← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతకాలము aṃtakālamu

Original — తెలుగు
  1. అంతిమ నయని; అంత్య వయసి; చరమ వయసి; మరణకాలే; ప్రళయకాలే.

(నాశకాలము; మృత్యుకాలము; తుదికాలము; అవసానదశ; మరణము; ప్రాణవియోగకాలము)

“అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్యా కళేబరం |

యః ప్రయాతి స మద్భావవం యాతి తినాస్త్యత్ర సంశయః ||” (శ్రీమద్భగవద్గీత- 8 - 5)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము :-

“మామేవ వాసుదేవం యః సగుణవాధ నిర్గుణం |

చింతయన్ సంతతంబుద్ధ్యా తత్త త్సంస్కార పాటవాత్ ||

సమస్త కరణ గ్రామ వైయగ్ర్య సమయే మృతౌ |

స్మరన్ కళేబరం ముక్త్వా (అ) హం మమేతిధియం తథా |

త్యక్త్వా ప్రాణవియోగే యః సగుణధ్యా నవాన్యది |

తథా స దేవయానేన ప్రయాతి మదుపాసకః |

మద్భావం నిర్గుణం బ్రహ్మ బ్రహ్మలోకే విరించినా |

సహ భోగావ సానే (అ) సౌ స్రాప్నోతి జ్ఞాన లాభతః |

నిర్గుణ ధ్యాస పక్షేతం ప్రయాతీత్యస్య దృష్టి తః |

నతస్య ప్రాణా ఇత్యత్రశ్రు తౌ బ్రహ్మ విదో మునేః |

ప్రాణస్యోత్క్రమణా భావే గత్యభావ ఉదీరితః |

ససాక్షా దేవ మద్భావం యాతిబ్రహ్మై వసన్ స్వయం |

నాస్త్యత్ర సంశయః కశ్చిద్బ్ర హ్మైవ బ్రహ్మ విద్యతః ||” (గీతా భావప్రకాశము - 8 - 31 - 37)

(చనిపోవుటకు ముందు వాసుదేవుడనైన నన్ను సగుణ బ్రహ్మగా గాని, నిర్గుణ బ్రహ్మగా గాని వారివారి సంస్కారపు శక్తిని బట్టి ధ్యానించుచూ; ‘నేను, నాది’ అను భావమును విడిచిపెట్టి ఎవడు ప్రాణముల విడుచునో అట్టివాడు భగవద్భక్తుడు అయి యుండి సగుణధ్యాని అయిన యడల దేవయానమార్గమున పోయి బ్రహ్మ లోకములో బ్రహ్మతోసహా భోగములను అనుభవించి తర్వాత జ్ఞానప్రాప్తి వలన నా భావమైన నిర్గుణ బ్రహ్మను పొందును. అతను నిర్గుణ ధ్యానపరుడైన యెడల అట్టివానికి ప్రాణములు పోవుట తటస్తించదు; కనుక, సాక్షాత్తుగా నన్నే పొందును. ఎందుచేతననగా “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” (బ్రహ్మ జ్ఞాని బ్రహ్మమే యగును) అని యున్నది కనుక)

“యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం |

తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః ||” (శ్రీమద్భగవద్గీత - 8 - 6)

(పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -)

“స మద్గోచర ఏవాయం నియమః కింతు సర్వతః |

యం యం దేవ విశేషం వా యత్కించి ద్వస్తు మాత్రకం |

చింత యన్నంతకాలే (అ) సౌత్యజతీహ కళేబరం |

తంతం సంస్మర్య మాణం స భావమే వైతి నా పరం ||” - - -

“పూర్వా భ్యాసార్జితా పుం సాం వాసనా స్మృతి కారణం |

సర్వదా యేన యో (అ) భ్యస్తో భావో దేవాది గోచరః |

స్మర్య మాణతయా సో (అ) oతే తంతమేవైతి నాపరం ||.” (గీతా భావ ప్రకాశము - 8 - 43, 44, 46)

(మరణ కాలమందు భగవంతుని తలచుకొను చుండిన భగవంతుని పొందును. అని చెప్పుటవలన ఒక్క భగవంతుని గుఱించియే ఇది చెప్పినట్లుకాదు. మరణకాలమందు ఏ ఇతర దేవతలను స్మరించుచు, లేక ఏ వస్తువును స్మరించుచు శరీరమును విడిచి పెట్టునో, స్మరించిన దేవతనుగాని, ఆ భావమును గాని పొందును. మరణసమయమందు ఏ భావము మనసులో ఉండిన దానినే పొందును. దీనికి కారణమేమనగగా :- పూర్వ జన్మలోని అభ్యాసము ద్వారా ఆర్జించిన వాసనే మరణకాలమందు స్మృతిగా - ధ్యానముగా, ఆలోచనగా – పరిణమించును.)

(దీనివలన తెలియ వచ్చునదేమనగా మరణమునకు ముందు, తెలివి తేటలున్నపుడే, మంచి ఆలోచనలు కలిగియుండి భగవంతుని మనసులో ధ్యానించుట వలన మోక్షము గాని, పునర్జన్మ మంచిది గాని కలుగుటకు అవకాశమున్నది.)

Transliteration
  1. aṃtima nayani; aṃtya vayasi; carama vayasi; maraṇakālē; praḷayakālē.

(nāśakālamu; mṛtyukālamu; tudikālamu; avasānadaśa; maraṇamu; prāṇaviyōgakālamu)

“aṃtakālēca māmēva smaran muktyā kaḷēbaraṃ |

yaḥ prayāti sa madbhāvavaṃ yāti tināstyatra saṃśayaḥ ||” (śrīmadbhagavadgīta- 8 - 5)

pai ślōkamunaku vyākhyānamu :-

“māmēva vāsudēvaṃ yaḥ saguṇavādha nirguṇaṃ |

ciṃtayan saṃtataṃbuddhyā tatta tsaṃskāra pāṭavāt ||

samasta karaṇa grāma vaiyagrya samayē mṛtau |

smaran kaḷēbaraṃ muktvā (a) haṃ mamētidhiyaṃ tathā |

tyaktvā prāṇaviyōgē yaḥ saguṇadhyā navānyadi |

tathā sa dēvayānēna prayāti madupāsakaḥ |

madbhāvaṃ nirguṇaṃ brahma brahmalōkē viriṃcinā |

saha bhōgāva sānē (a) sau srāpnōti jñāna lābhataḥ |

nirguṇa dhyāsa pakṣētaṃ prayātītyasya dṛṣṭi taḥ |

natasya prāṇā ityatraśru tau brahma vidō munēḥ |

prāṇasyōtkramaṇā bhāvē gatyabhāva udīritaḥ |

sasākṣā dēva madbhāvaṃ yātibrahmai vasan svayaṃ |

nāstyatra saṃśayaḥ kaścidbra hmaiva brahma vidyataḥ ||” (gītā bhāvaprakāśamu - 8 - 31 - 37)

(canipōvuṭaku muṃdu vāsudēvuḍanaina nannu saguṇa brahmagā gāni, nirguṇa brahmagā gāni vārivāri saṃskārapu śaktini baṭṭi dhyāniṃcucū; ‘nēnu, nādi’ anu bhāvamunu viḍicipeṭṭi evaḍu prāṇamula viḍucunō aṭṭivāḍu bhagavadbhaktuḍu ayi yuṃḍi saguṇadhyāni ayina yaḍala dēvayānamārgamuna pōyi brahma lōkamulō brahmatōsahā bhōgamulanu anubhaviṃci tarvāta jñānaprāpti valana nā bhāvamaina nirguṇa brahmanu poṃdunu. atanu nirguṇa dhyānaparuḍaina yeḍala aṭṭivāniki prāṇamulu pōvuṭa taṭastiṃcadu; kanuka, sākṣāttugā nannē poṃdunu. eṃducētananagā “brahmavid brahmaiva bhavati” (brahma jñāni brahmamē yagunu) ani yunnadi kanuka)

“yaṃ yaṃ vāpi smaran bhāvaṃ tyajatyaṃtē kaḷēbaraṃ |

taṃ tamē vaiti kauṃtēya sadā tadbhāva bhāvitaḥ ||” (śrīmadbhagavadgīta - 8 - 6)

(pai ślōkamunaku vyākhyānamu : -)

“sa madgōcara ēvāyaṃ niyamaḥ kiṃtu sarvataḥ |

yaṃ yaṃ dēva viśēṣaṃ vā yatkiṃci dvastu mātrakaṃ |

ciṃta yannaṃtakālē (a) sautyajatīha kaḷēbaraṃ |

taṃtaṃ saṃsmarya māṇaṃ sa bhāvamē vaiti nā paraṃ ||” - - -

“pūrvā bhyāsārjitā puṃ sāṃ vāsanā smṛti kāraṇaṃ |

sarvadā yēna yō (a) bhyastō bhāvō dēvādi gōcaraḥ |

smarya māṇatayā sō (a) otē taṃtamēvaiti nāparaṃ ||.” (gītā bhāva prakāśamu - 8 - 43, 44, 46)

(maraṇa kālamaṃdu bhagavaṃtuni talacukonu cuṃḍina bhagavaṃtuni poṃdunu. ani ceppuṭavalana okka bhagavaṃtuni guṟiṃciyē idi ceppinaṭlukādu. maraṇakālamaṃdu ē itara dēvatalanu smariṃcucu, lēka ē vastuvunu smariṃcucu śarīramunu viḍici peṭṭunō, smariṃcina dēvatanugāni, ā bhāvamunu gāni poṃdunu. maraṇasamayamaṃdu ē bhāvamu manasulō uṃḍina dāninē poṃdunu. dīniki kāraṇamēmanagagā :- pūrva janmalōni abhyāsamu dvārā ārjiṃcina vāsanē maraṇakālamaṃdu smṛtigā - dhyānamugā, ālōcanagā – pariṇamiṃcunu.)

(dīnivalana teliya vaccunadēmanagā maraṇamunaku muṃdu, telivi tēṭalunnapuḍē, maṃci ālōcanalu kaligiyuṃḍi bhagavaṃtuni manasulō dhyāniṃcuṭa valana mōkṣamu gāni, punarjanma maṃcidi gāni kaluguṭaku avakāśamunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.