← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాదివాసనా anādivāsanā

Original — తెలుగు

శాస్త్రస్య - యాధాత్మ్య - జ్ఞానోత్పత్తి హేతు భూత భక్తి విరోధీ; యద్వా, సమ్యక్ జ్ఞానహేతు భూత భక్త్యభావాత్ సమ్యక్ జ్ఞానవిరోధి, పాపాను బంధం అనాదివాసనా వాసనా శబ్దేన పాపస్య దృఢమూలత్వేన దుర్నివారత్వ ముక్తం. వాసనయా పాపం, పాపేన వాసనా, అజ్ఞానేన పాపవాసనా, పాపవాసనయా అజ్ఞానం ఇత్యన్యోన్యాశ్రయ పరిహారాయ అనాది శబ్దః.

(శాస్త్రముయొక్క - యధాత్మ్యముయొక్క - జ్ఞానోత్పత్తికి విరోధి. లేక, సమ్యక్ జ్ఞానము కలుగుటకు కారణభూతమైన భక్తి లేకుండునట్లు చేయుటవలన సమ్యక్ జ్ఞానమునకు విరోధి - పాపముతో ఎడతెగని సంబంధముకలది, పాపమువలన కలుగు ఫలరూపముగలది. అనాది వాసన. పాపము దృఢమైన పేరు కలదగుటచేత వాసన నివారింప శక్యము కానిది, తప్పింప శక్యముకానిది. వాసనవలన పాపం, పాపమువలన వాసన, అజ్ఞానం వలన పాపవాసనా, వాసనవలన అజ్ఞానము - ఈ ప్రకారముగా ఒకదానికొకటి ఆశ్రయించి యుండుటవలన ఈ అన్యోన్యాశ్రయము పరిహరించుటకుగాను వాసన అనాది యని చెప్పబడినది.)

Transliteration

śāstrasya - yādhātmya - jñānōtpatti hētu bhūta bhakti virōdhī; yadvā, samyak jñānahētu bhūta bhaktyabhāvāt samyak jñānavirōdhi, pāpānu baṃdhaṃ anādivāsanā vāsanā śabdēna pāpasya dṛḍhamūlatvēna durnivāratva muktaṃ. vāsanayā pāpaṃ, pāpēna vāsanā, ajñānēna pāpavāsanā, pāpavāsanayā ajñānaṃ ityanyōnyāśraya parihārāya anādi śabdaḥ.

(śāstramuyokka - yadhātmyamuyokka - jñānōtpattiki virōdhi. lēka, samyak jñānamu kaluguṭaku kāraṇabhūtamaina bhakti lēkuṃḍunaṭlu cēyuṭavalana samyak jñānamunaku virōdhi - pāpamutō eḍategani saṃbaṃdhamukaladi, pāpamuvalana kalugu phalarūpamugaladi. anādi vāsana. pāpamu dṛḍhamaina pēru kaladaguṭacēta vāsana nivāriṃpa śakyamu kānidi, tappiṃpa śakyamukānidi. vāsanavalana pāpaṃ, pāpamuvalana vāsana, ajñānaṃ valana pāpavāsanā, vāsanavalana ajñānamu - ī prakāramugā okadānikokaṭi āśrayiṃci yuṃḍuṭavalana ī anyōnyāśrayamu parihariṃcuṭakugānu vāsana anādi yani ceppabaḍinadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.