యముడు
“అంతంకరోతి భూతానాం ఇతి అంతకః” (శ్రీ శంకరః)
(సకల భూతములను అంతము నొందించువాడు, నాశముచేయువాడు) - “తత్కరోతి, తదాచష్టే”
(అంతము చేయువాడు, అంతమును కలుగచేయువాడు - యముడు)
(ముఖాగ్నిచేత అన్ని లోకములను నాశము చేయువాడు, లోకములను దహించువాడు, మృత్యువు.)
(లోకములను నాశము నొందించు - అంతము నొందించు - కాలము నేను.) “కాలోహం సర్వ సమ్హర్తా” (గీతా భావ ప్రకశం -11 -109)
(ప్రళయకాలములో సృష్టిలోనున్న వస్తువులన్నింటినీ లయము నొందించువాడు భగవంతుడే. ఈ లోపుగా సమస్త భూతములను (వస్తువులను), వాటి వాటి కాలపరిమితి తీరగనే, అంతమొందించువాడు కూడ భగవంతుడే. అందుచేత అంతకుడు అనగా కాలుడు, యముని రూపములోనున్న భగవంతుడే - భగవంతుడు సర్వాత్మ.)
(ఎన్ని జీవులను చంపిననూ అంతకునకు - యమునకు - తృప్తి ఉండదు. పుట్టిన వాటినన్నింటిని యేదోకాలమందు చంపుచునే ఉండును. ఎన్ని కట్టెలు దహించినను అగ్నికి తృప్తి యుండదు, ఎన్ని నదులు - ఎంత నీరు తనలో కలిసినను సముద్రునకు తృప్తి యుండదు, ఎంతమంది పురుషులైనను స్త్రీకి తృప్తియుండదు.)
yamuḍu
“aṃtaṃkarōti bhūtānāṃ iti aṃtakaḥ” (śrī śaṃkaraḥ)
(sakala bhūtamulanu aṃtamu noṃdiṃcuvāḍu, nāśamucēyuvāḍu) - “tatkarōti, tadācaṣṭē”
(aṃtamu cēyuvāḍu, aṃtamunu kalugacēyuvāḍu - yamuḍu)
(mukhāgnicēta anni lōkamulanu nāśamu cēyuvāḍu, lōkamulanu dahiṃcuvāḍu, mṛtyuvu.)
(lōkamulanu nāśamu noṃdiṃcu - aṃtamu noṃdiṃcu - kālamu nēnu.) “kālōhaṃ sarva samhartā” (gītā bhāva prakaśaṃ -11 -109)
(praḷayakālamulō sṛṣṭilōnunna vastuvulanniṃṭinī layamu noṃdiṃcuvāḍu bhagavaṃtuḍē. ī lōpugā samasta bhūtamulanu (vastuvulanu), vāṭi vāṭi kālaparimiti tīraganē, aṃtamoṃdiṃcuvāḍu kūḍa bhagavaṃtuḍē. aṃducēta aṃtakuḍu anagā kāluḍu, yamuni rūpamulōnunna bhagavaṃtuḍē - bhagavaṃtuḍu sarvātma.)
(enni jīvulanu caṃpinanū aṃtakunaku - yamunaku - tṛpti uṃḍadu. puṭṭina vāṭinanniṃṭini yēdōkālamaṃdu caṃpucunē uṃḍunu. enni kaṭṭelu dahiṃcinanu agniki tṛpti yuṃḍadu, enni nadulu - eṃta nīru tanalō kalisinanu samudrunaku tṛpti yuṃḍadu, eṃtamaṃdi puruṣulainanu strīki tṛptiyuṃḍadu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.