“జీవ ఈశో విశుద్ధా చిత్తధా జీవేశ
యోర్బిధా |
అవిద్యా
(అజ్ఞాన) తచ్చితోర్భేధః షడస్మాక మనాదయః||”
జీవః
ఈశ్వరః
బ్రహ్మ
అనాది వస్తూనాం పరస్పరం
భేదః - జీవేశ యోః భేదః –
అవిద్యా
అవిద్యా
చైతన్యయోః సంబంధః - స ఏవ కాలః ఇత్యుచ్యతే - షడేతాని స్వరూపతః అనాది వస్తూని. ఉత్పత్తి శూన్యత్వం
స్వరూపతః అనాదిత్వం.
(జీవుడు,
ఈశ్వరుడు, శుద్ధ చైతన్యము, జీవేశ్వరులకు గల భేదము, అజ్ఞానము (అవిద్యా), అజ్ఞానమునకు
చైతన్యముతో గల సంబంధము - ఈ ఆరును స్వరూపమువలన అనాదులు - ఉత్పత్తి - జన్మ - లేకపోవుటవలన
ఆది లేనివి. మొదలు తెలియబడనివి - ఇవి ఎప్పుడు ప్రారంభమైనవో తెలియదు. అందుచేత అనాదులు -
స్వరూపమువలన అనాదులు.
తత్ర
కాలత్రయా బాధ్యత్వాత్ అనాద్యనంతం చ కూటస్థ నిత్యం బ్రహ్మ. జ్ఞానబాధ్యత్వాత్ ఇతరాణి పంచసాం తాని ఇతి
వివేకః.
(ఈ
ఆరు అనాదులలోను, మూడుకాలములందు ఉండునది - నిత్యమైనది - కాలపరిచ్ఛేదములేనిది బ్రహ్మ అనాది,
అనంతము కూటమువలె నిత్యమైనది అని చెప్పబడుచున్నది. మిగిలిన అయిదు అనాదులు జ్ఞానము కలుగగానే
అంతమొందునవి అని తెలుసుకొనవలెను.)
ఇవి ఎందువలన అనాదులని
చెప్పబడుచున్నవి అనగా –
అవిద్యాయాః
అపి అధిష్ఠానత్వాత్ న అవిద్యాతః బ్రహ్మజాయతే. అంతరేణ బ్రహ్మ జీవేశ్వరా దయః న సిద్ధ్యంతి ఇతి న తేభ్యశ్చ
తుర్భ్యోపి బ్రహ్మ జాయతే. తస్మాత్ అనాది సిద్ధం బ్రహ్మ.
(బ్రహ్మ
అవిద్యకుకూడ అధిష్ఠానమగుటవలన అవిద్య వలన బ్రహ్మ పుట్టుట లేదు - జీవ, బ్రహ్మ, ఈశ్వరుల వలన
నైనను పరబ్రహ్మ ఉత్పత్తి యగుటలేదు, పరబ్రహ్మవలననే ఇవి కలుగుచున్నవి. అందుచేత పరబ్రహ్మ అనాది
యగుట సిద్ధము.)
బ్రహ్మణః
నిర్వికారత్వాత్ నతతో అవిద్యా జాయతే ఈశ్వరాది చతుష్టయ సిద్ధేః అవిద్యా సిద్ధ్య ధీనత్వాత్ నతతోపి అవిద్యా జాయతే ఇతి
అవిద్యాపి అనాది రేవ.
(పరబ్రహ్మ
నిర్వికారుడగుటవలన - మార్పులు చెందనివాడు అగుటవలన అతనివలన అవిద్య పుట్టలేదు - ఈశ్వరుడు,
జీవుడు మొదలగు నలుగురు అవిద్యవలననే కలుగుటవలన, ఆ నలుగురు వలనను అవిద్య పుట్టియుండలేదు
- అందుచేత అవిద్య అనాది.)
జీవేశ్వరౌ
న కేవల బ్రహ్మణోవా, కేవలమాయ యావా ఉత్పద్యతే, వాపి ఈశ్వరాజ్జీవోవా, జీవాద్వా ఈశ్వరో జాయతే. జీవేశ్వర భేదస్య చ
జీవేశ్వర సిద్ధ్యధీనత్వాత్ న తతోపి న జీవేశ్వరోత్పత్తిః - అవిద్యాచిత్ సంబంధ సిద్ధ్యధీనా జీవేశ్వర సిద్ధిః -
అవిద్యా చిత్ సంబంధశ్చ అనాది రేవ. అనాద్య విద్యా చిత్సంబంధా దీన జీవేశ్వరౌ. అపి అనాదీ ఏవ.
(జీవేశ్వరులు
కేవలము బ్రహ్మవలనగాని, కేవలమాయవలనగాని ఉత్పత్తి యగుట లేదు - ఈశ్వరునివలన జీవుడు కాని, జీవునివలన
ఈశ్వరుడుకాని పుట్టుట లేదు - జీవేశ్వరుల ఉత్పత్తి అవిద్యా చైతన్యములవలన కలుగును. అవిద్యా
చైతన్యములు అనాది కనుక వాటితో సంబంధమున్న జీవేశ్వరులు అనాదులు.)
అవిద్యా
చితోరనాది త్వాత్ తయోః తాదాత్మ్య రూపసంబంధో పి అనాదిరేవ. తస్మాత్ బ్రహ్మణః వా అవిద్యా తోవా న తస్య
ఉత్పత్తిః. అతః అవిద్యాచిత్ సంబంధోపి అనాదిః.
(అవిద్యా
చైతన్యములు అనాదులగుటవలన వాటికి ఉన్న తాదాత్మ్య సంబంధము కూడా అనాదియే. ఈ రెండింటికి ఉన్న
సంబంధము చైతన్యము - బ్రహ్మ వలన పుట్టినదికాదు, అవిద్యవలన పుట్టినదికాదు. ఈశ్వరుడు, జీవుడు
మొదలగు మూడింటివల్ల అది ఉత్పత్తి యగుటలేదు. అందుచేత అవిద్యా చైతన్యములకు గల సంబంధము
అనాది.
ఏ
తేషాం అన్యోన్యభేదోపి అనాదిరేవ, షణ్ణామపి, ఏ తేషాం ఉత్పత్యభావాత్. స్వరూపతః అనాదీని షడేతాని. తత్ర కాలతయా
బాధ్యత్వాత్ అనాద్య నంతంచ కూటస్థ నిత్యం బ్రహ్మ, జ్ఞానబాధ్యత్వాత్ తు ఇతరాణి పంచ అనాది సాంతాని ఇతి
వివేకః.
(పైన
చెప్పబడిన వాటికి అన్యోన్య భేదము - ఓకదానితో ఒకటికి కల భేదము - కూడ అనాదియే, ఈ ఆరింటికీ ఉత్పత్తి
లేనందున ఈ అరును అనాదులే. వీటిలో మూడు కాలములందు ఉండునదియై, ఆది అంతము లేనిదగుటవలననూ,
కూటమువలె నిత్యమైనది బ్రహ్మ, మిగిలిన అయిదున్నూ జ్ఞానముకలుగగానే పోవునవి గనుక అంతముగలవి
యే.)
Transliteration
“jīva īśō viśuddhā
cittadhā jīvēśa yōrbidhā |
avidyā
(ajñāna) taccitōrbhēdhaḥ ṣaḍasmāka manādayaḥ||”
jīvaḥ
īśvaraḥ
brahma
anādi vastūnāṃ
parasparaṃ bhēdaḥ - jīvēśa yōḥ bhēdaḥ –
avidyā
avidyā
caitanyayōḥ saṃbaṃdhaḥ - sa ēva kālaḥ ityucyatē - ṣaḍētāni svarūpataḥ
anādi vastūni. utpatti śūnyatvaṃ svarūpataḥ anāditvaṃ.
(jīvuḍu,
īśvaruḍu, śuddha caitanyamu, jīvēśvarulaku gala bhēdamu, ajñānamu
(avidyā), ajñānamunaku caitanyamutō gala saṃbaṃdhamu - ī ārunu
svarūpamuvalana anādulu - utpatti - janma - lēkapōvuṭavalana ādi lēnivi.
modalu teliyabaḍanivi - ivi eppuḍu prāraṃbhamainavō teliyadu. aṃducēta
anādulu - svarūpamuvalana anādulu.
tatra
kālatrayā bādhyatvāt anādyanaṃtaṃ ca kūṭastha nityaṃ brahma.
jñānabādhyatvāt itarāṇi paṃcasāṃ tāni iti vivēkaḥ.
(ī
āru anādulalōnu, mūḍukālamulaṃdu uṃḍunadi - nityamainadi -
kālaparicchēdamulēnidi brahma anādi, anaṃtamu kūṭamuvale nityamainadi
ani ceppabaḍucunnadi. migilina ayidu anādulu jñānamu kalugagānē
aṃtamoṃdunavi ani telusukonavalenu.)
ivi eṃduvalana
anādulani ceppabaḍucunnavi anagā –
avidyāyāḥ
api adhiṣṭhānatvāt na avidyātaḥ brahmajāyatē. aṃtarēṇa brahma jīvēśvarā
dayaḥ na siddhyaṃti iti na tēbhyaśca turbhyōpi brahma jāyatē. tasmāt
anādi siddhaṃ brahma.
(brahma
avidyakukūḍa adhiṣṭhānamaguṭavalana avidya valana brahma puṭṭuṭa lēdu -
jīva, brahma, īśvarula valana nainanu parabrahma utpatti yaguṭalēdu,
parabrahmavalananē ivi kalugucunnavi. aṃducēta parabrahma anādi yaguṭa
siddhamu.)
brahmaṇaḥ
nirvikāratvāt natatō avidyā jāyatē īśvarādi catuṣṭaya siddhēḥ avidyā
siddhya dhīnatvāt natatōpi avidyā jāyatē iti avidyāpi anādi rēva.
(parabrahma
nirvikāruḍaguṭavalana - mārpulu ceṃdanivāḍu aguṭavalana atanivalana
avidya puṭṭalēdu - īśvaruḍu, jīvuḍu modalagu naluguru avidyavalananē
kaluguṭavalana, ā naluguru valananu avidya puṭṭiyuṃḍalēdu - aṃducēta
avidya anādi.)
jīvēśvarau
na kēvala brahmaṇōvā, kēvalamāya yāvā utpadyatē, vāpi īśvarājjīvōvā,
jīvādvā īśvarō jāyatē. jīvēśvara bhēdasya ca jīvēśvara siddhyadhīnatvāt
na tatōpi na jīvēśvarōtpattiḥ - avidyācit saṃbaṃdha siddhyadhīnā
jīvēśvara siddhiḥ - avidyā cit saṃbaṃdhaśca anādi rēva. anādya vidyā
citsaṃbaṃdhā dīna jīvēśvarau. api anādī ēva.
(jīvēśvarulu
kēvalamu brahmavalanagāni, kēvalamāyavalanagāni utpatti yaguṭa lēdu -
īśvarunivalana jīvuḍu kāni, jīvunivalana īśvaruḍukāni puṭṭuṭa lēdu -
jīvēśvarula utpatti avidyā caitanyamulavalana kalugunu. avidyā
caitanyamulu anādi kanuka vāṭitō saṃbaṃdhamunna jīvēśvarulu
anādulu.)
avidyā
citōranādi tvāt tayōḥ tādātmya rūpasaṃbaṃdhō pi anādirēva. tasmāt
brahmaṇaḥ vā avidyā tōvā na tasya utpattiḥ. ataḥ avidyācit saṃbaṃdhōpi
anādiḥ.
(avidyā
caitanyamulu anādulaguṭavalana vāṭiki unna tādātmya saṃbaṃdhamu kūḍā
anādiyē. ī reṃḍiṃṭiki unna saṃbaṃdhamu caitanyamu - brahma valana
puṭṭinadikādu, avidyavalana puṭṭinadikādu. īśvaruḍu, jīvuḍu modalagu
mūḍiṃṭivalla adi utpatti yaguṭalēdu. aṃducēta avidyā caitanyamulaku gala
saṃbaṃdhamu anādi.
ē
tēṣāṃ anyōnyabhēdōpi anādirēva, ṣaṇṇāmapi, ē tēṣāṃ utpatyabhāvāt.
svarūpataḥ anādīni ṣaḍētāni. tatra kālatayā bādhyatvāt anādya naṃtaṃca
kūṭastha nityaṃ brahma, jñānabādhyatvāt tu itarāṇi paṃca anādi sāṃtāni
iti vivēkaḥ.
(paina
ceppabaḍina vāṭiki anyōnya bhēdamu - ōkadānitō okaṭiki kala bhēdamu -
kūḍa anādiyē, ī āriṃṭikī utpatti lēnaṃduna ī arunu anādulē. vīṭilō mūḍu
kālamulaṃdu uṃḍunadiyai, ādi aṃtamu lēnidaguṭavalananū, kūṭamuvale
nityamainadi brahma, migilina ayidunnū jñānamukalugagānē pōvunavi ganuka
aṃtamugalavi yē.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.