ఆదిః అస్త్య
అస్తీతి ఆదిమత్, న ఆదిమత్ అనాదిమత్“. (శ్రీశంకరః)
(ఆది
అనగా జన్మ, ఆది కలవాడు - జన్మ కలవాడు - ఆదిమత్. ఆదిమత్ కానివాడు అనాదిమత్ - భగవంతుడు జన్మ
లేనివాడు.)
ఆదిరహితః (ఆది లేనివాడు
- జన్మ లేనివాడు - అజుడు.)
ఆదిమత్ కార్యం; తన్న
భవతీత్యనాదిమత్; ఆది మన్నభవతీత్యవాదిమత్ - ఉత్పత్యాది రహితః.
(ఆదిమత్
అనగా కార్యము - ఇంకొక వస్తువులోనుండి పుట్టినది, కారణములోనుండి పుట్టినది. కార్యం కానిది అనాదిమత్;
ఉత్పత్యాదులు, అనగా, జననము మొదలగునవి లేనిది. పరమాత్మ కాక మిగిలిన వస్తువులన్నీ ఏదో ఇంకొక
వస్తువులోనుండి పుట్టినవే. అవన్నీ కార్యములే. భగవంతునికి జన్మ లేదు, ఏ వస్తువులోనుండి
పుట్టలేదు, అందుచేత కార్యము కాదు. అన్ని వస్తువులకు కారణమైనవాడు.)
అవిద్యమాన
ఆదిః కారణం అస్యతవిదమనాదిః - యచ్చ ఆదిమత్ తత్కార్యత్వాదనిత్యం, కారణే ప్రలీయతే, యధా పృధివ్యాది. ఇదం
తు సర్వకారణత్వాత్ అకార్యం, అకర్యత్వాన్నిత్యం, నతస్యకారణమస్తి యస్మిన్ లీయేత.
(ఆది
అనగా కారణము; కారణములేనిది అనాది. కారణము కలది కార్యమగుటవలన నిత్యమైనదికాదు;
ఎల్లకాలమందుండునదికాదు. ఎందుచేతననగా అది కారణమందు లీనమైపోవును - భూమి మొదలగువాటివలె. భూమి
నీటిలోనుండి పుట్టినది. అందుచేత భూమి కార్యము, నీరు కారణము. భూమి తనకు కారణమగు నీటియందు లయమై
- లీనమై -పోవును. కార్యములైన వస్తువులన్నియు ఈ ప్రకారముగానే వాటివాటి కారణ వస్తువులందు
లీనమైపోవును. పరమాత్మ సమస్తవస్తువులకు కారణము. అతనికి ఏదియు కారణములేదు. అందుచేత అతను
అకార్యము. అకార్యము అగుటవలన నిత్యము, దేనిలోను లయము కాదు, అందుచేత అనాదిమత్.)
“అనాదిమత్ పరబ్రహ్మ”
(శ్రీమద్భగవద్గీత- 13 - 12)
(పరబ్రహ్మ ఆది
లేనివాడు.)
“యస్మాత్ త్వమేవ
సర్వస్య ఆత్మ భూతః, తస్మాదనాదిః త్వమేవ”
(నీవే అన్నింటికీ ఆత్మ అయినవాడవు. అందుచేత
నీవు అనాదివి.)
Transliteration
ādiḥ
astya astīti ādimat, na ādimat anādimat”. (śrīśaṃkaraḥ)
(ādi
anagā janma, ādi kalavāḍu - janma kalavāḍu - ādimat. ādimat kānivāḍu
anādimat - bhagavaṃtuḍu janma lēnivāḍu.)
ādirahitaḥ (ādi
lēnivāḍu - janma lēnivāḍu - ajuḍu.)
ādimat
kāryaṃ; tanna bhavatītyanādimat; ādi mannabhavatītyavādimat - utpatyādi
rahitaḥ.
(ādimat
anagā kāryamu - iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadi, kāraṇamulōnuṃḍi
puṭṭinadi. kāryaṃ kānidi anādimat; utpatyādulu, anagā, jananamu
modalagunavi lēnidi. paramātma kāka migilina vastuvulannī ēdō iṃkoka
vastuvulōnuṃḍi puṭṭinavē. avannī kāryamulē. bhagavaṃtuniki janma lēdu, ē
vastuvulōnuṃḍi puṭṭalēdu, aṃducēta kāryamu kādu. anni vastuvulaku
kāraṇamainavāḍu.)
avidyamāna
ādiḥ kāraṇaṃ asyatavidamanādiḥ - yacca ādimat tatkāryatvādanityaṃ,
kāraṇē pralīyatē, yadhā pṛdhivyādi. idaṃ tu sarvakāraṇatvāt akāryaṃ,
akaryatvānnityaṃ, natasyakāraṇamasti yasmin līyēta.
(ādi
anagā kāraṇamu; kāraṇamulēnidi anādi. kāraṇamu kaladi kāryamaguṭavalana
nityamainadikādu; ellakālamaṃduṃḍunadikādu. eṃducētananagā adi
kāraṇamaṃdu līnamaipōvunu - bhūmi modalaguvāṭivale. bhūmi nīṭilōnuṃḍi
puṭṭinadi. aṃducēta bhūmi kāryamu, nīru kāraṇamu. bhūmi tanaku
kāraṇamagu nīṭiyaṃdu layamai - līnamai -pōvunu. kāryamulaina
vastuvulanniyu ī prakāramugānē vāṭivāṭi kāraṇa vastuvulaṃdu
līnamaipōvunu. paramātma samastavastuvulaku kāraṇamu. ataniki ēdiyu
kāraṇamulēdu. aṃducēta atanu akāryamu. akāryamu aguṭavalana nityamu,
dēnilōnu layamu kādu, aṃducēta anādimat.)
“anādimat
parabrahma” (śrīmadbhagavadgīta- 13 - 12)
(parabrahma ādi lēnivāḍu.)
“yasmāt
tvamēva sarvasya ātma bhūtaḥ, tasmādanādiḥ tvamēva”
(nīvē
anniṃṭikī ātma ayinavāḍavu. aṃducēta nīvu anādivi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.