aṃtaḥkaraṇavṛttulu’).
(aṃtaḥkaraṇa vṛttulu: - manassu, buddhi, cittamu, ahaṃkāramu. vāṭiki viṣayamulu: - saṃkalpamu cēyuṭa, niścayiṃcuṭa, smariṃcuṭa, abhimāniṃcuṭa, vāṭisthānamulu :- gaḷamu, vadanamu, nābhi, hṛdayamu, bhrūmadhyamu.)
(śrīmadāṃdhra mahābhāgavatamu - 4 - 22 - 624)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.