← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతర్యామి aṃtaryāmi

Original — తెలుగు
  1. లోపలసంచరించువాడు; జీవాత్మ; పరమాత్మ, జీవాత్మలోనున్న పరమాత్మ.

  2. సర్వాంతరత్వాత్ అంతర్యామీ. (సమస్తమైన వాటిలోపల ఉండుటవలన అంతర్యామి)

  3. సర్వ భూతాంతరమను ప్రవిశ్య తన్ని యంతఋత్వాత్ అంతర్యామి.

(సర్వ భూతములలోన ప్రవేశించి వాటిని నియమించువాడు)

  1. “అంతర్ని యంతా” (శ్రీకూరనారాయణః)

(లోపలనుండి నియమించువాడు)

  1. సర్వేషామంతస్థః సన్ నియంతృత్వాత్ ప్రేరకత్వాత్ అంతర్యామీ.

(అందఱి లోపలనుండి నియమించువాడగుటచేత, అనగా పనులలో ప్రేరేపించు వాడగుట చేత, తన సత్తా స్పూర్తిచే వాటిని చైతన్య వంతముగా చేయువాడు.)

  1. అంతః ప్రవిశ్య సర్వేషాం భూతానాం యమ యితా.

(సర్వ భూతముల లోపల ప్రవేశించి వాటిని నియమించువాడు, వాటి వాటి పనులను చేయు నట్లు నియమించువాడు.)

  1. అంతః మనః యమ యతి, ప్రేరయతి, తచ్ఛీలం యస్యసః అంతర్యామీ, హృదయే తిష్టన్ శుభాశుభ కర్మ ప్రేరకః.

(లోపల అనగా, మనస్సును ప్రేరేపించువాడు, అట్టి శీలము కలవాడు అంతర్యామి. హృదయమందుండి శుభా శుభ కర్మలు చేయుటలో వారి స్వభావముకొలది ప్రేరేపించువాడు.)

“అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః |

ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ||” (శ్రీమద్భగవద్గీత - 15 - 14)

(వైశ్యానరుడను పేరుతో శరీరములోనున్న జఠరాగ్ని జీవులు తినిన అన్నమును పచనము చేసి - అనగా జీర్ణమగుటకు తగిన స్తితిలోనికి తీసుకొనివచ్చి - ఆ అన్నరసమును యావత్తు శరీరమును పోషించుటకు శరీరమంతట పంచ ప్రాణముల రూపముతో సమానముగా - దేనికెంత కావలయునో అంత - పంచిపెట్టుదును. ఈ విధముగానే ప్రాణుల శరీరములోన సంచరించుచువాటి చేత పనిచేయించు చుందును.)

  1. “వ. --- ఈశ్వరుండు కాలత్రయంబునందున జంగమస్థావరాంతర్యామి యగుటం జేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించువారు తాపత్రయ నివారణంబు కొఱకు భజియింతురు ---.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 31 - 988)

మ. “సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ

క్ష్మ కళుండచ్యుతుడు - - -” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 8 - 183)

వ. “వివిధ కాష్ఠాంతర్గతుం డైన వాయుసఖుండు తద్గత దోషంబునుం బొరయక, నిత్యశుద్ధుం డై, తరతమభావంబున వర్తించుచందంబున, స్వసంకల్ప కృతంబు లైన విచిత్ర శరీరంబులయందు నంతర్యామి వై ప్రవేశించి, తత్త ద్విచిత్ర యోనిగతం బయిన హేయంబులం బొరయక, సకలాత్మసమంబై, బ్రహ్మంబయిన నిన్ను - -” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - ఉ.భా.- 1211)

  1. వ. ” --- నీవు దేహగతుం డైన దేహియం దంతర్యామి వయ్యుం, గర్మఫలంబులం బొరయక కర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబ వై యుండుదువు. అట్టి నిన్ను నజ్ఞు లైన మానవులు నిజ కంఠలగ్నం బైన కంఠికామణి నిత్యసన్నిహితం బై వెలుగుచున్ననుం గానక వర్తించు తెఱంగున, దమ హృదయపద్మ మధ్యంబున ననంత తేజోవిరాజమానుండ వై ప్రకాశించు నిన్నుం దెలియలేరు ---.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము -10 - ఉ.భా. - 1226)

  2. వ. “--- అగ్ని యొక్కరుండయ్యు బెక్కుమ్రాకులందు దేజరిల్లుచు బెక్కండ్రై తోచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుం డొక్కడు, తనవలనం గలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు. ---” (శ్రీమదాంధ్ర మహభాగవతము - 1 - 2 - 59)

  3. వ. “--- దేహేంద్రియ ప్రాణ బుద్ధ్యంహంకార పరివృతంబు లైన యీ స్థావరజంగమంబుల హృదయంబులందు వ్యాపకుండును, బ్రత్యక్షభూతుండును, బ్రత్యగ్రూపుండును, భగవంతుండును నైన యీశ్వరుం డంతర్యామి రూపంబునం బ్రకాశింపుచుండును. ఆది నారాయణుని స్వరూపంబుగా, దెలియుము. ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 4 - 22 - 628)

  4. “య ఇమంచ లోకం పరమంచ లోకం సర్వాణి చ భూతాని యో (అ)oతరో యమ యతి” (అంతర్యామి బ్రాహ్మణము)

(ఎవడు ఈ లోకమును, పరలోకమును, సమస్త భూతములను లోపలనుండి నియమించుచున్నాడో - అని అంతర్యామి బ్రాహ్మణములో చెప్పబడినది.)

  1. “కూటస్థాద్యుపహిత భేధానాం స్వరూప లక్షణహేతుర్భూత్వా మణికణే సూత్రమివ సర్వక్షేత్రే యథానున్యూతః అంతర్యమ యన్ ప్రకాశతే సోం తర్యామీ” (సర్వసారోపనిషత్)

(కూటస్థుడు మొదలగు ఉపాధిభేదములందు, మణులలో దూరి వాటిని పట్టియుంచు దారమువలె, సర్వ క్షేత్రములందు - శరీరములందు - ప్రవేశించి, కట్టి పెట్టియుంచి, లోనుండి వానిని నియమించు ఆత్మ అంతర్యామి.)

  1. “యః సర్వభూతేషు తిష్ఠన్ సర్వేభ్యో భూతేభ్యో (అ) oతరః, యం సర్వాణి భూతాని నవిదుః, యస్య సర్వాణి భూతాని నవిదుః, యస్య సర్వాణి భూతాని శరీరం, యః సర్వాణి భూతాన్యంతరో యమ యత్యేష స ఆత్మా (అ) oతర్యామ్యమృతః”. (బృహదారణ్యకోపనిషత్)

(ఎవడు సర్వభూతములందుండియు వానినుండి వేరో, ఎవనిని సమస్తభూతములు ఎఱుంగవో, ఎవనికి సమస్తభూతములు శరీరములో, ఎవడు సమస్తభూతములందుండి వాటిని నియమము నందుంచుచున్నాడో, వాడు అమృతమయుడైన అంతర్యామి యగు ఆత్మ.)

  1. “తథాహి అంతఃప్రవిష్ట శ్శాస్తా జనానాం సర్వాత్మా”; ” తత్సృష్ట్వాతదేవాను ప్రావిశత్, తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చా భవత్” ఇత్యాదీ న్యౌప నిషదాని వాక్యాని పరమాత్మని ఏవ సర్వస్య ప్రశాసిత్వం సర్వశ్యాత్మత్వమిత్యాదీని వదంతి. తథాసుబాలోపనిషది - “నైవేహ కించనాగ్ర ఆనీదమూలమనాధార మిమాః ప్రజాః ప్రజాయంతే.దివ్యో దేవ ఏకో నారాయణః చక్షుశ్చద్రష్టవ్యంచ నారాయణః, శ్రోత్రంచ శ్రోత్తవ్యంచ నారాయణః”ఇత్యారభ్య” “అంతశ్శరీరో నిహితో గుహ యాం అజ ఏకో నిత్యః, యస్య పృధివీ శరీరం, యః పృధివీమంతరే సంచరన్, యం పృధివీ న వేద, యస్యాపశ్శరీరం” ఇత్యాది; “యస్యమృత్యుశ్శరీరం, యో మృత్యుమంతరే సంచరన్ యం మృత్యుర్నవేద, ఏష సర్వభూతాంతరాత్మా దివ్యో దేవ ఏకో నారాయణః” ఇతి; పరస్యైవ బ్రహ్మణస్య సర్వాత్మత్వం, సర్వ శరీరత్వం సర్వస్య నియంతృత్వంచప్రతి పాద్యతే, స్వాభావికం చామృతత్వం పరమాత్మన ఏవ ధర్మః“. (శ్రీరామానుజః)

(“జీవులందఱిలోను ప్రవేశించి శాసించువాడు; సర్వమునకు ఆత్మ అయినవాడు” అనిన్నీ, “దానిని సృష్టించి, దానిలోనే ప్రవేశించెను. దానిలో ప్రవేశించి సత్, త్యత్ గా తానే ఆయెను - మారెను.” అనిన్నీ ఈ మొదలగు ఉపనిషత్తులలో చెప్పిన వాక్యములు పరమాత్మయొక్క సర్వమునకు - అన్నింటికీ - ఆత్మ అయి ఉండుటయు, సర్వమునూ శాసించు వాడై యుండుటయును మొదలగువాటిని చెప్పుచున్నవి. ఆ ప్రకారముగానే జాబాలోపనిషత్తులో - “ఈ సృష్టికి పూర్వము ఏదియును లేదు; మూలములేక - కారణములేక - ఆధారములేక - ఈ ప్రజలు పుట్టుట లేదు. దివ్యమైన దేవుడు నారాయణుడొక్కడే, చూడతగినవాడు, చూచువాడు, వినువాడు వినతగినవాడు నారాయణుడే” అని యీ ప్రకారముగా ఆరంభించి “లోపల గుహ వలె నున్న శరీరమందు ఉండిన వాడిని, ఎవనికి పృధివి శరీరమో, దాని లోపల సంచరించుచున్నను, ఎవనిని పృధివి తెలుసుకొనలేదో, ఆ ప్రకారముగానే ఎవనికి ఉదకములు శరీరమో అను మొదలగునవిన్నీ”, “ఎవనికి మృత్యువు శరీరమో, మృత్యువు లోన ఉన్నప్పటికిన్నీ ఎవనిని మృత్యువు తేలుసుకొనలేదో, అతను సర్వ భూతములకు అంతరాత్మ, - లోపలనుండు ఆత్మ, ఒక్కడే అయిన దేవుడు నారాయణుడే” అని పరబ్రహ్మయొక్క సర్వాత్మత్వమున్నూ – సమస్తమునకు ఆత్మ అయి యుండుటయున్నూ - సర్వశరీరత్వమున్నూ - అన్నింటికి తానే శరీరము అయి యుండుట వలననున్నూ, సర్వ నియంతృత్వము - అన్నింటనీ నియమించి యుండుటయున్నూ, ప్రతిపాదించుచున్నవి. అసలు పరమాత్మ ధర్మము - తత్వము - అమృతత్వమే.)

  1. “ప్రేరకః సర్వభూతానా మంతర్యామీ హృది స్థితః |” (ఈశాన సం హితాయాం)

(సర్వ భూతముల హృదయంబున నుండి వాటిని వాటి వాటి పనులలో ప్రేరేపించువాడు)

  1. “అంతర్యామీ చ విశ్వేశ స్సర్వేషా మపి దేహినాం |” (ఆదిత్య పురాణే)

(సమస్తమైన దేహులందును విశ్వేశుడు - పరబ్రహ్మ - అంతర్యామిగా నున్నాడు.)

  1. “య ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాంతరో యమాదిత్యో నవేద, యస్యాదిత్యశ్శరీరం, య ఆదిత్యమంతరో యమ యత్యేష త ఆత్మాంతర్యామ్యమృతం ఇతి” (అంతర్యామి బ్రాహ్మణే)

(సూర్యునిలోన ఉన్న వాడయినను వానిని సూర్యుడు తెలుసుకొనలేడు, ఆదిత్యుడే - సూర్యుడే - శరీరమైనవాడు, - ఆదిత్యుడు అను శరీరములో నుండువాడు. ఆదిత్యుని లోపల ఉండి అతనిని ప్రేరేరేపించు వాడు - కాంతి, వేడిమి, శక్తి మొదలగువాటినిచ్చునట్లు చేయువాడు, అతడే ఆత్మ, అంతర్యామి, అమృతుడు.)

  1. “అధ య ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే, హిరణ్యశ్మశ్రుః, హిరణ్య కేశః ఆప్రణఖ్సాత్సర్వ ఏవ సువర్ణస్తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ తస్యోదితినామ”

ఇతి శ్రుతిః.

(ఆదిత్యునియందు హిరణ్మయుడగు ఏ పురుషుడు కలడో, హిరణ్మయశ్మశ్రువులు కలవాడు, హిరణ్మయ కేశములు (కిరణములు) కలవాడు, గోరు దగ్గరనుండి అంతయు సువర్ణమే, పుండరీకముల వంటి కండ్లు కలవాడు, అతడే ఆత్మ.)

(పరమాత్మ సూర్యునిలో - అనగా, సూర్యునివలె ప్రకాశస్వరూపములన్నింటిలోను - ఉండి దానికి తన చిఛ్చక్తి నిచ్చి, దాని కిరణములద్వారా చిఛ్చక్తిని - వేడిమిని, వెలుతురును, (heat, light and Energy) ని ఆకాశములోనికి విరజిమ్ము చేయునట్లు చేయుచున్నాడు. సూర్యుని కిరణముల లోని భగవంతుని చిచ్ఛక్తి వలననే ప్రపంచములోని జీవరాశులు శక్తి వంతములై జీవించుచున్నవి.- “యదాదిత్యగతం తేజః --- తత్తేజోవిద్ధి మామకం |” (శ్రీమద్భగవద్గీత- 15 - 12)

  1. “ఆత్మప్రకాశమానమున్నూ, అంతఃకరణములు స్వచ్చమై యుండగాను అక్కడ ప్రతిబింబించిన చిదా భాస తేజస్సు అంతఃకరణోపాధిం బట్టి వ్యవహరించును గనుక అది జీవుండని చెప్పుదురు. క్షేత్రజ్ఞ, సాక్షి, కూటస్థ, అంతర్యామి, మహాప్రాణ, ప్రత్యగాత్మ అని తమ తమ మతాలయందు చెప్పుచునుందురు.” (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 2)

  2. వ. “--- ఏ ప్రకారంబున మహా భూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందుం బ్రవేశించి యుండు నా ప్రకారంబున నేను నీ భూత భౌతికంబులైన సర్వకార్యంబులందు, సత్త్వాది రూపంబులం బ్రవేశించి యుండుదు. ---”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము-2 - 9 - 252)

  1. వ. “--- హరి సకలప్రాణి హృదయంబులందును నంతర్యామి యై యాకాశంబు భంగి నుండు.---”

(శ్రీమదాంధ్ర మహాభాగవతము- 7 - 7 - 241)

“అహం హి సర్వభూతానాం అంతస్తిష్టామి సర్వగః |

మాం సర్వసాక్షిణం లోకే న జానంతి మునీశ్వరాః |

య స్యాంతరా సర్వమిదం యోహి సర్వాంతరః పరః |

సోహం ధాతా విధాతా చకాలోగ్నిర్విశ్వతో ముఖః ||” (ఈశ్వరగీతా యాం -)

నేను సమస్త భూతములలోను ఉన్నాను. ఇందువల్ల సమస్త కర్మలకు నేను సాక్షిగా ఉన్నాను – అయినను ఈ లోకమందు నన్ను తెలియ లేకున్నారు - ఈ ప్రపంచమంతయు నాలోనే ఉన్నది. నేను విశ్వరూపుడను - విశ్వమంతా నారూపము. అందుచేత నావిశ్వరూపములో యీ జగత్తులోని సమస్త వస్తువులు ఉన్నవి. ఆ ప్రకారముగా ఉన్న సమస్తవస్తువులలోను సర్వాంతరుడుగా నున్నాను. అటువంటి నేనే ధాతను, విధాతను, కాలుడను (కాల స్వరూపుడను), అగ్నిని, అన్ని ప్రక్కల ముఖము గలవాడను.)

  1. “ఏక ఏవ ఆత్మా సర్వేషా మహమర్థతయా ఆస్తే, యథా ఏకఃతేజోధాతుఃత్రివృత్కరణతా వ్యాప్య అండాంతర్గత లోకే ప్రవిష్టస్సన్ రూపే రూపే ప్రతిరూపః సర్వాసు భౌతిక వ్యక్తిషుతేజో ధాతోః మిలితత్వేన ప్రతి సంక్రాంతాంతర్యామి విగ్రహో బహిశ్చ వ్యాప్నోతి, వా యో యథా భువన ప్రవిష్టో.”

(ఒక్కడే అయిన ఆత్మ అన్నిటి యందు ‘నేను’ అను భావముతో నున్నది -ఒకటే అయిన తేజో ధాతువు త్రివృత్కరణతా వ్యాపించి బ్రహ్మాండములో నున్న లోకములలో ప్రవేశించి అందులోని ప్రతి రూపములోను, అనగా భూతకార్యములయిన వ్యక్తులందు కూడా, ఉండుట వలన వాటి అన్నింటిలోను అంతర్యామిగానున్నూ, వాటి వెలుపలనున్నూ వ్యాపించి యున్నది; వాయువు యీ ప్రపంచమంతటను - లోపల, పైన ప్రవేశించి యున్నట్టుగా. ఇందువలననే భగవంతుడు పరమాణువువంటి చిన్నవస్తువునందు కూడా - (సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువునందు కూడా) - ఉండుట తటస్థించినది, సిద్ధించినది.

“క. ఇందు గలడందు లేడని

సందేహమువలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెతకి జూచిన

నందందే గలడు ---- ” (ప్రహ్లాదుని వచనము - శ్రీ మదాంధ్ర మహాభాగవతము - 7 - 8 - 275)

“Every particle of matter contains energy” (ప్రకృతి లోని ప్రతి పరమాణువు లోను Energy (శక్తి) కలదు).

“క. --- హరిమయము గాని ద్రవ్యము

పరమాణువు లేదు వంశ పావన ! వింటే ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 1 - 17)

(బ్రహ్మాండము పేలి బ్రధ్ధలయి దానిలోనున్న పదార్ద్ధము తునా తునకలై అకాశము లోనికి విరజిమ్ముకు పోగా, ఆ బ్రహ్మాండ భేధనము వలన కలిగిన శక్తి (Energy) - భగవంతుని చిచ్ఛక్తి ఆ విరజిమ్ముకు పోయిన ప్రతిభాగము లోను, దానిలోని పరమాణువు లోను ప్రవేశించి వాటిని చైతన్య వంతముగా చేసెను - ఈ ప్రకారముగా భగవంతుని చిచ్ఛక్తి (చైతన్య శక్తి) ప్రతి పరమాణువులోను ఉండుట తటస్థించినది, సంఘటితమైనది.)

  1. “య ద్ధైవతంసర్వ జనాంతరస్థం” (శ్రీరామ కర్ణామృతం - 2 - 29)

(అందఱు జనుల లోపలనుండు దైవతము పరబ్రహ్మ రూపమైన శ్రీరామచంద్రుడు.)

Transliteration
  1. lōpalasaṃcariṃcuvāḍu; jīvātma; paramātma, jīvātmalōnunna paramātma.

  2. sarvāṃtaratvāt aṃtaryāmī. (samastamaina vāṭilōpala uṃḍuṭavalana aṃtaryāmi)

  3. sarva bhūtāṃtaramanu praviśya tanni yaṃtaṛtvāt aṃtaryāmi.

(sarva bhūtamulalōna pravēśiṃci vāṭini niyamiṃcuvāḍu)

  1. “aṃtarni yaṃtā” (śrīkūranārāyaṇaḥ)

(lōpalanuṃḍi niyamiṃcuvāḍu)

  1. sarvēṣāmaṃtasthaḥ san niyaṃtṛtvāt prērakatvāt aṃtaryāmī.

(aṃdaṟi lōpalanuṃḍi niyamiṃcuvāḍaguṭacēta, anagā panulalō prērēpiṃcu vāḍaguṭa cēta, tana sattā spūrticē vāṭini caitanya vaṃtamugā cēyuvāḍu.)

  1. aṃtaḥ praviśya sarvēṣāṃ bhūtānāṃ yama yitā.

(sarva bhūtamula lōpala pravēśiṃci vāṭini niyamiṃcuvāḍu, vāṭi vāṭi panulanu cēyu naṭlu niyamiṃcuvāḍu.)

  1. aṃtaḥ manaḥ yama yati, prērayati, tacchīlaṃ yasyasaḥ aṃtaryāmī, hṛdayē tiṣṭan śubhāśubha karma prērakaḥ.

(lōpala anagā, manassunu prērēpiṃcuvāḍu, aṭṭi śīlamu kalavāḍu aṃtaryāmi. hṛdayamaṃduṃḍi śubhā śubha karmalu cēyuṭalō vāri svabhāvamukoladi prērēpiṃcuvāḍu.)

“ahaṃ vaiśyānarō bhūtvā prāṇināṃ dēha māśritaḥ |

prāṇāpānasamāyuktaḥ pacāmyannaṃ caturvidhaṃ ||” (śrīmadbhagavadgīta - 15 - 14)

(vaiśyānaruḍanu pērutō śarīramulōnunna jaṭharāgni jīvulu tinina annamunu pacanamu cēsi - anagā jīrṇamaguṭaku tagina stitilōniki tīsukonivacci - ā annarasamunu yāvattu śarīramunu pōṣiṃcuṭaku śarīramaṃtaṭa paṃca prāṇamula rūpamutō samānamugā - dēnikeṃta kāvalayunō aṃta - paṃcipeṭṭudunu. ī vidhamugānē prāṇula śarīramulōna saṃcariṃcucuvāṭi cēta panicēyiṃcu cuṃdunu.)

  1. “va. --- īśvaruṃḍu kālatrayaṃbunaṃduna jaṃgamasthāvarāṃtaryāmi yaguṭaṃ jēsi jīvakarma mārgaṃbulaṃ bravartiṃcuvāru tāpatraya nivāraṇaṃbu koṟaku bhajiyiṃturu ---.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 31 - 988)

ma. “sakala prāṇi hṛdaṃtarāḷamula bhāsvajjyōtiyai yuṃḍu sū

kṣma kaḷuṃḍacyutuḍu - - -” (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 8 - 183)

va. “vividha kāṣṭhāṃtargatuṃ ḍaina vāyusakhuṃḍu tadgata dōṣaṃbunuṃ borayaka, nityaśuddhuṃ ḍai, taratamabhāvaṃbuna vartiṃcucaṃdaṃbuna, svasaṃkalpa kṛtaṃbu laina vicitra śarīraṃbulayaṃdu naṃtaryāmi vai pravēśiṃci, tatta dvicitra yōnigataṃ bayina hēyaṃbulaṃ borayaka, sakalātmasamaṃbai, brahmaṃbayina ninnu - -” (śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - u.bhā.- 1211)

  1. va. ” --- nīvu dēhagatuṃ ḍaina dēhiyaṃ daṃtaryāmi vayyuṃ, garmaphalaṃbulaṃ borayaka karmaphalabhōktayaina jīvunaku sākṣibhūtaṃba vai yuṃḍuduvu. aṭṭi ninnu najñu laina mānavulu nija kaṃṭhalagnaṃ baina kaṃṭhikāmaṇi nityasannihitaṃ bai velugucunnanuṃ gānaka vartiṃcu teṟaṃguna, dama hṛdayapadma madhyaṃbuna nanaṃta tējōvirājamānuṃḍa vai prakāśiṃcu ninnuṃ deliyalēru ---.” (śrīmadāṃdhra mahābhāgavatamu -10 - u.bhā. - 1226)

  2. va. “--- agni yokkaruṃḍayyu bekkumrākulaṃdu dējarillucu bekkaṃḍrai tōcu teṟaṃguna viśvātmakuṃḍaina puruṣuṃ ḍokkaḍu, tanavalanaṃ galigina nikhila bhūtaṃbulaṃdu naṃtaryāmi rūpaṃbuna dīpiṃcu. ---” (śrīmadāṃdhra mahabhāgavatamu - 1 - 2 - 59)

  3. va. “--- dēhēṃdriya prāṇa buddhyaṃhaṃkāra parivṛtaṃbu laina yī sthāvarajaṃgamaṃbula hṛdayaṃbulaṃdu vyāpakuṃḍunu, bratyakṣabhūtuṃḍunu, bratyagrūpuṃḍunu, bhagavaṃtuṃḍunu naina yīśvaruṃ ḍaṃtaryāmi rūpaṃbunaṃ brakāśiṃpucuṃḍunu. ādi nārāyaṇuni svarūpaṃbugā, deliyumu. ---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 4 - 22 - 628)

  4. “ya imaṃca lōkaṃ paramaṃca lōkaṃ sarvāṇi ca bhūtāni yō (a)otarō yama yati” (aṃtaryāmi brāhmaṇamu)

(evaḍu ī lōkamunu, paralōkamunu, samasta bhūtamulanu lōpalanuṃḍi niyamiṃcucunnāḍō - ani aṃtaryāmi brāhmaṇamulō ceppabaḍinadi.)

  1. “kūṭasthādyupahita bhēdhānāṃ svarūpa lakṣaṇahēturbhūtvā maṇikaṇē sūtramiva sarvakṣētrē yathānunyūtaḥ aṃtaryama yan prakāśatē sōṃ taryāmī” (sarvasārōpaniṣat)

(kūṭasthuḍu modalagu upādhibhēdamulaṃdu, maṇulalō dūri vāṭini paṭṭiyuṃcu dāramuvale, sarva kṣētramulaṃdu - śarīramulaṃdu - pravēśiṃci, kaṭṭi peṭṭiyuṃci, lōnuṃḍi vānini niyamiṃcu ātma aṃtaryāmi.)

  1. “yaḥ sarvabhūtēṣu tiṣṭhan sarvēbhyō bhūtēbhyō (a) otaraḥ, yaṃ sarvāṇi bhūtāni naviduḥ, yasya sarvāṇi bhūtāni naviduḥ, yasya sarvāṇi bhūtāni śarīraṃ, yaḥ sarvāṇi bhūtānyaṃtarō yama yatyēṣa sa ātmā (a) otaryāmyamṛtaḥ”. (bṛhadāraṇyakōpaniṣat)

(evaḍu sarvabhūtamulaṃduṃḍiyu vāninuṃḍi vērō, evanini samastabhūtamulu eṟuṃgavō, evaniki samastabhūtamulu śarīramulō, evaḍu samastabhūtamulaṃduṃḍi vāṭini niyamamu naṃduṃcucunnāḍō, vāḍu amṛtamayuḍaina aṃtaryāmi yagu ātma.)

  1. “tathāhi aṃtaḥpraviṣṭa śśāstā janānāṃ sarvātmā”; ” tatsṛṣṭvātadēvānu prāviśat, tadanupraviśya sacca tyaccā bhavat” ityādī nyaupa niṣadāni vākyāni paramātmani ēva sarvasya praśāsitvaṃ sarvaśyātmatvamityādīni vadaṃti. tathāsubālōpaniṣadi - “naivēha kiṃcanāgra ānīdamūlamanādhāra mimāḥ prajāḥ prajāyaṃtē.divyō dēva ēkō nārāyaṇaḥ cakṣuścadraṣṭavyaṃca nārāyaṇaḥ, śrōtraṃca śrōttavyaṃca nārāyaṇaḥ”ityārabhya” “aṃtaśśarīrō nihitō guha yāṃ aja ēkō nityaḥ, yasya pṛdhivī śarīraṃ, yaḥ pṛdhivīmaṃtarē saṃcaran, yaṃ pṛdhivī na vēda, yasyāpaśśarīraṃ” ityādi; “yasyamṛtyuśśarīraṃ, yō mṛtyumaṃtarē saṃcaran yaṃ mṛtyurnavēda, ēṣa sarvabhūtāṃtarātmā divyō dēva ēkō nārāyaṇaḥ” iti; parasyaiva brahmaṇasya sarvātmatvaṃ, sarva śarīratvaṃ sarvasya niyaṃtṛtvaṃcaprati pādyatē, svābhāvikaṃ cāmṛtatvaṃ paramātmana ēva dharmaḥ”. (śrīrāmānujaḥ)

(“jīvulaṃdaṟilōnu pravēśiṃci śāsiṃcuvāḍu; sarvamunaku ātma ayinavāḍu” aninnī, “dānini sṛṣṭiṃci, dānilōnē pravēśiṃcenu. dānilō pravēśiṃci sat, tyat gā tānē āyenu - mārenu.” aninnī ī modalagu upaniṣattulalō ceppina vākyamulu paramātmayokka sarvamunaku - anniṃṭikī - ātma ayi uṃḍuṭayu, sarvamunū śāsiṃcu vāḍai yuṃḍuṭayunu modalaguvāṭini ceppucunnavi. ā prakāramugānē jābālōpaniṣattulō - “ī sṛṣṭiki pūrvamu ēdiyunu lēdu; mūlamulēka - kāraṇamulēka - ādhāramulēka - ī prajalu puṭṭuṭa lēdu. divyamaina dēvuḍu nārāyaṇuḍokkaḍē, cūḍataginavāḍu, cūcuvāḍu, vinuvāḍu vinataginavāḍu nārāyaṇuḍē” ani yī prakāramugā āraṃbhiṃci “lōpala guha vale nunna śarīramaṃdu uṃḍina vāḍini, evaniki pṛdhivi śarīramō, dāni lōpala saṃcariṃcucunnanu, evanini pṛdhivi telusukonalēdō, ā prakāramugānē evaniki udakamulu śarīramō anu modalagunavinnī”, “evaniki mṛtyuvu śarīramō, mṛtyuvu lōna unnappaṭikinnī evanini mṛtyuvu tēlusukonalēdō, atanu sarva bhūtamulaku aṃtarātma, - lōpalanuṃḍu ātma, okkaḍē ayina dēvuḍu nārāyaṇuḍē” ani parabrahmayokka sarvātmatvamunnū – samastamunaku ātma ayi yuṃḍuṭayunnū - sarvaśarīratvamunnū - anniṃṭiki tānē śarīramu ayi yuṃḍuṭa valananunnū, sarva niyaṃtṛtvamu - anniṃṭanī niyamiṃci yuṃḍuṭayunnū, pratipādiṃcucunnavi. asalu paramātma dharmamu - tatvamu - amṛtatvamē.)

  1. “prērakaḥ sarvabhūtānā maṃtaryāmī hṛdi sthitaḥ |” (īśāna saṃ hitāyāṃ)

(sarva bhūtamula hṛdayaṃbuna nuṃḍi vāṭini vāṭi vāṭi panulalō prērēpiṃcuvāḍu)

  1. “aṃtaryāmī ca viśvēśa ssarvēṣā mapi dēhināṃ |” (āditya purāṇē)

(samastamaina dēhulaṃdunu viśvēśuḍu - parabrahma - aṃtaryāmigā nunnāḍu.)

  1. “ya ādityē tiṣṭan ādityāṃtarō yamādityō navēda, yasyādityaśśarīraṃ, ya ādityamaṃtarō yama yatyēṣa ta ātmāṃtaryāmyamṛtaṃ iti” (aṃtaryāmi brāhmaṇē)

(sūryunilōna unna vāḍayinanu vānini sūryuḍu telusukonalēḍu, ādityuḍē - sūryuḍē - śarīramainavāḍu, - ādityuḍu anu śarīramulō nuṃḍuvāḍu. ādityuni lōpala uṃḍi atanini prērērēpiṃcu vāḍu - kāṃti, vēḍimi, śakti modalaguvāṭiniccunaṭlu cēyuvāḍu, ataḍē ātma, aṃtaryāmi, amṛtuḍu.)

  1. “adha ya ēṣōṃtarādityē hiraṇmayaḥ puruṣō dṛśyatē, hiraṇyaśmaśruḥ, hiraṇya kēśaḥ āpraṇakhsātsarva ēva suvarṇastasya yathā kapyāsaṃ puṃḍarīkamēva makṣiṇī tasyōditināma”

iti śrutiḥ.

(ādityuniyaṃdu hiraṇmayuḍagu ē puruṣuḍu kalaḍō, hiraṇmayaśmaśruvulu kalavāḍu, hiraṇmaya kēśamulu (kiraṇamulu) kalavāḍu, gōru daggaranuṃḍi aṃtayu suvarṇamē, puṃḍarīkamula vaṃṭi kaṃḍlu kalavāḍu, ataḍē ātma.)

(paramātma sūryunilō - anagā, sūryunivale prakāśasvarūpamulanniṃṭilōnu - uṃḍi dāniki tana cichcakti nicci, dāni kiraṇamuladvārā cichcaktini - vēḍimini, veluturunu, (heat, light and Energy) ni ākāśamulōniki virajimmu cēyunaṭlu cēyucunnāḍu. sūryuni kiraṇamula lōni bhagavaṃtuni cicchakti valananē prapaṃcamulōni jīvarāśulu śakti vaṃtamulai jīviṃcucunnavi.- “yadādityagataṃ tējaḥ --- tattējōviddhi māmakaṃ |” (śrīmadbhagavadgīta- 15 - 12)

  1. “ātmaprakāśamānamunnū, aṃtaḥkaraṇamulu svaccamai yuṃḍagānu akkaḍa pratibiṃbiṃcina cidā bhāsa tējassu aṃtaḥkaraṇōpādhiṃ baṭṭi vyavahariṃcunu ganuka adi jīvuṃḍani ceppuduru. kṣētrajña, sākṣi, kūṭastha, aṃtaryāmi, mahāprāṇa, pratyagātma ani tama tama matālayaṃdu ceppucunuṃduru.” (brahmavidyā sudhārṇavamu - 2)

  2. va. “--- ē prakāraṃbuna mahā bhūtaṃbulu bhautikaṃbulaina ghaṭapaṭādulaṃduṃ bravēśiṃci yuṃḍu nā prakāraṃbuna nēnu nī bhūta bhautikaṃbulaina sarvakāryaṃbulaṃdu, sattvādi rūpaṃbulaṃ bravēśiṃci yuṃḍudu. ---”

(śrīmadāṃdhra mahābhāgavatamu-2 - 9 - 252)

  1. va. “--- hari sakalaprāṇi hṛdayaṃbulaṃdunu naṃtaryāmi yai yākāśaṃbu bhaṃgi nuṃḍu.---”

(śrīmadāṃdhra mahābhāgavatamu- 7 - 7 - 241)

“ahaṃ hi sarvabhūtānāṃ aṃtastiṣṭāmi sarvagaḥ |

māṃ sarvasākṣiṇaṃ lōkē na jānaṃti munīśvarāḥ |

ya syāṃtarā sarvamidaṃ yōhi sarvāṃtaraḥ paraḥ |

sōhaṃ dhātā vidhātā cakālōgnirviśvatō mukhaḥ ||” (īśvaragītā yāṃ -)

nēnu samasta bhūtamulalōnu unnānu. iṃduvalla samasta karmalaku nēnu sākṣigā unnānu – ayinanu ī lōkamaṃdu nannu teliya lēkunnāru - ī prapaṃcamaṃtayu nālōnē unnadi. nēnu viśvarūpuḍanu - viśvamaṃtā nārūpamu. aṃducēta nāviśvarūpamulō yī jagattulōni samasta vastuvulu unnavi. ā prakāramugā unna samastavastuvulalōnu sarvāṃtaruḍugā nunnānu. aṭuvaṃṭi nēnē dhātanu, vidhātanu, kāluḍanu (kāla svarūpuḍanu), agnini, anni prakkala mukhamu galavāḍanu.)

  1. “ēka ēva ātmā sarvēṣā mahamarthatayā āstē, yathā ēkaḥtējōdhātuḥtrivṛtkaraṇatā vyāpya aṃḍāṃtargata lōkē praviṣṭassan rūpē rūpē pratirūpaḥ sarvāsu bhautika vyaktiṣutējō dhātōḥ militatvēna prati saṃkrāṃtāṃtaryāmi vigrahō bahiśca vyāpnōti, vā yō yathā bhuvana praviṣṭō.”

(okkaḍē ayina ātma anniṭi yaṃdu ‘nēnu’ anu bhāvamutō nunnadi -okaṭē ayina tējō dhātuvu trivṛtkaraṇatā vyāpiṃci brahmāṃḍamulō nunna lōkamulalō pravēśiṃci aṃdulōni prati rūpamulōnu, anagā bhūtakāryamulayina vyaktulaṃdu kūḍā, uṃḍuṭa valana vāṭi anniṃṭilōnu aṃtaryāmigānunnū, vāṭi velupalanunnū vyāpiṃci yunnadi; vāyuvu yī prapaṃcamaṃtaṭanu - lōpala, paina pravēśiṃci yunnaṭṭugā. iṃduvalananē bhagavaṃtuḍu paramāṇuvuvaṃṭi cinnavastuvunaṃdu kūḍā - (sūkṣmāti sūkṣmamainaṭuvaṃṭi paramāṇuvunaṃdu kūḍā) - uṃḍuṭa taṭasthiṃcinadi, siddhiṃcinadi.

“ka. iṃdu galaḍaṃdu lēḍani

saṃdēhamuvaladu cakri sarvōpagatuṃ

ḍeṃdeṃdu vetaki jūcina

naṃdaṃdē galaḍu ---- ” (prahlāduni vacanamu - śrī madāṃdhra mahābhāgavatamu - 7 - 8 - 275)

“Every particle of matter contains energy” (prakṛti lōni prati paramāṇuvu lōnu Energy (śakti) kaladu).

“ka. --- harimayamu gāni dravyamu

paramāṇuvu lēdu vaṃśa pāvana ! viṃṭē ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 1 - 17)

(brahmāṃḍamu pēli bradhdhalayi dānilōnunna padārddhamu tunā tunakalai akāśamu lōniki virajimmuku pōgā, ā brahmāṃḍa bhēdhanamu valana kaligina śakti (Energy) - bhagavaṃtuni cicchakti ā virajimmuku pōyina pratibhāgamu lōnu, dānilōni paramāṇuvu lōnu pravēśiṃci vāṭini caitanya vaṃtamugā cēsenu - ī prakāramugā bhagavaṃtuni cicchakti (caitanya śakti) prati paramāṇuvulōnu uṃḍuṭa taṭasthiṃcinadi, saṃghaṭitamainadi.)

  1. “ya ddhaivataṃsarva janāṃtarasthaṃ” (śrīrāma karṇāmṛtaṃ - 2 - 29)

(aṃdaṟu janula lōpalanuṃḍu daivatamu parabrahma rūpamaina śrīrāmacaṃdruḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.