← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరా రాముడు aṃtarā rāmuḍu

Original — తెలుగు
  1. “అంతరేవ ఆత్మని ఆరామః ఆరమణం క్రీడా యస్య సః” (శ్రీ శంకరః)

(లోపల - తనమనసులోనే - ఆత్మ యందు క్రీడించువాడు, బ్రహ్మానందము ననుభవించు వాడు.)

  1. “ఆత్మైకో ద్యానః స్వగుణైః ఆత్మైన సుఖవర్ధకో యస్యసః”. (శ్రీరామానుజః)

(ఆత్మయే ఉద్యానము, క్రీడించు స్థానము, తన గుణములచేత సుఖమును వృధ్ధి పొందించునది అని తలచువాడు.)

  1. “ఆరామః ప్రీతిహేతుః స్త్రీ ఆదిభిః సహ క్రీడా, తత్ యస్యాంతరేవ సో అంతరా రామః” (నీలకంఠవ్యాఖ్యా)

(అరామము, క్రీడ, విహరించుట, ప్రీతికి అనగా సంతోషమునకు కారణము, స్త్రీలు మొదలగువాటితో క్రీడించుట. అట్టి క్రీడ లోపలనే, మనసులోనే, ఆత్మయందే కలవాడు.)

  1. “అంతరాత్మన్యేవ, నతు స్త్రీ ఆది విషయే బాహ్యసుఖసాధనే అరామః ఆరమణం క్రీడా యస్య సః. అంతరా రామః - త్యక్తసర్వ పరిగ్రహత్వేన బాహ్యసుఖసాధన శూన్యః ఇత్యర్ధః” (మధుసూధనీ వ్యాఖ్యా)

(అంతరాత్మయందే క్రీడ కలుగువాడు, స్త్రీ మొదలగు బాహ్య సుఖసాధనమందు కాదు. అన్ని వస్తువులు విడిచి పెట్టుటవలన బాహ్య సుఖసాధనములేని వాడు అని అర్ధము.)

  1. ఆరా మోహి భోగస్తాన భూత ఛాయా పల్లవ పుష్ప ఫలాదిభిః స్వగుణైః సుఖవర్ధకః. ఆత్మైవ సుఖవర్ధకః ఇత్యారామ శబ్దేన ఉపచర్యతే. ఏవం భోగ్యం భోగస్తానంచ ఆత్మైవ ఇత్యుక్తః.

(ఆరామమనగా భోగస్తానమైన నీడలు, చిగుళ్ళు, పుష్పములు, ఫలములు మొదలగువాటిచే సుఖమును పొందించునది. ఆత్మ కూడ సుఖమును పొందించునదే. అందుచేత ఆత్మ ఆరామమనిపించుకొనును. ఈ ప్రకారముగా భోగించతగిన వస్తువు, భోగించు ప్రదేశము ఆత్మయే యని చెప్పబడినది. అట్టి ఆత్మ యందు క్రీడించువాడు.)

  1. ఆరామం పరదర్శనాది నిమిత్తం సుఖం.

  2. (ఆరామమనగా భగవంతుని దర్శించుటవలన కలుగు సుఖము.అందుచేత అంతరంగమందు భగవద్దర్శనమువలన కలుగుసుఖమును అనుభవించువాడు.)

  3. “ఆరామం వైభవానామభినవ సుఖపదం” - “రామచంద్రం భజే (అ) నిశం” (శ్రీరామ కర్ణామృతం - 3 - 4)

Transliteration
  1. “aṃtarēva ātmani ārāmaḥ āramaṇaṃ krīḍā yasya saḥ” (śrī śaṃkaraḥ)

(lōpala - tanamanasulōnē - ātma yaṃdu krīḍiṃcuvāḍu, brahmānaṃdamu nanubhaviṃcu vāḍu.)

  1. “ātmaikō dyānaḥ svaguṇaiḥ ātmaina sukhavardhakō yasyasaḥ”. (śrīrāmānujaḥ)

(ātmayē udyānamu, krīḍiṃcu sthānamu, tana guṇamulacēta sukhamunu vṛdhdhi poṃdiṃcunadi ani talacuvāḍu.)

  1. “ārāmaḥ prītihētuḥ strī ādibhiḥ saha krīḍā, tat yasyāṃtarēva sō aṃtarā rāmaḥ” (nīlakaṃṭhavyākhyā)

(arāmamu, krīḍa, vihariṃcuṭa, prītiki anagā saṃtōṣamunaku kāraṇamu, strīlu modalaguvāṭitō krīḍiṃcuṭa. aṭṭi krīḍa lōpalanē, manasulōnē, ātmayaṃdē kalavāḍu.)

  1. “aṃtarātmanyēva, natu strī ādi viṣayē bāhyasukhasādhanē arāmaḥ āramaṇaṃ krīḍā yasya saḥ. aṃtarā rāmaḥ - tyaktasarva parigrahatvēna bāhyasukhasādhana śūnyaḥ ityardhaḥ” (madhusūdhanī vyākhyā)

(aṃtarātmayaṃdē krīḍa kaluguvāḍu, strī modalagu bāhya sukhasādhanamaṃdu kādu. anni vastuvulu viḍici peṭṭuṭavalana bāhya sukhasādhanamulēni vāḍu ani ardhamu.)

  1. ārā mōhi bhōgastāna bhūta chāyā pallava puṣpa phalādibhiḥ svaguṇaiḥ sukhavardhakaḥ. ātmaiva sukhavardhakaḥ ityārāma śabdēna upacaryatē. ēvaṃ bhōgyaṃ bhōgastānaṃca ātmaiva ityuktaḥ.

(ārāmamanagā bhōgastānamaina nīḍalu, ciguḷḷu, puṣpamulu, phalamulu modalaguvāṭicē sukhamunu poṃdiṃcunadi. ātma kūḍa sukhamunu poṃdiṃcunadē. aṃducēta ātma ārāmamanipiṃcukonunu. ī prakāramugā bhōgiṃcatagina vastuvu, bhōgiṃcu pradēśamu ātmayē yani ceppabaḍinadi. aṭṭi ātma yaṃdu krīḍiṃcuvāḍu.)

  1. ārāmaṃ paradarśanādi nimittaṃ sukhaṃ.

  2. (ārāmamanagā bhagavaṃtuni darśiṃcuṭavalana kalugu sukhamu.aṃducēta aṃtaraṃgamaṃdu bhagavaddarśanamuvalana kalugusukhamunu anubhaviṃcuvāḍu.)

  3. “ārāmaṃ vaibhavānāmabhinava sukhapadaṃ” - “rāmacaṃdraṃ bhajē (a) niśaṃ” (śrīrāma karṇāmṛtaṃ - 3 - 4)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.