← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరాత్మ aṃtarātma

Original — తెలుగు
  1. పరమాత్మ; జీవాత్మ, జీవుడు; మనస్సు, అంతర్యామి.

  2. సర్వ స్థూల శరీరాంతరత్వాత్ ఆత్మ బుద్ధి గోచరత్వాత్ చ అంతరాత్మా.

(సమస్త స్థూలశరీరముల లోపల ఉండుట చేతను, తన బుద్ధికే గోచరమగుటచేతను అంతరాత్మ యనబడును)

  1. “ఈశో అంతశ్చరతి బహుధా జాయమానః”

(ఈశ్వరుడు అనేక ప్రకారములుగా, అనేక రూపములుగా పుట్టుచూ, వాటిలో ప్రవేశించి, పూర్తిగా వ్యాపించి, పైకి కనబడకుండా లోపలనే సంచరించుచుండును - అందుచేత అంతరాత్మ, అంతర్యామి)

  1. “అంతశ్చరతి భూతేషు గుహా యాం విశ్వమూర్తిషు” (మంత్ర పుష్పము) (అనేక రూపములతో నున్న ఈ సమస్త భూతముల లోను చీకటిగా నుండు గుహలో దాగి ఉండి, ఉన్నట్టుగా పైకి కనబడకుండా భగవంతుడు సంచరించుచున్నాడు. అట్లు లోపల సంచరించు ఆత్మ గనుక అంతరాత్మ.)

  2. “అంగుష్ఠమాత్రః పురుషో అంతరాత్మా” (శ్వేతాశ్వ తరోపనిషత్)

(అంగుష్ఠపరిమాణముగల పురుషుడు అంతరాత్మ) - (చూడుము: - ‘అంగుష్ఠమాత్రః పురుషః -’)

  1. “ఏకో దేవః సర్వ భూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వ భూతాంతరాత్మా, కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః, సాక్షీ, చేతా, కేవలో నిర్గుణశ్చ”

(శ్వేతాశ్వతరోపనిషత్ - 6 - 11)

(ఒకడే అయిన దేవుడు సమస్త భూతములందు గూఢుడై కనుపించకుండా ఉన్నాడు. అతనే అన్నింటియందు వ్యాపించి సర్వభూతములకు అంతరాత్మయై యున్నాడు - లోపలనుండు ఆత్మగానున్నాడు, జీవులకర్మల కనుకూలమగు ఫలము నిచ్చువాడు, సర్వ భూతములకు సాక్షి అయినవాడు వాటికి చేతనత్వము కలిగించువాడు, కేవలుడు, నిర్గుణుడు.)

  1. “ఏష సర్వేషు భూతేషు గూఢో అత్మా న ప్రకాశతే |”

(ఈ ఆత్మ సమస్తభూతములందు గూఢముగా దాగి ఉన్నట్లు ఉన్నది. పైకి ప్రకాశించదు - ఉన్నట్లు పైనుండి తెలియబడడు.)

  1. “లింగం సూక్ష్మ శరీరం తద్ధ్యంతరాళే శరీరస్యాత్మనశ్చ ఆత్మదద్వర్తతే ఇత్యంతరాత్మా”. (శ్రీ శంకరః)

(లింగ శరీరమనగా సూక్ష్మ శరీరము. దాని లోపల శరీరమునకు జీవాత్మకు ఆత్మవలె వర్తించునది కనుక అంతరాత్మ.)

  1. అంతర్గత లింగశరీరం స్వోపాధిత్వేన ఆదత్తే ఇత్యంతరాత్మా.

(లోపల ఉన్న లింగ శరీరమును తనకు ఉపాధిగా చేసుకొని దానిలో తాను ఉండి, దాని నుండి స్థూలశరీరమును కార్య రూపముగా ఆవిర్భవింప చేయువాడు.)

  1. సర్వాత్మాంతరత్వాత్ అంతరాత్మా- (అందరి ఆత్మలలోను, శరీరములలోను ఉండుట వలన అంతరాత్మ)

  2. “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్” (తైత్తిరీయోపనిషత్)

(దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను - సృష్టించిన ప్రతివస్తువులోనూ భగవంతుడు ప్రవేశించెను, (ప్రవేశించి యున్నాడు) అందువలననే అంతరాత్మ)

  1. “సీ. అఖిల భూతములందు నాత్మ రూపంబున నీశుండు హరియుండు నెల్ల ప్రొద్దు

బుధ్ధ్యాది లక్షణంబుల గానబడును ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము -2 - 2 - 36)

  1. “సీ. అఖిలభూతముల దేహాంతస్థమగునాత్మ యీశు డచ్యుతుడని యెఱుగవలయు ---”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము -6 - 4 - 201)

“యచ్చ కించిత్ జగత్సర్వం (సత్యం) దృశ్యతే, శ్రూయతేపివా |

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః |” (మంత్రపుష్పము)

(ఈ సమస్తమైన సృష్టి అంతటిలోనూ మనకు ఏ కొంచెము కనబడుచున్నదో, లేక, ఇంకను ఉన్నదని తెలిసినవారు చెప్పగా వినుచున్నామో, అదియును, మిగిలిన సర్వ ప్రపంచములోనూ, పైన, లోపల, అంతటా, నారాయణుడు వ్యాపించియున్నాడు. సమస్తవస్తువులలోను ఆత్మగా ఉన్నాడు కనుక అంతరాత్మ.)

  1. “దం. --- పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్టక్రియా లోలురై దేహ గేహంబులం దోలి వర్తించు దుర్మానవశ్రేణులం దంతరాత్ముండవై యుండియుం దూరమై తోచు మీ పాద పద్మంబు లర్చింతు మో దేవ! ---”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 5 - 203)

సీ. “నలువొంద నఖిల జీవుల యందు గల నన్ను దెలిసి సేవింపుము నలినగర్భ

- - - భూతేంద్రియాశయ విరహితమై విశుధ్ధ

మైన జీవుని విమలాంతరాత్ముడ నైన నను నేకముగ జూచు నరుడు మోక్ష

పద మార్గవర్తివై భాసిల్లు --- ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 9 - 320)

  1. వ. “--- భవత్కృపావలోకనంబు లేనివారు కష్టాత్ము లై, దుర్గతిం గూలుదురు. అట్టి జీవులు దేవ తిర్య ఙ్మనుష్య స్థావరాది శరీరంబులు సొచ్చి, యణురూపు లై యుందురు. అందును నీ వంతరాత్మ వగుచు నుందువు ---”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము-10 - ఉ.భా. -1219)

“ఏక ఏవ మహానాత్మా సో అహంకారో అభిధీయతే |

సజీవస్సో (అ) oతరాత్మేతి గీయతే తత్వచింతకైః ||”

(పరమాత్మ ఒక్కడే, అనగా అద్వితీయము. అదియే అహంకారముగా చెప్పబడుచున్నది. ఆ పరమాత్మనే తత్వవేత్తలు జీవుడని, అంతరాత్మ యని చెప్పు చున్నారు -)

  1. దేశకాలావస్థాసు యుగవత్సర్వ జన జగదంతః ప్రవేశపూర్వకం ప్రకాశకః.

(అన్ని దేశములందు, అన్నికాలములందు, అన్ని అవస్థలందు ఒక్క మారుగ ప్రాణులందఱిలోను, జగత్తు అంతటిలోను ప్రవేశించియుండి వాటిని ప్రకాశింపచేయువాడు -వాటి వాటి పనులను - ధర్మములను - నిర్వర్తించునట్లు చేయువాడు)

“సీ. కలలోన జీవుండు కౌతూహలంబున బెక్కు దేహంబుల జేరు వడసి

యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెఱుగు కరణి

నఖిలాంతరాత్ముకు డగు పరమేశ్వరుడఖిల జంతుల హృదయములనుండి

బుధ్ధివృత్తలనెల్ల బోద్ధయై వీక్షించు - - ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 -1 -18)

  1. “య ద్దైవతం సర్వజనాంతరస్థం” (శ్రీ రామ కర్ణామృతం - 2 - 29)

(అందఱి జనుల లోపలనుండు దైవమైనవాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మము. ఈ ప్రకారముగా ఉండుటవలన అంతరాత్మ.)

  1. సీ. “--- కాష్ఠగత జ్యోతికైవడి నిఖిల భూతములందు నొకడ వై తనరు దీవు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - పూ.భా. 1176)

  2. వ. “--- దారు మధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపమున వర్తించుచందంబున, నందంబై, సకల శరీరులయందు నఛ్చేద్యుండును, నదాహ్యుండును, నశోష్యుండును నైన జీవుండు వసించి యుండు. ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 11 - 105)

  3. వ. “--- నీవొక్కరుండ వయ్యును మహదాద్యం బైన యీ యశేషవిశ్వంబు మాయాఖ్యం బైన యాత్మీయ శక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి, యింద్రియంబులందు వసింపుచు దత్తద్దేవతా రూపంబులచే నానా ప్రకారంబుల దారువులం దున్న వహ్ని చందంబునం బ్రకాశింతువు. ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 4 - 9 - 280)

  4. వ. “--- ఏ ప్రకారంబున మహా భూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందుం బ్రవేశించి యుండు నా ప్రకారంబున నేను నీ భూత భౌతికంబులైన సర్వకార్యంబులందు, సత్వాది రూపంబులం బ్రవేశించియుండుదు. ---”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 9 - 253)

  1. దేవమనుష్యాదిశరీరేషు ఆత్మతయానుప్రవిష్టో జీవః దేవః తద్వత్పరమాత్మా.

(దేవతలు మనుష్యులు మొదలగువాటి శరీరములందు ఆత్మగా ప్రవేశించి ఉన్నవాడు జీవుడు, దేవుడు, పరమాత్మ)

  1. “యథా ఏథసాం కాష్ఠానాం అంతర్జ్యోతిః తధా భగవాన్ భూతేషు స్థితోపి తైః నదృశ్యతే, సర్వభూతానాం ఏకః అనుస్యూతః ఆత్మా”

(కట్టెల లోపల అగ్ని పైకి కనబడకుండా ఉన్నట్లే ఆ ప్రకారముగానే భూతములందు భగవంతుడు ఉన్నప్పటికీ వారికి కనబడడు. సమస్త భూతములందు ఒకే ఆత్మ అల్లుకొని యున్నది.)

  1. “అధయ ఏ షోం తదాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే” -. “అధయ ఏషో అంత రక్షిణి పురుషో దృశ్యతే, ఏష ఆత్మేతి”

(చాందోగ్యోపనిషత్- 1 - 6, 1 - 7)

(సూర్యుని లోపల హిరణ్మయుడగు పురుషుడు ఎవడు కనబడుచున్నాడో (- హిరణ్మయమనగా జ్యోతిస్సు -), ఇట్లే కంటిలోపల ఏ పురుషుడు కనుపించుచున్నాడో - అని ఆదిత్యుడు, కన్ను ఉపలక్షణములుగా చెప్ప బడినవి. ఆదిత్యుడువలె ప్రకాశించు ప్రకాశరూపములన్నింటి యందును పరమాత్మ అంతరాత్మ రూపమున కలడు.)

“యదాదిత్యగతం తేజో జగద్భా సయతే (అ) ఖిలం |

యచ్చంద్రమని యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం ||” (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

(సూర్యునిలో ఉన్న తేజస్సు భగవంతునిదే - భగవంతుడు సూర్యునిలో ఉండుట బట్టియే సూర్యుడు ప్రకాశించు చున్నాడు)

  1. “యః పృధివ్యాం తిష్ఠన్ పృధివ్యా అంతరోయం పృధివీ నవేద, యస్య పృధివీ శరీరం యః పృధివీమంతరో యమయతి ఏషతే ఆత్మా అంతర్యామ్యమృతః” (బృహదారణ్యకోపనిషత్)

(ఎవడు భూమి యందుండినను ఎవనిని పృధివి ఆప్రకారము ఉన్నట్లు తెలుసుకొనలేదో ఎవనికి ఆ పృధివి శరీరమో, ఎవడు పృధివి లోపలనుండి దానిని నియమించుచుండునో అతనే నీ అంతర్యామి, అమృతుడు - (శాశ్వతుడు). అనగా పృధివి లోపలనుండి, దానికి తెలియకుండా దానిని నియమించువాడు. అంతర్యామి లేక అంతరాత్మ. ఈ ప్రకారముగా అన్ని భూతములలోను, అన్ని వస్తువులలోను, పైకి తెలియబడకుండా లోపల ఉండి ఆ వస్తువులను - ఆ భూతములను - ప్రవర్తింపచేయు ఆత్మయే అంతరాత్మ.)

  1. “అష్ట పురములతో గూడినది లింగశరీరము. దానిలో వ్యాపకమైన ఆత్మ అంతరాత్మ”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము)

“ఆత్మాంతరాత్మేతి హరిరేక ఏవ ద్విధా స్థితః |

నివిష్టో హృదయే నిత్యం రసం పిబతి కర్మజం ||“. (బృహత్సం హితాయాం)

(హరి ఒక్కడే ఆత్మయని అంతరాత్మయని రెండు విధములుగా నున్నాడు. ఎల్లపుడు హృదయమందుండి కర్మఫలము ననుభవించు చున్నాడు.)

  1. “ఈశ్వరస్సర్వభూతానాం హృద్ధేశే (అ) ర్జున తిష్ఠతి |” (శ్రీమద్భగవద్గీత - 18 - 61)

(జీవరాసులన్నింటి యొక్క హృదయప్రదేశమందు ఈశ్వరుడున్నాడు.)

చ. “అరయ సమస్త భూత హృదయంబుల యందు వసించి యేకమై

పరగిన ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 9 - 300)

  1. స్వ దేహేంద్రియమన ఆధష్ఠాతా ప్రత్య గ్రూపః పరమాత్మా ఇత్యర్ధః.

(అన్ని దేహములందు, ఇంద్రియములందు, మనస్సునందు అధిష్ఠించియున్న ప్రత్యగాత్మరూపమైన పరమాత్మయే అంతరాత్మ.)

  1. “అంతరాత్మానామ పృధివ్యాపస్తేజో వాయు రాకాశమిఛ్చా ద్వేష సుఖ దుఃఖ కామ మోహవికల్పనాది స్మృతి లింగోదాత్తాను దాత్త హ్రస్వ దీర్ఘ స్ఖలితగర్జిత స్ఫటిత ముదిత సృత్తగీత వాదిత్ర ప్రళయ విజృంభితాదిభిశ్రోతా, ఘ్రాతా, రసయితా, నేతా, బోధ్ధా, కర్తా, విజ్ఞానాత్మా, పురుషః, పురాణ న్యాయ, మీమాంసా, ధర్మశాస్త్రాణీతి శ్రవణ, ఘ్రాణాకర్షణ కర్మవిశేషణం కరోత్యేషో అంతరాత్మా” (ఆత్మోపనిషత్)

(అంతరాత్మ యనగా, పృధివీ, ఆపః, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు, ఇచ్చా, ద్వేష, సుఖ, దుఃఖ, కామ, మోహ వికల్పనములు అను మనోభావములు, ఉదాత్తాను దాత్త, హ్రస్వ, దీర్ఘ, స్ఖలిత, గర్జిత స్ఫటిత, ముదిత, నృత్త, గీత, వాదిత్రములు మొదలగువాటిని కలుగ చేయు శ్రోత, ఘ్రాత, రసయిత, నేత, బోధ్ధా కర్తా, విజ్ఞానాత్మా అయినవాడు, పురాణ, న్యాయమీమాంస ధర్మ శాస్త్రములను వినుట, ఆఘ్రాణించుట, ఆకర్షించుట, అను విశేష కర్మలను లోపల తానుండి చేయువాడు అంతరాత్మ - అనగా, శరీరములోనుండి వీటినన్నింటినీ కలుగ చేయువాడు అంతరాత్మ.

“అస్తి సర్వాంతరస్సాక్షీ ప్రత్యగాత్మా స్వయంప్రభుః |

తదేవ బ్రహ్మ సంపూర్ణమ పరోక్షతమం సురాః |

ప్రాణాపాన భేదస్య యస్సత్తాస్ఫురణ ప్రదః |

యస్యసన్నిధి మాత్రేణ చేష్టతే సకలం సురాః |

యశ్చ సర్వస్య చేష్టాయాం అసక్తో నిష్క్రియః స్వయం |

సహి సర్వాంత స్సాక్షా దాత్మా నాన్యః సురర్షభాః ||” (సూతసంహిత)

(స్వయం ప్రభువైన ప్రత్యగాత్మ అన్నింటి లోపలనుండి అన్నింటినీ చూచుచు సాక్షిగా ఉన్నాడు. అపరోక్షుడు పరిపూర్ణుడు (ప్రపంచమంతటను పూర్తిగా నిండి యుండువాడు) అయిన అతనే బ్రహ్మ. ప్రాణాపానములకు తన సత్తా స్ఫూర్తి నిచ్చువాడు. అతను లోపలనుండుట చేతనే యీ సకలమునూ - యీ జగత్తంతయు - చేష్టించు చున్నది, - ఎవరికి నిర్ణీతమైన పనులు అవి చేయుచున్నవి. ఇట్లయినను ఎవరి పనులయందైనను ఆసక్తి లేనివాడు, ఏ పనియు చేయనివాడు. అతనే అంతర్యామి, సర్వాంతర్యామి, సాక్షాదాత్మయే యేదియు కాదు -)

“గుణ భేదా దాత్మమూర్తిః అష్టధా పరికీర్తి తః |

జీవాత్మా చాంతరాత్మాచ పరమాత్మాచ నిర్మలః |

శుధ్ధాత్మా జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమ స్మృతః |

అష్టమస్తేషు భూతాత్మా ఇత్యష్ఠాత్మనః ప్రకీర్తితః ||”

(గుణ భేదము వలన ఆత్మ ఎనిమిది విధములుగ చెప్పబడుచున్నది :- జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మా, భూతాత్మా - అని)

  1. బుధ్ధ్య దిష్టా తా. (బుధ్ధిని అధిష్టించి యున్నది అంతరాత్మ)

  2. అంతఃకరణసాక్షీ, అంతర్యామీ, జీవాత్మ స్వరూపం.

(అంతఃకరణమునకు సాక్షి అయినది, అంతర్యామి, జీవాత్మ)

  1. ఆత్మ ప్రతీ వస్తువులోను ప్రవేశించి యున్నదని చెప్పబడినది - ప్రవేశించి యుండుట ఎట్లనగా :-

“గోజఠరగత వత్సే గాత్వాదివత్ సర్వ వ్యాప్తస్య బ్రహ్మణః ప్రత్యేకం సర్వ వస్తుషు పుష్కలప్రతీత్యర్హ స్థితి విశేషః ఏవ అను ప్రవేశః”

(శ్రీరంగరామానుజః)

(“తత్ సృష్ట్వా తదేవాన ప్రావిశత్” (1)).

“యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే, శ్రూయతేపివా |

అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణస్స్థితః ||” (14)

అని చెప్పుటలో భగవంతుడు అన్ని వస్తువులలో ఏ రీతిగా ప్రవేశించెననగా - ఆవు కడుపులో నుండు పెయ్యిలో ఆవు యొక్క లక్షణములన్నియు ఉన్నట్లు భగవంతుడు ఏ వస్తువులో ప్రవేశించిన దాని లక్షణములు అన్నియు దాని వలన పుట్టిన వస్తువునకు కలుగునట్లు చేయును - భగవంతుడు ఆవస్తువులో ఉండుట వలననే జాతి గుణములు వంశపరంపరలో కలుగుచు వచ్చుచున్నవి)

Transliteration
  1. paramātma; jīvātma, jīvuḍu; manassu, aṃtaryāmi.

  2. sarva sthūla śarīrāṃtaratvāt ātma buddhi gōcaratvāt ca aṃtarātmā.

(samasta sthūlaśarīramula lōpala uṃḍuṭa cētanu, tana buddhikē gōcaramaguṭacētanu aṃtarātma yanabaḍunu)

  1. “īśō aṃtaścarati bahudhā jāyamānaḥ”

(īśvaruḍu anēka prakāramulugā, anēka rūpamulugā puṭṭucū, vāṭilō pravēśiṃci, pūrtigā vyāpiṃci, paiki kanabaḍakuṃḍā lōpalanē saṃcariṃcucuṃḍunu - aṃducēta aṃtarātma, aṃtaryāmi)

  1. “aṃtaścarati bhūtēṣu guhā yāṃ viśvamūrtiṣu” (maṃtra puṣpamu) (anēka rūpamulatō nunna ī samasta bhūtamula lōnu cīkaṭigā nuṃḍu guhalō dāgi uṃḍi, unnaṭṭugā paiki kanabaḍakuṃḍā bhagavaṃtuḍu saṃcariṃcucunnāḍu. aṭlu lōpala saṃcariṃcu ātma ganuka aṃtarātma.)

  2. “aṃguṣṭhamātraḥ puruṣō aṃtarātmā” (śvētāśva tarōpaniṣat)

(aṃguṣṭhaparimāṇamugala puruṣuḍu aṃtarātma) - (cūḍumu: - ‘aṃguṣṭhamātraḥ puruṣaḥ -’)

  1. “ēkō dēvaḥ sarva bhūtēṣu gūḍhaḥ sarvavyāpī sarva bhūtāṃtarātmā, karmādhyakṣaḥ sarvabhūtādhivāsaḥ, sākṣī, cētā, kēvalō nirguṇaśca”

(śvētāśvatarōpaniṣat - 6 - 11)

(okaḍē ayina dēvuḍu samasta bhūtamulaṃdu gūḍhuḍai kanupiṃcakuṃḍā unnāḍu. atanē anniṃṭiyaṃdu vyāpiṃci sarvabhūtamulaku aṃtarātmayai yunnāḍu - lōpalanuṃḍu ātmagānunnāḍu, jīvulakarmala kanukūlamagu phalamu niccuvāḍu, sarva bhūtamulaku sākṣi ayinavāḍu vāṭiki cētanatvamu kaligiṃcuvāḍu, kēvaluḍu, nirguṇuḍu.)

  1. “ēṣa sarvēṣu bhūtēṣu gūḍhō atmā na prakāśatē |”

(ī ātma samastabhūtamulaṃdu gūḍhamugā dāgi unnaṭlu unnadi. paiki prakāśiṃcadu - unnaṭlu painuṃḍi teliyabaḍaḍu.)

  1. “liṃgaṃ sūkṣma śarīraṃ taddhyaṃtarāḷē śarīrasyātmanaśca ātmadadvartatē ityaṃtarātmā”. (śrī śaṃkaraḥ)

(liṃga śarīramanagā sūkṣma śarīramu. dāni lōpala śarīramunaku jīvātmaku ātmavale vartiṃcunadi kanuka aṃtarātma.)

  1. aṃtargata liṃgaśarīraṃ svōpādhitvēna ādattē ityaṃtarātmā.

(lōpala unna liṃga śarīramunu tanaku upādhigā cēsukoni dānilō tānu uṃḍi, dāni nuṃḍi sthūlaśarīramunu kārya rūpamugā āvirbhaviṃpa cēyuvāḍu.)

  1. sarvātmāṃtaratvāt aṃtarātmā- (aṃdari ātmalalōnu, śarīramulalōnu uṃḍuṭa valana aṃtarātma)

  2. “tat sṛṣṭvā tadēvānu prāviśat” (taittirīyōpaniṣat)

(dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu - sṛṣṭiṃcina prativastuvulōnū bhagavaṃtuḍu pravēśiṃcenu, (pravēśiṃci yunnāḍu) aṃduvalananē aṃtarātma)

  1. “sī. akhila bhūtamulaṃdu nātma rūpaṃbuna nīśuṃḍu hariyuṃḍu nella proddu

budhdhyādi lakṣaṇaṃbula gānabaḍunu ---” (śrīmadāṃdhra mahābhāgavatamu -2 - 2 - 36)

  1. “sī. akhilabhūtamula dēhāṃtasthamagunātma yīśu ḍacyutuḍani yeṟugavalayu ---”

(śrīmadāṃdhra mahābhāgavatamu -6 - 4 - 201)

“yacca kiṃcit jagatsarvaṃ (satyaṃ) dṛśyatē, śrūyatēpivā |

aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇaḥ sthitaḥ |” (maṃtrapuṣpamu)

(ī samastamaina sṛṣṭi aṃtaṭilōnū manaku ē koṃcemu kanabaḍucunnadō, lēka, iṃkanu unnadani telisinavāru ceppagā vinucunnāmō, adiyunu, migilina sarva prapaṃcamulōnū, paina, lōpala, aṃtaṭā, nārāyaṇuḍu vyāpiṃciyunnāḍu. samastavastuvulalōnu ātmagā unnāḍu kanuka aṃtarātma.)

  1. “daṃ. --- putrāṃganā mitra saṃbaṃdha baṃdhaṃbulaṃ jeṃdi nityaṃbu duṣṭakriyā lōlurai dēha gēhaṃbulaṃ dōli vartiṃcu durmānavaśrēṇulaṃ daṃtarātmuṃḍavai yuṃḍiyuṃ dūramai tōcu mī pāda padmaṃbu larciṃtu mō dēva! ---”

(śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 5 - 203)

sī. “naluvoṃda nakhila jīvula yaṃdu gala nannu delisi sēviṃpumu nalinagarbha

- - - bhūtēṃdriyāśaya virahitamai viśudhdha

maina jīvuni vimalāṃtarātmuḍa naina nanu nēkamuga jūcu naruḍu mōkṣa

pada mārgavartivai bhāsillu --- ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 9 - 320)

  1. va. “--- bhavatkṛpāvalōkanaṃbu lēnivāru kaṣṭātmu lai, durgatiṃ gūluduru. aṭṭi jīvulu dēva tirya ṅmanuṣya sthāvarādi śarīraṃbulu socci, yaṇurūpu lai yuṃduru. aṃdunu nī vaṃtarātma vagucu nuṃduvu ---”

(śrīmadāṃdhra mahābhāgavatamu-10 - u.bhā. -1219)

“ēka ēva mahānātmā sō ahaṃkārō abhidhīyatē |

sajīvassō (a) otarātmēti gīyatē tatvaciṃtakaiḥ ||”

(paramātma okkaḍē, anagā advitīyamu. adiyē ahaṃkāramugā ceppabaḍucunnadi. ā paramātmanē tatvavēttalu jīvuḍani, aṃtarātma yani ceppu cunnāru -)

  1. dēśakālāvasthāsu yugavatsarva jana jagadaṃtaḥ pravēśapūrvakaṃ prakāśakaḥ.

(anni dēśamulaṃdu, annikālamulaṃdu, anni avasthalaṃdu okka māruga prāṇulaṃdaṟilōnu, jagattu aṃtaṭilōnu pravēśiṃciyuṃḍi vāṭini prakāśiṃpacēyuvāḍu -vāṭi vāṭi panulanu - dharmamulanu - nirvartiṃcunaṭlu cēyuvāḍu)

“sī. kalalōna jīvuṃḍu kautūhalaṃbuna bekku dēhaṃbula jēru vaḍasi

yiṃdriyaṃbula veṃṭa nellavṛttaṃbulu nīkṣiṃci maṟi tannu neṟugu karaṇi

nakhilāṃtarātmuku ḍagu paramēśvaruḍakhila jaṃtula hṛdayamulanuṃḍi

budhdhivṛttalanella bōddhayai vīkṣiṃcu - - ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 -1 -18)

  1. “ya ddaivataṃ sarvajanāṃtarasthaṃ” (śrī rāma karṇāmṛtaṃ - 2 - 29)

(aṃdaṟi janula lōpalanuṃḍu daivamainavāḍu śrīrāmacaṃdra parabrahmamu. ī prakāramugā uṃḍuṭavalana aṃtarātma.)

  1. sī. “--- kāṣṭhagata jyōtikaivaḍi nikhila bhūtamulaṃdu nokaḍa vai tanaru dīvu ---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - pū.bhā. 1176)

  2. va. “--- dāru madhyabhāgaṃbuna nanalaṃbu sūkṣmarūpamuna vartiṃcucaṃdaṃbuna, naṃdaṃbai, sakala śarīrulayaṃdu nachcēdyuṃḍunu, nadāhyuṃḍunu, naśōṣyuṃḍunu naina jīvuṃḍu vasiṃci yuṃḍu. ---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 11 - 105)

  3. va. “--- nīvokkaruṃḍa vayyunu mahadādyaṃ baina yī yaśēṣaviśvaṃbu māyākhyaṃ baina yātmīya śakticētaṃ galpiṃci yaṃduṃ bravēśiṃci, yiṃdriyaṃbulaṃdu vasiṃpucu dattaddēvatā rūpaṃbulacē nānā prakāraṃbula dāruvulaṃ dunna vahni caṃdaṃbunaṃ brakāśiṃtuvu. ---” (śrīmadāṃdhra mahābhāgavatamu- 4 - 9 - 280)

  4. va. “--- ē prakāraṃbuna mahā bhūtaṃbulu bhautikaṃbulaina ghaṭapaṭādulaṃduṃ bravēśiṃci yuṃḍu nā prakāraṃbuna nēnu nī bhūta bhautikaṃbulaina sarvakāryaṃbulaṃdu, satvādi rūpaṃbulaṃ bravēśiṃciyuṃḍudu. ---”

(śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 9 - 253)

  1. dēvamanuṣyādiśarīrēṣu ātmatayānupraviṣṭō jīvaḥ dēvaḥ tadvatparamātmā.

(dēvatalu manuṣyulu modalaguvāṭi śarīramulaṃdu ātmagā pravēśiṃci unnavāḍu jīvuḍu, dēvuḍu, paramātma)

  1. “yathā ēthasāṃ kāṣṭhānāṃ aṃtarjyōtiḥ tadhā bhagavān bhūtēṣu sthitōpi taiḥ nadṛśyatē, sarvabhūtānāṃ ēkaḥ anusyūtaḥ ātmā”

(kaṭṭela lōpala agni paiki kanabaḍakuṃḍā unnaṭlē ā prakāramugānē bhūtamulaṃdu bhagavaṃtuḍu unnappaṭikī vāriki kanabaḍaḍu. samasta bhūtamulaṃdu okē ātma allukoni yunnadi.)

  1. “adhaya ē ṣōṃ tadādityē hiraṇmayaḥ puruṣō dṛśyatē” -. “adhaya ēṣō aṃta rakṣiṇi puruṣō dṛśyatē, ēṣa ātmēti”

(cāṃdōgyōpaniṣat- 1 - 6, 1 - 7)

(sūryuni lōpala hiraṇmayuḍagu puruṣuḍu evaḍu kanabaḍucunnāḍō (- hiraṇmayamanagā jyōtissu -), iṭlē kaṃṭilōpala ē puruṣuḍu kanupiṃcucunnāḍō - ani ādityuḍu, kannu upalakṣaṇamulugā ceppa baḍinavi. ādityuḍuvale prakāśiṃcu prakāśarūpamulanniṃṭi yaṃdunu paramātma aṃtarātma rūpamuna kalaḍu.)

“yadādityagataṃ tējō jagadbhā sayatē (a) khilaṃ |

yaccaṃdramani yaccāgnau tattējō viddhi māmakaṃ ||” (śrīmadbhagavadgīta - 15 - 12)

(sūryunilō unna tējassu bhagavaṃtunidē - bhagavaṃtuḍu sūryunilō uṃḍuṭa baṭṭiyē sūryuḍu prakāśiṃcu cunnāḍu)

  1. “yaḥ pṛdhivyāṃ tiṣṭhan pṛdhivyā aṃtarōyaṃ pṛdhivī navēda, yasya pṛdhivī śarīraṃ yaḥ pṛdhivīmaṃtarō yamayati ēṣatē ātmā aṃtaryāmyamṛtaḥ” (bṛhadāraṇyakōpaniṣat)

(evaḍu bhūmi yaṃduṃḍinanu evanini pṛdhivi āprakāramu unnaṭlu telusukonalēdō evaniki ā pṛdhivi śarīramō, evaḍu pṛdhivi lōpalanuṃḍi dānini niyamiṃcucuṃḍunō atanē nī aṃtaryāmi, amṛtuḍu - (śāśvatuḍu). anagā pṛdhivi lōpalanuṃḍi, dāniki teliyakuṃḍā dānini niyamiṃcuvāḍu. aṃtaryāmi lēka aṃtarātma. ī prakāramugā anni bhūtamulalōnu, anni vastuvulalōnu, paiki teliyabaḍakuṃḍā lōpala uṃḍi ā vastuvulanu - ā bhūtamulanu - pravartiṃpacēyu ātmayē aṃtarātma.)

  1. “aṣṭa puramulatō gūḍinadi liṃgaśarīramu. dānilō vyāpakamaina ātma aṃtarātma”. (brahmavidyā sudhārṇavamu)

“ātmāṃtarātmēti harirēka ēva dvidhā sthitaḥ |

(hari okkaḍē ātmayani aṃtarātmayani reṃḍu vidhamulugā nunnāḍu. ellapuḍu hṛdayamaṃduṃḍi karmaphalamu nanubhaviṃcu cunnāḍu.)

  1. “īśvarassarvabhūtānāṃ hṛddhēśē (a) rjuna tiṣṭhati |” (śrīmadbhagavadgīta - 18 - 61)

(jīvarāsulanniṃṭi yokka hṛdayapradēśamaṃdu īśvaruḍunnāḍu.)

ca. “araya samasta bhūta hṛdayaṃbula yaṃdu vasiṃci yēkamai

paragina ---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 9 - 300)

  1. sva dēhēṃdriyamana ādhaṣṭhātā pratya grūpaḥ paramātmā ityardhaḥ.

(anni dēhamulaṃdu, iṃdriyamulaṃdu, manassunaṃdu adhiṣṭhiṃciyunna pratyagātmarūpamaina paramātmayē aṃtarātma.)

  1. “aṃtarātmānāma pṛdhivyāpastējō vāyu rākāśamichcā dvēṣa sukha duḥkha kāma mōhavikalpanādi smṛti liṃgōdāttānu dātta hrasva dīrgha skhalitagarjita sphaṭita mudita sṛttagīta vāditra praḷaya vijṛṃbhitādibhiśrōtā, ghrātā, rasayitā, nētā, bōdhdhā, kartā, vijñānātmā, puruṣaḥ, purāṇa nyāya, mīmāṃsā, dharmaśāstrāṇīti śravaṇa, ghrāṇākarṣaṇa karmaviśēṣaṇaṃ karōtyēṣō aṃtarātmā” (ātmōpaniṣat)

(aṃtarātma yanagā, pṛdhivī, āpaḥ, agni, vāyuvu, ākāśamu anu paṃcabhūtamulu, iccā, dvēṣa, sukha, duḥkha, kāma, mōha vikalpanamulu anu manōbhāvamulu, udāttānu dātta, hrasva, dīrgha, skhalita, garjita sphaṭita, mudita, nṛtta, gīta, vāditramulu modalaguvāṭini kaluga cēyu śrōta, ghrāta, rasayita, nēta, bōdhdhā kartā, vijñānātmā ayinavāḍu, purāṇa, nyāyamīmāṃsa dharma śāstramulanu vinuṭa, āghrāṇiṃcuṭa, ākarṣiṃcuṭa, anu viśēṣa karmalanu lōpala tānuṃḍi cēyuvāḍu aṃtarātma - anagā, śarīramulōnuṃḍi vīṭinanniṃṭinī kaluga cēyuvāḍu aṃtarātma.

“asti sarvāṃtarassākṣī pratyagātmā svayaṃprabhuḥ |

tadēva brahma saṃpūrṇama parōkṣatamaṃ surāḥ |

prāṇāpāna bhēdasya yassattāsphuraṇa pradaḥ |

yasyasannidhi mātrēṇa cēṣṭatē sakalaṃ surāḥ |

yaśca sarvasya cēṣṭāyāṃ asaktō niṣkriyaḥ svayaṃ |

sahi sarvāṃta ssākṣā dātmā nānyaḥ surarṣabhāḥ ||” (sūtasaṃhita)

(svayaṃ prabhuvaina pratyagātma anniṃṭi lōpalanuṃḍi anniṃṭinī cūcucu sākṣigā unnāḍu. aparōkṣuḍu paripūrṇuḍu (prapaṃcamaṃtaṭanu pūrtigā niṃḍi yuṃḍuvāḍu) ayina atanē brahma. prāṇāpānamulaku tana sattā sphūrti niccuvāḍu. atanu lōpalanuṃḍuṭa cētanē yī sakalamunū - yī jagattaṃtayu - cēṣṭiṃcu cunnadi, - evariki nirṇītamaina panulu avi cēyucunnavi. iṭlayinanu evari panulayaṃdainanu āsakti lēnivāḍu, ē paniyu cēyanivāḍu. atanē aṃtaryāmi, sarvāṃtaryāmi, sākṣādātmayē yēdiyu kādu -)

“guṇa bhēdā dātmamūrtiḥ aṣṭadhā parikīrti taḥ |

jīvātmā cāṃtarātmāca paramātmāca nirmalaḥ |

śudhdhātmā jñānarūpātmā mahātmā saptama smṛtaḥ |

aṣṭamastēṣu bhūtātmā ityaṣṭhātmanaḥ prakīrtitaḥ ||”

(guṇa bhēdamu valana ātma enimidi vidhamuluga ceppabaḍucunnadi :- jīvātma, aṃtarātma, paramātma, śuddhātma, jñānātma, mahātmā, bhūtātmā - ani)

  1. budhdhya diṣṭā tā. (budhdhini adhiṣṭiṃci yunnadi aṃtarātma)

  2. aṃtaḥkaraṇasākṣī, aṃtaryāmī, jīvātma svarūpaṃ.

(aṃtaḥkaraṇamunaku sākṣi ayinadi, aṃtaryāmi, jīvātma)

  1. ātma pratī vastuvulōnu pravēśiṃci yunnadani ceppabaḍinadi - pravēśiṃci yuṃḍuṭa eṭlanagā :-

“gōjaṭharagata vatsē gātvādivat sarva vyāptasya brahmaṇaḥ pratyēkaṃ sarva vastuṣu puṣkalapratītyarha sthiti viśēṣaḥ ēva anu pravēśaḥ”

(śrīraṃgarāmānujaḥ)

(“tat sṛṣṭvā tadēvāna prāviśat” (1)).

“yacca kiṃcit jagatsarvaṃ dṛśyatē, śrūyatēpivā |

aṃtarbahiścatatsarvaṃ vyāpya nārāyaṇassthitaḥ ||” (14)

ani ceppuṭalō bhagavaṃtuḍu anni vastuvulalō ē rītigā pravēśiṃcenanagā - āvu kaḍupulō nuṃḍu peyyilō āvu yokka lakṣaṇamulanniyu unnaṭlu bhagavaṃtuḍu ē vastuvulō pravēśiṃcina dāni lakṣaṇamulu anniyu dāni valana puṭṭina vastuvunaku kalugunaṭlu cēyunu - bhagavaṃtuḍu āvastuvulō uṃḍuṭa valananē jāti guṇamulu vaṃśaparaṃparalō kalugucu vaccucunnavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.