← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనభిజ్ఞులు anabhijñulu

Original — తెలుగు

వేద శాస్త్రాది జ్ఞాన రహితాః.

(వేదము, శాస్త్రము మొదలగువాటి జ్ఞానము లేనివాడు.)

అభిజానాతీత్య భిజ్ఞః, తథా నచవతీత్య నభిజ్ఞః.

(అభిజ్ఞుడు అనగా బాగుగా తెలిసినవాడు, అభిజ్ఞుడు కానివాడు అనభిజ్ఞుడు.)

శాస్రే ప్రథాన తయా పతిపాద్యం జ్ఞానమిదమితి న జ్ఞాతమిత్యర్ధః.

(శాస్త్రములో ముఖ్యముగా ప్రతిపాదింపబడిన జ్ఞానము ఇది అని - భగవత్తత్వమిది యని - తెలియనివాడు.)

అనిపుణః, వేదాదిజ్ఞాన శూన్యః ఇత్యర్ధః.

(నేర్పరి కానివాడు, వేదము మొదలగువాటి జ్ఞానము లేనివాడు, పండితుడు కానివాడు.)

“హంతా హం”, “హతోస్మి అహం” ఇతి దేహ హననేవ ఆత్మానం అహం ద్రత్యయ విషయం యో విజానీతః తౌ ఆత్మ స్వరూపా నభిజ్ఞాః - యస్మాత్ న అయమాత్మా హంతి, నహన నక్రియాయాః కర్తా భవతి, నహన్యతేనచ కర్మ భవతి ఇత్యర్ధః, అవిక్రియత్వాత్.

(శ్రీశంకరః)

“నేను చంపితిని”, “నేను చంపివేయబడితిని” అని దేహము చనిపోగానే ‘నేను’ అను ఆత్మ విషయం చనిపోయినట్లు ఎవరు తలంచెదరో వారు ఆత్మ స్వరూపానభిజ్ఞులు, అనగా, ఆత్మ స్వరూపమును బాగా యదార్ధముగా తెలియనివారు, ఎందుచేతననగా, ఆత్మ చంపునదికాదు, చంపబడునదికాదు - ఆత్మ అవిక్రియుడు - మార్పులు లేనివాడు. ఈ విషయము శ్రీమద్భగవద్గీతలో ఈ క్రిందవిధముగా చెప్పబడినది -

“అజో నిత్యః శాశ్వతో (అ) యం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ||” (శ్రీమద్భగవద్గీత - 2 - 20)

(ఆత్మ జన్మ లేనివాడు, శాశ్వతముగానుండువాడు, పూర్వమునుండి ఉన్నవాడు, శరీరము నశించినను తాను నశింపనివాడు.)

Transliteration

vēda śāstrādi jñāna rahitāḥ.

(vēdamu, śāstramu modalaguvāṭi jñānamu lēnivāḍu.)

abhijānātītya bhijñaḥ, tathā nacavatītya nabhijñaḥ.

(abhijñuḍu anagā bāgugā telisinavāḍu, abhijñuḍu kānivāḍu anabhijñuḍu.)

śāsrē prathāna tayā patipādyaṃ jñānamidamiti na jñātamityardhaḥ.

(śāstramulō mukhyamugā pratipādiṃpabaḍina jñānamu idi ani - bhagavattatvamidi yani - teliyanivāḍu.)

anipuṇaḥ, vēdādijñāna śūnyaḥ ityardhaḥ.

(nērpari kānivāḍu, vēdamu modalaguvāṭi jñānamu lēnivāḍu, paṃḍituḍu kānivāḍu.)

“haṃtā haṃ”, “hatōsmi ahaṃ” iti dēha hananēva ātmānaṃ ahaṃ dratyaya viṣayaṃ yō vijānītaḥ tau ātma svarūpā nabhijñāḥ - yasmāt na ayamātmā haṃti, nahana nakriyāyāḥ kartā bhavati, nahanyatēnaca karma bhavati ityardhaḥ, avikriyatvāt.

(śrīśaṃkaraḥ)

“nēnu caṃpitini”, “nēnu caṃpivēyabaḍitini” ani dēhamu canipōgānē ‘nēnu’ anu ātma viṣayaṃ canipōyinaṭlu evaru talaṃcedarō vāru ātma svarūpānabhijñulu, anagā, ātma svarūpamunu bāgā yadārdhamugā teliyanivāru, eṃducētananagā, ātma caṃpunadikādu, caṃpabaḍunadikādu - ātma avikriyuḍu - mārpulu lēnivāḍu. ī viṣayamu śrīmadbhagavadgītalō ī kriṃdavidhamugā ceppabaḍinadi -

“ajō nityaḥ śāśvatō (a) yaṃ purāṇō nahanyatē hanyamānē śarīrē ||” (śrīmadbhagavadgīta - 2 - 20)

(ātma janma lēnivāḍu, śāśvatamugānuṃḍuvāḍu, pūrvamunuṃḍi unnavāḍu, śarīramu naśiṃcinanu tānu naśiṃpanivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.