(లోపల అనగా తనలోనున్న ఆత్మ యందే సుఖము కలవాడు.)
(ఆత్మయే, ఆత్మ యందే, సుఖము కలవాడు; ఆత్మ యందే ఆనందము ననుభవించువాడు.)
(ఆత్మాను భవమొక్కటే సుఖముగా కలవాడు). (తనయందే సుఖము కలవాడు, అంతరాత్మయందే సుఖము కలవాడు)
(ఏ దైనను ఉపద్రవము వచ్చి తీరిపోయినప్పుడు సుఖము కలుగును. ఆ ప్రకారముగానే కామాదులు - అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, అణగిపోయిన తర్వాత ఆత్మయందే కలుగు సుఖము, అనగా, ఆత్మధ్యానము వలన, ఆత్మ సాక్షాత్కారము వలన సుఖము, ఆనందము కలుగును. ఇదియే అంతస్సుఖము.)
(సుఖము అనగా విషయముల తోటి సంగము వలన కలుగు ప్రీతి. అట్టి సుఖము, ప్రీతి, మనసులోనే కలవాడు.)
(lōpala anagā tanalōnunna ātma yaṃdē sukhamu kalavāḍu.)
(ātmayē, ātma yaṃdē, sukhamu kalavāḍu; ātma yaṃdē ānaṃdamu nanubhaviṃcuvāḍu.)
(ātmānu bhavamokkaṭē sukhamugā kalavāḍu). (tanayaṃdē sukhamu kalavāḍu, aṃtarātmayaṃdē sukhamu kalavāḍu)
(ē dainanu upadravamu vacci tīripōyinappuḍu sukhamu kalugunu. ā prakāramugānē kāmādulu - anagā kāma, krōdha, lōbha, mōha, mada, mātsaryamulu, aṇagipōyina tarvāta ātmayaṃdē kalugu sukhamu, anagā, ātmadhyānamu valana, ātma sākṣātkāramu valana sukhamu, ānaṃdamu kalugunu. idiyē aṃtassukhamu.)
(sukhamu anagā viṣayamula tōṭi saṃgamu valana kalugu prīti. aṭṭi sukhamu, prīti, manasulōnē kalavāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.