ఆదిః కారణం అస్య
నవిద్యతే ఇతి అనాదిః, సర్వకారణత్వాత్.
(ఆది
అనగా మొదలు లేక కారణము. భగవంతుడు ఆది లేనివాడు కనుక అనాది అని చెప్పబడుచున్నాడు. అన్నింటికి తానే
కారణమగుటచేత, తనకు కారణము లేనివాడు. సృష్టిలోని ప్రతి వస్తువు ఇంకొక వస్తువులో నుండి పుట్టినదే.
పుట్టిన వస్తువు కార్యము, ఎందులోనుండి పుట్టినదో అది కారణము. భగవంతునిలోనుండి అన్ని వస్తువులు
ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. అందుచేత సృష్టిలోని అన్ని వస్తువులు కార్యములే. ఈ
కార్యవస్తువులన్నింటికి భగవంతుడే మూల కారణము; కాని తను మట్టుకు ఎందులోనుండి పుట్టలేదు.
అందుచేత అతను కారణము - ఆది - లేనివాడు. అందుచేత అనాది అని చెప్పబడుచున్నాడు.)
ఉత్పత్తిరహితం
- యత్ ఉత్పత్తిమత్ తద్వినాశి, యథా ఘటాది. ఇదంతు అవినాశి తస్మాదుత్పత్తి రహితం. ఉత్పన్నస్య భావస్య వినాశ
నియమాత్ – ‘అనాద్యనంతం’ ఇతి శ్రుతేః.
(ఉత్పత్తి
కలది - అనగా, జన్మకలది. నశించునదే. మట్టినుండి కుండ పుట్టినదే. కుండ బ్రద్దలయి నశించునుగాని
శాశ్వతముగా నుండదు.”జాతస్య మరణం ధ్రువం“;”జాతస్య హి ద్రువో మృత్యుః” (శ్రీమద్భగవద్గీత- 2 -
27) పుట్టినదానికి చావు తప్పదు. అటువంటి ఉత్పత్తి లేనిది ఆత్మ - అందుచేత అనాది. “అనాద్యనంతం”
(జననమరణములు లేనిది ఆత్మ) అని శ్రుతి చెప్పుచున్నది.
జన్మ శూన్యం. (జన్మ లేనిది.)
“నజాయతే, మ్రియతే
వావిపశ్చిత్” ఇతి శ్రుతేః. (‘ఆత్మ పుట్టడు, నశింపడు’ అని శ్రుతి చెప్పుచున్నది.)
ఆదిః కారణం పూర్వకాలో వా నాస్తి
యస్య సః.
“పరమాద్య
మనాద్యంతం తస్య బీజం న విద్యతే |
తత్ర సంలీయతే
సంవిత్ నిర్వికల్పంచ తిష్టతి |
భూయో న వర్తతే దుఃఖైః - - -
||” (అన్నపూర్ణోపనిషత్ - 4 - 6 - 9)
(ఆది
అనగా కారణము, లేక పూర్వముండు కాలము లేనిది, అనగా, భూతకాలమనునది లేనిది, ఎల్లపుడూ ఉండునది.
ఎల్లపుడూ ఒకే కాలమందు ఒకే రీతిగానుండునది కనుక అనాది. జీవులు తిరిగిపొందవలసిన, చేరవలసిన
మొదటిస్థానము, మొదటిపదము. ఆ పదమునకు ఆది, అంతము లేదు. దానిబీజము, పుట్టుటకు కారణము -
కారణమగు వస్తువు - లేదు. జీవులు అందులోనే లీనమగుదురు.)
“సర్వ హేతు తయా యస్య
నాస్త్యాదిః కారణం హరేః |
అనాది త్వేన జన్మాది శూన్యం - - -
||“. (గీతాభావప్రకాశము -10 -13)
(సర్వమునకూ,
అన్నింటికీ, తానే ఆది కారణమగుటచేత తనకు ఆది లేనివాడు.ఆది లేకపోవుటచేత జన్మ మొదలగునవి
లేనివాడు.)
కాలతః పరిచ్ఛేద రహితః, జన్మాది
రహితః.
(ఈ
కాలమందుండును, ఇంకొకకాలమందుండడు అను పరిమితి లేనివాడు. జన్మ కలవాడైన యడల జన్మకు ముందు
లేనివాడై యుండవలెను; కాని త్రికాలములందు ఉండువాడు కనుక నిత్యుడు; “ఒకప్పుడైనా లేనివాడు” అని కాని,
“జన్మకు ముందు లేనివాడు” అనిగాని చెప్పుటకు వీలుకాదు – అందుచేత జన్మలేనివాడు, అందుచేత
అజుడు.)
“అనశ్చేష్టయితా,
ఆదిశ్చ సర్వస్య ఇత్యనాదిః”. (శ్రీ ఆనందతీర్థః)
(అన
+ ఆది = అనాది - చేష్ట కలుగు చేయువాడు, ప్రేరేపించువాడు, తన సత్తాస్ఫూర్తిచే అన్నింటినీ వాటివాటి
చేష్టలు చేయునట్లుగా ప్రేరేపించువాడు. అన్నింటికి ఆది,మొదలు,కారణము అయినవాడు - ఈ రెండూ కలసి
అనాది.)
”
ప్రకృతిం పురుషం చైవ వద్ధ్యనాదీ ఉభావపి ” (శ్రీమద్భగవద్గీత - 13 -19)
(పురుషుడు
అనగా పరమాత్మ, ప్రకృతి - ఈ రెండునూ అనాదిలే, ఆదిలేనివే, మొదలులేనివే, జన్మలేనివే. ఎప్పటినుండి ఉన్నవో,
ఏలాగున వచ్చినవో తెలియదు. పరమాత్మను నిత్యము ఆశ్రయించుకొని యుండుట వలన పరమాత్మతో పాటు ప్రకృతి
కూడ అనాదియే.) (చూడుము : ‘అజః’ ; ‘అనాది సంసారము’)
శ్రీ కృష్ణభగవానుడు
శ్రీమద్భగవద్గీతలో తాను ‘అనాది’ అని స్వయముగా చెప్పియుండెను.
“యో మామ జ మనాదిం చ వేత్తి
లోకమహేశ్వరం |”. (శ్రీమద్భగవద్గీత -10 - 3)
(లోకము
లన్నింటికీ ఈశ్వరుడను, శాసించు వాడను అయిన నన్ను అనాదిగా - ఆది, జన్మ, కారణములేనివాడుగా - ఎవరు
తెలుసుకొనునో - -.)
ఉత్పత్తిశూన్యత్వం
స్వరూపతః అనాదిత్వం. (స్వరూపము వల్ల ఉత్పత్తి లేకపోవుటయే అనాది యగుట.)
పరమాత్మ
ఉత్పత్తిలేనివాడు కనుక అనాది. ఈ ప్రకారముగానే మఱికొన్ని ‘అనాది’; అని చెప్పబడుచున్నవి :- జీవుడు,
ఈశ్వరుడు, బ్రహ్మ, జీవేశ్వరులకు భేదము; అవిద్య; అవిద్యా చైతన్యముల సంబంధము - వీటికి ఉత్పత్తి
లేనందున వీటిని అనాది అని చెప్పిరి -
“జీవ, ఈశో,
విశుద్ధా చిత్తధా జీవేశ్వర యోర్బిధా |
అవిద్యా తచ్చితోర్భేధః
షడస్మాకం అనాదయః - ||“. (చూడుము - ‘అజుడు’ ; ‘అనాదిప్రపంచము’.)
Transliteration
ādiḥ
kāraṇaṃ asya navidyatē iti anādiḥ, sarvakāraṇatvāt.
(ādi
anagā modalu lēka kāraṇamu. bhagavaṃtuḍu ādi lēnivāḍu kanuka anādi ani
ceppabaḍucunnāḍu. anniṃṭiki tānē kāraṇamaguṭacēta, tanaku kāraṇamu
lēnivāḍu. sṛṣṭilōni prati vastuvu iṃkoka vastuvulō nuṃḍi puṭṭinadē.
puṭṭina vastuvu kāryamu, eṃdulōnuṃḍi puṭṭinadō adi kāraṇamu.
bhagavaṃtunilōnuṃḍi anni vastuvulu okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi.
aṃducēta sṛṣṭilōni anni vastuvulu kāryamulē. ī kāryavastuvulanniṃṭiki
bhagavaṃtuḍē mūla kāraṇamu; kāni tanu maṭṭuku eṃdulōnuṃḍi puṭṭalēdu.
aṃducēta atanu kāraṇamu - ādi - lēnivāḍu. aṃducēta anādi ani
ceppabaḍucunnāḍu.)
utpattirahitaṃ
- yat utpattimat tadvināśi, yathā ghaṭādi. idaṃtu avināśi tasmādutpatti
rahitaṃ. utpannasya bhāvasya vināśa niyamāt – ‘anādyanaṃtaṃ’ iti
śrutēḥ.
(utpatti
kaladi - anagā, janmakaladi. naśiṃcunadē. maṭṭinuṃḍi kuṃḍa puṭṭinadē.
kuṃḍa braddalayi naśiṃcunugāni śāśvatamugā nuṃḍadu.”jātasya maraṇaṃ
dhruvaṃ”; “jātasya hi druvō mṛtyuḥ” (śrīmadbhagavadgīta- 2 - 27)
puṭṭinadāniki cāvu tappadu. aṭuvaṃṭi utpatti lēnidi ātma - aṃducēta
anādi. “anādyanaṃtaṃ” (jananamaraṇamulu lēnidi ātma) ani śruti
ceppucunnadi.
janma śūnyaṃ.
(janma lēnidi.)
“najāyatē,
mriyatē vāvipaścit” iti śrutēḥ. (‘ātma puṭṭaḍu, naśiṃpaḍu’ ani śruti
ceppucunnadi.)
ādiḥ
kāraṇaṃ pūrvakālō vā nāsti yasya saḥ.
“paramādya
manādyaṃtaṃ tasya bījaṃ na vidyatē |
tatra saṃlīyatē
saṃvit nirvikalpaṃca tiṣṭati |
bhūyō
na vartatē duḥkhaiḥ - - - ||” (annapūrṇōpaniṣat - 4 - 6 - 9)
(ādi
anagā kāraṇamu, lēka pūrvamuṃḍu kālamu lēnidi, anagā, bhūtakālamanunadi
lēnidi, ellapuḍū uṃḍunadi. ellapuḍū okē kālamaṃdu okē rītigānuṃḍunadi
kanuka anādi. jīvulu tirigipoṃdavalasina, cēravalasina modaṭisthānamu,
modaṭipadamu. ā padamunaku ādi, aṃtamu lēdu. dānibījamu, puṭṭuṭaku
kāraṇamu - kāraṇamagu vastuvu - lēdu. jīvulu aṃdulōnē
līnamaguduru.)
“sarva hētu tayā
yasya nāstyādiḥ kāraṇaṃ harēḥ |
anādi
tvēna janmādi śūnyaṃ - - - ||“. (gītābhāvaprakāśamu -10 -13)
(sarvamunakū,
anniṃṭikī, tānē ādi kāraṇamaguṭacēta tanaku ādi lēnivāḍu.ādi
lēkapōvuṭacēta janma modalagunavi lēnivāḍu.)
kālataḥ paricchēda
rahitaḥ, janmādi rahitaḥ.
(ī
kālamaṃduṃḍunu, iṃkokakālamaṃduṃḍaḍu anu parimiti lēnivāḍu. janma
kalavāḍaina yaḍala janmaku muṃdu lēnivāḍai yuṃḍavalenu; kāni
trikālamulaṃdu uṃḍuvāḍu kanuka nityuḍu; “okappuḍainā lēnivāḍu” ani kāni,
“janmaku muṃdu lēnivāḍu” anigāni ceppuṭaku vīlukādu – aṃducēta
janmalēnivāḍu, aṃducēta ajuḍu.)
“anaścēṣṭayitā,
ādiśca sarvasya ityanādiḥ”. (śrī ānaṃdatīrthaḥ)
(ana
+ ādi = anādi - cēṣṭa kalugu cēyuvāḍu, prērēpiṃcuvāḍu, tana
sattāsphūrticē anniṃṭinī vāṭivāṭi cēṣṭalu cēyunaṭlugā prērēpiṃcuvāḍu.
anniṃṭiki ādi,modalu,kāraṇamu ayinavāḍu - ī reṃḍū kalasi anādi.)
”
prakṛtiṃ puruṣaṃ caiva vaddhyanādī ubhāvapi ” (śrīmadbhagavadgīta - 13
-19)
(puruṣuḍu
anagā paramātma, prakṛti - ī reṃḍunū anādilē, ādilēnivē, modalulēnivē,
janmalēnivē. eppaṭinuṃḍi unnavō, ēlāguna vaccinavō teliyadu. paramātmanu
nityamu āśrayiṃcukoni yuṃḍuṭa valana paramātmatō pāṭu prakṛti kūḍa
anādiyē.) (cūḍumu : ‘ajaḥ’ ; ‘anādi saṃsāramu’)
śrī
kṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō tānu ‘anādi’ ani svayamugā
ceppiyuṃḍenu.
“yō
māma ja manādiṃ ca vētti lōkamahēśvaraṃ |”. (śrīmadbhagavadgīta -10 -
3)
(lōkamu
lanniṃṭikī īśvaruḍanu, śāsiṃcu vāḍanu ayina nannu anādigā - ādi, janma,
kāraṇamulēnivāḍugā - evaru telusukonunō - -.)
utpattiśūnyatvaṃ
svarūpataḥ anāditvaṃ. (svarūpamu valla utpatti lēkapōvuṭayē anādi
yaguṭa.)
paramātma
utpattilēnivāḍu kanuka anādi. ī prakāramugānē maṟikonni ‘anādi’; ani
ceppabaḍucunnavi :- jīvuḍu, īśvaruḍu, brahma, jīvēśvarulaku bhēdamu;
avidya; avidyā caitanyamula saṃbaṃdhamu - vīṭiki utpatti lēnaṃduna
vīṭini anādi ani ceppiri -
“jīva, īśō,
viśuddhā cittadhā jīvēśvara yōrbidhā |
avidyā
taccitōrbhēdhaḥ ṣaḍasmākaṃ anādayaḥ - ||“. (cūḍumu - ‘ajuḍu’ ;
‘anādiprapaṃcamu’.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.