సర్వపదార్థాంతర్యామీ. (అన్నివస్తువులలోను ఉండువాడు, సర్వాంతర్యామి)
సర్వాంతరత్వాత్ అంతరః (అన్నింటి లోపల ఉండుట వల్ల అంతరుడు)
“తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్”ఇతి శృతేః
(దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను. భగవంతుడు తాను సృష్టించిన ప్రతి వస్తువులోను - పెద్దది, చిన్నది అను విచక్షణ లేక ఎంత చిన్నదానిలోనైనను - ప్రవేశించెను. తాను సృష్టించిన ప్రతీ వస్తువులోను ప్రవేశించియుండ గలిగే శక్తిన్నీ, శీలమున్నూ గలవాడు కనుకనే విష్ణువని చెప్పబడుచున్నాడు.)
(కంటికి కనబడుచున్నదిన్నీ, ఇంకా ఉన్నది అని చెప్పబడుటవలన ఉన్నట్లు -వినబడుచున్నది అగు ప్రపంచము అంతయు - వినబడుచున్నది, కనబడుచున్నదియు యగు భాగమే కాక, కనబడకుండా, వినబడకుండా ఉన్న ప్రపంచమెంతకలదో, దాని అంతటిలోను, లోపల, పైనవ్యాపించి భగవంతుడు ఉన్నాడు. అతను వ్యాపించియుండని స్థలముగాని, వస్తువుగాని సూదిమొన మోపినంతదైనను లేదు అని అర్థము.)
sarvapadārthāṃtaryāmī. (annivastuvulalōnu uṃḍuvāḍu, sarvāṃtaryāmi)
sarvāṃtaratvāt aṃtaraḥ (anniṃṭi lōpala uṃḍuṭa valla aṃtaruḍu)
“tat sṛṣṭvā tadēvānuprāviśat”iti śṛtēḥ
(dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu. bhagavaṃtuḍu tānu sṛṣṭiṃcina prati vastuvulōnu - peddadi, cinnadi anu vicakṣaṇa lēka eṃta cinnadānilōnainanu - pravēśiṃcenu. tānu sṛṣṭiṃcina pratī vastuvulōnu pravēśiṃciyuṃḍa galigē śaktinnī, śīlamunnū galavāḍu kanukanē viṣṇuvani ceppabaḍucunnāḍu.)
(kaṃṭiki kanabaḍucunnadinnī, iṃkā unnadi ani ceppabaḍuṭavalana unnaṭlu -vinabaḍucunnadi agu prapaṃcamu aṃtayu - vinabaḍucunnadi, kanabaḍucunnadiyu yagu bhāgamē kāka, kanabaḍakuṃḍā, vinabaḍakuṃḍā unna prapaṃcameṃtakaladō, dāni aṃtaṭilōnu, lōpala, painavyāpiṃci bhagavaṃtuḍu unnāḍu. atanu vyāpiṃciyuṃḍani sthalamugāni, vastuvugāni sūdimona mōpinaṃtadainanu lēdu ani arthamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.