← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమూర్తం amūrtaṃ

Original — తెలుగు

నిరాకారం. (ఆకారము లేనిది.)

సర్వమూర్తి వర్జితం (ఏ విధమైన ఆకారమైనను లేనివాడు.)

సర్వ శూన్యం, (ఏమీ లేనిది.)

“మూర్తిః ఘనరూప దారణ సమర్థం, చరాచరలక్షణం, తద్రహితః ఇత్యమూర్తిః అధవా, దేహ సంస్థాన లక్షణామూర్చితాంగావయవా మూర్తిః, తద్రహితః ఇత్యమూర్తిః”. (శ్రీశంకరః)

(మూర్తి అనగా చరాచరములకు లక్షణమైన ఘనరూపమును, కఠినమైన రూపమును ధరించుసామర్థ్యముగలది. అటువంటిరూపములేనిది అమూర్తి; లేక దేహమును కలిగియుండుటకు లక్షణమైన అవయవములుకలిగి యుండుట మూర్తి. అటువంటిదికానిది అమూర్తము.)

అపరిచ్ఛిన్న పరిమాణం.

(ఇది ఇంతవఱకే, ఇది ఇంతే అను పరిమాణము, హద్దులేనిది. అందుచేత ఎంత ఉన్నదో, ఎట్లున్నదో తెలియదు కనుక అమూర్తము.)

పూర్ణః.

(పూర్తిగా నిండియున్నవాడు, ప్రపంచమంతా తానేకనుక, హద్దు, అంతు తెలియదు కనుక అమూర్తము.)

పరమాత్మనః బ్రహ్మణః రూపం అమూర్తం, అకఠినం.

(పరమాత్మ అయిన బ్రహ్మయొక్క రూపము ఆకారములేనిది మూర్తి లేనిది; కఠినము కానిది - కఠినమైనదానికి రూపము ఉండును - స్థూలముకానిది - అందుచేత పరమాత్మరూపము ఊహించుటకు అలవికానిది.)

“మూర్తం సదితి సంప్రోక్తం అమూర్తం అసదుచ్యతే| (పైంగలోపనిషత్)

(మూర్తము - మూర్తికలది - సత్ అనిన్నీ, అమూర్తము – మూర్తి లేనిది అసత్ అని చెప్పబడుచున్నది.)

ఇంద్రియములకు గోచరముగు ఆకారము లేనిది.

మూర్తముకన్నా, అనగా, రూపముకలిగియున్నదానికన్న, భిన్నమైన స్వభావముకలది.

ఆశ్రయశ్చేతసో బ్రహ్మ ద్విథాతచ్చ స్వరూపతా| భూప ! మూర్తమ మూర్తంచ పరం చా పరమే వ చ||“.

(బ్రహ్మ రూపములు రెండు :- మూర్తము, అమూర్తము, లేక పరం, అపరం; నిర్విశేషము, సవిశేషము - అని రెండు విధములు.)

కర్మ నిబంధనా మూర్తి రస్య న విద్యతే ఇత్యమూర్తిః -

(కర్మవలనకలుగు మూర్తి - ఆకారము - శరీరము లేదుకనుక అమూర్తము.)

వాయ్యూకాశ ద్వయమమూర్తిం; కేచిత్తు శ్రుతిముప లక్షణం కృత్వా సూక్ష్మపంచ భూతాస్యమూర్తాని.

(వాయువు, ఆకాశము - ఈ రెండు భూతములు కంటికి కనబడనివి - అందుచేత రూపములేనివి, కనుక అమూర్తములు - కాని కొందఱు శ్రుతినిబట్టి సూక్ష్మరూపములోనున్న పంచభూతములు - తన్మాత్రలు - అమూర్తములని - చెప్పుదురు.)

శబ్ద స్పర్శాది సూక్ష్మ భూతములు -

“ధర్మా ధర్మౌ భావనాచ శబ్దో బుద్ధ్యా దయోపి చ| ఏతే అమూర్తగుణా స్సర్వే”.

(ధర్మాధర్మములు, భావన, శబ్దము, బుద్ధి మొదలగునవి అమూర్తగుణములు - ఇవి అమూర్తములు.)

Transliteration

nirākāraṃ. (ākāramu lēnidi.)

sarvamūrti varjitaṃ (ē vidhamaina ākāramainanu lēnivāḍu.)

sarva śūnyaṃ, (ēmī lēnidi.)

“mūrtiḥ ghanarūpa dāraṇa samarthaṃ, carācaralakṣaṇaṃ, tadrahitaḥ ityamūrtiḥ adhavā, dēha saṃsthāna lakṣaṇāmūrcitāṃgāvayavā mūrtiḥ, tadrahitaḥ ityamūrtiḥ”. (śrīśaṃkaraḥ)

(mūrti anagā carācaramulaku lakṣaṇamaina ghanarūpamunu, kaṭhinamaina rūpamunu dhariṃcusāmarthyamugaladi. aṭuvaṃṭirūpamulēnidi amūrti; lēka dēhamunu kaligiyuṃḍuṭaku lakṣaṇamaina avayavamulukaligi yuṃḍuṭa mūrti. aṭuvaṃṭidikānidi amūrtamu.)

aparicchinna parimāṇaṃ.

(idi iṃtavaṟakē, idi iṃtē anu parimāṇamu, haddulēnidi. aṃducēta eṃta unnadō, eṭlunnadō teliyadu kanuka amūrtamu.)

pūrṇaḥ.

(pūrtigā niṃḍiyunnavāḍu, prapaṃcamaṃtā tānēkanuka, haddu, aṃtu teliyadu kanuka amūrtamu.)

paramātmanaḥ brahmaṇaḥ rūpaṃ amūrtaṃ, akaṭhinaṃ.

(paramātma ayina brahmayokka rūpamu ākāramulēnidi mūrti lēnidi; kaṭhinamu kānidi - kaṭhinamainadāniki rūpamu uṃḍunu - sthūlamukānidi - aṃducēta paramātmarūpamu ūhiṃcuṭaku alavikānidi.)

“mūrtaṃ saditi saṃprōktaṃ amūrtaṃ asaducyatē| (paiṃgalōpaniṣat)

(mūrtamu - mūrtikaladi - sat aninnī, amūrtamu – mūrti lēnidi asat ani ceppabaḍucunnadi.)

iṃdriyamulaku gōcaramugu ākāramu lēnidi.

mūrtamukannā, anagā, rūpamukaligiyunnadānikanna, bhinnamaina svabhāvamukaladi.

āśrayaścētasō brahma dvithātacca svarūpatā| bhūpa ! mūrtama mūrtaṃca paraṃ cā paramē va ca||“.

(brahma rūpamulu reṃḍu :- mūrtamu, amūrtamu, lēka paraṃ, aparaṃ; nirviśēṣamu, saviśēṣamu - ani reṃḍu vidhamulu.)

karma nibaṃdhanā mūrti rasya na vidyatē ityamūrtiḥ -

(karmavalanakalugu mūrti - ākāramu - śarīramu lēdukanuka amūrtamu.)

vāyyūkāśa dvayamamūrtiṃ; kēcittu śrutimupa lakṣaṇaṃ kṛtvā sūkṣmapaṃca bhūtāsyamūrtāni.

(vāyuvu, ākāśamu - ī reṃḍu bhūtamulu kaṃṭiki kanabaḍanivi - aṃducēta rūpamulēnivi, kanuka amūrtamulu - kāni koṃdaṟu śrutinibaṭṭi sūkṣmarūpamulōnunna paṃcabhūtamulu - tanmātralu - amūrtamulani - ceppuduru.)

śabda sparśādi sūkṣma bhūtamulu -

“dharmā dharmau bhāvanāca śabdō buddhyā dayōpi ca| ētē amūrtaguṇā ssarvē”.

(dharmādharmamulu, bhāvana, śabdamu, buddhi modalagunavi amūrtaguṇamulu - ivi amūrtamulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.